Saturday, 19 July 2025

నీతిద్విషష్టికా (Working)

 నీతిద్విషష్టికా - 

-అనువాదం-- సంకా ఉషారాణీ

 

శ్రీమాన్ సుందరపాండ్యః శ్రుతిస్మృతిప్రసృతసత్పదార్థజ్ఞః ।

కృతవానార్యాం సమ్యక్ శ్రోతౄణాం బుద్ధివృద్ధికరీమ్ ॥1

పదవిభాగః-- శ్రీమాన్ సుందర-పాండ్యః శ్రుతి-స్మృతి-ప్రసృత-సత్పదార్థ-జ్ఞః । కృతవాన్ ఆర్యాం సమ్యక్ శ్రోతౄణాం బుద్ధి-వృద్ధి-కరీమ్ ॥1

అన్వయః-- శ్రీమాన్, శ్రుతిస్మృతిప్రసృతసత్పదార్థజ్ఞః, సుందరపాండ్యః శ్రోతౄణాం బుద్ధివృద్ధికరీమ్ ఆర్యాం సమ్యక్ కృతవాన్ ॥1

తాత్పర్యం-- లక్ష్మీసంపన్నుడు, శ్రుతి, స్మృతుల ద్వారా ప్రసారితమైన మంచి విషయాలను తెలిసినవాడు, అయిన సుందరపాండ్యుడు వినే(తెలుసుకునే)వారికి బాగా బుద్ధిని వృద్ధి చేసే (ఈ) ఆర్యా(వృత్తంలో సుభాషిత) పద్యాలను చేశాడు (కూర్చాడు).

 

శృణుత శ్రుతిజలధౌతైః కర్ణైః సుశ్లిష్టసంధిసంబంధామ్ ।

శ్రుత్వావధారయధ్వం దోషాన్ సంతో నుదంత్వత్ర ॥2

పదవిభాగః-- శృణుత శ్రుతి-జల-ధౌతైః కర్ణైః సుశ్లిష్ట-సంధి-సంబంధామ్ । శ్రుత్వా అవధారయధ్వం దోషాన్ సంతః నుదంతు అత్ర ॥2

అన్వయః-- శ్రుతిజలధౌతైః కర్ణైః సుశ్లిష్టసంధిసంబంధామ్ (ఆర్యాం) శృణుత । శ్రుత్వా అవధారయధ్వమ్ । అత్ర సంతః దోషాన్ నుదంతు ॥2

తాత్పర్యం-- చక్కని సంధిసంబంధాన్ని అంటే విరుపు, విశ్రామాలు (ఆర్యావృత్తం) కలిగిన దానిని, వేదమనే జలంతో కడగబడిన చెవులతో వినండి. విని అవధరించండి (దృష్టిని ఉంచండి). సజ్జనులు దోషాలను తీసివేయుదురుగాక.

 

 

సద్భాషితరత్నానాం రత్నానామివ సుదేశజాతానామ్ ।

హృది నిచయః కర్తవ్యః సజ్జనసమ్మానకామేన ॥3

పదవిభాగః-- సద్భాషిత-రత్నానాం రత్నానామ్ ఇవ సుదేశ-జాతానామ్ । హృది నిచయః కర్తవ్యః సజ్జన-సమ్మాన-కామేన ॥3

అన్వయః-- సజ్జనసమ్మానకామేన సుదేశజాతానామ్ రత్నానామ్ ఇవ సద్భాషితరత్నానాం హృది నిచయః కర్తవ్యః ॥3

తాత్పర్యం-- ఉత్తమజనుల ఆదరణ పొందగోరేవాడు మంచి ప్రాంతం నుండి వచ్చిన రత్నాల వంటి, ఈ సుభాషిత రత్నాలను, హృదయంలో సంగ్రహం చేసుకోవాలి.

 

పరపరివాదః పరిషది న కథంచన పండితేన వక్తవ్యః ।

సత్యమపి తన్న వాచ్యం యదుక్తమసుఖావహం భవతి ॥4

పదవిభాగః-- పర-పరివాదః పరిషది న కథంచన పండితేన వక్తవ్యః । సత్యమ్ అపి తత్ న వాచ్యం యద్ ఉక్తమ్ అసుఖావహం భవతి ॥4

అన్వయః-- పర-పరివాదః పరిషది కథంచన పండితేన న వక్తవ్యః । యద్ ఉక్తమ్ అసుఖావహం భవతి, తత్ సత్యమ్ అపి న వాచ్యమ్ ॥4

తాత్పర్యం-- పండితుడు సభలో ఎప్పుడూ ఇతరుల మీద చాడీలు లేదా తప్పుడు మాటలు చెప్పరాదు. అది సత్యమైనప్పటికీ మాట్లాడరాదు. మాట్లాడినట్లైతే అది (మనసుకు) కష్టాన్ని కలిగిస్తుంది.

On Sweet Speech

“A wise man should not speak ill of others in an assembly. Even that truth should not be uttered, which, if expressed, becomes unpalatable.” Nitidvishashtika 4

 

భూమిపతావర్థపతౌ విద్యావృద్ధే తపోఽధికే బహుషు ।

మూర్ఖేష్వరిషు చ గురుషు చ విదుషా నైవోత్తరం వాచ్యమ్ ॥5

పదవిభాగః-- భూమిపతౌ అర్థపతౌ విద్యావృద్ధే తపః-అధికే బహుషు । మూర్ఖేషు అరిషు చ గురుషు చ విదుషా నైవ ఉత్తరం వాచ్యమ్ ॥5

అన్వయః-- విదుషా (ఏతేషు) ఉత్తరం నైవ వాచ్యమ్- భూమిపతౌ, అర్థపతౌ, విద్యావృద్ధే, బహుషు తపోధికే, మూర్ఖేషు, అరిషు చ, గురుషు చ ॥5

తాత్పర్యం-- రాజు, ధనవంతుడు, విద్యావంతుడు, తపస్సంపన్నుడు, చాలామంది (ఉన్నప్పుడు), మూర్ఖులు, శత్రువులు, గురుజనులు (పెద్దలు)- వీరి ఎదుట విద్వాంసుడైనవాడు (ఎదురు) సమాధానం చెప్పరాదు.

 

స్వాధీనే మాధుర్యే మధురాక్షరసంహితేషు వాక్యేషు ।

కిం నామ సత్త్వవంతః పురుషాః పరుషాణి భాషంతే ॥6

పదవిభాగః-- స్వాధీనే మాధుర్యే మధురాక్షర-సంహితేషు వాక్యేషు । కిం నామ సత్త్వవంతః పురుషాః పరుషాణి భాషంతే ॥6

అన్వయః-- మాధుర్యే స్వాధీనే మధురాక్షరసంహితేషు వాక్యేషు (చ స్వాధీనేషు) సత్త్వవంతః పురుషాః కిం నామ పరుషాణి భాషంతే? 6

తాత్పర్యం-- మాధుర్యం (గుణం తమకు) స్వాధీనమై ఉండగా, మధురమైన పదాలతో కూడిన వాక్యాలు ఉండగా, మరి సత్త్వగుణవంతులైన సజ్జనులు ఎందుకు పరుషంగా మాట్లాడతారు? (మాట్లాడరు అని భావము).

 “Why should men endowed with good sense speak harshly, when sweetness is within their own power and when sentences can be composed with sweet words?” Nitidvishashtika 6

 

అప్రియముక్తాః పురుషాః ప్రయతంతే ద్విగుణమప్రియం వక్తుమ్ ।

తస్మాదవాచ్యమప్రియమప్రియమశ్రోతుకామేన ॥7

పదవిభాగః-- అప్రియమ్ ఉక్తాః పురుషాః ప్రయతంతే ద్విగుణమ్ అప్రియం వక్తుమ్ । తస్మాద్ అవాచ్యమ్ అప్రియమ్ అప్రియమ్ అశ్రోతుకామేన ॥7

అన్వయః-- పురుషాః అప్రియమ్ ఉక్తాః ద్విగుణమ్ అప్రియం వక్తుం ప్రయతంతే । తస్మాద్ అప్రియమ్ అశ్రోతుకామేన అప్రియమ్ అవాచ్యమ్ ॥7

తాత్పర్యం-- (ఎవరైనా తమతో) అయిష్టమైన మాటలు మాట్లాడినప్పుడు జనులు రెట్టింపు అయిష్టంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల అయిష్టమైనమాటలు వినవద్దు అనుకునేవాడు అయిష్టమైన మాటలు మాట్లాడకూడదు.

 “When a person is addressed harshly, he responds in a doubly harsh manner. There, one who does not wish to hear unpleasant words must not use such language himself” Nitidvishashtika 7

 

అల్పాక్షరరమణీయం యః కథయతి నిశ్చితం స వై వాగ్మీ ।

బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సః ॥8

పదవిభాగః-- అల్పాక్షర-రమణీయం యః కథయతి నిశ్చితం సః వై వాగ్మీ । బహు-వచనమ్ అల్పసారం యః కథయతి విప్రలాపీ సః ॥8

అన్వయః-- యః అల్పాక్షరరమణీయం నిశ్చితం కథయతి సః వై వాగ్మీ (భవతి) । యః బహువచనమ్ అల్పసారం కథయతి సః విప్రలాపీ (భవతి) ॥8

తాత్పర్యం-- ఎవరైతే తక్కువ పదాలలో అందంగా, కచ్చితంగా మాట్లాడతాడో వాడే మాటపటువు ఉన్నవాడు. ఎవరైతే ఎక్కువ మాటలతో తక్కువ సారం మాట్లాడతాడో అతడు వాగుడుకాయ.

 “He is an eloquent speaker who speaks with brevity, but whose speech is sweet. One who speaks a lot but speaks with little sense is nothing but a prattler.” Nitidvishashtika 8

 

శబ్దార్థసూక్ష్మవసనా సత్యాభరణా విచిత్రహేత్వంగీ ।

విద్వన్ముఖనిష్క్రాంతా సుస్త్రీవ విరాజతే వాణీ ॥9

పదవిభాగః-- శబ్దార్థ-సూక్ష్మ-వసనా సత్య-ఆభరణా విచిత్ర-హేతు-అంగీ । విద్వన్ముఖ-నిష్క్రాంతా సుస్త్రీ ఇవ విరాజతే వాణీ ॥9

అన్వయః-- విద్వన్ముఖనిష్క్రాంతా వాణీ- శబ్దార్థసూక్ష్మవసనా, సత్యాభరణా, విచిత్రహేత్వంగీ సుస్త్రీ ఇవ విరాజతే ॥9

తాత్పర్యం-- విద్వాంసుల నోటి నుండి వచ్చిన పలుకు- శబ్దం, అర్థం అనే మంచి (నేర్పుగా చేసిన) బట్టలు ధరించినది, సత్యం అనే ఆభరణం కలిగినది, విచిత్రమైన (అందమైన) హేతువులు అంగిగా కలది, అయిన మంచి స్త్రీవలె విరాజిల్లుతూ ఉంటుంది.

 

దుర్జనవదనవినిర్గతవచనభుజంగేన సజ్జనో దష్టః ।

ఔషధశతైరసాధ్యశ్చికిత్స్యతే క్షాంతిమంత్రేణ ॥10

పదవిభాగః-- దుర్జన-వదన-వినిర్గత-వచన-భుజంగేన సజ్జనః దష్టః । ఔషధ-శతైః అసాధ్యః చికిత్స్యతే క్షాంతి-మంత్రేణ ॥10

అన్వయః-- సజ్జనః, దుర్జనవదనవినిర్గతవచనభుజంగేన దష్టః ఔషధశతైః (చికిత్సితుమ్) అసాధ్యః క్షాంతిమంత్రేణ చికిత్స్యతే ॥10

తాత్పర్యం-- దుష్టుల నోటి నుండి బయల్పడిన మాట అనే పాము చేత కాటు వేయబడిఉత్తముడు, వంద మందులతో కూడా (చికిత్స) సాధ్యం కాక. (చివరకు) క్షమ అనే మంత్రంతో చికిత్సను పొందుతాడు.

 

అవమానారణిమథితం దుర్వాగింధనవివర్ధితజ్వాలమ్ ।

సత్పురుషాః కోపాగ్నిం జ్ఞానాంబుఘటైః ప్రశమయంతి ॥11

పదవిభాగః-- అవమాన-అరణి-మథితం దుర్వాగ్-ఇంధన-వివర్ధిత-జ్వాలమ్ । సత్పురుషాః కోపాగ్నిం జ్ఞాన-అంబు-ఘటైః ప్రశమయంతి ॥11

అన్వయః-- సత్పురుషాః అవమానారణిమథితం దుర్వాగింధనవివర్ధితజ్వాలం కోపాగ్నిం జ్ఞానాంబుఘటైః ప్రశమయంతి ॥11

తాత్పర్యం-- అవమానం అనే కాష్టం చేత రుద్దబడినది, దుష్టుల వాక్కు అనే ఇంధనం చేత జ్వాలగా పెంపొందినదైన కోపమనే అగ్నిని జ్ఞానం అనే నీటికుండలతో సత్పురుషులు ఉపశమింపచేసుకుంటారు. [దుర్జనుల మాటలతో గాయపడి అవమానపడిన సజ్జనుల మనస్సు జ్ఞానంచేత చల్లబడుతుంది.]

 “As a fire is extinguished only by water, similarly, the anger caused by harsh speech can be pacified only by the words of wisdom spoken by the virtuous.” Nitidvishashtika 11

 

న తథా శశీ న సలిలం న చందనరసో న శీతలచ్ఛాయా ।

ప్రహ్లాదయతి చ పురుషం యథా మధురభాషిణీ వాణీ ॥12

పదవిభాగః-- న తథా శశీ న సలిలం న చందనరసః న శీతల-చ్ఛాయా । ప్రహ్లాదయతి చ పురుషం యథా మధుర-భాషిణీ వాణీ ॥12

అన్వయః-- పురుషం శశీ న, సలిలం న, చందనరసః న, శీతల-చ్ఛాయా న చ తథా ప్రహ్లాదయతి, యథా మధుర-భాషిణీ వాణీ (ప్రహ్లాదయతి). ॥12

తాత్పర్యం-- చంద్రుడు, నీరు, గంధపు రసం, చల్లని నీడ- ఇవన్నీ కూడా మనిషిని, మధురంగా మాట్లాడిన మాట అంతగా ఆహ్లాదపరచలేవు.

 

న తథా రిపుర్న శస్త్రం నాగ్నిర్న విషం న దారుణో వ్యాధిః ।

పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥13

పదవిభాగః-- న తథా రిపుః న శస్త్రం న అగ్నిః న విషం న దారుణః వ్యాధిః । పరితాపయతి చ పురుషం యథా కటుక-భాషిణీ వాణీ ॥13

అన్వయః-- పురుషం రిపుః న, శస్త్రం న, అగ్నిః న, విషం న, దారుణః వ్యాధిః న చ తథా పరితాపయతి యథా కటుక-భాషిణీ వాణీ (పరితాపయతి). ॥13

తాత్పర్యం-- శత్రువు, ఆయుధం, నిప్పు, విషం, భయంకరమైన రోగం- ఇవన్నీ కూడా మనిషిని కఠినంగా మాట్లాడిన మాట పెట్టినంతగా బాధపెట్టవు.

 

రజనికరః కిల శీతో రజనికరాచ్చందనో మహాశీతః ।

రజనికరచందనాభ్యాం సజ్జనవచనాని శీతాని ॥14

పదవిభాగః-- రజనికరః కిల శీతః రజనికరాత్ చందనః మహాశీతః । రజనికర-చందనాభ్యాం సజ్జన-వచనాని శీతాని ॥14

అన్వయః-- రజనికరః శీతః కిల. రజనికరాత్ చందనః మహాశీతః. రజనికరచందనాభ్యాం సజ్జనవచనాని శీతాని. ॥14

తాత్పర్యం-- చంద్రుడు చల్లనివాడు. చంద్రునికంటే చందనం చాలా చల్లనిది. చంద్రునికన్నా, చందనం కన్నా, మహాత్ముల మాటలు చల్లనివి.

 

దివసకరః కిల తీక్ష్ణో దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః ।

దివసకరపావకాభ్యాం దుర్జనవచనాని తీక్ష్ణాని ॥15

పదవిభాగః-- దివసకరః కిల తీక్ష్ణః దివస-కరాత్ పావకః మహా-తీక్ష్ణః । దివసకర-పావకాభ్యాం దుర్జన-వచనాని తీక్ష్ణాని ॥15

అన్వయః-- దివసకరః కిల తీక్ష్ణః. దివసకరాత్ పావకః మహా-తీక్ష్ణః. దివసకరపావకాభ్యాం దుర్జనవచనాని తీక్ష్ణాని. ॥15

తాత్పర్యం-- సూర్యుడు తీక్ష్ణంగా ఉంటాడు. (వేడితో/వాడిగా గుచ్చుకుంటాడు). సూర్యునికన్నా అగ్ని ఇంకా వాడి. సూర్యుడు, అగ్నుకన్నా కూడా దుష్టుని మాటలు మరింత వాడిగా ఉంటాయి.

 

ఇక్షోరగ్రాత్ క్రమశః పర్వణి పర్వణి యథా రసవిశేషః ।

తద్వత్ సజ్జనమైత్రీ విపరీతానాం తు విపరీతా ॥16

పదవిభాగః-- ఇక్షోః అగ్రాత్ క్రమశః పర్వణి పర్వణి యథా రస-విశేషః । తద్వత్ సజ్జన-మైత్రీ విపరీతానాం తు విపరీతా ॥16

అన్వయః-- యథా ఇక్షోః అగ్రాత్ పర్వణి పర్వణి క్రమశః రసవిశేషః, తద్వత్ సజ్జనమైత్రీ (భవతి). విపరీతానాం తు విపరీతా (భవతి). ॥16

తాత్పర్యం-- చెరుకు పైభాగం కన్నా క్రమంగా ఒక్కొక్క గడలో రసం విశేషంగా (ఎక్కువగా) వచ్చినట్టు, ఉత్తముల స్నేహం (ఉంటుంది). ఇందుకు విరుద్ధమైనవారి (స్నేహం) విరుద్ధంగా (ఉంటుంది). [క్రమంగా తగ్గిపోతుంటుంది.]

On Good Company

“Friendship with the good grows day by day just as the sap of from top to bottom, joint by joint. Friendship of the wicked is opposite in nature to this.” Nitidvishashtika 16

 

పరుషానలప్రగల్భా దుర్జనవదనాత్ ప్రవృత్తవాగుల్కా ।

కుగృహాదివ దుష్టస్త్రీ త్వరితగతిర్నిస్సరతి వాణీ ॥17

పదవిభాగః-- పరుష-అనల-ప్రగల్భా దుర్జన-వదనాత్ ప్రవృత్త-వాగ్-ఉల్కా । కుగృహాద్ ఇవ దుష్టస్త్రీ త్వరిత-గతిః నిస్సరతి వాణీ ॥17

అన్వయః-- పరుషానలప్రగల్భా దుర్జనవదనాత్ ప్రవృత్తవాగుల్కా, కుగృహాద్ దుష్టస్త్రీ ఇవ వాణీ త్వరితగతిః నిస్సరతి ॥17

తాత్పర్యం-- పరుషమై, అగ్ని వలె ప్రగల్భంగా ఉండి, దుష్టుడి నోటినుండి బయల్వెడలిన ఉల్క వంటి మాట, చెడ్డ ఇంటినుంచి చెడుస్త్రీ వలె (ఆ మాట) వెనువెంటనే బయటకు వచ్చేస్తుంది.

 

మూర్ఖేషు కుశలమానిషు విజానతాప్యకుశలేన భవితవ్యమ్ ।

విమలమపి కథితమర్థం మూర్ఖా మోహాదపహసంతి ॥18

పదవిభాగః-- మూర్ఖేషు కుశల-మానిషు విజానతా అపి కుశలేన భవితవ్యమ్ । విమలమ్ అపి కథితమ్ అర్థం మూర్ఖాః మోహాద్ అపహసంతి ॥18

అన్వయః-- విజానతా అపి కుశలమానిషు మూర్ఖేషు కుశలేన భవితవ్యమ్ । కథితమ్ అర్థం విమలమ్ అపి మూర్ఖాః మోహాద్ అపహసంతి ॥18

తాత్పర్యం-- అన్ని తెలిసినవాడు కూడా తెలివిగలవారమనుకునే మూర్ఖుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. (విజ్ఞుడు) చెప్పిన మంచి ప్రయోజనాన్ని/అర్థాన్ని కూడా మూర్ఖులు మూఢత్వం వల్ల అపహసిస్తారు.

On Fools

 “Where fools pretend to be wise, the wise should pretend to be foolish. Under the spell of ignorance ridicule even the wise sayings.” Nitidvishashtika 18

 

మూర్ఖా న ద్రష్టవ్యా ద్రష్టవ్యాశ్చేన్న తైస్తు సహ తిష్ఠేత్ ।

యది తిష్ఠేన్న తు కథయేద్ యది కథయేన్మూర్ఖవత్ కథయేత్ ॥19

పదవిభాగః-- మూర్ఖాః న ద్రష్టవ్యాః ద్రష్టవ్యాః చేత్ న తైః తు సహ తిష్ఠేత్ । యది తిష్ఠేత్ న తు కథయేద్ యది కథయేత్ మూర్ఖవత్ కథయేత్ ॥19

అన్వయః-- మూర్ఖాః న ద్రష్టవ్యాః. ద్రష్టవ్యాః చేత్ తైః సహ తు న తిష్ఠేత్ । యది తిష్ఠేత్ న తు కథయేత్. యది కథయేత్ మూర్ఖవత్ కథయేత్ ॥19

తాత్పర్యం-- మూర్ఖులను చూడరాదు. చూసినా వారితో ఉండరాదు. ఉన్నట్లైతే మాట్లాడరాదు. ఒకవేళ మాట్లాడితే మూర్ఖుడిలా మాట్లాడాలి.

 “Avoid even the sight of foolish men. If one does see them, then avoid their company. If one does fall into the company of foolish men, then let him keep silent. And if one does have to speak amongst them, then let him too speak like them.” Nitidvishashtika 19

 

న తథా భవతి భయం మే వ్యాఘ్రం దృష్ట్వా వనే పిశాచం వా ।

మూర్ఖం దృష్ట్వాభిముఖం యథా భయం మాం సమావిశతి ॥20

పదవిభాగః-- న తథా భవతి భయం మే వ్యాఘ్రం దృష్ట్వా వనే పిశాచం వా । మూర్ఖం దృష్ట్వా అభిముఖం యథా భయం మాం సమావిశతి ॥20

అన్వయః-- యథా భయం మాం మూర్ఖం అభిముఖం దృష్ట్వా సమావిశతి, వనే వ్యాఘ్రం పిశాచం వా దృష్ట్వా మే భయం తథా న భవతి. ॥20

తాత్పర్యం-- అడవిలో పులిని చూసో, పిశాచాన్ని చూసో కూడా వేయనంత భయం మూర్ఖుని ఎదురుగా చూస్తే వేస్తుంది. (వాటికన్నా మూర్ఖుడు ప్రాణాంతకుడు అని తాత్పర్యం)

 

కాంతారపాదపానాం యథా ఫలం మానుషైరననుభోగ్యమ్ ।

ఏవమనార్యేష్వర్థాః మనసాప్యార్యైరననుభోగ్యాః ॥21

పదవిభాగః-- కాంతార-పాదపానాం యథా ఫలం మానుషైః అననుభోగ్యమ్ । ఏవమ్ అనార్యేషు అర్థాః మనసా అపి ఆర్యైః అననుభోగ్యాః ॥21

అన్వయః-- యథా కాంతారపాదపానాం ఫలం మానుషైః అననుభోగ్యమ్, ఏవమ్ అనార్యేషు అర్థాః ఆర్యైః మనసా అపి అననుభోగ్యాః ॥21

తాత్పర్యం-- అడవిలో చెట్ల పండ్లు మనుషులు తినలేనివి అయినట్లే దుష్టుల ధనసంపదాదులు కూడా ఆర్యులకు మనస్సు చేతనైనా అనుభవించరానివి.

 

ఉపభోగకాతరాణాం పురుషాణామర్థసంచయపరాణామ్ ।

కన్యారత్నమివ గృహే తిష్ఠంత్యర్థాః పరస్యార్థే ॥22

పదవిభాగః-- ఉపభోగ-కాతరాణాం పురుషాణామ్ అర్థసంచయ-పరాణామ్ । కన్యా-రత్నమ్ ఇవ గృహే తిష్ఠంతి అర్థాః పరస్యార్థే ॥22

అన్వయః-- అర్థసంచయపరాణామ్ ఉపభోగకాతరాణాం పురుషాణామ్ అర్థాః, పరస్యార్థే గృహే కన్యారత్నమ్ ఇవ తిష్ఠంతి ॥22

తాత్పర్యం-- అనుభవించటానికి భయపడుతూ ఉండే డబ్బును (కేవలం) దాచుకునే మనుష్యులకు చెందిన ధనసంపదలు, ఇతరుల కోసం (పెళ్ళి కాకుండా) ఇంట్లో కూర్చునే కూతురి వంటివి. (అంటే పరులు వచ్చి తీసుకుపోవటానికే ఆ ధనం కానీ వారికోసం ఉపయోగపడదు అని భావం)

On the Miser

“The wealth of a man who merely hoards riches, but does not want to enjoy them is like someone else’s wealth lying in his house. It is the like a daughter who is brought up (with love and affection), only to be given away at the time of her marriage.” Nitidvishashtika 22

 

కస్తస్య జీవితార్థః సతి విభవే కశ్చ తస్య పురుషార్థః ।

యోఽర్థినమభిముఖమాగతమనభిముఖః సన్ విసర్జయతి ॥23

పదవిభాగః-- కః తస్య జీవితార్థః సతి విభవే కః చ తస్య పురుషార్థః । యః అర్థినమ్ అభిముఖమ్ ఆగతమ్ అనభిముఖః సన్ విసర్జయతి ॥23

అన్వయః-- విభవే సతి, యః అభిముఖమ్ ఆగతమ్ అర్థినమ్ అనభిముఖః సన్ విసర్జయతి, తస్య జీవితార్థః కః, తస్య పురుషార్థః చ కః? 23

తాత్పర్యం-- వైభవం ఉండి కూడా, ఎవడైతే ఎదుటకు వచ్చి (ధన-సహాయాదులు) కోరినవాడిని ముఖం తిప్పేసుకుని, విడిచి పెట్టేస్తాడో, వాడి జీవితం ఎందుకు? వాడి పురుషార్థం ఏమిటి?

“No purpose of existence and no object of human life is attained by him, who turns miserly at the sight of a needy man and turns him away.” Nitidvishashtika 23

 

చారిత్రనిర్మలజలః సత్పురుషనదోఽక్షయో భవతు నిత్యమ్ ।

యస్య విభవారవిందే విద్వద్భ్రమరాః కృతవినోదాః ॥24

పదవిభాగః-- చారిత్ర-నిర్మల-జలః సత్పురుష-నదః అక్షయః భవతు నిత్యమ్ । యస్య విభవ-అరవిందే విద్వద్భ్రమరాః కృతవినోదాః ॥24

అన్వయః-- యస్య విభవారవిందే విద్వద్భ్రమరాః కృతవినోదాః (భవంతి), (సః) చారిత్రనిర్మలజలః సత్పురుషనదః నిత్యమ్ అక్షయః భవతు. ॥24

తాత్పర్యం-- ఎవరి వైభవమనే కమలంలో విద్వాంసులనే తేనెటీగలు వినోదిస్తూంటారో, ఆ నిర్మలమైన చరిత్ర అనే జలం కలిగిన, సత్పురుషులనే నది ఎల్లప్పుడూ అక్షయంగా ఉండాలి. (=పండితులు ఆనందించగలిగే చోటును కల్పించే సత్పురుషులు అక్షయం అగుదురు గాక. ఇక్కడ సత్పురుషులను నదితో, వారి చరిత్రను నిర్మలత్వమనే జలంతో వారి వైభవాన్ని కమలంతో, విద్వాంసులను భ్రమరాలతో పోల్చారు.)

 

జీవతి స జీవలోకే సుజీవితో నష్టయంత్రణైః ప్రణయాత్ ।

యస్యోద్యానతరోరివ సుహృద్భిరుపభుజ్యతే లక్ష్మీః ॥25

పదవిభాగః-- జీవతి సః జీవలోకే సుజీవితః నష్టయంత్రణైః ప్రణయాత్ । యస్య ఉద్యాన-తరోః ఇవ సుహృద్భిః ఉపభుజ్యతే లక్ష్మీః ॥25

అన్వయః-- నష్టయంత్రణైః సుహృద్భిః ప్రణయాత్ యస్య లక్ష్మీః ఉద్యానతరోః ఇవ ఉపభుజ్యతే, సః సుజీవితః జీవలోకే జీవతి ॥25

తాత్పర్యం-- కష్టం పోయినవారైన స్నేహితుల చేత ప్రేమగా ఎవరి ధనం తోటలో చెట్టులాగ అనుభవింపబడుతుందో, అతడు జీవలోకంలో చక్కగా జీవిస్తాడు. (స్నేహితులకు కష్టం పోయేంతగా ధనాన్ని ఇచ్చి ఆదుకునేవాడే లోకంలో సుఖంగా జీవిస్తాడని భావం)

 

యస్మిన్ జీవతి జీవతి మహాజనస్తస్య జీవితం నామ ।

జీవన్నపి న స జీవతి న జీవతి యమాశ్రితః పురుషః ॥26

పదవిభాగః-- యస్మిన్ జీవతి జీవతి మహాజనః తస్య జీవితం నామ । జీవన్ అపి న సః జీవతి న జీవతి యమ్ ఆశ్రితః పురుషః ॥26

అన్వయః-- యస్మిన్ జీవతి మహాజనః జీవతి, తస్య జీవితం నామ । సః జీవన్ అపి న జీవతి, యమ్ ఆశ్రితః పురుషః న జీవతి ॥26

తాత్పర్యం-- ఎవరు జీవించి ఉండగా మహాత్ముడు (లేదా అనేకమంది జనులు) జీవిస్తాడో(రో) జీవితమంటే అతడిది. ఎవరిని ఆశ్రయించి ఉన్నవాడు జీవించడో, అతడు (ఆశ్రయమైనవాడు) జీవించి ఉండి కూడా జీవించి లేనట్లే.

“That man’s life along is meaningful who sustains and nourishes vast multitudes of men from his provisions. And he, who does not sustain his dependents is indeed dead, even if alive.” Nitidvishashtika 25

 

జ్ఞానవతామతిథీనాం లోకజ్ఞానాం ప్రకాశవంశానామ్ ।

ప్రణయాద్ గృహే నివసతాం శేషభుజః సంతు నః సుహృదః ॥27

పదవిభాగః-- జ్ఞానవతామ్ అతిథీనాం లోకజ్ఞానాం ప్రకాశ-వంశానామ్ । ప్రణయాద్ గృహే నివసతాం శేష-భుజః సంతు నః సుహృదః ॥27

అన్వయః-- సుహృదః నః జ్ఞానవతాం, లోకజ్ఞానాం, ప్రకాశ-వంశానామ్, గృహే నివసతాం, అతిథీనాం ప్రణయాద్ శేషభుజః సంతు ॥27

తాత్పర్యం-- మా మంచి మిత్రులు- పండితులకు, అతిథులకు, లోకం తెలిసినవారికి, మంచి కుటుంబంవారికి, ప్రేమతో మన ఇంట నిలిచే వారికి- భుక్తశేషం తినేవారుగా అంటే, వారు తిన్న తరువాత తినేవారుగా అవుదురుగాక. (అతిథిని విడిచి తినరాదు. ఇంటికి వచ్చి ఉన్నవారు తిన్నాక యజమాని తాను తినుగాక అనే సూక్తిని చెబుతున్నారు.)

 

సత్కారపూర్వమార్యః ప్రయచ్ఛతిచ్ఛన్నమర్థమర్థిభ్యః ।

యద్యపి నీచో యచ్ఛతి తత్ కారణవచ్చ జనవచ్చ ॥28

పదవిభాగః-- సత్కార-పూర్వమ్ ఆర్యః ప్రయచ్ఛతి ఛన్నమ్ అర్థమ్ అర్థిభ్యః । యద్యపి నీచః యచ్ఛతి తత్ కారణవత్ చ జనవత్ చ ॥28

అన్వయః-- ఆర్యః సత్కారపూర్వమ్ అర్థిభ్యః ఛన్నమ్ అర్థమ్ ప్రయచ్ఛతి । యద్యపి నీచః తత్ కారణవత్ చ జనవత్ చ యచ్ఛతి ॥28

తాత్పర్యం-- ఉత్తముడు సత్కారభావంతో, గుప్తంగా, సహాయం కావలసినవారికి, చక్కగా ధనాన్ని ఇస్తాడు. అధముడు కూడా (దానంగా ధనం) ఇచ్చినప్పటికీ అది ఏదో కారణంగానో, లేక వ్యక్తి (ప్రాముఖ్యం) వల్లో అయ్యి ఉంటుంది.

 

శీలం శౌచం క్షాంతిర్దాక్షిణ్యం మధురతా కులే జన్మ ।

న విరాజంతే సర్వాణ్యర్థవిహీనస్య పురుషస్య ॥29

పదవిభాగః-- శీలం శౌచం క్షాంతిః దాక్షిణ్యం మధురతా కులే జన్మ । న విరాజంతే సర్వాణి అర్థ-విహీనస్య పురుషస్య ॥29

అన్వయః-- అర్థవిహీనస్య పురుషస్య శీలం, శౌచం, క్షాంతిః, దాక్షిణ్యం, మధురతా, కులే జన్మ - సర్వాణి న విరాజంతే ॥29

తాత్పర్యం-- ధనం లేని మనిషికి- శీలం, శుచి, క్షమ, దయ, తీయదనం, మంచి కుటుంబంలో జన్మ- ఇవన్నీ (ఉన్నా) శోభించవు.

On Wealth

“Virtuous conduct, cleanliness, patience, courtesy, sweet disposition and noble birth--all these do not shine in a person who does not possess wealth.” Nitidvishashtika 29

 

మానో వా దర్పో వా విజ్ఞానం విక్రమః సుబుద్ధిర్వా ।

సర్వం ప్రణశ్యతి సమం విభవవిహీనస్య పురుషస్య ॥30

పదవిభాగః-- మానః వా దర్పః వా విజ్ఞానం విక్రమః సుబుద్ధిః వా । సర్వం ప్రణశ్యతి సమం విభవ-విహీనస్య పురుషస్య ॥30

అన్వయః-- విభవవిహీనస్య పురుషస్య మానః వా, దర్పః వా, విజ్ఞానం విక్రమః సుబుద్ధిః వా, సర్వం సమం ప్రణశ్యతి. ॥30

తాత్పర్యం-- ధనం లేని మనిషికి మానం, దర్పం, విజ్ఞానం, పరాక్రమం, సద్బుద్ధి- సర్వమూ సమానంగా (ఇదెక్కవ అది తక్కువ అని కాకుండా మొత్తం) నశిస్తుంది.

 “Honor, self respect, knowledge, bravery, high ideals--all these are fruitless in one who does not have wealth.” Nitidvishashtika 30

 

హేతుప్రమాణయుక్తం వాక్యం న శ్రూయతే దరిద్రస్య ।

అప్యస్పష్టం వాక్యమనర్థం పూజ్యం సమృద్ధస్య ॥31

పదవిభాగః-- హేతు-ప్రమాణ-యుక్తం వాక్యం న శ్రూయతే దరిద్రస్య । అపి అస్పష్టం వాక్యమ్ అనర్థం పూజ్యం సమృద్ధస్య ॥31

అన్వయః-- దరిద్రస్య హేతుప్రమాణయుక్తం వాక్యం న శ్రూయతే. సమృద్ధస్య అస్పష్టమ్ అపి అనర్థం వాక్యం పూజ్యమ్. ॥31

తాత్పర్యం-- పేదవాడు సహేతుకంగా, సప్రమాణంగా చెప్పిన వాక్యం కూడా వినరు. ధనం ఉన్నవాడు అస్పష్టంగ, అనర్థమైన మాట చెప్పినా అది పూజ్యమే.

 

ఖ్యాతేఽపి కులే జాతః స్రగ్వీ వాగ్మీ సుదర్శనీయశ్చ ।

ఆర్యైర్గుణైర్వియుక్తః పలాశ ఇవ పుష్పితో భవతి ॥32

పదవిభాగః-- ఖ్యాతే అపి కులే జాతః స్రగ్వీ వాగ్మీ సుదర్శనీయః చ । ఆర్యైః గుణైః వియుక్తః పలాశ ఇవ పుష్పితః భవతి ॥32

అన్వయః-- ఖ్యాతే అపి కులే జాతః, స్రగ్వీ, వాగ్మీ, సుదర్శనీయః చ - ఆర్యైః గుణైః వియుక్తః పలాశః ఇవ పుష్పితః భవతి ॥32

తాత్పర్యం-- ప్రఖ్యాతమైన కుటుంబంలో పుట్టినవాడు మంచి పూలమాలలు వేసుకున్నవాడైనా, మాటల్లో పటువైనా, చూడచక్కనివాడైనా, యోగ్యమైన మంచి గుణాలు లేనివాడైనట్లైతే పలాశ వృక్షం వలె పుష్పిస్తాడు. (సామాన్యంగా పువ్వు నుండి పండు వస్తుంది. పలాశ చెట్టు పువ్వు పుష్పించీ లాభం ఉండదు. దానికి సువాసనా ఉండదు, ఎప్పటికీ ఫలించదు- అని అర్థం.)

 “An ignoble man, though born of a noble lineage, endowed with eloquence, a handsome appearance and adorned with garlands is like the Palasa (Flame of the Forest) tree which blooms but does not yield any fruit.” Nitidvishashtika 32

 

విద్యా శ్రుతం తపో వాప్యైశ్వర్యం వా యశః ప్రకాశో వా ।

శీలరహితస్య పుంసో ద్విరదస్నానోపమం భవతి ॥33

పదవిభాగః-- విద్యా శ్రుతం తపః వా అపి ఐశ్వర్యం వా యశః ప్రకాశః వా । శీల-రహితస్య పుంసః ద్విరద-స్నాన-ఉపమం భవతి ॥33

అన్వయః-- శీలరహితస్య పుంసః - విద్యా, శ్రుతం, తపః వా అపి, ఐశ్వర్యం వా, యశః, ప్రకాశః వా - ద్విరదస్నానోపమం భవతి ॥33

తాత్పర్యం-- చదువు, జ్ఞానం, తపస్సు, ఐశ్వర్యం, యశస్సు, కాంతి - ఏదైనా శీలంలేనివాడికి అది ఏనుగు స్నానం వలె అవుతుంది. (ఏనుగు స్నానం చేసిన తరువాత మళ్ళీ ఒడలంతా మట్టి పూసుకుంటుంది. కనుక స్నానం చేసి లాభం ఉండదు.)

On Virtue

“Learning, Vedic study, penances, prosperity, fame and splendor--all these in one who is devoid of good character are like the bath of an elephant (an elephant throws dust on his body after bathing)” Nitidvishashtika 38

 

తీర్థాభిషేకగమనైర్నిదాఘసూర్యానువర్తనస్నానైః ।

శిశిరేష్వసుప్తవాసైర్నాశీలః స్వర్గమాప్నోతి ॥34

పదవిభాగః-- తీర్థ-అభిషేక-గమనైః నిదాఘ-సూర్య-అనువర్తన-స్నానైః । శిశిరేషు అసుప్తవాసైః న అశీలః స్వర్గమ్ ఆప్నోతి ॥34

అన్వయః-- తీర్థాభిషేకగమనైః నిదాఘసూర్యానువర్తనస్నానైః । శిశిరేషు అసుప్తవాసైః అశీలః స్వర్గం న ఆప్నోతి ॥34

తాత్పర్యం-- తీర్థక్షేత్రాలకు, అభిషేకాలకు పోవటం చేత, వేసవిలో ఎండలో స్నానం చేసినందువల్ల, చలికాలంలో నిద్రలేకుండా గడిపినంత మాత్రం చేత శీలంలేనివాడు స్వర్గాన్ని పొందలేడు. (శీలం లేకపోతే ఏ గొప్ప ప్రయత్నాలూ ఉత్తమగతికై పనికిరావని సారం.)

 “Pilgrimages to holy places for ablutions, gazing at the hot blazing sun as a penance, standing in water in winter--all these cannot take a man to heaven if he were devoid of good character.” Nitidvishashtika 39

 

గంధైర్వా మాల్యైర్వా కిం శీలవతో ముహూర్తరమణీయైః ।

దిశి దిశి యస్య ప్రసృతో గుణాధివాసో యశోగర్భః ॥35

పదవిభాగః-- గంధైః వా మాల్యైః వా కిం శీలవతః ముహూర్త-రమణీయైః । దిశి దిశి యస్య ప్రసృతః గుణ-అధివాసః యశః-గర్భః ॥35

అన్వయః--  యస్య దిశి దిశి గుణాధివాసః యశోగర్భః ప్రసృతః తస్య శీలవతః ముహూర్తరమణీయైః గంధైః వా మాల్యైః వా కిం? 35

తాత్పర్యం-- గుణాలకు నిలయమైన ఎవరి యశస్సు దిశదిశల్లో వ్యాపించిందో, అట్టి శీలవంతులకు క్షణికమైన శోభ కలిగిన గంధాలు, మాలలు ఎందుకు?

 “Of what use are garlands and perfumes to the man, the fragrance of whose noble qualities has permeated all the directions?” Nitidvishashtika 40

 

భవతు చ న భవతు విత్తం కులీనతా దుర్లభా మనుష్యస్య ।

ప్రాప్య చ కులపుత్రత్వం చారిత్రాఢ్యేన భవితవ్యమ్ ॥36

పదవిభాగః-- భవతు చ న భవతు విత్తం కులీనతా దుర్లభా మనుష్యస్య । ప్రాప్య చ కుల-పుత్రత్వం చారిత్ర-ఆఢ్యేన భవితవ్యమ్ ॥36

అన్వయః-- విత్తం భవతు చ న భవతు (వా) మనుష్యస్య కులీనతా దుర్లభా । కులపుత్రత్వం ప్రాప్య చ చారిత్రాఢ్యేన భవితవ్యమ్ ॥36

తాత్పర్యం-- ధనం ఉండవచ్చు, లేకపోనూవచ్చు. మంచి కుటుంబంలో పుట్టుక మనిషికి చాలా అరుదుగా కలుగుతుంది. మంచి కుటుంబంలో కొడుకుగా పుట్టినప్పుడు వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉండాలి.

 

శీలమపి రక్షమాణాః శ్రుతవంతః శౌర్యధైర్యసంపన్నాః ।

నీచైస్తథా మిలంతే యథా కిల న విక్రియాం యాంతి ॥37

పదవిభాగః-- శీలమ్ అపి రక్షమాణాః శ్రుతవంతః శౌర్య-ధైర్య-సంపన్నాః । నీచైః తథా మిలంతే యథా కిల న విక్రియాం యాంతి ॥37

అన్వయః-- శీలమ్ అపి రక్షమాణాః శ్రుతవంతః శౌర్యధైర్యసంపన్నాః । నీచైః తథా మిలంతే యథా కిల న విక్రియాం యాంతి ॥37

తాత్పర్యం-- శీలాన్ని రక్షించుకునేవారైనా, చదువుకున్నవారైనా, శౌర్యం ధైర్యం కలవారైనప్పటికీ నీచులతో కలిసినంతనే వికారాన్ని పొందుతారు. (దిగజారతారు). (బహుశ, ఇక్కడ ‘న’ కి ఇవార్థం)

 

మానీ దంభీ ద్రోహీ పరాపవాదీ వికత్థనః పిశునః ।

బ్రాహ్మణకులేఽపి జాతః శ్వపాక ఇవ నీచతాం యాతి ॥38

పదవిభాగః-- మానీ దంభీ ద్రోహీ పరాపవాదీ వికత్థనః పిశునః । బ్రాహ్మణ-కులే అపి జాతః శ్వపాక ఇవ నీచతాం యాతి ॥38

అన్వయః-- బ్రాహ్మణకులే జాతః అపి, (యది) మానీ, దంభీ, ద్రోహీ, పరాపవాదీ, వికత్థనః, పిశునః (భవతి, సః)- శ్వపాక ఇవ నీచతాం యాతి ॥38

తాత్పర్యం-- గర్విష్టి, దంభం కలవాడు, ద్రోహి, ఇతరుల మీద అభాండాలు వేసేవాడు, గొప్పలు చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడు- బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ చండాలునివలె (కుక్కమాంసం తినేవాడివలె) అధముడవుతాడు. 

 “Although born in a family of Brahmins, a man who is proud, hypocritical, harmful to others, evil-tongued, boastful and slanderous is but a lowly Chandala (outcaste)” Nitidvishashtika 43

 

మలినాశ్చైతేఽమలినా యేషాం హృదయాని నిత్యశుద్ధాని ।

తేఽమలినా అపి మలినా యేషాం హృదయాని కలుషాణి ॥39

పదవిభాగః-- మలినాః చ ఏతే అమలినా యేషాం హృదయాని నిత్య-శుద్ధాని । తే అమలినాః అపి మలినాః యేషాం హృదయాని కలుషాణి ॥39

అన్వయః-- యేషాం హృదయాని నిత్యశుద్ధాని, ఏతే మలినాః (సంతః అపి) చ అమలినాః (ఏవ భవంతి) । యేషాం హృదయాని కలుషాణి తే అమలినా అపి మలినాః  (భవంతి)॥39

తాత్పర్యం-- మలినం కలిగి ఉన్నా ఎవరి మనస్సులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయో వారు మలినులు కారు. మలినులు కాకపోయినా ఎవరి మనసులు కలుషితంగా ఉంటాయో వారు మలినులు.

On Purity

“They who are pure at heart are pure even if impure externally. And they whose hearts are impure are impure even if they be clean from outside.” Nitidvishashtika 44

 

సత్యార్జవహృదయానాం కిం ఖలు కర్తవ్యమస్తి సాధూనామ్ ।

యే స్వహృదయానుమానాత్ పరహృదయే యాంతి విశ్వాసమ్ ॥40

పదవిభాగః-- సత్య-అర్జవ-హృదయానాం కిం ఖలు కర్తవ్యమ్ అస్తి సాధూనామ్ । యే స్వహృదయ-అనుమానాత్ పర-హృదయే యాంతి విశ్వాసమ్ ॥40

అన్వయః-- యే స్వహృదయానుమానాత్ పరహృదయే విశ్వాసం యాంతి (తాదృశాం) సత్యార్జవహృదయానాం సాధూనాం కిం ఖలు కర్తవ్యమ్ అస్తి ? 40

తాత్పర్యం-- ఎవరైతే తమ హృదయం ప్రకారం (తీరునుబట్టి) ఇతరుల హృదయాలపై నమ్మకాన్ని ఉంచుతారో, అట్టి సత్యం, ఋజుత్వంతో కూడిన మనసులు కలిగినవారైన సాధుజనులకు చేయవలసింది ఇంకా ఏమున్నది? [తాము ఉన్నట్టే అవతలివారూ ఉంటారు అనుకుని మంచితనాన్ని నమ్మినవారికి ఇంకా చేయవలసిందేమి మిగిలింది?]

 

మర్మాంతః పరిహాసో యావత్ క్రియమాత్రభద్రకృత్త్వం చ ।

స్మరణం చ దుష్కృతానాం త్రీణి కుమిత్రస్య చిహ్నాని ॥41

పదవిభాగః-- మర్మ-అంతః పరిహాసః యావత్ క్రియమాత్ర-భద్రకృత్త్వం చ । స్మరణం చ దుష్కృతానాం త్రీణి కుమిత్రస్య చిహ్నాని ॥41

అన్వయః-- మర్మాంతః పరిహాసః, యావత్ క్రియమాత్రభద్రకృత్త్వం చ, దుష్కృతానాం స్మరణం చ – (ఏతాని) త్రీణి కుమిత్రస్య చిహ్నాని ॥41

తాత్పర్యం-- రహస్యం లేదా స్వగతవిషయం చెప్పిన తరువాత ఎద్దేవాచేయటం, పని ఉన్నంతవరకే మంచి చేయటం, చెడువాటినే గుర్తు పెట్టుకోవటం-- ఇవి మూడు చెడుమిత్రుని లక్షణాలు.

 “Following are the characteristics of a bad friend- making fun of their friend in public, showing friendship only as long as some benefit is obtained from the relationship, and not forgetting the bad deeds of his friend towards him.” Nitidvishashtika 46

 

బంధురివ భవతి పూర్వం మధ్యే మిత్రమివ శత్రురివ చాంతే ।

కృకలాస ఇవ దురాత్మా త్రీన్ వర్ణాన్ దర్శయతి నీచః ॥42

పదవిభాగః-- బంధుః ఇవ భవతి పూర్వం మధ్యే మిత్రమ్  ఇవ శత్రుః ఇవ చ అంతే । కృకలాసః ఇవ దురాత్మా త్రీన్ వర్ణాన్ దర్శయతి నీచః ॥42

అన్వయః-- పూర్వం బంధుః ఇవ భవతి. మధ్యే మిత్రమ్ ఇవ (భవతి). అంతే చ శత్రుః ఇవ. కృకలాస ఇవ దురాత్మా నీచః త్రీన్ వర్ణాన్ దర్శయతి ॥42

తాత్పర్యం-- మొదలు బంధువు లాగా, మధ్యలో స్నేహితునిలాగా, చివరలో శత్రువులాగా- దుష్టుడైన నీచుడు ఊసరవెల్లిలాగా మూడు రంగులను మారుస్తాడు.

On Wicked Men

“Just as a chameleon changes colors, the low and wicked too put on three different colors. At first, he acts as relative, next as a friend and at the end, he turns out to be a enemy.” Nitidvishashtika 47

 

గుణవంతః సమశీలా విస్రంభసుఖోపచారసంభోగాః ।

సమదుఃఖసుఖాః సుహృదో రసాయనం జీవలోకస్య ॥43

పదవిభాగః-- గుణవంతః సమశీలాః విస్రంభ-సుఖ-ఉపచార-సంభోగాః । సమ-దుఃఖ-సుఖాః సుహృదః రసాయనం జీవ-లోకస్య ॥43

అన్వయః-- గుణవంతః, సమశీలాః విస్రంభసుఖోపచారసంభోగాః, సమదుఃఖసుఖాః సుహృదః జీవలోకస్య రసాయనం  (భవంతి)॥43

తాత్పర్యం-- గుణవంతులు, మంచి శీలం కలవారు, నమ్మకమనే సుఖాన్ని హాయిగా కలిగించేవారు, సుఖదుఃఖాలను సమంగా తీసుకునేవారైన మంచి స్నేహితులు ఈ లోకంలో ఔషధం వంటివారు.

 

భిన్నశ్లిష్టా ప్రీతిర్యద్యప్యుపచారేణ బహుగుణీభవతి ।

ఛిన్నవిరూఢేవ లతా పూర్వచ్ఛాయాం న పూరయతి ॥44

పదవిభాగః-- భిన్న-శ్లిష్టా ప్రీతిః యద్యపి ఉపచారేణ బహుగుణీభవతి । ఛిన్న-విరూఢా ఇవ లతా పూర్వచ్ఛాయాం న పూరయతి ॥44

అన్వయః-- యద్యపి భిన్నశ్లిష్టా ప్రీతిః ఉపచారేణ బహుగుణీభవతి, (తథాపి సా) ఛిన్నవిరూఢా లతా ఇవ పూర్వచ్ఛాయాం న పూరయతి ॥44

తాత్పర్యం-- విరిగిన స్నేహం ప్రయత్నాలతో తిరిగి రెట్టింపు పుంజుకుంటుంది. కానీ కొమ్మ తెగిన తీగ వలె పూర్వపు కాంతిని నింపలేదు. [తెగిన తీగా, విరిగిన స్నేహమూ ప్రయత్నిస్తే మళ్ళీ ఎదుగుతాయి కానీ వాటికి గతవైభవము తిరిగి రాదు]

 “A creeper that has been cut can be made to grow again, but it will never look as beautiful as it used to. Similarly, an affectionate relationship that has been spoilt, can be revived again, but it will not have the same charm as it used to.” Nitidvishashtika 49

 

స్నిగ్ధానామశఠానాం స్థిరసంధీనాం మహానుభావానామ్ ।

వ్యసనేషు సహాయానాం భద్రం కల్యాణమిత్రాణామ్ ॥45

పదవిభాగః-- స్నిగ్ధానామ్ అశఠానాం స్థిర-సంధీనాం మహానుభావానామ్ । వ్యసనేషు సహాయానాం భద్రం కల్యాణ-మిత్రాణామ్ ॥45

అన్వయః-- స్నిగ్ధానామ్, అశఠానాం, స్థిరసంధీనాం, మహానుభావానామ్, వ్యసనేషు సహాయానాం, కల్యాణమిత్రాణామ్ భద్రం ॥45

తాత్పర్యం-- స్నేహశీలులు, మోసం లేనివారు, బంధం నిలుపుకునే గుణం కలవారు, మహానుభావులు, కష్టాలలో సహాయం చేసేవారు- అయిన మంచి మిత్రులకు భద్రం కలగాలి.

 

వాఙ్మాత్రవత్సలానాం శస్త్రాగ్నివిషప్రఘాతహృదయానామ్ ।

అర్థార్థమాశ్రితానాం ధిగస్తు బత పాపమిత్రాణామ్ ॥46

పదవిభాగః-- వాక్-మాత్ర-వత్సలానాం శస్త్ర-అగ్ని-విష-ప్రఘాత-హృదయానామ్ । అర్థార్థమ్ ఆశ్రితానాం ధిగ్ అస్తు బత పాప-మిత్రాణామ్ ॥46

అన్వయః-- బత, వాఙ్మాత్రవత్సలానాం, శస్త్రాగ్నివిషప్రఘాతహృదయానామ్, అర్థార్థమ్ ఆశ్రితానాం, పాపమిత్రాణామ్ ధిగ్ అస్తు. ॥46

తాత్పర్యం-- వాక్కులో మాత్రమే వాత్సల్యం కనబరచేవారు, హృదయంలో ఆయుధం, నిప్పు, విషం, యుద్ధం/దెబ్బతీయటం (వంటి భావాలు) ఉన్నవారు, ప్రయోజనం కోసం (ఇతరులను) ఆశ్రయించేవారు-- అయిన పాపాత్ములైన మిత్రులకు ధిక్కారము (ఛీ).

 

స్వజన ఇవ భవతి నీచస్తావద్ యావద్ స్వకార్యనిష్పత్తిః ।

కృతకృత్యస్త్వపవృత్తః ప్రతికారభయాద్ భవతి శత్రుః ॥47

పదవిభాగః-- స్వజనః ఇవ భవతి నీచః తావద్ యావద్ స్వ-కార్య-నిష్పత్తిః । కృత-కృత్యః తు అపవృత్తః ప్రతికార-భయాద్ భవతి శత్రుః ॥47

అన్వయః-- నీచః యావద్ స్వకార్యనిష్పత్తిః (న భవతి) తావద్ స్వజన ఇవ భవతి, కృతకృత్యః తు అపవృత్తః (సన్) ప్రతికారభయాద్ శత్రుః భవతి. ॥47

తాత్పర్యం-- తన పని పూర్తి కానంతవరకు నీచుడు ఆత్మీయుడిలాగా ఉంటాడు. కార్యం పరిసమాప్తమవుతూనే వదిలిపెడతాడు. ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసివస్తుందోనని శత్రువుగా మారతాడు.

 

ఉపచారః కర్తవ్యో యావదనుత్పన్నసౌహృదః పురుషః ।

ఉత్పన్నసౌహృదానాముపచారః కైతవం భవతి ॥48

పదవిభాగః-- ఉపచారః కర్తవ్యః యావద్ అనుత్పన్న-సౌహృదః పురుషః । ఉత్పన్న-సౌహృదానామ్ ఉపచారః కైతవం భవతి ॥48

అన్వయః-- యావద్ అనుత్పన్నసౌహృదః పురుషః (తావత్) ఉపచారః కర్తవ్యః. ఉత్పన్నసౌహృదానామ్ ఉపచారః కైతవం భవతి ॥48

తాత్పర్యం-- స్నేహం నెలకొననంతవరకే మనిషి ఔపచారికత (అవసర మర్యాదలు) చేయాలి. ఒకసారి స్నేహం బలపడ్డాక మర్యాదలు చేయటం మోసానికి గుర్తు అవుతుంది. (అంటే కొన్ని ఔపచారికతలు వాటికవే స్నేహబలంలో కొట్టుకుపోతాయి. వాటిని పాటిస్తే కృత్రిమంగా అనిపిస్తుంది.)

 “One should retain formal courtesy only as long as friendship has not been achieved. Once friendship is acquired, formal courtesy is a sign of deceit.” Nitidvishashtika 53

 

ధిగ్ ధిక్ సజ్జనమైత్రీం దుర్జనసంసర్గ ఏవ నో భవతు ।

సజ్జనవియోగకాలే భవంతి తీవ్రాణి దుఃఖాని ॥49

పదవిభాగః-- ధిక్ ధిక్ సజ్జన-మైత్రీం దుర్జన-సంసర్గః ఏవ నః భవతు । సజ్జన-వియోగ-కాలే భవంతి తీవ్రాణి దుఃఖాని ॥49

అన్వయః-- ధిగ్ ధిక్ సజ్జనమైత్రీం. దుర్జనసంసర్గ ఏవ నః భవతు । సజ్జనవియోగకాలే తీవ్రాణి దుఃఖాని భవంతి ॥49

తాత్పర్యం-- అయ్యో, మంచివ్యక్తితో స్నేహం మాకు వద్దే వద్దు (కలగకుండుగాక). చెడ్డవారితో సంబంధమే మాకు కలుగు గాక. మంచి వ్యక్తి విడిచిపోయే సమయంలో తీవ్రమైన దుఃఖాలు కలుగుతాయి.

 

అల్పాశ్చ గుణాః స్ఫీతా భవంతి గుణసముదితేషు పురుషేషు ।

శ్వేతగిరిశిఖరకేష్వివ నిశాసు చంద్రాంశవః పతితాః ॥50

పదవిభాగః-- అల్పాః చ గుణాః స్ఫీతాః భవంతి గుణ-సముదితేషు పురుషేషు । శ్వేత-గిరి-శిఖరకేషు ఇవ నిశాసు చంద్రాంశవః పతితాః ॥50

అన్వయః-- గుణ-సముదితేషు పురుషేషు అల్పాః చ గుణాః స్ఫీతాః భవంతి । శ్వేతగిరిశిఖరకేషు ఇవ నిశాసు చంద్రాంశవః పతితాః ॥50

తాత్పర్యం-- అల్పమైన సద్గుణాలు కూడా సద్గుణవంతుల వద్ద అధికమవుతాయి. రాత్రులలో తెల్లని (హిమవత్) పర్వతాలపై పడిన చంద్రకిరణాలు మరింతగా మెరిసినట్టు (ఇది కూడా).

On Merit

“Although dim, the rays of moon falling on the snow clad peaks of the Himalayas look resplendent and illuminate entire mountain ranges. Likewise, even a few good qualities become abundant in persons who are lofty with merit.” Nitidvishashtika 55

 

శతమప్యపరాధానాం సుకృతేనైకేన నాశయత్యార్యః ।

నాశయతి సుకృతశతాన్యపి నీచస్త్వేకాపరాధేన ॥51

పదవిభాగః-- శతమ్ అపి అపరాధానాం సుకృతేన ఏకేన నాశయతి ఆర్యః । నాశయతి సుకృత-శతాని అపి నీచః తు ఏక-అపరాధేన ॥51

అన్వయః-- ఆర్యః శతమ్ అపి అపరాధానాం ఏకేన సుకృతేన నాశయతి । నీచః తు సుకృతశతాని అపి ఏకాపరాధేన నాశయతి ॥51

తాత్పర్యం-- మంచి వ్యక్తి ఒక్క మంచిపని (పుణ్యకార్యం)తో వంద అపరాధాలను కూడా నశింపచేస్తాడు. అధముడు వంద మంచి పనులను (పుణ్యకార్యాలను) కూడా ఒక్క తప్పుతో నాశనం చేస్తాడు. (అంటే- మంచివాడు వంద తప్పులనైనా క్షమించి ఒక మంచిని పరిగణిస్తాడు. దుష్టుడు ఒక్క తప్పుకోసం వంద మంచిపనులను నిరాకరిస్తాడు.)

 

ఏకసుకృతేన దుష్కృతశతాని యే నాశయంతి తే సేవ్యాః ।

న త్వేకదోషజనితో యేషాం కోపః కృతశతఘ్నః ॥52

పదవిభాగః-- ఏక-సుకృతేన దుష్కృత-శతాని యే నాశయంతి తే సేవ్యాః । న తు ఏక-దోష-జనితః యేషాం కోపః కృత-శతఘ్నః ॥52

అన్వయః-- యే ఏకసుకృతేన దుష్కృతశతాని నాశయంతి తే సేవ్యాః । యేషాం ఏకదోషజనితః కోపః కృతశతఘ్నః (భవతి) (తే) న తు (సేవ్యాః)॥52

తాత్పర్యం-- (అవతలివాడు చేసిన) ఒక మంచి పనితో వంద చెడ్డ పనులను నాశనం చేసేవారు (పట్టించుకోకుండా వదిలేసేవారు) పూజ్యులు (సమీపించ తగినవారు). (అంతే కానీ అవతలివాడు) ఒక్క తప్పు చేసినందుకు వచ్చిన కోపంతో (మొదలు చేసిన) వంద పనులను నాశనం చేసేవాడు (పరిగణించకుండా వదిలేసేవాడు) అట్లా కాదు. (అతడిని సమీపించరాదు.) [ఒక్క మంచి పనితో వంద దుష్కార్యాలను నాశనం చేయగలవారు పూజ్యులు (సేవింపదగినవారు). ఒక్క తప్పు కారణంగా కలిగిన కోపంతో వంద మంచిపనులను పాడు చేసేవాడిని సేవించరాదు]

 

సమరసమవిషమమకుటిలమవస్థితం తుల్యశీలసామర్థ్యమ్ ।

ఏకమపి మిత్రమచలితముదారమార్యస్య పర్యాప్తమ్ ॥53

పదవిభాగః-- సమరసమ్ అవిషమమ్ అకుటిలమ్ అవస్థితం తుల్య-శీల-సామర్థ్యమ్ । ఏకమ్ అపి మిత్రమ్ అచలితమ్ ఉదారమ్ ఆర్యస్య పర్యాప్తమ్ ॥53

అన్వయః-- ఆర్యస్య ఏకమ్ అపి మిత్రమ్ పర్యాప్తమ్ (యత్-) సమరసమ్ అవిషమమ్ అకుటిలమ్ అవస్థితం తుల్యశీలసామర్థ్యమ్ అచలితమ్ ఉదారమ్ (చ భవతి)॥53

తాత్పర్యం-- మంచివాడికి ఒక్క మిత్రుడు (ఇట్టి గుణాలవాడు) ఉంటే చాలు - స్నేహం (సామరస్యం) కలవాడు, విరోధించనివాడు, కుటిలత లేనివాడు, దగ్గర (ఎదురుగా) ఉన్నవాడు, వ్యక్తిత్వం (శీలం)-సామర్థ్యంలో సమానుడు, (స్నేహంనుంచి) చలించనివాడు, ఉన్నతమైన హృదయుడు అయినవాడు.

 

విద్వానృజురభిగమ్యో విదుషి శఠే చాప్రమాదినా భావ్యమ్ ।

మూర్ఖఋజవోఽనుకంప్యా మూర్ఖశఠాః సర్వదా వర్జ్యాః ॥54

పదవిభాగః-- విద్వాన్ ఋజుః అభిగమ్యః విదుషి శఠే చ అప్రమాదినా భావ్యమ్ । మూర్ఖ-ఋజవః అనుకంప్యాః మూర్ఖశఠాః సర్వదా వర్జ్యాః ॥54

అన్వయః-- విద్వాన్ ఋజుః అభిగమ్యః ।  విదుషి శఠే చ అప్రమాదినా భావ్యమ్ । మూర్ఖఋజవః అనుకంప్యాః । మూర్ఖశఠాః సర్వదా వర్జ్యాః ॥54

తాత్పర్యం-- (ఇందులో నలుగురి గురించి చెప్తున్నారు). విద్వాంసుడు అయి సరలస్వభావం కలవాడితో చేరి ఉండవచ్చు. విద్వాంసుడైనా కుటిలుడితో జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖుడైనా సరలంగా ఉండేవాడి పై జాలి చూపాలి. మూర్ఖుడైన కుటిలుడిని మాత్రం పూర్తిగా విడిచిపెట్టాలి.

 

చిరజీవిత్వమనర్థం కామేర్ష్యాసక్తచేతసాం పుంసామ్ ।

కర్మణ్యసమర్థానాం పరిభవదుఃఖాగ్నితప్తానామ్ ॥55

పదవిభాగః-- చిర-జీవిత్వమ్ అనర్థం కామ-ఈర్ష్యా-ఆసక్త-చేతసాం పుంసామ్ । కర్మణి అసమర్థానాం పరిభవ-దుఃఖ-అగ్ని-తప్తానామ్ ॥55

అన్వయః-- కామేర్ష్యాసక్తచేతసాం కర్మణి అసమర్థానాం పరిభవదుఃఖాగ్నితప్తానాం చిరజీవిత్వమ్ అనర్థం ॥55

తాత్పర్యం-- అతికోరిక, ఈర్ష్య తో నిండిన మనస్సు ఉన్నవారు, (అంగవైకల్యాదుల వల్లో, దుర్బలమైన మనస్సు వల్లో) పనులు చేసుకోలేనివారు, అవమానం అనే అగ్నితో హృదయం కాలి ఉన్నవారు- వీరికి దీర్ఘజీవితం అనర్థం. (అంటే వారు జీవించకూడదని కాదు- కష్టం కనుక ఇతరులు వారిని అర్థం చేసుకుని సహాయం చేయాలని సూచనగా తీసుకోవాలి.)

On Longevity

“Of what use is a long life to those whose minds are blemished with lust and jealousy, who work inefficiently and who feel insulted at slight pretexts?” Nitidvisastika 60

 

త్యక్తవ్యాస్తే సుహృదో యే దైవవిపర్యయాగతం మిత్రమ్ ।

వ్యసనార్ణవే నిమగ్నం స్వస్థా జనవన్నిరీక్షంతే ॥56

పదవిభాగః-- త్యక్తవ్యాః తే సుహృదః యే దైవ-విపర్యయా-గతం మిత్రమ్ । వ్యసన-అర్ణవే నిమగ్నం స్వస్థా జనవత్ నిరీక్షంతే ॥56

అన్వయః-- తే సుహృదః త్యక్తవ్యాః యే దైవవిపర్యయాగతం వ్యసనార్ణవే నిమగ్నం మిత్రం స్వస్థా జనవత్ నిరీక్షంతే ॥56

తాత్పర్యం-- దురదృష్టం పాలైన, కష్టాల సముద్రంలో మునిగిన స్నేహితుని మామూలుగా (ఏమీ జరగనట్టే) చూస్తూండిపోయే మిత్రులు విడిచిపెట్టదగినవారు.

 

సతతప్రసరే విషయే జితేంద్రియత్వం చ యది భవేత్పుంసః ।

ఇహ చ మనోఽభిఘాతః పరత్ర చిరం సుఖం భవతి ॥57

పదవిభాగః-- సతత-ప్రసరే విషయే జితేంద్రియత్వం చ యది భవేత్ పుంసః । ఇహ చ మనః అభిఘాతః పరత్ర చిరం సుఖం భవతి ॥57

అన్వయః-- పుంసః సతతప్రసరే విషయే జితేంద్రియత్వం చ యది భవేత్ । ఇహ చ మనః అభిఘాతః పరత్ర చిరం సుఖం భవతి ॥57

తాత్పర్యం-- ఎప్పుడూ కదిలిపోతుండే (చంచలమైన ఇంద్రియ) విషయాలపై మనిషికి గెలుపు కలిగితే, ఇహలోకంలో మనస్సు హతం చెందుతుంది. (దాని పూర్తి దుష్ట ప్రభావాన్ని, చెడు అధికారాన్ని కోల్పోతుంది.) పరలోకంలో సుఖంగా ఉంటుంది.

 

హిమవతి తిష్ఠత్యౌషధముదధౌ రత్నం విభావసౌ తేజః ।

వైరమసజ్జనహృదయే సజ్జనహృదయే సదా క్షాంతిః ॥58

పదవిభాగః-- హిమవతి తిష్ఠతి ఔషధమ్ ఉదధౌ రత్నం విభావసౌ తేజః । వైరమ్ అసజ్జన-హృదయే సజ్జన-హృదయే సదా క్షాంతిః ॥58

అన్వయః-- హిమవతి ఔషధం తిష్ఠతి. ఉదధౌ రత్నం (తిష్ఠతి). విభావసౌ తేజః (తిష్ఠతి). అసజ్జనహృదయే వైరమ్ (తిష్ఠతి). సజ్జనహృదయే సదా క్షాంతిః (తిష్ఠతి). ॥58

తాత్పర్యం-- హిమాలయాలలో ఔషధం (ఔషధీచెట్లు) ఉంటుంది. సముద్రంలో రత్నం ఉంటుంది. సూర్యునిలో తేజస్సు ఉంటుంది. చెడ్డవారి మనసులో వైరం ఉంటుంది. మంచివారి మనస్సులో ఎప్పుడూ క్షమాగుణం ఉంటుంది.

 

పాషాణేష్వివ రేఖా మూర్ఖ-వైరం దృఢం చిరం భవతి ।

జలమధ్యేష్వివ రేఖా ప్రాజ్ఞే న చిరం భవతి వైరమ్ ॥59

పదవిభాగః-- పాషాణేషు ఇవ రేఖా మూర్ఖ-వైరం దృఢం చిరం భవతి । జలమధ్యేషు ఇవ రేఖా ప్రాజ్ఞే న చిరం భవతి వైరమ్ ॥59

అన్వయః-- మూర్ఖవైరం పాషాణేషు రేఖా ఇవ దృఢం చిరం భవతి । ప్రాజ్ఞే వైరం జలమధ్యేషు రేఖా ఇవ చిరం న భవతి ॥59

తాత్పర్యం-- రాళ్ళమీద గీతల లాగే మూర్ఖుల శత్రుత్వం చాలాకాలం పాటు ఉంటుంది. నీటి పై గీతలలాగే విజ్ఞులైనవారిలో శత్రుభావన ఎక్కువ కాలం ఉండదు.

On Enmity

“Foolish people never give up enmity, just as a line drawn on a rock cannot be erased. But the wise forgive and forget, their enmity is as ephemeral as a line drawn on the surface of water.” Nitidvishashtika 64

 

పరపరివాదనమూకాః పరదారనిరీక్షణేషు జాత్యంధాః ।

యే పరరహస్యబధిరాస్తే పురుషా దేవతాసదృశాః ॥60

పదవిభాగః-- పర-పరివాదన-మూకాః పర-దార-నిరీక్షణేషు జాతి-అంధాః । యే పర-రహస్య-బధిరాః తే పురుషాః దేవతా-సదృశాః ॥60

అన్వయః-- యే పురుషాః - పరపరివాదనమూకాః, పరదారనిరీక్షణేషు జాతిఅంధాః, పరరహస్యబధిరాః, తే దేవతాసదృశాః ॥60

తాత్పర్యం-- ఇతరులను తిట్టటం (అనవసరంగా విమర్శించటం)లో మూగవారు (గా ఉండిపోయేవారు), ఇతరుల భార్యలను చూడటంలో జన్మతః గుడ్డివారు (లా ప్రవర్తించేవారు), ఇతరుల నిగూఢవిషయాల పట్ల చెవిటివారు (లా వర్తిల్లేవారు) అయిన వ్యక్తులు దేవతలవంటివారు.

 

యది తత్త్వేనాక్రోశతి సోఢవ్యం భవతి తత్త్వమాహేతి ।

అథ చేన్మిథ్యాభిహితం క్షంతవ్యం నైతదస్తీతి ॥61

పదవిభాగః-- యది తత్త్వేన ఆక్రోశతి సోఢవ్యం భవతి తత్త్వమ్ ఆహ ఇతి । అథ చేత్ మిథ్యా అభిహితం క్షంతవ్యం న ఏతద్ అస్తి ఇతి ॥61

అన్వయః-- యది (కోపి) తత్త్వేన ఆక్రోశతి - తత్త్వమ్ ఆహ ఇతి - సోఢవ్యం భవతి । అథ చేత్ మిథ్యా అభిహితం (కేనచిత్, తర్హి) న ఏతద్ అస్తి ఇతి క్షంతవ్యం ॥61

తాత్పర్యం-- ఒకవేళ నిజంగా కోపి(౦చి అరి)స్తే- తప్పు మనదైతే, నిజమే కదా చెప్తున్నాడని (విని) భరించాలి. ఒకవేళ అనవసరంగా అపవాదు వేస్తున్నట్లైతే ఇది(నాకు చెందినది) కాదని (హద్దు మీరనంతవరకు) క్షమతో ఉండాలి.

On Forgiveness

“If one is censured for a genuine fault of his, then he should endure that rebuke. And if he is censured for no fault of his, he should forgive the other person thinking that the censure did not occur at all.” Nitidvishashtika 66

 

మర్మాణి ఘట్టయిత్వా సుప్రీతమనాస్తు దుర్జనో భవతి ।

అప్రియముక్త్వాతిభృశం పశ్చాత్తపతీహ ఖల్వార్యః ॥62

పదవిభాగః-- మర్మాణి ఘట్టయిత్వా సుప్రీత-మనాః తు దుర్జనః భవతి । అప్రియమ్ ఉక్త్వా అతిభృశం పశ్చాత్ తపతి ఇహ ఖలు ఆర్యః ॥62

అన్వయః-- దుర్జనః తు మర్మాణి ఘట్టయిత్వా సుప్రీతమనాః భవతి । ఆర్యః ఇహ ఖలు అప్రియమ్ ఉక్త్వా అతిభృశం పశ్చాత్ తపతి ॥62

తాత్పర్యం-- దుష్టుడు రహస్యాలు భేదించి (లేదా కోమలమైన భావాలను కించపరచి) ఎంతో సంతుష్టిని చెందుతాడు. మంచివాడు అప్రియంగా మాట్లాడి(నంతనే) చాలా పశ్చాత్తాపాన్ని పొందుతాడు.

On Virtuous Men

“A wicked man feels elated when he has hurts others with his unkind words. On the contrary, a good man repents immediately even if he makes an unkind remark out of carelessness.” Nitidvishashtika 67

 

శ్వా యది దశతి మనుష్యాన్న తే జనాస్తం పునః ప్రతిదశంతి ।

యద్యాక్రోశతి నీచో న సజ్జనస్తం వదతి కించిత్ ॥63

పదవిభాగః-- శ్వా యది దశతి మనుష్యాన్ న తే జనాః తం పునః ప్రతిదశంతి । యది ఆక్రోశతి నీచః న సజ్జనః తం వదతి కించిత్ ॥63

అన్వయః-- శ్వా యది మనుష్యాన్ దశతి, తే జనాః తం పునః న ప్రతిదశంతి । యది నీచః ఆక్రోశతి సజ్జనః తం కించిత్ న వదతి ॥63

తాత్పర్యం-- కుక్క మనుషులను కరిస్తే మనుషులు మనుషులు దాన్ని తిరిగి కరవరు. నీచుడు (తిడుతూ) అరిస్తే మంచివాడు అతడిని తిరిగి ఏమీ అనడు.

 “If a dog bites a man, he does not bite the dog back. Therefore, if a wicked man humiliates a virtuous one, the latter should not seek revenge.” Nitidvishashtika 68

 

శ్రేష్ఠం చ భయాత్ క్షమతే సమం తు లోకాపవాదజననభయాత్ ।

హీనం యస్తు క్షమతే స మహర్షిసమో నరో జ్ఞేయః ॥64

పదవిభాగః-- శ్రేష్ఠం చ భయాత్ క్షమతే సమం తు లోక-అపవాద-జనన-భయాత్ । హీనం యః తు క్షమతే సః మహర్షి-సమః నరః జ్ఞేయః ॥64

అన్వయః-- (నరః) శ్రేష్ఠం చ భయాత్ క్షమతే. సమం తు లోకాపవాదజననభయాత్ (క్షమతే)। యః తు హీనం క్షమతే, సః నరః మహర్షిసమః జ్ఞేయః ॥64

తాత్పర్యం-- (తనకన్నా) శ్రేష్ఠుడిని భయం వల్ల క్షమిస్తాడు. (తనతో) సమానుడిని లోకం, జనులు ఏమైనా అంటారేమోనని భయంతో క్షమిస్తాడు. హీనుడిని క్షమించేవాడు (భరించేవాడు) మహర్షి సమానుడు అని తెలుసుకోబడవలసినవాడు.

 

పరుషైరపి వాక్ఛల్యైర్మర్మఘ్నైః కోపితా మహాత్మానః ।

సలిలమివ శరత్కాలే స్వయమేవార్యాః ప్రసీదంతి ॥65

పదవిభాగః-- పరుషైః అపి వాక్-శల్యైః మర్మఘ్నైః కోపితా మహాత్మానః । సలిలమ్ ఇవ శరత్కాలే స్వయమ్ ఏవ ఆర్యాః ప్రసీదంతి ॥65

అన్వయః-- మహాత్మానః మర్మఘ్నైః పరుషైః వాక్శల్యైః కోపితాః అపి, ఆర్యాః (సంతః) శరత్కాలే సలిలమ్ ఇవ స్వయమ్ ఏవ ప్రసీదంతి ॥65

తాత్పర్యం-- మహాత్ములు కోమలమైన అంతరంగాన్ని బాధించే పరుషమైన మాటల శూలాలచేత కోపించినా, మంచివారు (కనుక) శరదృతువులో నీటి వలె తమంతట తామే (తిరిగి) ప్రసన్నులవుతారు.

 

ఆకృష్టేన మతిమతా తత్త్వార్థవిచారణే మతిః కార్యా ।

యది సత్యం కః కోపః స్యాదనృతం కిం ను కోపేన ॥66

పదవిభాగః-- ఆకృష్టేన మతిమతా తత్త్వార్థ-విచారణే మతిః కార్యా । యది సత్యం కః కోపః స్యాద్ అనృతం కిం ను కోపేన ॥66

అన్వయః-- ఆకృష్టేన మతిమతా తత్త్వార్థవిచారణే మతిః కార్యా । యది సత్యం కః కోపః, (యది) అనృతం స్యాద్, కిం ను కోపేన ॥66

తాత్పర్యం-- వివేకశీలుడు తిట్టబడినవాడైనప్పుడు తత్త్వం విచారించుకోవటంలో బుద్దిని నియోగించాలి. ఒకవేళ నిజమైతే ఇంకా కోపం ఎందుకు? అబద్ధం అయితే మాత్రం కోపం వల్ల ఏం ప్రయోజనం?

 

పనసామ్రపాటలసమాః స్యురిహోత్తమమధ్యమాధమాః పురుషాః ।

ఫలసుమఫలసుమనిచయైః కర్మవచఃకర్మవాఙ్నిచయైః ॥67

పదవిభాగః-- పనస-ఆమ్ర-పాటల-సమాః స్యుః ఇహ ఉత్తమ-మధ్యమ-అధమాః పురుషాః । ఫల-సుమఫల-సుమ-నిచయైః కర్మ-వచఃకర్మ-వాక్-నిచయైః ॥67

అన్వయః-- ఇహ ఉత్తమమధ్యమాధమాః పురుషాః - ఫలసుమఫలసుమనిచయైః కర్మవచః కర్మవాక్నిచయైః పనసామ్రపాటలసమాః స్యుః ॥67

తాత్పర్యం-- పనస-మామిడి-పాటలాల వలె ఉత్తమ-మధ్యమ-అధమ జనులు ఉంటారు. (క్రమంగా) ఫలం, సుమంఫలం, సుమనిచయం ఉంటాయి. అంటే కేవలం పని, మాట కూడా పని కూడా, కేవలం మాటలు మాత్రమే (అని సమన్వయం).

ఇక్కడ- ఉత్తముడు పనస పండు వలె. పండు మాత్రం ఉంటుంది.  ఆమ్రం పండు, పువ్వు కూడా ఉంటుంది. అంటే పని, మాట కూడా ఉంటుంది. పాటలం అంటే రోజా కేవలం పువ్వుల గుత్తులు ఉంటాయి.

[పనస ఫలం వలె ఉత్తములు పుష్పం లేకుండానే ఫలం ఇచ్చే గుణం వలె నేరుగా కార్యం నెరవేరుస్తారు. మామిడి పండు వలె మధ్యములు, పువ్వు పూసి పండు కాసినట్టు, మాట చెప్పి, పనిని చేస్తారు. రోజాపుష్పాల వలె అధములు, కేవలం పూవుల గుత్తులులాగా బోలెడు మాటలు చెప్తూ ఉంటారు.]

 

న భవతి భవతి చ న చిరం భవతి చిరం చేత్ ఫలే న సంభవతి ।

కోపః సత్పురుషాణాం తుల్యః స్నేహేన నీచానామ్ ॥68

పదవిభాగః-- న భవతి భవతి చ న చిరం భవతి చిరం చేత్ ఫలే న సంభవతి । కోపః సత్పురుషాణాం తుల్యః స్నేహేన నీచానామ్ ॥68

అన్వయః-- న భవతి, భవతి చ న చిరం భవతి, చిరం చేత్ ఫలే న సంభవతి । సత్పురుషాణాం కోపః నీచానాం స్నేహేన తుల్యః ॥68

తాత్పర్యం-- రాదు. వచ్చినా ఎక్కువ సేపు ఉండదు. ఎక్కువ సేపు ఉన్నా ఫలితాన్ని ఇవ్వదు- సత్పురుషుల కోపం, నీచుల స్నేహం- ఈ రెండూ (పైన చెప్పిన విధంగా) సమానమైనవి.

 

నీచజనజనితమన్యుః క్రుద్ధోఽపి న విప్రియం వదత్యార్యః ।

న హి రాహువదనదష్టశ్చంద్రః శైత్యం పరిత్యజతి ॥69

పదవిభాగః-- నీచ-జన-జనిత-మన్యుః క్రుద్ధః అపి న విప్రియం వదతి ఆర్యః । న హి రాహు-వదన-దష్టః చంద్రః శైత్యం పరిత్యజతి ॥69

అన్వయః-- ఆర్యః నీచజనజనితమన్యుః క్రుద్ధః అపి విప్రియం న వదతి । రాహువదనదష్టః చంద్రః శైత్యం న హి పరిత్యజతి ॥69

తాత్పర్యం-- అధముని (చేష్టల) వల్ల జనించిన కోపం కలవాడైనప్పటికీ మంచివాడు అప్రియంగా మాట్లాడడు. రాహువు చేత తన ముఖం కబళించి వేయబడినా చంద్రుడు చల్లదనాన్ని విడిచిపెట్టడు.

 

యత్కుపితాః ఖలభుజగాః పరమర్మఘ్నం క్షరంతి వాక్యవిషమ్ ।

తత్ క్షాంతిమయైరగదైర్విషమివ సంతః ప్రశమయంతి ॥70

పదవిభాగః-- యత్కుపితాః ఖల-భుజగాః పర-మర్మఘ్నం క్షరంతి వాక్య-విషమ్ । తత్ క్షాంతి-మయైః అగదైః విషమ్ ఇవ సంతః ప్రశమయంతి ॥70

అన్వయః-- యత్కుపితాః ఖలభుజగాః పరమర్మఘ్నం క్షరంతి వాక్యవిషమ్ । తత్ క్షాంతిమయైః అగదైః విషమ్ ఇవ సంతః ప్రశమయంతి ॥70

తాత్పర్యం-- కోపం వచ్చినవారైన దుష్టులు, పాములు- ఇతరుల కోమల అంతరంగాలను గాయపరిచే విధంగా వాక్యాలను (దుష్టుడు), విషాన్ని (పాము) కక్కుతారు. ఉత్తములు వాటిని మందుతో విషాన్ని వలె క్షమతో తగ్గించుకుంటారు. [దుష్టులు అనబడే పాములు (లేదా పాముల వంటి దుష్టులు) కోపించినవారై, ఇతరుల కోమలాంతరంగాలను గాయపరిచే విధంగా వాక్య విషాన్ని కక్కుతారు. ఉత్తములు ఓర్పు అనే మందుతో ఆ విషాన్ని తగ్గించుకుంటారు.]

 

ఆలస్యం త్యక్తవ్యం లౌల్యం లోభః పరాపవాదశ్చ ।

అస్థానేషు చ కోపస్తథాతిమానశ్చ పురుషేణ ॥71

పదవిభాగః-- ఆలస్యం త్యక్తవ్యం లౌల్యం లోభః పర-అపవాదః చ । అస్థానేషు చ కోపః తథా అతిమానః చ పురుషేణ ॥71

అన్వయః-- పురుషేణ ఆలస్యం, లౌల్యం, లోభః, పరాపవాదః చ, అస్థానేషు చ కోపః, తథా అతిమానః చ త్యక్తవ్యం ॥71

తాత్పర్యం-- సోమరితనం, చపలచిత్తత, దురాశ, చాడీలు (పరనింద), అనవసరమైన కోపం, అహంకారం - వీటన్నింటినీ మనిషి విడిచిపెట్టాలి.

 

విద్వానృజుః ప్రధానో విద్వాంశ్చ శఠశ్చ మధ్యమః పురుషః ।

మూర్ఖఋజుస్తు తృతీయః సర్వజఘన్యస్తు మూర్ఖశఠః ॥72

పదవిభాగః-- విద్వాన్ ఋజుః ప్రధానః విద్వాన్ చ శఠః చ మధ్యమః పురుషః । మూర్ఖ-ఋజుః తు తృతీయః సర్వ-జఘన్యః తు మూర్ఖశఠః ॥72

అన్వయః-- విద్వాన్ ఋజుః ప్రధానః । విద్వాన్ చ శఠః పురుషః చ మధ్యమః । మూర్ఖఋజుః తు తృతీయః । మూర్ఖశఠః తు సర్వజఘన్యః ॥72

తాత్పర్యం-- విద్వాంసుడు సరళమైన స్వభావం కలిగి ఉన్నవాడు ప్రధానుడు. విద్వాంసుడై కుటిలుడైతే మధ్యముడు. మూర్ఖుడై సరళస్వభావుడైతే మూడవస్థితి వాడు. అందరికన్నా నీచుడు మూర్ఖుడైన దుష్టుడు.

 

సుజనో న యాతి వైరం పరహితబుద్ధిర్వినాశకాలేఽపి ।

ఛేదేఽపి చన్దనతరుః సురభయతి ముఖం కుఠారస్య ॥73

పదవిభాగః-- సుజనః న యాతి వైరం పర-హిత-బుద్ధిః వినాశ-కాలే అపి । ఛేదే అపి చన్దన-తరుః సురభయతి ముఖం కుఠారస్య ॥73

అన్వయః-- సుజనః పరహితబుద్ధిః వినాశకాలే అపి వైరం న యాతి । చన్దనతరుః ఛేదే అపి కుఠారస్య ముఖం సురభయతి ॥73

తాత్పర్యం-- మంచివాడు వినాశకాలంలో సైతం ఇతరులకు మంచి చేసే స్వభావం వల్ల శత్రుత్వాన్ని పొందడు. నరకబడుతున్నా చందనం చెట్టు గొడ్డలి ముఖాన్ని పరిమళింపచేస్తుంది.

 “Even at times of calamity, a noble man should desist from harboring ill-will or enmity towards others. He is like the sandalwood tree that imparts its fragrance even to the axe blade that strikes it down.” Nitidvishashtika 78

 

అభిముఖమధురతరేభ్యః పరాఙ్ముఖా క్రోశనాత్ కుశీలేభ్యః ।

అభ్యన్తరకలుషేభ్యో భేతవ్యం మిత్రశత్రుభ్యః ॥74

పదవిభాగః-- అభిముఖ-మధుర-తరేభ్యః పరాఙ్ముఖ-ఆక్రోశనాత్ కుశీలేభ్యః । అభ్యన్తర-కలుషేభ్యః భేతవ్యం మిత్రశత్రుభ్యః ॥74

అన్వయః-- అభిముఖమధురతరేభ్యః, పరాఙ్ముఖాక్రోశనాత్ కుశీలేభ్యః, అభ్యన్తరకలుషేభ్యః - మిత్రశత్రుభ్యః భేతవ్యం ॥74

తాత్పర్యం-- ఎదురుంగా ఉన్నప్పుడు తీయగా (మాట్లాడుతూ) ఉండేవారు, పరోక్షంలో తిట్టిపోసే దుష్టశీలం కలిగినవారు, లోపల కపటం నిండినవారైన మిత్రరూపులైన శత్రువులకు భయపడాలి.

 

న చ హసతి నాభ్యసూయతి న పరాన్ పరిభవతి నానృతం వదతి ।

నాక్షిప్య కథాం కథయతి లక్షణమేతత్ కులీనస్య ॥75

పదవిభాగః-- న చ హసతి న అభ్యసూయతి న పరాన్ పరిభవతి న అనృతం వదతి । న ఆక్షిప్య కథాం కథయతి లక్షణమ్ ఏతత్ కులీనస్య ॥75

అన్వయః-- న చ హసతి, న అభ్యసూయతి, పరాన్ న పరిభవతి, అనృతం న వదతి, ఆక్షిప్య కథాం న కథయతి(ఇతి) ఏతత్ కులీనస్య లక్షణమ్ ॥75

తాత్పర్యం-- (హేళనగా) నవ్వడు, అసూయ చెందడు, అతరులను అవమానించడు, అబద్ధం చెప్పడు. తిడుతూ (చెడ్డగా విమర్శిస్తూ లేదా ఆక్షేపిస్తూ) మాట్లాడడు. ఇది మంచి కుటుంబం నుంచి వచ్చినవాడి లక్షణం.

 

పశ్యతి దీర్ఘం కృత్యం పీడాం సహతే పరం న పీడయతి ।

అవమన్యతే న కంచిల్లక్షణమేతత్ కులీనస్య ॥76

పదవిభాగః-- పశ్యతి దీర్ఘం కృత్యం పీడాం సహతే పరం న పీడయతి । అవమన్యతే న కంచిత్ లక్షణమ్ ఏతత్ కులీనస్య ॥76

అన్వయః-- దీర్ఘం కృత్యం పశ్యతి, పీడాం సహతే, పరం న పీడయతి । న కంచిత్ అవమన్యతే - ఏతత్ కులీనస్య లక్షణమ్ ॥76

తాత్పర్యం-- ఎక్కువ కాలంపాటు జరగాల్సిన కార్యాన్ని (విసుగుపడకుండా ఓపికతో) చూస్తాడు, నెప్పిని భరిస్తాడు, ఇతరులను పీడించడు. ఎవ్వరినీ అవమానించడు. ఇది మంచి కుటుంబం నుంచి వచ్చినవాడి లక్షణం.

 

కులశీలవృత్తదోషాన్ విద్యాదోషాంశ్చ కర్మదోషాంశ్చ ।

కథయతి పరస్య నీచో న తు స్మరత్యాత్మనో దోషాన్ ॥77

పదవిభాగః-- కుల-శీల-వృత్త-దోషాన్ విద్యాదోషాన్ చ కర్మదోషాన్ చ । కథయతి పరస్య నీచః న తు స్మరతి ఆత్మనః దోషాన్ ॥77

అన్వయః-- నీచః పరస్య కులశీలవృత్తదోషాన్, విద్యాదోషాన్ చ, కర్మదోషాన్ చ కథయతి । ఆత్మనః దోషాన్ తు న స్మరతి ॥77

తాత్పర్యం-- వేరొకరి యొక్క కుటుంబంలోని, వ్యక్తిత్వం (శీలం)లోని, ప్రవర్తనలోని దోషాలను, విద్యలో, కర్మలో దోషాలను నీచుడు బయటకు చెప్తాడు. కానీ తన దోషాలను గుర్తించడు.

 

చిరజీవిత్వమనర్థం పురుషస్యాధర్మచారిణో భవతి ।

చిరజీవిత్వం సఫలం భవతి హి ధర్మైకనిష్ఠస్య ॥78

పదవిభాగః-- చిర-జీవిత్వమ్ అనర్థం పురుషస్య అధర్మచారిణః భవతి । చిరజీవిత్వం సఫలం భవతి హి ధర్మ-ఏక-నిష్ఠస్య ॥78

అన్వయః-- అధర్మచారిణః పురుషస్య చిరజీవిత్వమ్ అనర్థం భవతి । ధర్మైకనిష్ఠస్య చిరజీవిత్వం హి సఫలం భవతి ॥78

తాత్పర్యం-- అధర్మవర్తనుడైన వాడికి దీర్ఘాయువు అనర్థకారకం (లేదా అర్థం లేనిది). ధర్మంలో మాత్రమే (పూర్తిగా) నిలిచినవాడికి దీర్ఘాయువు సఫలమవుతుంది.

 

జ్ఞానాఢ్యమలోకజ్ఞం కృపణం ధనినం దరిద్రమభిజాతమ్ ।

గుణవంతం శ్రుతహీనం కస్మాత్ కృతవాన్ కృతాంతః సః ॥79

పదవిభాగః-- జ్ఞాన-ఆఢ్యమ్ అలోకజ్ఞం కృపణం ధనినం దరిద్రమ్ అభిజాతమ్ । గుణవంతం శ్రుతహీనం కస్మాత్ కృతవాన్ కృతాంతః సః ॥79

అన్వయః-- సః కృతాంతః - జ్ఞానాఢ్యమ్ అలోకజ్ఞం, ధనినం కృపణం, అభిజాతం దరిద్రమ్, గుణవంతం శ్రుతహీనం - కస్మాత్ కృతవాన్ ॥79

తాత్పర్యం-- జ్ఞానం హెచ్చుగా కలిగినవాడైనా లోకం తెలియనివాడిని (అమాయకుడిని); ధనవంతుడైన పిసినారి వాడిని; గొప్ప ఇంట్లో పుట్టినవాడైన పేదవాడైనవాడిని, మంచి గుణాలు కలిగినా చదువులేనివాడిని- (వీరందరిని) బ్రహ్మ ఎందుకు సృష్టించాడో కదా! [లోకము తెలియని పండితుడిని, పిసినారియైన ధనవంతుడిని, మంచి పుటక పుట్టిన పేదవాడిని, చదువు అబ్బని మంచివాడిని బ్రహ్మ ఎందుకు పుట్టించాడో కదా!]

 

ఏతావదేవ హి ఫలం పర్యాప్తం జ్ఞానసత్త్వయుక్తస్య ।

యద్యాపత్సు న ముహ్యతి నాభ్యుదయే విస్మితో భవతి ॥80

పదవిభాగః-- ఏతావద్ ఏవ హి ఫలం పర్యాప్తం జ్ఞాన-సత్త్వ-యుక్తస్య । యది ఆపత్సు న ముహ్యతి న అభ్యుదయే విస్మితః భవతి ॥80

అన్వయః-- జ్ఞానసత్త్వయుక్తస్య ఏతావద్ ఏవ హి ఫలం పర్యాప్తం - యది ఆపత్సు న ముహ్యతి,  అభ్యుదయే విస్మితః న భవతి ॥80

తాత్పర్యం-- జ్ఞానము, బలము కలిగినవాడు- ఆపదలలో కుంగకుండా, సంపదలలో పొంగిపోకుండా ఉంటే ఇంతే ఫలితం చాలు.

On Wise Men

“The characteristic of a wise man who has knowledge and wisdom in the right measure is this- he does not become despondent in adversity, and does not become arrogant in times of prosperity.” Nitidvishashtika 85

 

నీచేషు కార్యయుక్తిః సాధుప్రణయక్రియాసు చాశక్తిః ।

సహవాసశ్చానార్యైరార్యస్య గురూణి దుఃఖాని ॥81

పదవిభాగః-- నీచేషు కార్య-యుక్తిః సాధు-ప్రణయ-క్రియాసు చాశక్తిః । సహవాసః చ అనార్యైః ఆర్యస్య గురూణి దుఃఖాని ॥81

అన్వయః-- నీచేషు కార్యయుక్తిః, సాధుప్రణయక్రియాసు చ అశక్తిః, అనార్యైః సహవాసః చ - ఆర్యస్య గురూణి దుఃఖాని (భవంతి) ॥81

తాత్పర్యం-- నీచుల మధ్య పని పనికి నియోగింపబడటం (పని చేయవలసిరావటం), సజ్జనులకు ప్రియమైన పనులలో శక్తి లేకపోవటం, నీచులతో సహవాసం - ఇవి మంచివాడికి బరువైన దుఃఖాలు. [నీచులతో పని చేయించాల్సి రావడం, మంచివారికి ఇష్టమైన పనిని చేయలేకపోవడం, సంస్కారము లేని వారితో స్నేహము – సంస్కారవంతుడికి గొప్ప దుఃఖాన్ని కలిగిస్తాయి.]

 

యః ఖలు బహువిధదోషం మిత్రం పాలయతి స ఖలు పాలయతి ।

న హి పరిపాలనకృత్యం గుణవతి మిత్రే భవతి కించిత్ ॥82

పదవిభాగః-- యః ఖలు బహు-విధ-దోషం మిత్రం పాలయతి సః ఖలు పాలయతి । న హి పరిపాలన-కృత్యం గుణవతి మిత్రే భవతి కించిత్ ॥82

అన్వయః-- యః ఖలు బహువిధదోషం మిత్రం పాలయతి, సః ఖలు పాలయతి । గుణవతి మిత్రే పరిపాలనకృత్యం కించిత్ న హి భవతి ॥82

తాత్పర్యం-- ఎవరైతే ఎన్నో దోషాలున్నా స్నేహితుని (పట్ల స్నేహాన్ని) రక్షిస్తాడో, వాడు (స్నేహాన్ని) పాటించినట్టు. గుణవంతుడైన స్నేహితుడి పట్ల రక్షించవలసినది ఏమీ ఉండదు (స్వయంగానే అది సురక్షితంగా ఉంటుంది).

[దోషాలు అంటే దుష్టత్వం, శఠత్వం అత్యాదులు కాక సామాన్య దోషాలు కావచ్చు. పేదరికం, అమాయకత్వం, భయం, అతిమంచితనం, పెద్దగా విద్యావంతుడు కాకపోవటం మొదలైనవి. లేదంటే కుమిత్రనింద ఈ సుభాషితక్రమంలో చాలా చోట్ల వచ్చింది.]

 

కృత్వా జగత్ప్రకాశం ప్రీతిం సర్వాత్మనా మనుష్యేణ ।

విషమరసాన్యపి సుహృదాం శీలాన్యనువర్తితవ్యాని ॥83

పదవిభాగః-- కృత్వా జగత్ప్రకాశం ప్రీతిం సర్వాత్మనా మనుష్యేణ । విషమ-రసాని అపి సుహృదాం శీలాని అనువర్తితవ్యాని ॥83

అన్వయః-- మనుష్యేణ సర్వాత్మనా ప్రీతిం జగత్ప్రకాశం కృత్వా, సుహృదాం శీలాని విషమరసాని అపి అనువర్తితవ్యాని83

తాత్పర్యం-- ఒక మనిషితో (ఉన్న) స్నేహాన్ని లోకానికి అంతటికి ప్రకటించిన తరువాత, (స్నేహం విధి వక్రించి వికటించినప్పుడు) బాధపెట్టే విషయాలతో కూడిన స్నేహితుల పద్ధతులను కూడా భరించాలి.

 

అభిగమ్యాస్తే సద్భిర్వ్యపగతమానావమానదోషాశ్చ ।

యే స్వగృహముపగతానాం శ్రమముపచారైర్వ్యపనయంతి ॥84

పదవిభాగః-- యే వ్యపగత-మాన-అవమాన-దోషాః చ స్వగృహమ్ ఉపగతానాం ఉపచారైః శ్రమమ్ వ్యపనయంతి - తే సద్భిః అభిగమ్యాః ॥84

అన్వయః-- అభిగమ్యాః తే సద్భిః వ్యపగతమానావమానదోషాః చ । యే స్వగృహమ్ ఉపగతానాం శ్రమమ్ ఉపచారైః వ్యపనయంతి ॥84

తాత్పర్యం-- (జరిగిన) సన్మానం, అవమానం, (ఇతర) దోషాలను (గణించకుండా) వదిలేసి, ఇంటికి వచ్చిన వారి అలసటను పరిచర్యలు చేసి పోగొట్టేవారు ఉత్తముల చేత సమీపించదగినవారు.

 

ఐశ్వర్యమల్పమేత్యప్రాయేణ హి దుర్జనో భవతి మానీ ।

సుమహత్ ప్రాప్యైశ్వర్యం ప్రశమం ప్రతిపద్యతే సుజనః ॥85

పదవిభాగః-- ఐశ్వర్యమ్ అల్పమ్ ఏత్య ప్రాయేణ హి దుర్జనః భవతి మానీ । సుమహత్ ప్రాప్య ఐశ్వర్యం ప్రశమం ప్రతిపద్యతే సుజనః ॥85

అన్వయః-- దుర్జనః ప్రాయేణ హి అల్పమ్ ఐశ్వర్యమ్ ఏత్య మానీ భవతి । సుజనః సుమహత్ ఐశ్వర్యం ప్రాప్య ప్రశమం ప్రతిపద్యతే ॥85

తాత్పర్యం-- చాలామటుకు దుర్జనుడు కొద్దిపాటి ఐశ్వర్యాన్ని పొంది గర్విష్టి అవుతాడు. ఉత్తముడు ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని పొంది కూడా శాంతంగా ఉంటాడు.

 

సత్యవచనవృత్తానాం శీలజటాశౌచవల్కలధరాణామ్ ।

సంతోషాభిరతానాం కిమాశ్రమైః కార్యమార్యాణామ్ ॥86

పదవిభాగః-- సత్య-వచన-వృత్తానాం శీల-జటా-శౌచ-వల్కల-ధరాణామ్ । సంతోష-అభిరతానాం కిమ్ ఆశ్రమైః కార్యమ్ ఆర్యాణామ్ ॥86

అన్వయః-- సత్యవచనవృత్తానాం, శీలజటాశౌచవల్కలధరాణాం, సంతోషాభిరతానాం, ఆర్యాణామ్ ఆశ్రమైః కిమ్ కార్యమ్ ॥86

తాత్పర్యం-- సత్యం పలికటమే ప్రవృత్తిగా కలవారు, శీలం అనే జటలు, శౌచమనే నారచీరలను ధరించేవారు, సంతోషంలో మునిగి ఉండేవారైన ఉత్తమజనులకు ఇంక ఆశ్రమాలెందుకు?

 

విద్వత్త్వే యతితవ్యం నార్థేష్వేవాదరః సదా కార్యః ।

అర్థః సర్వజనగతో విద్వత్తా దుర్లభా లోకే ॥87

పదవిభాగః-- విద్వత్త్వే యతితవ్యం న అర్థేషు ఏవ ఆదరః సదా కార్యః । అర్థః సర్వ-జన-గతః విద్వత్తా దుర్లభా లోకే ॥87

అన్వయః-- సదా విద్వత్త్వే యతితవ్యం । అర్థేషు ఏవ ఆదరః న కార్యః । అర్థః సర్వజనగతః । లోకే విద్వత్తా దుర్లభా ॥87

తాత్పర్యం-- పాండిత్యం కోసం ప్రయత్నించాలి. ధనంకోసం గౌరవభావం అన్నివేళలా కూడదు. ధనం అందరి వద్దా ఉంటుంది. పాండిత్యం లోకంలో సులువుగా లభించదు.

 “One should strive to become learned and not hanker after wealth alone. It is common to find a wealthy man, but rare indeed is he who has erudition.” Nitidvishashtika 92

 

యస్మిన్ న బాష్పమోక్షో నాపి రహస్యం న చ ప్రణయజాతమ్ ।

తన్మిత్రం త్యక్తవ్యం శ్రమేణ కిం న్వర్థహీనేన ॥88

పదవిభాగః-- యస్మిన్ న బాష్ప-మోక్షో న అపి రహస్యం న చ ప్రణయ-జాతమ్ । తత్ మిత్రం త్యక్తవ్యం శ్రమేణ కిం ను అర్థహీనేన ॥88

అన్వయః-- యస్మిన్ - న బాష్పమోక్షో, న అపి రహస్యం, న చ ప్రణయజాతమ్ - తత్ మిత్రం త్యక్తవ్యం. అర్థహీనేన శ్రమేణ కిం ను88

తాత్పర్యం-- కన్నీరు కార్చటం, రహస్యం (దాచటం), ప్రేమతో జనించిన భావం ఎవరి యందు ఉండదో ఆ మిత్రుని విడిచివేయాలి. అర్థరహితమైన (స్నేహం కోసం) శ్రమ ఎందుకు?

 

దారైశ్చ సన్నికర్షో హతదోషతయా గృహప్రవేశశ్చ ।

యస్య త్వశంకనీయౌ పర్యాప్తం భవతి తన్మిత్రమ్ ॥89

పదవిభాగః-- దారైః చ సన్నికర్షః హత-దోషతయా గృహప్రవేశః చ । యస్య తు అశంకనీయౌ పర్యాప్తం భవతి తన్మిత్రమ్ ॥89

అన్వయః-- యస్య తు - దారైః చ సన్నికర్షః, హతదోషతయా గృహప్రవేశః చ అశంకనీయౌ – తత్ మిత్రమ్ పర్యాప్తం భవతి ॥89

తాత్పర్యం-- ఏ మిత్రునికి భార్యతో చనువు, తప్పు పట్టకుండా ఇంటలోనికి చొరబడటం (వీలు) ఉన్నా అవి అనుమానపడవలసిన పని లేదో అటువంటి మిత్రుడు (ఒకడుంటే) చాలు. [(తన) భార్యతో చనువుగా మెలగుతున్నా సరే, జంకూ గొంకూ లేకుండా ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నా సరే, ఏ మిత్రుడిని అనుమానించవలసిన పనిలేదో అటువంటి మిత్రుడు ఒక్కడుంటే చాలును.]

 

పక్షద్వయశశిసదృశాన్యనిశం హార్దాని సదసతాం లోకే ।

ఆప్యాయంతే తు సతామసతాం చ పరిక్షయం యాంతి ॥90

పదవిభాగః-- పక్ష-ద్వయ-శశి-సదృశాని అనిశం హార్దాని సదసతాం లోకే । ఆప్యాయంతే తు సతామ్ అసతాం చ పరిక్షయం యాంతి ॥90

అన్వయః-- లోకే సదసతాం హార్దాని అనిశం పక్షద్వయశశిసదృశాని । సతాం తు ఆప్యాయంతే, అసతాం చ పరిక్షయం యాంతి ॥90

తాత్పర్యం-- లోకంలో మంచివారు, చెడ్డవారు- వీరి స్నేహాలు చంద్రుని (శుక్ల, కృష్ణ) రెండు పక్షాల వంటివి. మంచివారివి వృద్ధి చెందుతాయి, దుష్టులవి క్షయం పొందుతాయి.

 

సత్సంగమస్య నార్ఘః కర్తుం శక్యమితి మే మతిర్భవతి ।

యత్తద్వియోగదుఃఖం తదేవ మూల్యం భవతి తస్య ॥91

పదవిభాగః-- సత్సంగమస్య న అర్ఘః కర్తుం శక్యమ్ ఇతి మే మతిః భవతి । యత్తద్ వియోగ-దుఃఖం తద్ ఏవ మూల్యం భవతి తస్య ॥91

అన్వయః-- సత్సంగమస్య అర్ఘః కర్తుం న శక్యమ్ ఇతి మే మతిః భవతి । యత్తద్ వియోగదుఃఖం తద్ ఏవ తస్య మూల్యం భవతి ॥91

తాత్పర్యం-- మంచివారితో స్నేహానికి వెలకట్టటం సాధ్యం కాదని నా అభిప్రాయం. అది కోల్పోయిన్పపుడు ఎంత దుఃఖం కలుగుతుందో అదే దాని వెల.

 

తే మూర్ఖా మూర్ఖతమా యేషాం ధనమస్తి నాస్తి చ త్యాగః ।

కేవలమార్జనరక్షణవియోగదుఃఖాన్యనుభవంతి ॥92

పదవిభాగః-- తే మూర్ఖాః మూర్ఖతమాః యేషాం ధనమ్ అస్తి నాస్తి చ త్యాగః । కేవలమ్ ఆర్జన-రక్షణ-వియోగ-దుఃఖాని అనుభవంతి ॥92

అన్వయః-- యేషాం ధనమ్ అస్తి, త్యాగః నాస్తి చ, తే మూర్ఖాః మూర్ఖతమాః । (తాదృశాః) కేవలమ్ ఆర్జనరక్షణవియోగదుఃఖాని అనుభవంతి ॥92

తాత్పర్యం-- ఎవరికైతే చాలా ధనం ఉందో, కానీ త్యాగబుద్ధి లేదో వారు మూర్ఖులు, (ఇంకా చెప్పాలంటే) మూర్ఖాతిమూర్ఖులు. కేవలం (ధనం) సంపాదించటం, కాపాడుకోవటం, పోగొట్టుకోవటం అనే బాధలను వారు అనుభవిస్తారు.

 

గుణకలశైః స్నాతానాం వినయవిలేపనవిలిప్తగాత్రాణామ్ ।

విద్యావిభూషితానాం కిమలంకారైః కులీనానామ్ ॥93

పదవిభాగః-- గుణ-కలశైః స్నాతానాం వినయ-విలేపన-విలిప్త-గాత్రాణామ్ । విద్యా-విభూషితానాం కిమ్ అలంకారైః కులీనానామ్ ॥93

అన్వయః-- కులీనానాం, గుణ-కలశైః స్నాతానాం, వినయ-విలేపనవిలిప్తగాత్రాణాం, విద్యా-విభూషితానాం కిమ్ అలంకారైః?93

తాత్పర్యం-- మంచి కుటుంబంలో పుట్టినవారు, మంచి గుణాలనే కలశాలతో స్నానం చేసినవారు, వినయం అనే విలేపనం పూసుకున్న శరీరాలు కలవారు, విద్య అనే అలంకారం ఉన్నవారు- ఇంక వీరికి అలంకారాలతో పని ఏమిటి?