Thursday, 26 January 2017

మొట్టమొదలు గుర్తుకు వచ్చేదెవరో!! (చిన్న సంభాషణ)

నాకూ మరొకామెకు (ఓ ఆధ్యాత్మికసంస్థ వ్యక్తి) ఓ ఆసక్తికరమైన చిన్న చర్చ జరిగింది. సంభాషణ రూపంలో చెప్తాను.
ఆమె- ఈమధ్య సంస్థకు రావటం అందరికి వీలు పడదని సేవాభావంతో మేమే ఇంటింటికి వస్తున్నాము.
నేను- మంచిదే, కానీ జనాలే సంస్థకు వస్తే బాగుంటుంది..
ఆమె- పాపం, ఎంతో తీరికలేని జీవితాల్లో ఇతర సమస్యలతో సమయం ఉండదు కదా..
నేను- అయ్యో.. జనాలకు సినిమాలు షికార్లకు తిరగటానికి బోలెడు సమయం ఉంటుంది.. మాల్స్ లో గంటలు గంటలు తిరుగుతారు.. టీవీలతో పక్కకుచూసే వ్యవధి కూడా ఉండదు. గుళ్ళకు, మంచి సంస్థలకే పాపం తీరిక ఉండదు..
ఆమె- అట్లా కాదు, జనాలకు అట్టి ఏదైనా చోటికి వెళితే వెంటనే ఫలితం తెలుస్తున్నది. ఓ ఆనందం కలుగుతున్నది. అందుకు పోతారు. ఆధ్యాత్మిక స్థలాలలో వెంటనే ఫలితం తెలియదు.
నేను- (ఇది అనాలనుకుని ఆగిపోయాను) అయితే, మరి ఏదైనా బాధకలగంగానే, లేదా మనసు ఆహతం కాంగనే మొట్టమొదలు గుర్తుకు వచ్చేదెవరో..!? తిట్టేది దూషించేది, ఆక్షేపించేది, అన్యాయమైపోయామని బాధపడేది, అంతటికీ నువ్వే కారణమని తోసేసేది ఎవరిమీదకో..??! అది ద్వంద్వవైఖరి కదా..
"జగమే మాయ, బ్రతుకే లోయ.." అన్నీ దుఃఖంలోనే.. సుఖంలో ఏ సమస్యా లేదు..😂