మనుస్మృతి
- జీ.పీ. ద్వివేదీ
భూమిక-
తెలుగు అనువాదం
విశ్వాని దేవ సవితుర్దురీతాని
పరాసువ
యద్భద్రం తన్న ఆసువ..
(యజుర్వేదం.3అధ్యాయం.3కం)
1.
ధర్మం-
ధర్మశాస్త్రానికి అత్యావశ్యకమైన కొన్ని
విషయాలను సంక్షిప్తంగ తెలుసుకుందాం. ఇవి తెలుసుకోకపోవటం వల్ల నేటికాలంలో చాలా హాని
జరుగుతోంది. ఇవన్నీ శ్రీదుర్గాప్రసాద్ ద్వివేదీ రచించిన ధర్మసంహితా అనే
గ్రంథంలోనుండి గ్రహించబడినవి.
ఇక్కడ ధర్మ శబ్దం పంకజ శబ్దం లాగే
యోగరూఢమైనది. ((పంకే జాయతే ఇతి పంకజః- పంకం- అంటే బురద. తస్మిన్ జాయతే- అంటే అందులో
పుట్టినది అని అర్థం. కమలం అని వ్యవహారంలో ఉన్న అర్థం. బురదలో పుట్టినవి పురుగులు
కూడ ఉంటాయి. దుర్గంధం కూడ ఉంటుంది. కానీ మనం దాన్ని లోకంలో ఒక్క కమలం అనే
అర్థానికే వాడుతున్నాము. శబ్దాలు నాలుగు రకాలని శాస్త్రం చెబుతుంది- యోగం, రూఢం,
యోగరూఢం, యౌగికరూఢం. యోగము అంటే శబ్దానికి ఉన్న వ్యత్పత్తి అర్థాన్నే చెప్పేది.
ఉదా- .. రూఢం అంటే వ్యుత్పత్త్యర్థం తో పనిలేకుండ దీన్ని ఇది అందాం అనే విధంగ
ఏర్పడినది. ఉదా- .. యోగరూఢమంటే అటు వ్యుత్పత్త్యర్థం ద్వార సూచితమయ్యే
అర్థాలన్నింటిలోంచి ఒకదానికే పరిమితమైంది. ఉదా- .. యౌగికరూఢమంటే అశ్వగంధ మొదలైనవి.))
కిందపడే మనిషికి ఆధారంగ ఉండి ధారణ చేసేది ధర్మం అనబడుతుంది. ఇది ధర్మశబ్దానికి
అక్షరశః అర్థము. అనిష్టంతో సంబంధం లేకుండ ఇష్టఫలాన్ని సాధించటానికి సాధనం ధర్మం.
ఇది ధర్మశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం. కణాదమహర్షి ((పరిచయం- షడ్దర్శనాలలో వైశేషికం
ఒకటి. కణాదుడు ఆ శాస్త్రానికి సూత్రాలు వ్రాశాడు. ప్రతీ దర్శనానికీ ఒక సూత్రకర్త, ఒక
వార్తిక కర్త, ఒక భాష్యకర్త ఉంటారు. కణాదుడు సూత్రకారుడు. వైశేషిక శాస్త్రమంటే
-..)) వైశేషికదర్శనంలో "యతో అభ్యుదయ-నిశ్రేయస-సిద్ధిః స ధర్మః" అని
ధర్మం లక్షణాన్ని చెప్పాడు. అంటే దేనివల్ల ఈ లోకంలో పరలోకంలో కూడ సుఖం పొందగలమో
అదే దర్మం. జైమిని మహర్షి మీమాంసాదర్శనంలో "చోదనాలక్షణోర్థో ధర్మః" అని
క్రియాసాపేక్షమైన ధర్మలక్షణాన్ని చెప్పాడు. ఏ వాక్యాన్ని వినటం వల్ల కర్తవ్యకర్మ
అకర్తవ్యకర్మ మనకు తెలుస్తాయో ఆ వాక్యానికి చోదనం, ప్రేరణం, ఉపదేశం, విధి అని
పేర్లు. ఏ మాట వినంగనే మనకు ఆ వస్తువు గుర్తింపు కలుగుతుందో అది దాని లక్షణం
అవుతుంది. చోదనం లక్షణంగ కలిగినది- అంటే శ్రేయస్సుకు సాధనమైన అగ్నిహోత్రాది కర్మలు-
ధర్మం. ఇక్కడ ఆచార్యులు చెప్పిన సూత్రాన్ని ఈ విధంగ కూడ అమర్చవచ్చు.
"ధర్మః చోదనాలక్షణః అర్థః"
ధర్మం, విధిరూపమైన శ్రేయోసాధకం. ఈవిధంగ సూత్రాన్ని అమర్చటం వల్ల ధర్మానికి
ప్రమాణత్వం రావటం తోపాటు ఇంకా రెండు నియమాలు కూడ సిద్ధిస్తాయి. మొదటి నియమం- "యో
ధర్మః తత్ర చోదనైవ ప్రమాణం" ఏదైతే ధర్మమో దానికి విధి వాక్యమే ప్రమాణం.
దీనివల్ల "అగ్ని ధూమం ఇత్యాదుల సమాధనధర్మసాధన చేయటానికి ప్రత్యక్షాది
ప్రమాణాలు సమర్థాలు కావు." అనే మాట సిద్ధించింది. మొదటి నియమం యొక్క ఫలాన్ని చూపించే
ప్రత్యక్ష సూత్రం- "సత్సంప్రయోగే పురుషస్యేంద్రియాణాం వృద్ధిజన్మ
తత్ప్రత్యక్షమనిమిత్తం విద్యమానోపలంభనత్వాత్" (మీమాంసా దర్శనం- 1.1.4)
పరీక్షకుడి- అంటే చూసేవాడి కళ్ళకు, లేదా ఇతర ఇంద్రియాలకు వర్తమాన విషయాలతో
సంయోగరూపమైన సంబంధం కలిగినందువల్ల ఏర్పడే జ్ఞానం ప్రత్యక్షం అనబడుతుంది. అని దీని
అర్థం. ((అంటే కళ్ళకు కనిపించే వస్తువును చూసి ఇది ఫలానా అని మనం గుర్తిస్తాము.
అట్లగే చెవులకు వినపడే ధ్వనిని విని దానిని ఫలానా అని గుర్తిస్తాము. ఇక్కడ కన్ను-
ఇంద్రియస్థానమైన అవయవం. చెవు శ్రవణస్థానమైన ఇంద్రియం. మనం చూసే వస్తువు- విషయం. అంటే
చూపుకు చూసేది విషయం. వినుటకు ధ్వని విషయం. అట్లగే మిగిలిన ఇంద్రియాలకు కూడ. ఆవిధంగ
వస్తువును లేదా విషయాన్ని సాక్షాత్తు చూసి, లేదా విని గుర్తించటం- అంటే ఇంద్రియంతో
విషయానికి సాక్షాత్తు సంబంధం కలిగినప్పుడు- అంటే సంయోగం కలిగినప్పుడు కలిగే జ్ఞానం
ప్రత్యక్షజ్ఞానం అనబడుతుంది. అట్ల ఇంద్రియ-విషయ-సంయోగ-జన్యజ్ఞానాన్ని బట్టి
తెలుసుకున్నదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. అంటే ఇక్కడ విషయ జ్ఞానం కలగటానికి విషయంతో
ఇంద్రియానికి నేరుగ సంయోగం జరిగింది. కానీ)) ప్రత్యక్షం (ప్రమాణం) ధర్మం (ప్రమేయం)
యొక్క జ్ఞానం కలగటానికి కారణం కాదు. ఎందుకంటే వర్తమాన ((అంటే ఇప్పుడు ప్రస్తుతం
ఉన్నట్టి)) విషయాలు మాత్రమే ఇంద్రియాలకు ఉపలబ్ధమవుతాయి. అంటే జ్ఞానం కలిగే కాలంలో
వర్తమానమై ఉండనందు వల్ల ధర్మం ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం కావటానికి యోగ్యమైనది
కాదు. ((అంటే ధర్మంతో ఇంద్రియానికి సంయోగ రూప సంబంధం కలగటం కుదరదు. అప్పుడు అది
ప్రత్యక్ష ప్రమాణం అనటానికి కుదరదు.)) ఇదే మాట చాతుర్వర్ణ్య శిక్షలో ఈవిధంగ
చెప్పబడింది-
ప్రత్యక్షయోగం సహతే న ధర్మస్తతోనుమాతి ప్రతిరుద్ధవీర్యా|
మానం తు లిఙ్-లేట్-ముఖభావనీయా సా చోదనైవాత్ర వరీవృతీతి||
రెండవ నియమం- "యో ధర్మః తత్ర చోదనా
ప్రమాణమేవ" ఏది ధర్మమో దానికి విధి వాక్యం ప్రమాణమై తీరుతుంది. దీనివల్ల- "వేదాల
రహస్యం తెలియకుండ వాటిమీద చేయబడిన, చేయబడుతున్న ఆక్షేపాలు అన్నీ వ్యర్థమైపోతాయి."
అని సిద్ధిస్తుంది. ఈ రెండవ నియమ ఫలాన్ని చూపించే ఔత్పత్తిక సూత్రం- "ఔత్పత్తికస్తు
శబ్ధస్యార్థేన సంబంధస్తస్య జ్ఞానముపదేశ్యే వ్యతిరేకశ్చార్థే అనుపలబ్ధే తత్ప్రమాణం
బాదరాయణస్య అనపేక్షత్వాత్" (మీమాంసా దర్శనం- 1.1.5) అర్థం- పూర్వపక్షం-
((ఏదైనా ఒక శాస్త్రీయ ప్రతిపాదన చేయబోయేముందు దానికి విరుద్ధమైన, అంతకు ముందు ఉన్న
వాదాన్ని ప్రస్తావించటం పరిపాటి. అట్ల ప్రస్తావించినది పూర్వపక్షం. దాన్ని ఖండించి
అప్పుడు ప్రతిపాదనను చెప్పటాన్ని సిధ్ధాంతం అంటారు. అట్ల సిద్ధాంతానికి ముందు
ఖండించబడటానికి, లేదా సవిరించటానికి ప్రస్తావించబడిన పూర్వవాదాన్ని పూర్వపక్షం
అంటారు. ఇది రెండురకాలు- వాదంలో విరోధి పెట్టే ఆక్షేపణ ఒకటి; సిద్ధాంతి తనకు తానే
ఏదైనా సిద్ధాంతీకరించే ముందు దానిలో ఉండే లోపాలను వివరిస్తూ, ఇట్ల ఆక్షేపిస్తే,
దానికి ఇది సమాధానం అని స్వయంగ ఆక్షేపణను ఊహించి చెప్పటం రెండవరకం.)) మనిషి ఒక
శబ్దానికి ఏ అర్థాన్ని సంకేతం చేస్తాడో, ఆ శబ్దం విన్నప్పుడు ఆ అర్థజ్ఞానమే
కలుగుతుంది. ((ఇక్కడ శబ్దం అంటే ధ్వని రూపమైన మాట. "ఈ మాటకు ఇది అర్థం"
అని నిర్దేశించటాన్ని సంకేతం చేయటం అంటారు. ఇది ప్రతీభాషలో వేరువేరుగ వ్యవస్థ
చేయబడి ఉంది. ఈ శబ్దాన్ని వింటే ఈ అర్థం తెలియాలి అని అట్ల తెలియచేసే సంబంధశక్తిని
సంకేతం అంటారు. కనక సంకేతం అంటే ఒక శబ్దానికి దాని అర్థానికి ఉన్న సంబంధం.)) అందువల్ల
శబ్దార్థాల సంకేతరూపమైన సంబంధం పురుషకృతమైనందువల్ల, శబ్దం యొక్క
ప్రత్యక్షజ్ఞానాన్ని, శుక్తంలో రజత జ్ఞానం, రజ్జువులో సర్పజ్ఞానాన్ని మృగతృష్ణలో
జలజ్ఞానాన్ని కలిగించినందువల్ల విపర్యయాన్ని (మిథ్యాభావం) పొందినట్టే శబ్దంలో కూడ
విపర్యయజ్ఞానం సంభవమే. అందువల్ల విధివాక్యాలు ధర్మవిషయంలో ప్రమాణం కాజాలవు.
సిద్ధాంతం- శబ్దానికి అర్థంతో శక్తిరూప సంబంధం నిత్యమై ఉంటుందే కానీ కృతకం కాదు.
అది ధర్మానికి కారణం. అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణాలతో ప్రాప్తం కాని అర్థంలో
విధివాక్యం వ్యభిచారాన్ని పొందదు. ((=తనది కాక ఇతర అర్థాన్ని ఇవ్వటం జరగదు. అంటే
కృతకం అయితే కదా దోషం. శబ్దార్థసంబంధం నిత్యం కనక ప్రత్యక్షప్రమాణం వేరే ఆధారంగ
చూపించకపోయినా శబ్దం ప్రమాణమే అవుతుంది.)) అందువల్ల ప్రత్యక్షాది ప్రమాణాలను
అపేక్షించదు కనక ఆ విధివాక్యం ధర్మవిషయంలో బాదరాయణ ఆచార్యులకు ప్రమాణమైనది. అంటే
ఉదాహరణకు- "పర్వతో వహ్నిమాన్" - పర్వతం అగ్ని కలిగి ఉంది. మొదలైన
వాక్యాలలో ఇంద్రియ దోషయుక్తమైన పురుషుడు (పొగ మొదలైన కారణాలవల్ల పర్వతంలో మిథ్య
((లేని)) అగ్ని కనిపించినవాడికి) చెప్పిన అర్థం (అగ్ని) నుండి వ్యభిచరితం ((భిన్నార్థాన్ని
ఇచ్చేవి)) అవుతాయి. అందువల్ల ప్రమాణం విషయంలో ప్రత్యక్షప్రమాణం అవసరం వాటికి
ఉండదు. అట్లగే "అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామః" = "సుఖం కోరేవాడు
అగ్నిహోత్రం ద్వారా స్వర్గాన్ని భావన చేయాలి" మొదలైన వైదిక ఉపదేశ వాక్యాలు
పురుషకృతాలు కానందువల్ల దోషరహితాలై, ఏ కాలంలోనూ తన అర్థం కన్నా భిన్నంగ కావు.
అందువల్ల అవి సత్యాలేనని నిరూపించటానికి ప్రత్యక్షాది ప్రమాణాలు అవసరం లేవు.
ధర్మానికి
లక్షణం
మనుమహర్షి ధర్మానికి ఈ లక్షణాన్ని
చెప్పాడు-
విద్వద్భిః సేవితః
సద్భిర్నిత్యమద్వేషరాగిభిః |
హృదయేనాభ్యనుజ్ఞాతో
యో ధర్మస్తం నిబోధత ||
ధర్మశబ్దానికి ఇక్కడ ఆరు రకాల అర్థాలను
తీసుకున్నారు. 1. వర్ణధర్మం. 2. ఆశ్రమధర్మం. 3. వర్ణాశ్రమ ధర్మం. 4. గుణధర్మం=
శాస్త్రోక్తమైన అభిషేకాది గుణాలు కలిగిన రాజు పరిపాలించటం. 5. నిమిత్తధర్మం=
ప్రాయశ్చిత్తం. 6. సాధారణ ధర్మం= ధృతి మొదలైన పది (మను. 6.92) సంక్షేపంగ అహింసాది
ఐదు (మను. 10.63).
సామవేదీయ ఛాందోగ్యోపనిషత్తులో ధర్మానికి
యజ్ఞం, అధ్యయనం, దానం అని మూడు స్కంధాలు చెప్పారు.
"త్రయో
ధర్మస్కంధా యజ్ఞోధ్యయనం దానమితి"
ధర్మం గురించి మనుస్మృతిలో ఇట్ల
చెప్పబడింది-
యః కశ్చిత్ కస్యచిత్
ధర్మో మనునా పరికీర్తితః |
స సర్వోభిహితో వేదే
సర్వజ్ఞానమయో హి సః || (2.7)
ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః |
తస్మాద్ధర్మో న
హన్తవ్యో మానో ధర్మో హతోవధీత్ || (8.15)
ధర్మం
ఉండే స్థానాలు-
యాజ్ఞవల్క్య మహర్షి ఈవిధంగ చెప్పాడు-
పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాంగమిశ్రితాః
|
వేదాః స్థానాని
విద్యానాం ధర్మస్య చ చతుర్దశ ||
పురాణం, న్యాయం, మీమాంస, ధర్మశాస్త్రం,
శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, ఋగ్వేదం, యజుర్వేదం,
సామవేదం, అథర్వణవేదం ఈ పధ్నాలుగు విద్యకు ధర్మానికి స్థానాలు.
వేదాది
ప్రమాణ గ్రంథాల విచారణం-
వేదాలు-
మంత్రం బ్రాహ్మణం ఈ రెండు భాగాలను కలిపి
వేదం అంటారు. ఆతస్తంబ ముని దీనినే వేదలక్షణంగ చెప్పాడు-
"మంత్రబ్రాహ్మణయోర్వేదనామధేయమ్" ఇతర మునులది కూడ ఇదే అభిప్రాయం. కర్మ
సంబంధమైన అర్థాన్ని బోధించేవి మంత్రాలు, ఇతరాలు బ్రాహ్మణాలని జైమిని మహర్షి
మీమాంసా దర్శనంలో చెప్పాడు. "తచ్చోదకేషు మంత్రాఖ్యా. శేషే బ్రాహ్మణశబ్దః ||"
దీని ఉద్దేశం ఆచార్యలు ఇట్ల చెప్పారు- వేదంలో ఎంత భాగాన్ని వ్యవహారంలో మంత్రం అని
పిలుస్తూ వచ్చామో అది మంత్రభాగం. మిగిలింది బ్రాహ్మణభాగం.
వేదం
రకాలు-
వేదం నాలుగు- ఋగ్వేదం, యజుర్వేదం,
సామవేదం, అథర్వణవేదం. మొదటి మూడు వేదాలకు రచనానుగుణంగ పేరు ఏర్పడింది.
అథర్వవేదానికి అధ్యయనం కారణంగ పేరు ఏర్పడింది. అంటే చందస్సుతో కూడి ఉన్న
(మంత్ర)పాదాల వ్యవస్థ ఉన్నది ఋగ్వేదం. గానానుకూల వ్యవస్థ ఉన్నది సామవేదం. ఛందస్సు
లేదా గానం కాక గద్యభాగం ఉన్నది యజుర్వేదం. ఋగ్యజుస్సామాల ఈ లక్షణాన్ని జైమని ముని
చెప్పాడు- "ఋగ్యత్రార్థవశేన పాదవ్యవస్థా. గీతిషు సామాఖ్యా. శేషే యజుశ్శబ్దః."
అందువల్ల ఈ మూడు వేదాలను ఋగ్వేదాదులు అంటారు. బ్రహ్మ తన కుమారుడైన అథర్వాఋషికి
నేర్పిన మంత్రబ్రాహ్మణాల సంగ్రహానికి అథర్వవేదం అని ప్రసిద్ధి. ఈ మాట
ముండకోపనిషత్తులో చెప్పారు-
బ్రహ్మా దేవానాం
ప్రథమః సంబభూవ, విశ్వస్య కర్తా భువనస్య గోప్తా
స బ్రహ్మవిద్యాం
సర్వవిద్యాప్రతిష్ఠామథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ ||
సంహిత, లేదా మంత్రసంహితగా పిలవబడే ఈ
నాలుగు వేదాల మంత్రభాగంలో, బ్రాహ్మణభాగంలో ఉన్నటువంటి జ్ఞానకాండను ఉపనిషత్తు
అంటారు. సుప్రసిద్ధమైన నాలుగువేదాల మంత్రసంహితలలో నుండి కేవలం యజుర్వేదం మంత్రసంహితలోని
నలభైయవ, అంతిమ అధ్యాయం ఈశావాస్యమనే ఉపనిషత్తు. మిగిలిన ఉపనిషత్తులన్నీ
బ్రాహ్మణభాగం లోనివే. వేదంలో ఆరణ్యకమనే ఇంకొక ప్రత్యేకభాగం ఉంటుంది. అది అరణ్యంలో
మాత్రమే చదవటానికి చెప్పటానికి యోగ్యమైనది కావటం చేత ఆరణ్యకమనబడింది. ఐతరేయారణ్యక
భాష్యారంభంలో ఇట్ల చెప్పబడింది-
ఐతరేయబ్రాహ్మణోస్తి
కాండమారణ్యకాభిధమ్ |
అరణ్య ఏవ
పాఠ్యత్వాదారణ్యకమితీర్యతే ||
బ్రాహ్మణభాగంలో తాపినీ అనే పేరు గల ఒక
విభాగంలో ఉపాసన గురించి విశేషంగ చర్చించారు.
ఋగ్వేదం-
శాఖాభేదాలు-
ఋగ్వేదంలో 21 శాఖలు ఉండేవి అని
వ్యాకరణమహాభాష్య ప్రథమాహ్నికంలో చెప్పబడింది. అధ్యయనం, అధ్యాపనం కారణంగ వేదంలో వచ్చిన
పాఠభేదాలే శాఖాభేదాలు. ఆ పాఠభేదాలు కాలక్రమేణ న్యూనాధికరూపమై ((కొద్దే గొప్పగ అయి))
నిలిచిపోయి శాఖాభేదాలను ప్రవర్తింపజేశాయి. శౌనకమహర్షి కృతమైన ప్రాతిశాఖ్యం అనే
గ్రంథంలో ఋగ్వేదానికి ఈ ఐదు శాఖలున్నాయని చెప్పబడింది. శాకల, బాష్కల, ఆశ్వలాయన,
శాంఖ్యాయన, మాండూక. విష్ణుపురాణంలో శాకలశాఖకు ఐదు శాఖాభేదాలు ఉన్నాయని
తెలుస్తుంది. అవి- ముద్గల, గోకుల, వాత్స్య, శైశిర, శిశిర.
శౌనకుడి వచనం-
ఋజ్వాం సమూహ
ఋగ్వేదస్తమభ్యస్య ప్రయత్నతః |
పఠితః శాకలేనాదౌ
చతుర్భిస్తదనంతరమ్ ||
శాంఖ్యాశ్వలాయనౌ చైవ
మాండూకో బాష్కలస్తథా |
బహ్వృచా ఋషయః సర్వే
పంచైత ఏకవేదినః ||
విష్ణుపురాణం వచనం-
ముద్గలో గోకులో
వాత్స్యః శైశిరః శిశిరస్తథా |
పంచైతే శాకలాః
శిష్యాః శాఖాభేదప్రవర్తకాః ||
ఈ విధంగనే ఐతరేయీ, కౌషీతకీ, పైంగీ
మొదలైనవెన్నో ఏకశాఖాభేదాలు ఇతర గ్రంథాల నుంచి ప్రాప్తమవుతున్నవి. ఋగ్వేదం యొక్క
శాకల సంహిత, ఐతరేయ, కౌషీతక అనే బ్రాహ్మణ గ్రంథాలు లభ్యమవుతున్నవి.
యజుర్వేదశాఖాభేదాలు-
యజుర్వేదం 1. కృష్ణ, 2. శుక్ల అని రెండు
రకాలు. దీని కారణం మున్ముందు చెప్పుకుందాం. యజుర్వేదానికి 101 శాఖలుండేవని
వ్యాకరణమహాభాష్య ప్రథమాహ్నికంలో చెప్పబడింది. కృష్ణయజుర్వేదానికి 12 శాఖాభేదాలు
ప్రాప్తమవుతున్నవి. అవి- చరక, ఆహ్వరక, కఠ, ప్రాచ్యకఠ, కాపిష్ఠల, కఠ, చారాయణీయ,
వారతంతవీయ, శ్వేత, శ్వేతతర, ఔపమన్యవ, పాత్యండినేయ, మైత్రాయణీయ. మైత్రాయణీయలో ఆరు
భేదాలు లభ్యమవుతున్నవి. మానవ, వారాహ, దుందుభ, ఛాగలేయ, హారిద్రవీయ, శ్యామాయనీయ.
చరకవిశేష తైత్తిరీయంలో రెండు శాఖాభేదాలు ప్రాప్తమవుతున్నవి. ఔఖీయ, ఖాండికీయ.
ఖాండికీయలో ఐదు శాఖాభేదాలున్నవి- ఆపస్తంబీ, బౌధాయనీ, సత్యాపాఢీ, హిరణ్యకేశీ, శాస్యాయనీ.
కృష్ణయజుర్వేదం లోని కృష్ణయజుస్సంహితా,
తైత్తిరీయ-బ్రాహ్మణ, తైత్తిరీయ-ఆరణ్యకం ఈ కాలంలో ప్రచరితమై ఉన్నవి.
శుక్లయజుర్వేదానికి 15 శాఖాబేదాలున్నవి.
కాణ్వ, మాధ్యందిన, జాబాల, బుధేయ, శాకేయ, తాపనీయ, కపోల, పౌండ్ర, వత్స, ఆవరిక,
పరమావరిక, పారాశరీయ, వైనేయ, వైధేయ, ఔధేయ, గాలవ. ఈ శాఖలన్నింటి ప్రవర్తకులు వాజసనేయ
యాజ్ఞవల్క్య శిష్యులైనందువల్ల వాజసనేయీ అనబడతాయి. (వాజసనేరపత్యం వాజసనేయః = వాజసని
యొక్క సంతానం వాజసనేయ.)
శుక్లయజుర్వేదానికి చెందిన మాధ్యందినీయ సంహిత,
శతపథ బ్రాహ్మణము ప్రసిద్ధములు. యాజ్ఞవల్క్య మహర్షి తన స్మృతిలోని
ప్రాయశ్చిత్తాధ్యాయంలో - "నేను సూర్యుని నుంచి పొందిన ఆరణ్యకం ఆత్మజ్ఞానార్థం
విచారించటానికి యోగ్యత కలిగి ఉంది." అని చెప్పాడు.
"జ్ఞేయం చారణ్యకమహం యదాదిత్యాదవాప్తవాన్ | (110 వ
శ్లోకం)
యజుర్వేదం శుక్లంగ ఉండటానికి కారణం-
వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు తన
శిష్యులైన యాజ్ఞవల్క్యాదులకు యజుర్వేదం నేర్పించాడు. ఒకసారి ఏదో కారణంగ
క్రుద్ధుడైన వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడితో - "నువ్వు నా నుంచి నేర్చినదంతా
తిరిగి ఇచ్చేయి." అని అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తాను చదివిన విద్యనంతా
యోగబలంతో మూర్తిమంతంగ ((ఆకారం కలిగినదిగా)) చేసి బయటకు తీసేశాడు. ఆయన తీసేసిన
(కక్కిన నిప్పు కణికల లాగ ఉన్న) యజుర్విద్యను వైశంపాయనుడి ఆజ్ఞతో ఇతర శిష్యగణం
తిత్తిర పక్షులై తినశారు. అప్పటి నుంచి ఆ యజర్మంత్రాలు కక్కినవి కావటం వల్ల
కృష్ణయజుస్సులని, వాటిని తిన్న వారు తైత్తిరీయులు అయినారు. తర్వాత విద్యావియోగంతో
దుఃఖించిన యాజ్ఞవల్క్యుడు సూర్యారాధన చేసి ఇతరంగ పొందిన యజుర్మంత్రాలు
శుక్లయజుస్సులయినవి యాజ్ఞవల్క్యుడు ఆ శుక్లయజుర్వేదాన్ని ఉక్వ కణ్వ, మాధ్యందినాది
15 మంది శిష్యులకు నేర్పాడు. (ఈ వృత్తాంతం శుక్లయజుర్వేద భాష్యారంభంలో ఉన్నది.)
సామవేద
శాఖాభేదాలు-
సామవేదానికి 1000 శాఖలుండేవని
వ్యాకరణమహాభాష్య ప్రథమాహ్నికంలో చెప్పబడింది. వాటిలో ఈ శాఖాభేదాలు మనకు తెలుసు.
రాణాయణీయ, శాఠ్యముగ్ర, కాపోల, మహాకాపోల, లాంగలిక, శార్దూల, కౌథుమ. కౌథుమలో
శాఖాభేదాలు- ఆసురాయణ, వాతాయన, మాంజ, వైనధృత, ప్రాచీనయోగ్య, నైతేయ.
ఛంద, ఆరణ్య, మాహానామ్న, ఉత్తర - ఇవి
నాలుగు ఆర్చిక గ్రంథాలు. స్తోభగ్రంథం ఒకటి. గేయ, ఆరణ్య, ఊహ, ఊహ్య- ఈ నాలుగు ప్రధాన
గ్రంథాలు. మాహానామ్న, భారండ, తవశ్యాయనీయ, గాయత్ర- ఈ నాలుగు పరిశిష్టగ్రంథాలు. ఈ
విధంగ 8 గ్రంథాలు గానానికి ఛందాది ఐదు గ్రంథాలు కలిపి 13 గ్రంథాలను సంహితా అంటారు.
తాండ్య, షడ్వింశ, సామవిధాన, ఆర్పేయ,
దేవతాధ్యాయ, ఉపనిషద్, సంహితోపనిషద్, వంశ- ఈ ఎనిమిది బ్రాహ్మణ గ్రంథాలు. దీని
సాధారణ నామం ఛాందోగ్య బ్రాహ్మణం.
అథర్వవేద
శాఖాభేదాలు-
అథర్వవేదానికి 9 శాఖలుండేవని
వ్యాకరణమహాభాష్య ప్రథమాహ్నికంలో చెప్పబడింది. అవి- పైప్పలాద, శౌనకీయ, దామోద,
తోతాయన, జాయన, బ్రహ్మపలాశ, కునఖీ, దేవదర్శీ చారణవిద్య.
అథర్వవేద శౌనకసంహిత, గోపథబ్రాహ్మణం
ప్రసిద్ధమైనవి.
వేదాల
షడంగాలు-
వేదాలకు శిక్షాదులు ఆరు అంగాలు. అంగములు
అంగికి ఉపకారం చేసేవైనట్లు వేదానికి శిక్షాదులు ఉపకారకాలు కనక అంగాలనబడతాయి.
శిక్ష-
సర్వసాధారణంగ కనిపించేది పాణినీయ శిక్ష. యాజ్ఞవల్క్య శిక్ష, కాత్యాయన శిక్ష,
వశిష్ఠ శిక్షాది అనేక శిక్ష గ్రంథాలున్నవి.
కల్పం-
వేదోక్త కర్మలను యథావిధంగ కల్పన చేసే అంగాన్ని కల్పం అంటారు. కల్పం రెండు విధాలు. ఒకటి
శ్రౌతకల్పం, రెండవది స్మార్త కల్పం. ఈ రెండు గ్రంథాలు వేదంలో లేదా శాఖలో భేదంవల్ల
భిన్నములు. శ్రౌతకల్పం శ్రౌతసూత్రం అనే పేరుతో, స్మార్త కల్పం స్మార్త సూత్రం అనే
పేరుతో లేదా గృహ్యసూత్రమనే పేరుతో వ్యవహరింపబడతాయి.
వ్యాకరణం-
వార్తికకారుడు కాత్యాయనుడు, భాష్యకారుడు పతంజలి -వీరి ద్వారా ఉన్నతమైనది పాణినీయ
(అష్టాధ్యాయీ) వ్యాకరణం. అది కాక వైదిశశబ్దానుసాసనానికి ఉపయోగపడేవి
ప్రాతిశాఖ్యగ్రంథాలు.
నిరుక్తం-
వేదార్థ జ్ఞానానికి ఎంతో ఉపయోగపడేది యాస్కముని వ్రాసిన నిరుక్తం. దీనిలో నైఘంటుక,
నైగమ, దైవతమని మూడు కాండలు ఉన్నవి.
ఆద్యం
నైఘంటుకం కాండం, ద్వితీయం నైగమం తథా |
తృతీయం దైవతం చేతి నమామ్నాయస్త్రిధా మతః ||
ఛందస్సు-
పింగలముని వ్రాసిన ఛందస్సు వైదిక లౌకికమని రెండురకాలు.
జ్యోతిషం-
జ్యోతిషం సూర్యాది దేవతలు, ఋషులు వ్రాసినది. దీనిలో సిద్ధాంతం, సంహితా, హోరా అని
మూడు విశాల స్కంధాలున్నవి. జ్యోతిషశాస్త్ర కర్తల గురించి కశ్యపుడు తన సంహితలో ఇట్ల
వ్రాశాడు-
సూర్యః పితామహో
వ్యాసో వశిష్ఠోత్రిః పరాశరః |
కశ్యపో నారదో గర్గో
మరీచిర్మనురంగిరాః ||
లోమశః (రోమశః)
పులినశ్చైవ చ్యవనో యవనో భృగుః |
శౌనకష్టాదశావేతే జ్యోతిఃశాస్త్రప్రవర్తకాః
||
అంగాల
కల్పన-
వేదవేదాంగాలను ఉల్లేఖించిన ఈ క్రమం
అథర్వవేదంలో, ముండకోపనిషత్తులో చెప్పిన విధంగ ఉన్నది. రూపకుడి ప్రకారం శబ్దబ్రహ్మ
అయిన వేదానికి పురుష కల్పన చేసి దానికి సహాయకారకాలైన శిక్షాది ఆరు శాస్త్రాలను
నాసికాది అవయవాలు (అంగాలు)గా భావించబడింది.
"ఛందః పాదౌ తు
వేదస్య, హస్తౌ కల్పోథ పఠ్యతే |
జ్యోతిషామయనం చక్షుర్నిరుక్తం
శ్రోత్రముచ్యతే ||
శిక్షా ఘ్రాణం తు
వేదస్య, ముఖం వ్యాకరణం స్మృతమ్ |"
శిక్షా మొదలైన ఆరు అంగాలు వేదాలకు
సహాయకాలు అయి ఉండటాన్ని గురించి సూర్యసిద్ధాంత సమీక్షలో (1. ఈ గ్రంథం ద్వివేది
గారు వ్రాసినదే) ఈవిధంగ చూపించారు- "స చ శిక్షయా శిక్ష్యతే
స్వరవర్ణాద్యుచ్చారణప్రక్రియయా సముపదిశ్యతే, వ్యాకరణేన వ్యాక్రియతే
తత్తచ్ఛబ్దార్థాన్వాఖ్యానేన వ్యుత్పాద్యతే, నిరుక్తేన నిరుచ్యతే,
పదపదార్థనిర్ధారణేన నిరూప్యతే, ఛందసాం ఛాద్యతే త్రయీత్వవ్యపదేశబీజేన
పద్యగద్యగానరూపేణ ఋగ్యజుః సామబంధేన బధ్యతే కల్పేన కల్ప్యతే, కర్మకాండానుపూర్వ్యా
సమ్పాద్యతే, తథైవ జ్యోతిషేణ ద్యోత్యతే, ప్రకృతివికృత్యుభయానుభయాత్మనాం
యజ్ఞానామను,ఠానకాలాదేశేన ప్రకాశ్యతే|"
వేదాల
ఉపాంగాలు నాలుగు-
వేదాలు, వేదాంగాల లాగ ఉపాంగాల నియమితంగ
ఇన్ని అని గణించలేనివి. వాటి క్రమం భిన్నభిన్నంగ కనిపిస్తుంది. యాజ్ఞ్యవల్క్యుడు
చెప్పిన క్రమం ముందు ఇవ్వబడింది. ఇది రెండవ క్రమం-
అథ చత్వార్యుపాంగాని
వేదానాం సంప్రచక్షతే |
ధర్మశాస్త్రం పురాణం
చ మీమాంసాన్యాయవిస్తరః ||
ఇటువంటి స్థితిలో పేర్లక్రమంలో ఏకత్వం
ఉడటం కుదరదు. ఇక్కడ మీమాంసా అనే పదంతో పూర్వోత్తరాలు రెండూ గ్రహింపబడతాయి. న్యాయం
వల్ల వైశేషికం కూడ తెలుస్తుంది. సాంఖ్యయోగాలు కూడ గణిస్తే సముచితంగ ఉంటుంది.
ఎందుకంటే అవీ న్యాయాదుల వలె ఆస్తికదర్శనాలే. కనక పురాణంతో సాంఖ్యయోగాలు కూడ
గ్రహించాలి. లేదా న్యాయ-వైశేషికం, సాంఖ్యయోగాలు, పూర్వోత్తర మీమాంసలు అని ఈ
ఆరింటినీ కలిపి దార్శనిక విభాగంగా, షట్-శాస్తాలుగా ప్రసిద్ధాలని, స్వతంత్రంగ
చెప్పవచ్చు.
షట్-శాస్తాల
సంగ్రహం చెప్పే శ్లోకం-
న్యాయవైశేషికే
పూర్వం సాంఖ్యయోగౌ తతః పరమ్ |
మీమాంసాద్వితయం
పశ్చాదిత్యాహుర్దర్శనాని షట్ ||
1. న్యాయవిస్తరం- ప్రమాణాలతో అర్థపరీక్ష
చేసే శాస్త్రమిది. ఇది రెండు విధాలు- ఒకటి న్యాయం మరొకటి వైశేషికం. గౌతమ ముని
ప్రమాణాది షోడశ-పదార్థవాది, పంచాధ్యాయి అయిన న్యాయశాస్త్రం రచించాడు. కణాదుడు
ద్రవ్యాదిసప్తపదార్థవాది, దశాధ్యాయి అయిన వైశేషికశాస్త్రం రచించాడు. ఈ రెండిటికీ
కలిపి ఆన్వీక్షికీ అని పేరు. న్యాయశాస్త్రారంభంలో వాత్స్యాయన ముని ఇట్ల అంటాడు-
ప్రదీపః
సర్వవిద్యానాముపాయః సర్వకర్మణాం |
ఆశ్రయః
సర్వధర్మాణాం విద్యోద్దేశే ప్రకీర్తితః ||
మనుమహర్షి 12వ అధ్యాయం 105, 106వ
శ్లోకాలలో ఈ విద్యను ప్రశంసించాడు.
కపిలముని షడధ్యాయి అయిన సాంఖ్యశాస్త్రం
రచించాడు. పతంజలి చతుష్పాదయుతమైన యోగశాస్త్రం రచించాడు. సాంఖ్యయోగాల మహిమ
శ్వేతాశ్వతరోపనిషత్తులో ఇట్ల చెప్పబడింది-
నిత్యో నిత్యానాం
చేతనశ్చేతనానామేకో బహూనాం యో విదధాతి కామాన్ |
తత్కారణం
సాంఖ్యయోగాదిగమ్యం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః ||
2. మీమాంసా- వేదవాక్యార్థాలను బోధించే
శాస్త్రమిది. మీమాంస రెండు రకాలు. ఒకటి పూర్వ మీమాంస. రెండవది ఉత్తర మీమాంస.
(వేదాంతశాస్త్రం లేదా వేదాంత దర్శనం). పూర్వ మీమాంస జైమిని రచించిన పన్నెండు అధ్యాయాల
శాస్త్రం. ఉత్తర మీమాంస వ్యాసముని రచించిన నాలుగు అధ్యాయాల బ్రహ్మసూత్రాలు.
మొదటిదానిలో కర్మ, రెండవదానిలో జ్ఞానానికి సంబంధించిన విచారం ఉంటుంది. పారాశర
ఉపపురాణంలో ఈ ఆరు దర్శనాలలోనుంచి పూర్వ మీమాంస ఉత్తర మీమాంసల సర్వాంశాలలో ఇట్ల
ప్రశంసింపబడినవి.
అక్షపాదప్రణీతే చ
కాణాదే సాంఖ్యయోగయోః |
త్యాజ్యః
శ్రుతివిరుద్ధోంశః శ్రుత్యేకశరణైర్నృభిః ||
జైమినీయే చ వైయాసే
విరుద్ధాంశే న కశ్చన
శ్రుత్యా
వేదార్థవిజ్ఞానే శ్రుతిపారం గతౌ హి తౌ ||
ఉత్తరమీమాంస,
అద్వైతవాదం-
ఉత్తరమీమాంస లో ద్వైతం, విశిష్టాద్వైతం,
శుద్ధాద్వైతం, ద్వైతాద్వైతం అనే వాదాలను ఆధారంగ చేసుకుని నాలుగురకాల భాష్యాలు
రచింపబడినవి. వీటిని రచించినవారు చతుఃప్రస్థానీయ వైష్ణవులు అని పిలవబడినారు.
దీనివల్ల ఈనాడు నాలుగు సంప్రదాయాలు పరస్పర విరుద్ధంగ నడుస్తున్నవి. ఈ సంప్రదాయాలలో
నుండి విశిష్టాద్వైతసంప్రదాయం అన్నింటికన్నా ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది.
దీనిని ప్రతిపాదించిన కాలం విక్రమీయ 12వ శతకం. సాంప్రదాయికులలో ఈ శ్లోకం ఎంతో
ప్రసిద్ధమై ఉన్నది-
రామానుజః శ్రీః
స్వీచక్రే మధ్యాచార్యం చతుర్ముఖః |
శ్రీవిష్ణుస్వామినం
రుద్రో నిమ్బాదిత్యం చతుఃసనః ||
ఈ ద్వైతాది నాలుగు వాదాలను అనుసరించే
ఉత్తరమీమాంస భాష్యాలు వేదవిరుద్ధాలై ఉన్నవి. అంటే తమతమ సంప్రదాయాలను పరిపుష్టం
చేసుకోవటానికి శ్రుతిస్మృతుల ఆశయాలను అటూఇటూ తిప్పి ఆ భాష్యాలన్నీ వ్రాశారు.
వేదం, వేదవ్యాసునికి సమ్మతమైన అర్థాన్ని
వివరించే ఉత్తరమీమాంస భాష్యం ఒఖటి ఉంది. అది శారీరకమనే భాష్యం. దీని కర్త
వేదవ్యాసుని వచనానుసారి, వేదవ్యాసుని శిష్యపరంపర ల పరిణింపబడేవాడూ అయిన ఆచార్య
శంకరస్వాములు.
వేదవ్యాసుడు కూర్మపురాణంలో ముప్ఫైయవ
అధ్యాయంలో ఇట్ల చెప్పాడు-
"కలౌ రుద్రో
మహాదేవో లోకానామీశ్వరః పరః |
కరిష్యత్యవతారం స్వం
శంకరో నీలలోహితః ||
శ్రౌతస్మార్తప్రతిష్ఠార్థం
భక్తానాం హితకామ్యయా |
ఉపదేక్ష్యతి
తజ్జ్ఞానం శిష్యాణాం బ్రహ్మసమ్మితమ్||
సర్వవేదాంతసారం చ
ధర్మాన్ వేదనిదర్శనాన్ |" ఇతి.
ఇవి ఆయన శిష్యపరంపరను గూర్చి చెప్పే
శ్లోకాలు-
నారాయణం
పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ |
వ్యాసం శుకం గౌడపదం
మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యమ్ ||
శ్రీశంకరాచార్యమథాస్య
పద్మపాదం చ హస్తామలకం చ శిష్యమ్ |
తం తోటకం
వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి ||
విద్వత్ శిరోమణి నిశ్చలదాసు తన
విచారసాగరంలో, ఐదవతరంగంలో ఇట్ల వ్రాశాడు-
"చారి యార
మధ్వాదిక్ జే హై......................భేదవాద లఖి సకల అశుద్ధమ్ ||" మొదలైన.
పరమార్థ దశలో అద్వైతవాదులే
అనుసరింపదగినవారు. దీనికి ఎన్నో శ్రుతి-స్మృతి-పురాణ-వచనాలు ప్రమాణంగ ఉన్నవి.
ఇక్కడ కొన్ని ఇవ్వబడుతున్నవి.
మృత్యోః స
మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి | మొదలైన శ్రుతి.
అత్రాత్మవ్యతిరేకేణ
ద్వితీయం యో న పశ్యతి |
బ్రహ్మభూతః స ఏవేహ
దక్షపక్ష ఉదాహృతః ||
సర్వభూతాంతరస్థాయ
నిత్యశుద్ధచిదాత్మనే |
ప్రత్యక్
చిన్మయరూపాయ మహ్యమేవ నమో నమః || మొదలైన స్మృతి.
ఇదే విషయం బ్రహ్మపురాణంలో ఇట్ల
చెప్పబడింది-
"ధర్మాధర్మౌ
జన్మమృత్యూ.............................తూష్ణీమాసీనః సుమతిం వివిద్ధి ||"
అట్లగే విష్ణుధర్మపురాణంలో ఇట్ల
చెప్పారు-
"అనాదిసంబంధవత్యా
క్షేత్రజ్ఞోయమవిద్యయా...............తైరేవ విగతః శుద్ధః పరమాత్మా నిగద్యతే
||"
3. పురాణాలు- వేదవ్యాసుడు రచించిన
పురాణాలు 18. వాటి పేర్లు 1. బ్రాహ్మ 2.
పద్మ 3. వైష్ణవ 4. శైవ 5. భాగవత 6. భవిష్య 7. నారదీయ 8. మార్కండేయ 9. ఆగ్నేయ 10.
బ్రహ్మవైవర్తక 11. లైంగ 12. వరాహ 13. స్కాంద 14. వామన 15. కౌర్మ 16. మాత్స్య 17.
గరుడ 18. బ్రహ్మాండ
బ్రాహ్మం పురాణం
ప్రథమం ద్వితీయం పాద్మముచ్యతే
తృతీయం వైష్ణవం
ప్రోక్తం చతుర్థం శైవముచ్యతే
తతో భాగవతం ప్రోక్తం
భవిష్యాఖ్యం తతః పరం
సప్తమం నారదీయం చ
మార్కండేయం తథాష్టమం
ఆగ్నేయ నవమం పశ్చాద్
బ్రహ్మవైవర్తమేవ చ
తతో లైంగం వరాహం చ
తతః స్కాందమనుత్తమం
వామనాఖ్యం తతః
కౌర్మం మాత్స్యం తత్పరముచ్యతే
గరుడాఖ్యం తతః
ప్రోక్తం బ్రహ్మాండం తత్పరం విదుః
గ్రంథతశ్చ
చతుర్లక్షం పురాణం మునిపుంగవాః
అష్టాదశపురాణానాం
కర్తా సత్యవతీసుతః || (సూతసంహిత)
ఉపపురాణాలు- మునులు చేసిన ఉపపురాణాలు.
వాటి పేర్లు- 1. సనత్కుమారపురాణం, 2. నారసింహ 3. నాంద 4. శివధర్మ 5. దౌర్వాసస 6. నారదీయ
7. కాపిల 8. మానవ 9. ఔశనస 10. బ్రహ్మాండ 11. వారుణ 12. కాలీ 13. వాసిష్ఠలైంగ 14. మాహేశ్వర
15. సాంబ 16. సౌర 17. పారాశర 18. మారీచ 19. భార్గవ
అన్యాన్యుపపురాణాని
మునిభిః కీర్తితాని చ
ఆద్యం సనత్కుమారేణ
ప్రోక్తం వేదవిదాం వరాః
ద్వితీయం
నారసింహాఖ్యం తృతీయం నాందమేవ చ
చతుర్థం శివధర్మాఖ్యం
దౌర్వాసం పంచమం విదుః
షష్ఠం తు నారదీయాఖ్యం
కాపిలం సప్తమం విదుః
అష్టమం మానవం
ప్రోక్తం తతశ్చోశనసేరితం
బ్రహ్మాండం నవమం
ప్రోక్తం వారుణాఖ్యం తతః పరం
((కాలీయాఖ్యం తతః
ప్రోక్తం)) విశిష్టం మునిపుంగవాః
తతో వాసిష్ఠలైంగాఖ్యం
ప్రోక్తం మాహేశ్వరం పరం
తతః సాంబపురాణాఖ్యం తతః
సౌరం మహాద్భుతం
పారాశరం తతః
ప్రోక్తం మారీచాఖ్యం తతః పరం
భార్గవాఖ్యం తతః
ప్రోక్తం సర్వధర్మార్థసాధకం || (సూతసంహిత)
పురాణాలు
ఉపపురాణాలు-
విష్ణుపురాణం గణనం ప్రకారం కూడ ఇవే
పురాణాలుగా పేర్కొనబడినవి. కానీ భేదాలేంటంటే ఆరవది నాకదీయం, ఏడవది మార్కండేయం,
ఎనిమిదవది ఆగ్నేయం తొమ్మిదవది భవిష్యం. దేవీభాగవతం ప్రకారం వాయుపురాణం
చేర్చబడింది. పురాణాలలో శివపురాణం, ఉపపురాణాలలో ఉంది. (??? పే.23)
ప్రమాణవాక్యాలను గుర్తుపెట్టుకోవాలి-
మ-ద్వయం, భ-ద్వయం
చైవ బ్ర-త్రయం వ-చతుష్టయం |
అ-నా-ప-లింగ-కూ-స్కా-ని
పురాణాని పృథక్ పృథక్ ||
భాగవతం రెండువిధాలు- ఒకటి విష్ణుభాగవతం,
రెండవది దేవీభాగవతం. ఇందులో ఒకటి పురాణం, రెండవది ఉపపురాణం. రెండూ పురాణాలేనని
చెప్పటానికి ప్రమాణవాక్యమేం కనిపించదు. అటువంటి దశలో ఏది పురాణం ఏది ఉపపురాణం అని
నిర్ణయించటానికి మహాభారతాన్ని ఆశ్రయించి రెండు భాగవతాల పూర్వాపరాలు చూసి, వాటి
ప్రారంభిక శ్లోకాలు చూస్తే ఒకటి పురాణం, రెండవది ఉపపురాణం అని తెలుస్తుంది. (???
పే.23)
సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మకు విష్ణు-శివాది
నామాలు ఉన్నా పురాణాలలో, ఉపపురాణాలలో ఏ దేవత ప్రతిపాదనా మరొకరి ఉత్కర్షనో,
అపకర్షనో కలిగించేదిగా లేదు. ((అంటే ఒకరికన్నా ఒకరు ఎక్కువ కానీ తక్కువ కానీ అని
చెప్పే సందర్భాలు లేవు.)) ఇక్కడ మాత్రం-
బ్రహ్మ-విష్ణు-శివా
బ్రహ్మన్ ప్రధానాబ్రహ్మశక్తయః |
తతో
న్యూనాశ్చ మైత్రేయ దేవా దక్షాదయస్తతః ||
బ్రహ్మావిష్ణుశివాదీనాం
యః పరః స మహేశ్వరః |
ఇటువంటి వచనాలు కనిపిస్తాయి. ఇవి
ఆలోచించవలసినవి.
ఉపపురాణాల విషయంలో కూర్మపురాణ వచనం-
(పే.24)
ఆద్యం
సనత్కుమారోక్తం...........భార్గవాహ్వయమ్ ||
బ్రహ్మవైవర్త వచనం-
ఆద్యం సనత్కుమారం
చ...........సర్వధర్మప్రవర్తకమ్ ||
సూతసంహిత ప్రకారం 19 ఉపపురాణాలు.
కూర్మపురాణం ప్రకారం (పే. 24)........పురాణం అని చెప్పబడింది. వాటిలో వాసిష్ఠలైంగం
లేదు. .........ప్రకారం కూడ 18 ఉపపురాణాలు. వాటిలో నాంద పురాణం గణింపబడలేదు.
దేవీభాగవతంలో వాయుపురాణం పురాణాలలో పరిగణింపబడింది. కానీ సూతసంహితాదుల ప్రకారం వాయుపురాణం
పురాణాలలోనూ లేదు, ఉపపురాణాలలోనూ లేదు. ఈవిధంగనే భాగవతం పరిస్థితి కూడ ఉంది.
ఆలోచించిన మీదట తెలిసేదేంటంటే ఉపపురాణాల సంఖ్య పద్దెనిమిది మాత్రమే కాదు, కనక
ఉక్తమైనవి, అనుక్తమైనవి కూడ ఉపపురాణాలున్నవి. ఉపపురాణాలలో నారదీయ బ్రహ్మాండ
పురాణాలు వేరు. ఉపపురాణాలు పురాణాలలోనుండే వచ్చినవని మాత్స్య పురాణంలో ఉంది-
పాద్మే పురాణే
యత్ప్రోక్తం నారసింహోపవర్ణనం
తదష్టాదశసాహస్రం
నారసింహమిహోచ్యతే ||
నందాయా యత్ర
మాహాత్మ్యం కార్తికేయేన వర్ణితం
నందాపురాణం తల్లోకే
నందాఖ్యమితి కీర్తితం ||
యత్తు సాంబం
పురస్కృత్యం భవిష్యేపి కథానకం
ప్రోచ్యతే
తత్పునర్లోకే సాంబమేవ మునివ్రతాః ||
ఏవమాదిత్య సంజ్ఞం చ
తత్రైవ పరిగద్యతే
అష్టాదశభ్యస్తు
పృథక్ పురాణం యత్తు దృశ్యతే ||
విజానీధ్వం
ద్విజశ్రేష్ఠాస్తతేభ్యో వినిర్గతం ||
ధర్మశాస్త్రాలు,
స్మృతులు-
4. ధర్మశాస్త్రాలు- "శ్రుతిస్తు
వేదో విజ్ఞేయో ధర్మశాస్త్రం తు వై స్మృతిః|" ఈ మనువు వచనం ప్రకారం
ధర్మశాస్ర్తానికి ఇంకొక పేరే స్మృతి. మనుస్మతి మొదలైనవి ఎన్నో తమ కర్తల పేర్లతో
ప్రసిద్ధములై ఉన్నవి. స్మృతుల ఇన్ని అని వాటి పేర్లు క్రమంలో నియతంగ చెప్పబడి
లేవు. భిన్నంగ కనిపిస్తున్నవి. ఇక్కడ పైఠీనసి వచనం ప్రకారం ముప్ఫైఆరుగురిని
ఉల్లేఖించుకుందాము-
1. మనువు 2. అంగిరా 3. వ్యాస 4. గౌతమ 5.
అత్రి 6. ఉశనా 7. యమ 8. వశిష్ఠ 9. దక్ష 10. సంవర్త 11. శాతాతప 12. పరాశర 13. విష్ణు
14. ఆపస్తంబ 15. హారీత 16. శంఖ 17. కాత్యాయన 18. భృగు 19. ప్రచేతా 20. నారద 21. యాజ్ఞ్యవల్క్య
22. బౌధాయన 23. పితామహ 24. సుమంతు 25. కాశ్యప 26. బభ్రు 27. పైఠీనసి 28. వ్యాఘ్ర
29. సత్యవ్రత 30. భరద్వాజ 31. గార్గ్య 32.
కార్ష్ణాజిని 33. జాబాలి 34. జమదగ్ని 35. లౌగాక్షి 36. బ్రహ్మగర్భ
తేషాం
మన్వంగిరో-వ్యాస-గౌతమత్ర్యశునోయమాః
వశిష్ఠ-దక్ష-సంవర్త-శాతాతప-పరాశరాః
విష్ణ్వాపస్తంబ-హారీతాః
శంఖః కాత్యాయనో భృగు
ప్రచేతా నారదో యోగీ
బౌధాయన-పితామహౌ
సుమంతుః కాశ్యపో
బభ్రుః పైఠీనో వ్యాఘ్ర ఏవ చ
సత్యవ్రతో భరద్వాజో
గార్గ్యః కార్ష్ణాజినిస్తథా
జాబాలి-జమదగ్నిశ్చ
లౌగాక్షిర్బ్రహ్మసంభవః
ఇతి ధర్మప్రణేతారః
షట్-త్రింశదృషయస్తథా || (పైఠీనసి స్మృతి)
యాజ్ఞ్యవల్క్యుడు చెప్పిన 20
స్మృతికారుల పేరు క్రమంగ ఉంది. అది పైఠీనసి ఇచ్చిన క్రమంకన్నా విశేషంగ ఉంది.
యాజ్ఞ్యవల్క్యుడు చెప్పిన స్మృతికర్తలలో పైఠీనసి వాక్యంలో చెప్పని బృహస్పతి, లిఖిత
అనేవారి పేర్లు ఉన్నవి. వారిని కలుపుకుంటే 38 స్మృతులౌతాయి.
మన్వత్రి-విష్ణు-హారీత-
యాజ్ఞ్యవల్క్యోశనోంగిరా
యమాపస్తంబ-సంవర్తాః
కాత్యాయన-బృహస్పతీ
పరాశర-వ్యాస-శంఖ-లిఖితా
దక్ష-గౌతమౌ
శాతాతపో వశిష్ఠశ్చ
ధర్మశాస్త్ర-ప్రయోజకాః || (యాజ్ఞ్యవల్క్య స్మృతి)
ప్రయోగపారిజాతంలో స్మృతికర్తల పేర్లు
పైఠీనసి యాజ్ఞ్యవల్క్యుల క్రమంకన్నా వేరుగ ఉంది. అష్టాదశ స్మృతులు అష్టాదశ
ఉపస్మృతుల పేర్లు చెప్పబడినవి. వీరిలో 1. నాచికేత 2. స్కంద 3. కాశ్యప 4. సనత్కుమార
5. శంతను 6. జనక 7. జాతూకర్ణ్య 8. కపింజల 9. కణాద 10. విశ్వామిత్ర 11. గోభిల 12.
దేవల 13. పులస్త్య 14. పులహ 15. క్రతు 16. ఆగ్నేయ 17. గవేయ 18. మరీచి 19. వత్స 20.
పారస్కర 21. ఋశ్యశృంగ 22. వైజావాప - ఈ 22 పేర్లు అధికంగ ఉన్నవి. వీరిని ముందు
చెప్పుకున్న 38 మందితో కలిపితే 60 స్మృతులైనవి.
మనుర్బృహస్పతిద్రక్షో
గౌతమోథ యమోంగిరాః
యోగీశ్వరః
ప్రచేతాశ్చ శాతాతప-పరాశరౌ
సంవర్తోశనసౌ
శంఖలిఖితావత్రిరేవ చ
విష్ణ్వాపస్తంబ-హారీతాః
ధర్మశాస్త్రప్రవర్తకాః
ఇతి హ్యష్టాదశో
ప్రోక్తా మునయో నియతవ్రతాః
జాబాలిర్నాచికేతశ్చ
స్కందో లౌగాక్షికాశ్యపౌ
వ్యాసః సనత్కుమారశ్చ
శంతనుర్జనకస్తథా
వ్యాఘ్రః
కాత్యాయనశ్చైవ జాతూకర్ణ్యః కపింజలః
బౌధాయనశ్చ కాణాదో
విశ్వామిత్రస్తథైవ చ
పైఠీనసిర్గోభిలశ్చేత్యుపస్మృతివిధాయకాః
వశిష్ఠో నారదశ్చైవ
సుమంతుశ్చ పితామహః
విష్ణుః
కార్ష్ణాజినిః స్తయవ్రతో గార్గ్యశ్చ దేవలః
జమదగ్నిర్భరద్వాజః పులస్త్యః పులహః క్రతుః
ఆత్రేయశ్చ గవేయశ్చ
మరీచిర్వత్స ఏవ చ
పారస్కరశ్చర్ష్యశృంగో
వైజావాపస్తథైవ చ
ఇత్యేతే
స్మృతికర్తార ఏకవింశతిరీరితాః || (ప్రయోగపారిజాతం)
కల్పతరువు నుంచి- 1. బుధ 2. సోమ 3.
ఛాగలేయ 4. జాబాల 5. చ్యవన- ఈ ఐదు పేర్లు అధికంగ ఉన్నవి. వీరిని 60కి కలిపితే 65
స్మృతికారులైనారు. సాధుచరణప్రసాదుడు సంగ్రహించిన ధర్మశాస్త్రసంగ్రహంలో- 1.
ఆశ్వలాయన 2. మార్కండేయ 3. శౌనక 4. కణ్వ 5. ఉపమన్యు 6. శాండిల్య - ఈ ఆరు పేర్లు అధికంగ
కనిపిస్తున్నవి. మొత్తం కలిపి 71 స్మృతులైనవి.
వృద్ధ
ఆదిపదం- విశిష్టస్మృతి-
వృద్ధ మనువు, వృద్ధ యాజ్ఞ్యవల్క్యుడు,
వృద్ధ వశిష్ఠుడు, వృద్ధ సాతాతపుడు.. ఈ విధంగ కొందరు స్మృతికారుల పేర్లు వృద్ధ పద
విశిష్టమై కనిపిస్తవి. బృహద్విష్ణు స్మృతి, బృహద్యమస్మృతి, బృహత్పారాశరీయ
ధర్మశాస్త్రం- ఈ విధంగ ఎన్నో స్మృతులు బృహత్ పద విశిష్టంగ కనిపిస్తవి. లఘుహారీత
స్మృతి, లఘుసంఖస్మృతి- ఈవిధంగ కొన్ని స్మృతులు లఘుపదవిశిష్టంగ కనిపిస్తవి.
సాధుచరణప్రసాదుడు సంగ్రహించిన ధర్మశాస్త్ర సంగ్రహంలో రెండువిధాల ఆంగిరసస్మృతి, రెండువిధాల
సాతాతపస్మృతి, రెండువిధాల దేవలస్మృతి, మూడువిధాల ఔశనసస్మృతి లబ్ధమవుతున్నవి. వీటి
కర్తలు కూడ ఆ మునులేనని అంగీకరిస్తారు. గ్రంథసంఖ్య బృహత్ లేదా లఘు ((విస్తృతంగ,
సంక్షిప్తంగ)) ఉండటంవల్ల గ్రంథకర్త లేదా గ్రంథం బృహత్ లేదా లఘు అనే పదాలను కలిగి ఉన్నవి.
లేదా వృద్ధ పదం యోగి పదంలాగే ఆయా ఋషిమునుల గౌరవార్థం చేర్చబడిందో. ఉదా- యోగి యాజ్ఞ్యవల్క్యుడు.
వర్ణాశ్రమధర్మవిచారణం,
శాస్త్రప్రకోపం, పరీక్ష -
మనుమహర్షి చెబుతాడు-
అర్థకామేష్వసక్తానాం
ధర్మజ్ఞానం విధీయతే |
ధర్మజిజ్ఞాసమానానాం
ప్రమాణం పరమం శ్రుతిః ||
అర్థకామాలలో అసక్తుల (అలోలుపులు,
అనాసక్తులు) కోసం ధర్మోపదేశం చేయబడింది. ధర్మాన్ని వెదికేవాడికి ధర్మనిర్ణయం
చేయటానికి శ్రుతియే అంటే వేదమే పరమప్రమాణం. వేదం కర్మ, ఉపాసన, జ్ఞానాన్ని
ప్రతిపాదిస్తుంది. వేదార్థం ఋగ్యజుస్సామ భేదాల చేత అపరిఛిన్నమైనప్పటికీ ((అంటే ఈ
భేదాల వల్ల అది విభేదించకపోయినప్పటికీ, విభాగం కానప్పటికీ)) జైమిని మహర్షి, వేదవ్యాస
మహర్షులు నిరూపించిన సూత్రాలు వేదార్థాన్ని పరిఛిన్నం చేశాయి. ఒకవేళ కాలవశాన
వేదశాఖలు లుప్తమైపోయినా సరే, ఈ సూత్రాల వల్ల వేదరహస్యం సురక్షితంగ నిలిచి ఉంటుంది.
అందువల్ల ఈనాటికైనా అధికారి ((యోగ్యత అర్హత కలిగినవాని)) కి అబ్యుదయ-నిఃశ్రేయస
(భుక్తి-ముక్తి) ద్వారం తెరిచే ఉంది. దీనివల్ల స్పష్టమయేదేంటంటే శ్రౌత, స్మార్త
వాఙ్మయాల రహస్యమే పూర్వోత్తరమీమాంసలనీ, వాటి కర్తలైన వ్యాసజైమిని మహర్షులు
వేదపారదర్శులు అని స్పష్టమవుతుంది. ఈ విషయంలో పారాశరీయ ప్రమాణవచనం ముందే
ఇవ్వబడింది.
వేదం శబ్దం అర్థం అనే రెండూ శరీరంగ
కలిగి ఉంటుంది. వానిలో శబ్దశరీర రక్ష శిక్షా-వ్యాకరణ-నిరుక్త-ఛందస్సులు చేస్తే,
అర్థ శరీరాన్ని జ్యోతిషం, కల్పసూత్రం, ఉపాంగాలు రక్షిస్తాయి. ఈవిధంగ
ఋగ్యజుస్సామరూపమైన వేదం యొక్క శబ్దార్థరూప శరీరానికి అంగాలు, ఉపాంగాలు సహాయతాలై ఉంటాయి.
అంగోపాంగాలంటే లోకంలో ఉన్న అంగోపాంగాల సముదాయ రూపమైన అంగీ అని కానీ, అంగోపాంగములు
నశిస్తే అంగీ నశిస్తుందనో అర్థం కాదు. వేదం యొక్క అంగోపాంగాలు వేదం యొక్క
శబ్దార్థరూపమైన శరీరానికి పరిచాయకములు, ప్రదర్శకాలు, బోధకాలు ((పరిచయం చేసేవి,
ప్రదర్శించేవి, విశదపరచేవి)) అని చెప్పబడినవి. ఏదైనా పాఠ్యాంశానికి దేవదత్తాదులు
బోధకులు అయినవిధంగ, ఒకానొక దృశ్యానికి సూర్యాది ప్రకాశాలు ప్రకాశింపచేసేవి
అయినవిధంగ ఇది కూడ. అప్పుడు దేవదత్తాదుల అభావంలో ((అంటే వారు లేనప్పుడు))
యజ్ఞదత్తాదులు బోధకులు అయినట్టు, సూర్యుని ప్రకాశం లేకపోతే అగ్ని మొదలైనవి
కార్యాన్ని సాధించే పెట్టేవిగ ఉంటాయో అట్లగే కాలవశాన అంగోపాంగాలు నశిస్తే ఇతర
అంగోపాంగాలు వేదానికి సహాయంగ ఉంటవి. అంటే అంగోపాంగాల అధికారులు నిత్యులని, అవి
స్వరూపం చేత అనిత్యములని, వేదం మాత్రం స్వరూపం చేత నిత్యమని దీనివల్ల
స్పష్టమవుతుంది. అందువల్లే వేదానికి శ్రుతి అని పేరు. "శ్రూయతే గురుపరంపరయా,
న తు కేనచిత్ క్రియతే ఇతి శ్రుతిః". గురుపంరపంర లో వినిపొందబడేదే కానీ ఎవరి
చేతా తయారు చేయబడేది కానందువల్ల వేదం శ్రుతి. అంగోపాంగాల సాధారణ నామం స్మృతి.
"స్మర్యతే ఇతి స్మృతిః". వేదార్థానుకూలంగ స్మరింపబడేది స్మృతి. స్మరణలో
న్యూనాధికభావాల (హెచ్చుతగ్గుల) వల్ల స్మృతుల ప్రామాణ్యంలో న్యూనాధిక భావాలు
కల్పించబడినవి. ((అంటే వేదార్థ స్మరణ న్యూనంగ ఉందా, అధికంగ ఉందా అనేదాన్ని బట్టి ఆ
స్మృతి ప్రమాణత్వం న్యూనమా అధికమా అనేది నిర్ణయించబడింది.)) అందువల్లే బృహస్పతి
అంటాడు-
వేదార్థోపనిబంధత్వాత్
ప్రాధాన్యం హి మనోః స్మృతిః |
మన్వర్థవిపరీతా తు
యా స్మృతి సా న శస్యతే ||
వేదార్థాన్ని సంకలనం చేయటంలో
మనుమహర్షిదే ప్రాధాన్యం. మనుస్మృతికి విరుద్ధంగ ఉన్న స్మృతి ప్రశంసనీయం కాదు.
ఇక్కడ మనుస్మృతికి సజాతీయాలైన స్మృతులను దృష్టిలో పెట్టుకుని బృహస్పతి ఈ మాట
అన్నప్పటికీ వీలైనంతవరకూ అంగాలు, ఉపాంగాల ప్రామాణ్యంలో హెచ్చుతగ్గులను ఒప్పుకోక
తప్పదు. అంగోపాంగాల సంజ్ఞ బలాబల విచారణంలో సహాయకారి కాదు, అది వైదిక శబ్దార్థ
శరీరానికి అనుగుణంగ పెట్టబడిన సంజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి.
శబ్దార్థాలకు మధ్య ఉన్నది నిత్య సంబంధం
అనీ, శబ్దంలోని దోషం అర్థానికి దోషాన్ని సంక్రమింపచేస్తుంది అనీ ఇక్కడ తప్పక
తెలుసుకవాలి. అందువల్ల శబ్దనిష్ఠమైన స్వరంలోని భేదం వల్ల అర్థంలో భేదం
వచ్చేస్తుంది. మాట శిక్షా నిరుక్తంలో ఉన్న
మంత్రం వల్ల స్పష్టమవుతుంది.
మంత్రో హీనః స్వరతో
వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ |
స వాగ్వజ్రో యజమానం
హినస్తి యథేంద్రశత్రుః స్వరతోపరాధాత్ ||
స్వరం లేదా వర్ణం చేత హీనమై, దాని చేత
దోషగ్రస్తమై, తప్పుగ ఉచ్చరింపబడిన మంత్రవాక్యం వాస్తవిక అర్థాన్ని
చెప్పలేకపోతుంది. ఆ మంత్రం వజ్రమై యజమానుని ((ఆ యజ్ఞాన్ని ఆచరిస్తున్న వానిని)) సంహరిస్తుంది.
స్వరదోషం వల్ల ఇంద్రశత్రువు సంహరింపబడినట్టు అని ఉదాహరణ. పూర్వకాలంలో ఇంద్రుడు
త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని సంహరించాడు. అప్పుడు త్వష్ట క్రుద్ధుడై వృత్రుడనే
రెండవ పుత్రుని కోరి ఆభిచారిక యజ్ఞం చేశాడు. ఇంద్రుని శత్రువై వర్ధిల్లు అనే ఇచ్ఛ
తో ఇంద్రశత్రుర్వర్ధస్వ అనే వాక్యాన్ని ఊహించి ఉచ్చరించాడు. ఇందులో షష్ఠీతత్పరుష
సమాసం ప్రకారం అంతోదాత్తం ఉచ్చరించాల్సింది ఉండింది. కానీ ప్రమాదవశాత్తు బహువ్రీహి
సమాసం ప్రకారం ఆద్యుదాత్తం ఉచ్చరింపబడింది. దీనితో విరుద్ధఫలం కలిగి ఇంద్రుని
చేతిలో వృతృడు హతమైనాడు. అంటే ఇంద్రశత్రువు అనే పదానికి ఇంద్రస్య శత్రుః అనే
తత్పురుష సమాసం చేస్తే ఇంద్రుని శత్రువు అని అర్థం వస్తుంది. ఇంద్రః శత్రుః యస్య
సః అని బహువ్రీహి చేస్తే ఇంద్రుడు శత్రువు (సంహారకుడి) గా ఉన్నవాడు అని అర్థం
వచ్చింది. ఇది వైయాకరణులలో చాలా ప్రఖ్యాతమైన విషయం.
ఇదే విధంగ "విజ్ఞానమానందం
బ్రహ్మ" మొదలైన శ్రుతులలో విజ్ఞానపదంలో మత్వర్థీయ అచ్ ప్రత్యయాన్ని కల్పించి విజ్ఞానరూపమైన
అనే పరంపరాగత అర్థాన్ని తీసుకోకుండ విజ్ఞానవాన్ అనే నవీనార్థాన్ని కల్పిస్తారు.
అంటే విజ్ఞానపదంతో విజ్ఞానవాన్ అనే అర్థాన్ని తీయటానికి "విజ్ఞానమస్యాస్తీతి
విజ్ఞానం = ఎవరు విజ్ఞానాన్ని కలిగి ఉన్నాడో వాడు = విజ్ఞానవాన్" అనే వ్యాఖ్య
చేసినప్పుడు విజ్ఞానపదం అంతోదాత్తం అవుతుంది కానీ "విజ్ఞాయతే యత్ తత్ = ఏది
తెలియబడుతున్నదో అది" అని పరంపరాగత వ్యాఖ్య చేసినప్పుడు విజ్ఞానపదం స్వరిత
స్వరాంతమవుతుంది. ఆశయమేంటంటే గురుపరంపరలో సస్వరవేదం చదివినవారు విజ్ఞానపదాన్ని
స్వరితంగనే చదువుతున్నప్పుడు పూర్వయుక్తితో విజ్ఞానపదాన్ని అంతోదాత్తంగ చేసేయటం
ఎంత అనర్థమైన పని..! శివశివా.. హరహరా..! ఇటువంటి సాహసాలు చేయటంవల్లనే వేదదూషకులు,
బ్రహ్మఘాతకులు అనే బిరుదులు పొందుతారు.
ఈవిధంగనే "కృష్ణోస్వాఖరేష్టోగ్నయే
అనే సుప్రసిద్ధ యజుర్వేదీయ మంత్రంలో కృష్ణపదం ఆద్యుదాత్తంగ చదువుతారు. అందువల్ల
కృష్ణపదం పరంపరలో మృగార్థాన్ని ఇస్తుంది. ఒకవేళ కృష్ణపదం అంతోదాత్తంగ చదివితే
వర్ణార్థం ఇస్తుంది.
దీనివల్ల స్పష్టంగ తెలిసేదేంటంటే-
వేదాలలో కొద్దిగ అటూఇటూ అయిందంటే అర్థం అనర్థమైపోతుంది. ఆ భయంతోనే పూర్వకాలంలో ఎప్పుడూ
వేదాలను నిత్యనూతనంగ ఉంచేవారు. వాటిని యథార్థంగ ధారణ చేసేవారిని ఋషి లేదా
మంత్రద్రష్ట అంటారు. గురుముఖతః యథాతథంగ వేదాలను చదివేవారిని అనూచానులు అనేవారు.
మనుమహర్షి ఇట్ల చెప్పాడు-
న హాయనైర్న పలితైర్న
విత్తేన న బంధుభిః |
ఋషయశ్చక్రిరే ధర్మం
యోనూచానః స నో మహాన్ ||
వయస్సులో పెద్ద కావటం చేత, తలలు పండటం
చేత, ధనవంతులైనందువల్ల, బందువుల గొప్ప వల్ల ఎవరూ గొప్పవారు కాదు. అనూచానులు (అంటే
సాంగవేదాధ్యయనం చేసినవారు) మాత్రమే మనకు మహాత్ములు అని ఋషులు నియమం చెప్పారు.
కాలవశాత్తు క్షత్రియసామ్రాట్టులు నశించి
వర్ణాశ్రమశిక్షాప్రమాలి శిథిలమైపోయాక వైదికశుద్ధజ్ఞానం లుప్తప్రాయమైనందువల్ల
వర్ణాశ్రమవ్యవస్థలో నడిచే వారి వృత్తులు మారిపోయాయి. నానావిధాల మతవిద్యలు
ప్రచారంలోకి వచ్చినవి. బ్రాహ్మణులు ధర్మధ్వజులైనారు. తమకు తోచిన విధంగ ధార్మిక
వ్యవస్థలను మార్చారు. తమతమ అభిమతాల పరిపుష్టికి అనుగుణంగ శ్రుతిస్మృతులు యథేచ్ఛగ
వ్యాఖ్యానించటం మొదలైంది. గ్రంథాలలో నానావిధాల వాక్యాలను కలపటం మొదలైంది. శ్రుతి
స్మృతులపేరుతో ఎన్నో కొత్త గ్రంథాలు వచ్చినవి. చాలాచోట్ల ఆర్ష ((ఋషుల)), పౌరుష
((మానవ)) వివేకం సందేహసాగరంలో మునిగిపోయింది.
కాలం మహిమ ఏంటంటే ఏ వ్యాకరణ న్యాయాలు
వేదార్థరక్షణకై చదివి చదివించబడేవో, ఏవేటి వల్ల వేదశబ్దార్థశరీరానికి ఏ పీడా
ఉండేది కాదో అవే ఇప్పుడు విరుద్ధభావాలకోసం ఉపస్థాపిపంపబడుతున్నవి. వ్యాకరణభాష్యంలో
మాటిమాటికీ వేదరక్షకై వ్యాకరణం ఉందని నొక్కివక్కాణించారు. కానీ ఇప్పుడు వేదానికి
యథేష్టంగ అర్థాలను చెప్పటానికే వ్యాకరణవీరులు సిద్ధం అవుతున్నారు. న్యాయదర్శనంలో
తత్త్వనిర్ణయం రక్షార్థం జల్పవితండలున్నాయని చెప్పారు. (టి.
తత్త్వాధ్యవసాయ-సంరక్షణార్థం జల్పవితండే బీజప్రరహ-సంరక్షణార్థం కంటకశాఖావరణవత్|) కానీ
ఇప్పుడు తమతమ స్వమతాల రక్షార్థం జల్పవితండలు ప్రయోగిస్తున్నారు.
ప్రసంగవశాన చెప్పవలసిందేంటంటే
చార్వాకులు, బౌద్ధులు, జైనులు వేదదూషకులే కానీ వారి వల్ల వేదానికి తిరిగి
బాగుచేసుకోలేనంత విఘాతం జరగలేదు. ఎందుకంటే వారంతా బాహాటంగ వేదదూషకులైనారు. కనక
ఎప్పటికప్పుడు వారికి చికిత్స జరిగింది. కానీ ఈ దుర్బలధార్మిక వ్యవస్థలో
ప్రబలమవుతున్న ప్రచ్ఛన్న (గుప్త) చార్వాకాదులను అనుశాసించటం చాలా కఠినమే కాదు
అశక్యమైపోయింది. ఈ శోచనీయ దశను ఉల్లేఖిస్తూ విద్య (దార్శనిక నిబంధావళిలో) ఇట్ల
చెప్పారు-
(టి.
ఈ నిబంధావళి ద్వివేదిగారు వ్రాసినది.)
ప్రత్యక్షీక్రియతేద్య.....................సంప్రత్యుపేత్యత్యయమ్||
(పే.35)
కర్మకాండ-
వేదం ప్రతిపాదించిన కర్మ శ్రౌత, స్మార్త భేదం కలిగి రెండు విధాల ఉంది అని ముందు
చెప్పుకున్నాం. శ్రుతుల ఆదారంగనే స్మార్తకర్మ ఉన్నప్పటికీ, శ్రౌతకర్మ సాక్షాత్తు
8తుల నుండే సిద్ధించినప్పటికీ, దీనివల్ల శ్రౌతకర్మకే ప్రాధాన్యం అని తేలినప్పటికీ
స్మార్తక్రమ అయిన ఉపనయనం జరగకుండ శ్రౌతకర్మ అగ్నిహోత్రాదులు చేయలేరనేది వైదిక
సిద్ధాంతం. అందువల్ల శ్రౌతకర్మకు అధికారి కావాలంటే ముందు ఉపనయనం జరిగి
ద్విజాతికావటం తప్పనిసరి.
ఉపనయనం- (యజ్ఞోపవీతం = జంధ్యం).
ఉపనయన-సంస్కారం కన్నా ముందు తర్వాత జరిగే సంస్కారాల గూర్చిన చర్చ మున్ముందు
వస్తుంది. అయినా వర్ణాశ్రమధర్మ-వ్యవస్థ భారమంతా మోయవలసిన ఉపనయనం ప్రస్తుతం ఎంతటి
గడ్డు పరిస్థితులలో ఉందో అది తెలుసుకోవటం చాలా ముఖ్యం. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య
పురుషునికి వివాహం తర్వాత బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య స్త్రీ యందు కలిగిన మగపిల్లలకు
తగిన సమయానికి ఉపనయనం చేయటం వల్ల వారు ద్విజాతి పదాన్ని పొందుతున్నారు. క్షత్రియ
వైశ్యుల గురించి తర్వాత చెప్పుకుందాము. ముందు..............
పే.36
పే.38
ఇక ఉపనయనం ముందు తర్వాత జరిగే సంస్కారాల
గురించి తెలుసుకుంటాము. ఈ క్రమం స్మృతులలోని పాఠభేదాల వల్ల వివిధ చోట్ల వివిధ
రకాలుగా చెప్పబడినప్పటికీ పెద్దలు చెప్పినదాన్ని బట్టి సవరించబడింది. 1. గర్భాధానం
2. పుంసవనం 3. సీమంతోన్నయనం 4. జాతకర్మ 5. నామకరణం 6. అన్నప్రాశనం 7. చౌల 8.
ఉపనయనం 12. చతుర్వేదవ్రతం 13. స్నానం (సమావర్తనం) 14. వివాహం 19. పంచమహాయజ్ఞాలు
20. అష్టక 21. పార్వణం 22. శ్రాద్ధం 23. శ్రావణి 24. ఆగ్రహాయణి 25. చైత్రి 26 ఆశ్వయుజి
27. అగ్న్యాధానం 28. అగ్నిహోత్రం 29. దర్శపౌర్ణమాసం
30. చాతుర్మాస్యం 31. ఆగ్రయణేష్టి 32. నిరూఢపశుబంధం 33. సౌత్రామణి 34. అగ్నిష్టోమ 35.
అత్యగ్నిష్టోమ 36. ఉక్థ 37. షోడశి 38. వాజపేయ 39. అతిరాత్ర 40. ఆప్తోర్యామ - ఇవి
నలభై సంస్కారాలు. (???) వీటి అనుష్ఠానక్రమాలు లక్షణాలు కల్పసూత్రాల నుండి
తెలుసుకుంటారు. వీటిలో గర్భాధానం నుండి వివాహం వరకు ఉన్న పదునాల్గు సంస్కారాల వల్ల
పవిత్ర గృహస్థు అవుతాడు. తరువాతి సంస్కారాల వల్ల ఇంకా మాననీయుడు అవుతాడు.
(చతుర్వేదవ్రతం తరువతే పూర్వకాలంలో ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేవదం, అథర్వవేదం
శిక్షింపబడేవి.) (టి. వర్తమాన కాలిక మనుష్యశిక్షా వర్ణనం
"చాతుర్వర్ణ్యశిక్షా"లో చూడండి.) వీటిలో కూడ పంచమహాయజ్ఞాలు గృహస్థుకు
నిత్యకర్మ అని వీటి గురించి మనుమహర్షి తృతీయాధ్యాయంలో చాలా వ్రాశాడు. అష్టకాది
ఆశ్వయుజి వరకు ఏడు స్మార్తకర్మలు పాకనిష్ఠమైనవి. అగ్న్యాధానాది సౌత్రామణి పర్యంతం
ఏడు శ్రౌతకర్మలు హవిష-నిష్ఠమైనవి. అగ్నిష్టోమాది ఆప్తోర్యామ పర్యంతం ఏడు
శ్రౌతకర్మలు సోమ (పూతిక) ?? నిష్ఠమైనవి. ఈ నలభే సంస్కారాలు కాక ఎనిమిది ఆత్మగుణాలు
ఉన్నాయ. అవి- 1. దయ 2. క్షాంతి 3. అనసూయ 4. శౌచం 5. అనాయాసం 6. మాంగల్యం 7.
అకార్పణ్యం 8. అస్పృహ. ఆంతరక్రియ సాధ్యం (సాధించవలసింది) కావటం చేత వీటిని సంస్కార
ప్రకరణంలో ఉల్లేఖించారు.
"గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం
జాతకర్మ నామకరణాన్నప్రాశన-చౌలోపనయనం చత్వారి వేదవ్రతాని స్నానం సహధర్మచారిణా సంయోగః పంచానాం
యజ్ఞానామనుష్టానమష్టకా పార్వణం శ్రాద్ధం శ్రావణ్యాగ్రహాయణీ చైత్ర్యాశ్వయుజీతి సప్త
పాకసంస్థాః అగ్న్యాధానమగ్నిహోత్రం
దర్శపౌర్ణమాసౌ చాతుర్మాస్యాన్యాగ్రయణేష్టిర్నిరూఢపశుబంధః సౌత్రామణీతి సప్త హవిర్యజ్ఞసంస్థాః
అగ్నిష్టోమోత్యగ్నిష్టోమ ఉక్థ షోడశీ
వాజపేయోతిరాత్ర ఆప్తోర్యామ ఇతి సప్త సోమసంస్థా ఇత్యేతే చతుర్వింశతి
సంస్కారాః. అష్టావాత్మగుణా దయా సర్వభూతేషు క్షాంతిరనసూయా శౌచమనాయాసో
మాంగల్యమకార్పణ్యమస్పృహేతి." -గౌతముడు
"సర్వథాపి"- 3.4.34 ఈ
బ్రహ్మసూత్రానికి శారీరక వ్యాఖ్య ప్రకారం 1. నిరశనసంహితాధ్యయనం 2. ప్రాయణకర్మ 3. జపం
4. ఉత్క్రమణం 5. దైహికం 6. భస్మసమూహనం 7. అస్థిసంచయనం 8. శ్రాద్ధం -ఈ ఎనిమిది
సంస్కారాలు అదనంగ ఉన్నవి. వీటిని కలుపుకుంటే 48 సంస్కారాలు అవుతున్నవి.
"యస్యైతే
అష్టాచత్వారింశత్ సంస్కారా ఇత్యాద్యా చ|" (శారీరకం)
అంగీరా ఈ 25 సంస్కారాలను చెప్పాడు-
"పంచవింశతిసంస్కారైః
సంస్కృతా యే ద్విజాతయః
తే పవిత్రాశ్చ
యోగాశ్చ శ్రాద్ధాదిషు సుయంత్రితాః
గర్భాధానం పుంసవనం
సీమంతో బలిరేవ చ
జాతకృత్యం నామకర్మ
నిష్క్రమోన్నాశనం తథా
చౌలకర్మోపనయనం
తద్వ్రతానాం చతుష్టయమ్
స్నానోద్వాహౌ
చాగ్రయణమష్టకా చ యథాతథం
శ్రావణ్యామాశ్వయుజ్యాం
చ మార్గశీర్ష్యా చ పార్వణం
ఉత్సర్గశ్చాప్యుపాకర్మ
మహాయజ్ఞాశ్చ నిత్యశః
సంస్కారా నియతా
హ్యేతే బ్రాహ్మణస్య విశేషతః ||"
ఈ 25 సంస్కారాలు నైమిత్తిక, వార్షిక,
మాసిక, నిత్య బేదంతో నాలుగు విధాలు ఉంటాయని అశ్వలాయనుడు అన్నాడు-
"నైమిత్తికాః
షోడశశ్లోకాః సముద్వాహావసానకాః
సప్తైవాగ్రయణాద్యాశ్చ
సంస్కారా వార్షా మతాః
మాసికం పార్వణం
ప్రోక్తమసక్తానాం తు వార్షికం
మహాయజ్ఞాస్తు
నిత్యాః స్యుః సంధ్యావచ్చాగ్నిహోత్రవత్ ||"
వీనిలో గర్భాధానాది షోడశ సంస్కారాలు
నైమిత్తికాలు; ఆగ్రయణాది పాకర్మపర్యంతం ఏడు సంస్కారాలు మాసికాలు; లేదా వార్షికాలు.
పంచమహాయజ్ఞాలు, సంధ్యోపాసన, అగ్నిహోత్రం నిత్యకర్మలు.
వ్యాసుడు షోడశ సంస్కారాలు చెప్పాడు-
గర్భాధానం పుంసవనం
సీమంతో జాతకర్మ చ
నామక్రియా
నిష్క్రమణోన్నాశనం వపనక్రియా
కర్ణవేధో వ్రతాదేశో
వేదారంభక్రియావిధిః
కేశాంతః
స్నానముద్వాహో వివాహాగ్నిపరిగ్రహః
త్రేతాగ్నిసంగ్రశ్చేతి
సంస్కారాః షోశస్మృతాః
నవైతాః కర్ణవేధాంతా
మంత్రవర్డం క్రియాః స్త్రియః
వివాహో
మంత్రతస్తస్యాః శూద్రస్యామంత్రతో దశ ||
వీనిలో గర్భాధానం నుండి వివాహం వరకు
పధ్నాలుగు సంస్కారాలు పదిహేనవది స్మార్త అగ్న్యాధానం, పదహారవది శ్రౌత అగ్న్యాధానం.
సారాంశం ఏంటంటే తమతమ కల్పసూత్రాలను
బట్టి ఎక్కువైనా తక్కువైనా ఎన్ని సంస్కారాలు ఉంటే అన్ని చేయటం యోగ్యమైనది. ముందు
ఇచ్చిన సంసస్కారాల సంఖ్యలో హెచ్చుతగ్గులు వైదికశాఖా సూత్రభేదాల వల్ల కలిగినవి.
అందువల్ల గోత్ర ప్రవర తో సమానంగ శాఖాసూత్ర స్మరణం చేయటం కూడ అత్యావశ్యకమే. లేదంటే
ఏ వాక్యాలననుసరించి సంస్కారాలు చేయాలి..? పూర్తిగ సంస్కారాలు విచిఛిన్నమై వేరేవారి
సంతానంగ కావలసి ఉంటుంది. ((ఏ వేద శాఖాధ్యాయి ఆ శాఖకనుగుణంగ, ఏ స్మృతి,
కల్పసూత్రాలను అనుసరించేవారు ఆయా స్మృతి కల్పసూత్రాలకనుగుణంగ వ్యవహరించటం పద్ధతి. మన
గోత్రం, ప్రవర వాటికి సంబంధించి వివరం చెప్పేదే. అట్ల అనుసరించటం వల్ల ఆయా శాఖలతో,
కల్పాలతో మనకు అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అవి మన తల్లిదండ్రులతో సమానంగ
అవుతాయి. అవి ఏం బోధిస్తే, ఎట్ల ధర్మ-కర్మములు చెబితే అట్ల ఆచరించటమే మన పని. అదే
మనం చేయవలసింది. దాన్ని తప్పితే దోషం వస్తుంది. స్వశాఖ, సూత్రాలు వదిలి ఇతర శాఖలలో
ఇతర కల్పాలలో ఏం చెప్పారా అని అది తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయటం ఇతరుల తల్లిదండ్రులను
మన అనుకోవటం వంటిది అని ఇక్కడ అభిప్రాయం. ఎప్పటికైనా మనదే మనకు ప్రమాణం- అందులో
ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే.)) ఈ వ్యవస్థ గృహ్యపరిశిష్టకారుని వాక్యం వల్ల
తెలుస్తుంది.
బహ్వల్పం వా స్వగృహోక్తం యస్య యావత్ ప్రకీర్తితం
తస్య తావతి
శాస్త్రార్థే కృతే సర్వః కృతో భవేత్
ఈవిధంగనే కాత్యాయానుడి వాక్యం-
ఊనో వాప్యతిరిక్తో
వా యః యః స్వశాఖాస్థితో విధిః
తేన సంతనుయాద్ యజ్ఞం
న కుర్యాత్ పారశాఖికం
పరశాఖోపి కర్తవ్యః
స్వశాఖాయాం న నీదితః
సర్వశాఖాసు యత్కర్మ
ఏకం ప్రత్యవశిష్యతే ||
ఇటువంటి దశలో ఇతర స్మృతులను ఉపేక్షించి తమతమ
గృహ్యస్మృతి (స్మార్తసూత్రం) అనుసరించి యావచ్ఛక్యం గర్భాధానాది సంస్కారాలను
అనుష్ఠించటం న్యాయం. శుక్లయజుర్వేదీయ మాధ్యందినీశాఖ వారు తమ గృహ్యస్మృతిని
(పారస్కర స్మార్తసూత్రాలు) అనుసరించి సంస్కారాలను చేయాలి.
ఆర్తవ
(ఋతు) కాలంలో గర్భాధానం
మూడవ
లేదా నాలుగవ మాసంలో గర్భచలనం కన్నా ముందు పుంసవనం
ఆరు
లేదా ఎనిమిదవ నెల సీమంతం (సీమంతోన్నయనం)
శిశువు
ఉత్పన్నం అయినాక జాతకర్మ
ఏకాదశదినాన
నామకర్మ
నాలుగవ
మాసంలో నిష్క్రమణం (పిల్లవాడిని ఇంటి బయటకు తీసుకుపోవటం)
ఆరవనెల
అన్నప్రాశనం
మొదటి
లేదా మూడవ కులాచారం ప్రకారం చూడా (చౌల) (గృహ్యస్మృతి లేదా యాజ్ఞ్యవల్క్యుడి
ప్రకారం చెప్పబడని కర్ణవేధం, చౌలం ఉపనయనం తో పాటు ఆచారం ప్రకారం అనుష్ఠించాలి.)
గర్భాధానానికి
ఎనిమిదవ ఏడు బ్రాహ్మణుడికి, గర్భాధానం నుండి ఎనిమిదవ ఏడు క్షత్రియునికి, పన్నెండవ
ఏడు వైశ్యునికి ఉపనయన సంస్కారం చేయాలని చెప్పారు. ఒకవేళ ఈ చెప్పిన కాలాలకు రెట్టింపు
కాలం (అంటే 16, 22, 24 వయస్సు) గడిచిపోతే వ్రాత్యస్తోమమనే ప్రాయశ్చిత్తం చేయకుండ
వారెవరూ (ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య నిర్భాగ్య బాలులు) ఉపనయనానికి అధికారి కాలేరు.
ఒకవేళ ఈ వ్యవధి లోపు స్త్రీ పరిగ్రహం ((వివాహం)) జరిగిపోతే వారు మరింత అధిక
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. జాతకర్మ మొదలు చూడాకర్మ వరకు ఐదు సంస్కారాలు కన్యకు
అమంత్రంగ (మంత్రవర్జితంగ, మంత్రం లేకుండ) ఉంటాయి అని గుర్తు పెట్టుకోవాలి. కన్యకు
ఉపనయన సంస్కారం ఉండదు. అందువల్ల వేదారంభ శాంతసమావర్తనం కూడ ఉండవు.
ఉపనయనం
తర్వాత వేదారంభం (స్వశాఖాధ్యయనం)
అధ్యయనం
పూర్తైన తర్వాత కేశాంతకర్మ చేతనైనంత విధంగ చేయాలి. (గోదానవిధి)
కేశాంతకర్మ
తర్వాత సమావర్తనం
పదహారవయేడు
తర్వాత వివాహం. ఇది కన్యకు 8 వఏడు మొదలు పదకొండవ ఏడు లోపు జరగటం తప్పనిసరి.
వివాహసంస్కారం కన్నా ముందు బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ సాధారణ విద్య, (టి.
స్త్రీల విద్యావిధానం "విద్య" "చాతుర్వర్ణ్య శిక్ష" లో
చూడండి.) తర్వాత విశేష విద్య గ్రహించాలి.
వివాహం
తర్వాత లేదా అన్నదమ్ముల నుండి విడివడ్డాక ఆవసథ్యాధానం (గృహాగ్ని-సంస్థాపనం)
సరైన
కాలానుగుణంగ పంచమహాయజ్ఞాలు. (టి. ఆవసథ్యాధానం చేయకుండ కూడ పంచమహాయజ్ఞాలు చేయవచ్చు.
గృహస్థు వీటిని ఆచరించటం ఎంతో అవసరం.)
శ్రావణ
పౌర్ణమికి ఉపాకర్మ
పుష్యమాస
రోహిణీ నక్షత్రం లేదా కృ,ణాష్టమికి ఉత్సర్గం.... మొదలైనవి. (టి. స్మార్తకర్మలో
అష్టక మొదలైన కొన్ని కర్మలను, శ్రౌతకర్మలలో మొదటి అన్నీ భాగాలను వదిలివేశారు.
వాటిలో రాజసూయ, అశ్వమేధలు క్షత్రియులకు చెందిన విషయాలు.)
ఈ విధంగ మాధ్యందినీ శాఖవారు
కాత్యాయనశ్రౌతసూత్రాల ప్రకారం అగ్న్యాధానాది శ్రౌతకర్మ చేయాలి.
1. అగ్న్యాధానం- ఇది బ్రాహ్మణద్విజులు
వసంతఋతువులో, క్షత్రియ ద్విజులు గ్రీష్మఋతువులో వైశ్యద్విజులు శరదృతువులో
చేస్తారు. అగ్న్యాధానంలో అధ్వర్యువు, హోత, ఉద్గాత, బ్రహ్మ అని నలుగురు ఋత్విక్కులు
ఉంటారు. అగ్న్యాధాన శాలలో పశ్చిమం వైపు గార్హపత్యమనే అగ్ని వృత్తాకార కుండంలో
ఉంటుంది. దీనికి పూర్వదిశగా ఆహవనీయాగ్ని చతురస్ర కుండంలో ఉంటుంది. దక్షిణం వైపు
అన్వాహార్యవచన అనే పేరుగల అగ్ని వృత్తార్ధాకార కుండంలో ఉంటుంది. గార్హపత్య ఆహవనీయ
కుండాల మధ్యభూమిలో ఒక విశిష్ట వేదిక తయారు చేస్తారు. దాని పూర్వభాగాన్ని అంశమని,
పశ్చిమబాగాన్ని శ్రోణి అని అంటారు.
2. అగ్నిహోత్రం- సాయంత్రం ఉదయం
వేదమంత్రాలతో అగ్నిలో ఆహుత వేయటాన్ని అగ్నిహోత్రమంటారు.
యథేహ క్షుధితా బాలా
మాతరం పర్యుపాసితః
ఏవం సర్వాణి
భూతాన్యగ్నిహోత్రముపాసతే || (ఛాందోగ్యోపనిషత్తు)
3. దర్శపౌర్ణమాసం- ఆహితాగ్ని అనే ఈ
ఇష్టిని (అగ్న్యాధానకర్త) ప్రతి నెలా చేయవలసి ఉంటుంది.... మొదలైనవి. (టి. ???)
ఈ విధంగనే ఆశ్వలాయన శాంఖ్యాయనాది సూత్రాల
ప్రకారం ఋగ్వేదీయుల కర్మలు; ఆపస్తంబ-హిరణ్యకేశీయ-సత్యాపాఢాది సూత్రాల ప్రకారం కృష్ణయజుర్వేదీయుల
కర్మలు; గోభిల-కౌథుమాది సూత్రాల ప్రకారం సామవేదీయుల కర్మలు; శౌనక సూత్రాల ప్రకారం
అథర్వవేదీయుల కర్మలు ఉంటాయి. ఎక్కడైనా స్మార్తకర్మలలో స్మార్తసూత్రాలు,
శ్రౌతకర్మలో శ్రౌతసూత్రాలు శరణ్యములని మాత్రం గుర్తుపెట్టుకోవలసిన విషయం. ((అంటే ఏ
సంస్కారం లేదా కర్మ చేస్తున్నామో అది స్మార్తమా, శ్రౌతమా చూసుకుని ఆయా సూత్రాలను
అనుసరించి ఆ కర్మలను ఆచరించాలి.)) శాఖాసూత్రాల విస్మరించినప్పుడు లేదా అవి
ఉచ్ఛిన్నమైనప్పుడు ఇతర స్మృతులను శరణు వేడటం అగతిక గతికంగ ఉంటుంది. ఈ విధంగ
ప్రేతకర్మల తమ గృహ్యస్మృతులలో లేనప్పుడు గరుడపురాణాన్ని శరణు వేడటం కూడ ఉంది.
ఎందుకంటే పురాణాలలో దాదాపుగ సర్వశాఖల కర్మలకు అనుగుణంగ ఉంటుంది. అందుచేత పౌరాణిక
కర్మలను ఆచరించటం వల్ల గృహ్యస్మృతికి అనాదరణ జరుగుతుంది. అది ఎప్పటికీ
విరుద్ధకర్మయే.
ప్రేతకర్మ,
శ్రాద్ధం- మరీచి ఈవిధంగ చెప్పాడు-
ప్రేతం పితౄంశ్చ
నిర్దిశ్య భోజ్యం యత్ ప్రియమాత్మనః |
శ్రద్ధయా దీయతే
యత్తు తచ్ఛ్రాద్ధం పరికీర్తితమ్ ||
మృతపిత్రాదులు సపిండీకరణం శ్రాద్ధానికి
మందు ప్రేత = ప్ర-ఇత శబ్దంతో పిలవబడతారు. మృతపిత్రాదికులను ఉద్దేశించి
ఆత్మప్రియభోజనాదులు బ్రాహ్ణణులకు శ్రద్ధతో పెడితే అది శ్రాద్ధమనబడుతుంది. శ్రాద్ధం
నాలుగు రకాలు- ఏకోద్దిష్టం, సపిండనం, పార్వణం, నాంది. ఏకోద్దిష్టం మూడు రకాలు-
నవం, నవ మిశ్రం, పురాణం.
1. మృతి చెందిన దినం మొదలు పదవరోజు వరకు
చేసేది నవ శ్రాద్ధం.
2. ఏకాదశాది ఊనవార్షిక (పదకొండవరోజు
మొదలు ఒక సంవత్సరం లోపు వరకు చేసేది) నవమిశ్ర శ్రాద్ధం.
3. వార్షిక శ్రాద్ధం పురాణం.
4. పన్నెండవరోజు శ్రాద్ధం సపిండనం
అనబడుతుంది. దాని స్వరూపం ఇది-
పిత్రర్ఘ్యపాత్రపిండేషు
మేలనం యేన భావ్యతే |
ప్రేతార్ఘ్యపిండయోస్తద్ధి
సపిండనముదీర్యతే ||
ఒక పితృదేవతను ఉద్దేశించి చేసే
విశ్వదేవరహిత శ్రాద్ధం ఏకోద్దిష్టం అనబడుతుంది.
5. ముగ్గరు పితృదేవతలను ఉద్దేశించి చేసే
శ్రాద్ధం పార్వణం.
6. పుత్రజన్మ, వివాహం, అగ్న్యాధానం,
సోమయాగం మొదలైన శుభకర్మల ప్రారంభంలో చేసే శ్రాద్ధమును నాందీ అంటారు. ఈ ఆవశ్యకమైన
శ్రాద్ధములు కాక కామ్య శ్రాద్ధాలను గురించి కాత్యాయన శ్రాద్ధసూత్రాల లోని నౌమి
కండికలో యాజ్ఞ్యవల్క్య స్మృతి ఇత్యాదులలో చెప్పారు.
ఉపసంహారం-
కొన్ని ఆవశ్యక విషయాలను చెప్పి
కర్మకాండను ముగిస్తాను. ధార్మిక క్రియ చాలా అంశాలలో అదృష్టఫలార్థాన్ని (కనిపించని
ఫలితం) ఇస్తుందనేది సత్యమే కానీ అసలు దృష్టఫలమే (కనిపించే ఫలితం) ఇవ్వదని
అనుకోకూడదు. విచారిస్తే గర్భాధానాది సంస్కారాలలో దృష్టఫలాలు చాలా కనిపిస్తాయి.
వీటికి క్షేత్ర-బీజ-ఫల-పుష్టి తో గట్టి సంబంధం ఉంది. అంతే కాదు- ఒక క్రి ఏదైనా
దేశ, కాల, పాత్రను కూడా అపేక్షిస్తుంది. దేశకాలపాత్రల సంఘటనం (కూర్చుకోవటానికి)
చాలా విధులు ఉన్నవి. వాటి విఘటన దశలో దోషాలు వస్తాయి. విధిలో దోషం రాకూడదని ఎన్నో
నిషేధవాక్యాలు, దషాల పరిహారానికి అనేక ఉపాయాలు ఉన్నవి. ఎక్కువగా ఈ ఉపాయాలు విషయవిభాగం
ప్రకారం ప్రాయశ్చిత్తం, శాంతికం, పౌష్టికం అని చెప్పారు. ఈ విషయం ఎంత వరకు
వచ్చిందంటే ఋషులు, దేశకాలపాత్రల (పట్టింపులు) సంకోచం చూసి "విరోధే త్వనపేక్షం
స్యాద్ అసతి హ్యనుమానం" అనే శ్రుతి ప్రాబల్యవ్యవస్థను పట్టించుకోకుండ
లోకరక్షార్థం "కలివర్జ్య" ప్రకరణం వ్రాశారు. (టి. కలివర్జ్య ప్రకరణం
ఉల్లేఖం చాలా స్థలాలలో ఉంది. నిర్ణయసింధువు లో మూడవ పరిచ్ఛేదం పూర్వార్ధం అంతంలో
ఉంది. నిబంధగ్రంథాల(?) నుండి ఉద్ధరించిన వాక్యాలను మూలగ్రంథం తో పోల్చి చూడవలసిన
అవసరం ఎంతో ఉంది.) ఇటు స్వార్ధాంధులైన జనాలు సంకీర్ణగ్రంథాలను ప్రచారం చేశారు
(బహుతాయత్?) వాటి గురించి ముందు ప్రత్యక్షీక్రియతే- చెప్పబడింది.
ఇటువంటి క్లిష్టమైనదశలో
"అస్వర్గ్యం లోకవిద్విదం ధర్మమప్యాచరేన్న తు" ఈ యోగీశ్వర శిక్షా ప్రకారం
తమతమ కల్పసూత్రోక్తమైన శ్రౌతస్మార్త కర్మలు ధర్మసంరక్షణార్థం చేతనైనంతవరకు చేయటం
తప్పనిసరి. బాల్యకాలంలో సంస్కారాలను తల్లిదండ్రలు, తరువాతి సంస్కారాలను గురించి
తనే విచారించుకోవటం అవసరం. కాలమహిమ వల్ల చాలా మంది జనం - మేము సంసారులం. ముక్కు
మూసుకుని కూర్చునే వ్యవధి లేదు. అంటారు. ఆ మహానుభావులతో చెప్పేదేంటంటే 24 గంటలలో
ఒకటో అరో గంట అందరికి ఖాళీ దొరుకుతుంది. తమ ఆరోగ్యం బాగా ఉంచుకోవాలని ఉంటే ముక్కు
మూసుకునే పనిని వైద్య-చికిత్సక-డాక్టర్ల మందు అనుకుని పాటించండి. ఈవిధంగ
త్రైవర్ణికత్వం వ్యవస్థ (లీక్?) నడుస్తూంటుంది.
ఒకమాట తప్పక చెప్పవలసి ఉంది-
గృహ్యస్మృతి లోని కొన్ని విషయాలు ఎక్కువగ కనిపించటం మొదలైంది. కొన్ని మాత్రం
లుప్తమైపోతున్నవి. పూర్వం ఇట్ల ఉండేది కాదు. వైదికజ్ఞానం లుప్తప్రాయమై పోయిన
దగ్గరినుంచి స్వశాఖీయ పరశాఖీయ కర్మలు బోధపడకుండ అయినవి. అత్యావశ్యక, ఆవశ్యక,
అనావశ్యక విషయాల వివేకం మునిగిపోయింది. వర్ణాశ్రమధర్మాలు పతనమైపోయాయి. (అధరోత్తర్
భయా?) అజ్ఞానం, స్వార్థపరాయణత్వం వల్ల నానావిధ కర్మకాండ పద్ధతులు మెరవటం మొదలైంది.
అప్పటి నుంచి నిర్ధనులు స్తోమత లేక, ధనవంతులు అవజ్ఞ (నిర్లక్ష్యం) చేత చాలా కర్మలు
కాలగర్భంలో లుప్తమైనవి.
చాతుర్వర్ణ్య శిక్షలో ఇట్ల చెప్పబడింది-
"సాంస్కారికం
కర్మ విధాతుకామాః పృచ్ఛంతి యత్తత్ సునిరూప్య లేఖాం
న వా
జిఘృక్షారససంశ్రయేణ నానావిదం వస్తువిమోహనాయ ||
నిక్షిప్యతాం
దృష్టిరితస్తతో వా విమృశ్యతాం వా మనసా నికామమ్
అపవ్యయాద్
భారతభూతలేస్మిన్ సంస్కార ఏష (శాఖీ) ప్రలయోనుయాతః ||
భూరి
క్రియాక్లృప్తినిరూపితశ్రీరాస్తాం స సోమాదివిశేషయాగః
న స్మర్యతే క్వాపి స
జాతియోగీ సంస్కారశాఖీ బహువిత్తసాధ్యః ||" మొదలైన.
కల్పసూత్రాలు ఇతరేతర స్మృతుల నుంచి
ఉపబృంహణం (విస్తరణం) కావాలి. కానీ కల్పసూత్రాలనే ఒక పక్కకు తోసేయటం దాని ప్రయోజనం
కాదు. అయితే ఒకటి- ఉదాహరణకు గృహ్యస్మృతి జ్యోతిషం సంహితాభాగంలో సంస్కారం కోసం కాలశుద్ధి
చెప్పి ఉంటే గృహ్యస్మృతి అనురోధం (చెప్పిన) ప్రకారమే జ్యోతిష కాలశుద్ధిని
తీసుకోవాలి. అందువల్ల ఎన్నో కర్మలు సింహస్థ-మకరస్థ గురు ఆదుల దుష్టకాలంలోనే
చేయబడతాయి. దానికి ఉదాహరణగా-
అధార్యకల్పకోద్వాహోऽధార్యపుత్రోపనాయనమ్
|
గయాగోదావరీయాత్రా
సింహస్థేऽపి న
దుష్యతి || (ధర్మాధికారి నంద పండితుడు)
ఈ దుర్దశయే శాంతిక-పౌష్టికాదులకు కూడా
పట్టింది. శాంతికకర్మ విధానం లేనిచోట కూడా అది ఒక విశాల స్వరూపాన్ని ధరించి
యజమానుని బాధిస్తుంది. ఉదా- ఉపనయన-వివాహాదులలో. ఆ కర్మను గ్రహశాంతి, లేదా గ్రహకర్మ
అంటారు. దాన్ని యాజ్ఞ్యవల్క్య స్మృతిలో ఇట్ల చెప్పారు-
శ్రీకామః శాంతికామో
వా గ్రహయజ్ఞం సమాచరేత్ |
దృష్ట్యాయుః
పుషిటకామో వా తథైవాభిచరన్నపి || 295 ||
ఇంకా దీని ఇతికర్తవ్యత (విధి) కూడ
చెప్పబడింది. కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న గ్రహశాంతి (టి. ఈ పుస్తకం రాజపూత్ ల
ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉంది.) పద్ధతి చాలా పెంచబడింది. చాలా రకాలుగా కూడ
కనిపిస్తుంది. దేన్ని ఏది అనాలి? సంస్కారభాస్కరాదులది కూడా ఇదే దశ.
పునర్వివాహం-
(టి. ఈ విషయం గురించిన పూర్తి విచారణం
"విధవోద్వాహశంకాసమాధి" అనే గ్రంథంలో చెప్పారు. ఇక్కడ కేవలం సూచనప్రాయంగ
ఇవ్వబడింది.) ఉపనీతుడైన (ఉపనయనం జరిగిన) త్రైవర్ణికునికి అనేక కారణాల వల్ల తిరిగి
ఉపనయన సంస్కారం చేయటం కనిపిస్తుందో అట్ల వివాహిత అయిన త్రైవర్ణిక స్త్రీకి వివాహం
చేయటం కనిపించదు. అందుకనే పునర్వివాహ
విధానం ఏ గృహ్యస్మృతిలో చెప్పలేదు. మనువు ఎనిమిదవ-తొమ్మిదవ అధ్యాయాలలో
"పాణిగ్రహణికా మంత్రాః కన్యాస్వేవ ప్రతిష్ఠితాః ||226|| పాణిగ్రహణికా మంత్రాః
నియతం దారలక్షణం ||227|| నోద్వాహికేషు మంత్రేషు నియోగః కీర్త్యతే క్వచిత్ ||65|| మొదలైన
వాక్యాలతో పునర్వివాహం నిషేధించాడు. శాస్త్రీయ యుక్తి కూడ చెప్పాడు- ఒకసారి
కన్యాద్రవ్యాన్ని వరునికి దానం చేశాక దాతకు మళ్ళీ కన్యాద్రవ్యం అధికారం దాతకు ఉండనప్పుడు,
అధికారి అయిన వరుడు మరణించినప్పుడు, ఇతర ద్రవ్యాలకు వలె సంబంధీకుల అధికారం ప్రాప్తించనప్పుడు
((అంటే వేరే ధనమో, వస్తువో అయితే ఒకరి చేతి నుంచి ఇంకొకరికి- అంటే
వంశపారంపర్యంగనో, లేక అధికారి లేని పక్షంలో సంబంధించినవారికో చేరినట్టు దీని
విషయంలో వీలు కాదు కనక)) "విధవ" ((విగతః ధవః యస్యాః- భర్తను కోల్పోయిన
స్త్రీ)) ను ఇచ్చిపుచ్చుకునేవాడు దొంగ కాక మరెవరు ఉంటారు..? (టి. భర్త స్త్రీ దాత
అంటే స్త్రీని మరొకరికి దానం చేసేవాడు కాగలిగేది కొన్ని పరిస్థితులలో మాత్రమే.
ఉదా- హరిశ్చంద్రుడు)
నష్టే మృతే
ప్రవ్రజితే క్లీబే చ పతితేऽపతౌ |
పంచస్వాపత్సు
నారీణాం పతిరన్యో విధీయతే || (4.3)
ఈ పరాశరస్మృతి వాక్యం ప్రకారం
పునర్వివాహాన్ని సమర్థిస్తారో వారు చాల తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మొదటిమాట,
వైవాహిక శ్రుతి (టి. "అర్యమణం తు దేవం కన్యా అగ్నిమవృక్షత" మొదలైన
మంత్రాలు, ఈ ప్రస్తుతం విచారం విద్యాసుధాకరం లో స్పష్టంగ ఉన్నవి.) దీని గురించి
మనువు ఇట్ల చెప్పాడు. "పాణిగ్రహణికా మంత్రాః కన్యాస్వేవ ప్రతిష్ఠితాః"
(8.226) రెండవమాట, గృహ్యస్మృతులలో పునర్వివాహ విధి లేనందువల్ల ఈ స్మృతి వచనానికి
గృహ్యస్మృతులతో విరోధం స్పష్టంగ కనిపిస్తుంది. మూడవది, ఆశుద్ధేః సంప్రతీక్ష్యో హి
మహాపాతకదూషితః" (77) ఈ యాజ్ఞ్యవల్క్య స్మృతి ప్రకారం ఇతర వ్యక్తి భర్తగ ప్రాప్తించటం
లేదు. కానీ ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఆ భర్తయే వ్యవహరింపదగినవాడు. అందువల్ల స్మృతి వాక్యం స్వతంత్రంగ పునర్వివాహం, లేదా
నియోగానికి విధాయకం కాదు. కానీ వ్యవస్థను అపేక్షిస్తుంది. ((స్వతంత్రంగ ఈ వాక్యం
చూసి పునర్వివాహం లేదా నాయోగం చేయాలి అని అనలేము. వ్యవస్థను చూసి నిర్ణయించాలి.))
ఉదా- వాగ్దానం తర్వాత పాణిగ్రహణం కన్నా ముందు అపతి (టి. అపతి- అని విడదీస్తే
ఉత్పత్స్యమానపతిత్వవాన్ = పతిత్వం, పతిపదవి ఉత్పన్నం కావలసి ఉన్నవాడు- అని వ్యాఖ్య
చేయవలసిన అవసరం లేదు. నఞ్ సమాసం కావటం చేత అపతి సాధువు కూడ అవుతుంది.) అంటే
పతిభిన్నుడైన, పతి సదృశుడైన వరుడు- ఒకవేళ కనిపించకుండ పోతే, లేదా చనిపోతే, లేదా
సన్యాసిగా మారిపోతే, లేదా నపుంసకుడైతే, లేదా మహాపాతకం ఏదైనా చేసి దూషితుడైతే - ఈ
ఐదు ఆపదలలో "చ"కారంత వికర్మ, లేదా విరుద్ధ ధర్మా, లేదా సమాన గోత్రం, లేదా
సమాన ప్రవర కలిగిన జ్ఞాతుడు ఉంటే ఆ కన్యను అతనికి సమర్పించాలి. ఈ ఉద్దేశమే
ధర్మాధికారి నందపండితుడు విద్వన్మనోహర లో వెలిబుచ్చాడు.
నియోగకర్మ-
ఇది ఇంద్రియదౌర్బల్యం కారణంగ కలికాలంలో
పూర్తిగ అసంభవం. (టి. మహాభారతంలో ధృతరాష్ట్రాదుల ఉత్పత్తి వృత్తాంతం చూడండి.)
అందువల్ల బృహస్పతి అన్నాడు-
ఉక్తా నియోగా మునినా
నిషిద్ధాః స్వయమేవ తు |
యుగక్రమాదశక్యోయం కర్తుమన్యైర్విధానతః
|| మొదలైన.
మనుమహర్షి కూడ చెప్పాడు- అయం ద్విజైర్హం
విద్వద్భిః పశుధర్మో విగర్హితః || (9.66)
నియోగ కర్మ కాదు కదా, ఈ కాలంలో కూడ
పునర్వివాహాన్ని త్రైవర్ణాతిరిక్తమైన శూద్రజాతిలో హీనదృష్టితో చూస్తున్నారు.
త్రైవర్ణికులు దీని కోసం ప్రయత్నించినా సరే.. "అక్షమాలా వశిష్ఠేన.."
(9.23) "అజీగర్తః సుతం హంతుం..." (10.105)
"శ్వమాంసమిచ్ఛన్..." (10.106) "భరద్వాజః.." (10.107)
"విశ్వామిత్రః..." (10.108) మొదలైన మనూక్తములైన వృత్తాంతాలు; తారా
మందోదరి, ద్రౌపది, మొదలైనవి ఏవో కొన్ని వృత్తాంతాలు వర్తమానకాలంలో దృష్టాంతాలై
విధేయములు కానేరవు.
యజ్ఞము-పశువు-
కలివర్జ్యం ప్రకారం అగ్నిహోత్ర,
సన్యాసాది కొన్ని కర్మలు కలికాలంలో వర్జితములు. ((విడిచిపెట్టవలసినవి.)) అయినా
వాటి విధానం (ప్రతిప్రసవవాక్యం) లభిస్తుంది.
యావద్వర్ణవిభాగోస్తి
యావద్వేదః ప్రవర్తతే |
సంన్యాసం
చాగ్నిహోత్రం చ తావత్కుర్యాత్ కలౌ యుగే ||
అంటే వేదాలు, వర్ణవిభాగం ఉండి నడిచినంత
కాలం అగ్నిహోత్రం, సంన్యాసం చేయవచ్చు. "చ"కారంతో వీలైనంతవరకు ఇతర
కర్మలు, ఇతర ఆశ్రమాలు గ్రహించాలి. అందువల్లే ఎట్లైనా బ్రహ్మచర్యం, చాతుర్మాస్యం,
సోమయాగం మొదలైన కొన్ని కర్మలు కొన్నిచోట్ల శిష్టజనుల మధ్య కనిపిస్తాయి.
("అకరణాత్ మందకరణం శ్రేయః")
ఇంకా ఈ వ్యాసవచనం కూడ ఉంది-
చత్వార్యబ్దసహస్రాణి
చత్వార్యబ్దశతాని చ |
కలేర్యదా గమిష్యంతి
తదా త్రేతాపరిగ్రహః |
సంన్యాసష్చ న
కర్తవ్యో బ్రాహ్మణేన విజానతా ||
కలియుగంలో నాలుగువేల నాలుగు వందల
సంవత్సరాలు వ్యతీతమైనాక సుజ్ఞులైన (బాగా తెలిసిన) బ్రాహ్మణం, అగ్నిహత్రం, సంన్యాసం
గ్రహింపరాదు. ఈ నిషేధం కూడ వర్తమానకాలిక వర్ణాశ్రమవ్యవహారాన్ని సూక్ష్మదృష్టితో
చూస్తే సముచితంగ నే అనిపిస్తుంది.
యజ్ఞంలో పశువును సంజ్ఞపనాన్ని
భ్రాంతిమూలకమని నిరూపించేవారు, లేదా దాన్ని యుగాంతరీయ ((వేరే యుగానికి చెందిన))
ధర్మంగ చెప్పేవారు, లేదా దాన్ని పిష్టపశువుకు చెందినదిగా చెప్పేవారు అందరూ
భ్రాతులు సర్వాంధులే. పశుసంజ్ఞపన చర్చ ఒక్కచోట కాదు, వెయ్యి చోట్ల ఉందన్నప్పుడు
వేదాల నుండి పురాణాల వరకు సంజ్ఞపనం దాగనప్పుడు వేదవిద్రోహులు దానిపై-
"పశుశ్చేన్నిహతః స్వర్గం జ్యోతిష్టోమే గమిష్యతి | స్వపితా యజమానేన తత్ర
కస్మాన్న హన్యతే ||" మొదలైన పరిహాసాలు చేస్తూ వచ్చినవారున్నప్పుడు, సంజ్ఞపనం
మనం దాచినంత మాత్రాన దాగుతుందా..? దాగదు కదా. సత్యాన్ని కప్పిపుచ్చి పాపానికి
భాగస్థులం ఎందుకు కావాలి..? ఉదా- అశ్వాలంభ- అశ్వమేధ (టి. "అశ్వః ఆలభ్యతే
వధ్యతేత్ర",. "అశ్వః మేధ్యతే వధ్యతేత్ర") శబ్దానికి అశ్వసంజ్ఞపనం
అనే అర్థాన్ని విడిచి అశ్వసంస్పర్శనం, అశ్వసంగమం అనే అర్థాన్ని చెప్పేవారు పచ్చి
అబద్ధాన్ని చెబుతున్నారు. ఈ కపోలకల్పితార్థం తో ఈ పదాల ప్రయోగంచేసిన చోటు ఒక్కటి
కూడ దొరకదు. ఇటువంటి దశల సంజ్ఞపనం భ్రాంతిమూలకం అని ఎట్ల సిద్ధింపచేయగలం..? దీనికి
శ్రీభాష్యకారుడైన శ్రీరామానుజాచార్యుడు, వేదాంతపారిజాతసౌరభాచార్యుడైన
శ్రీనింబకాచార్యుల శిష్యుడు, వేదాంత కౌస్తుభాచార్యుడు శ్రీశ్రీనివాసాచార్యుడు ఈ
శ్రుతిని చూపారు.
"న వా ఉ ఏతన్
మ్రియసే న రిష్యసి, దేవాన్ ఇదేషి ప్రతిభిః సుమేభిః |
యత్ర యంతి సుకృతో
నాపి దుష్కృతస్తత్రత్వా దేవః సవితా దధాతు ||"
పూర్ణప్రజ్ఞదర్శనాచార్యుడైన
శ్రీమధ్వాచార్యుడతు ఈ వరాహపురాణం వాక్యం చెప్పాడు-
హింసా త్వవైదికీ యా
తు తయోనర్థో ధ్రువం భవేత్ |
వేదోక్తయా హింసయా తు
నైవానర్థః కథంచన ||
దీనికి సంబంధించిన విచారణం
"అశుద్ధమితి చేన్న శబ్దాత్ |" (3.1.25) ఈ బ్రహ్మసూత్రం భాష్యంలో చెప్పారు. "ఓషధ్యః పశవః" (4.40) అనే
మనుస్మృతి వాక్యం కూడా ఈ వ్యవస్థను సమర్తిస్తుంది.
సాంఖ్యకారికల ఆనుశ్రవిక కర్మను
(త్రేతాగ్ని సాధ్య అనుష్టానం) అవిశుద్ధి, క్షయ, అతిశయం అనే మూడు దోషాలు
గ్రస్తమైనదిగా చెప్పారో, అందులో కర్మసాధ్యమైన స్వర్గాన్ని అనిత్యత వల్ల
క్షయమయ్యేదని. కర్మఫలాన్ని న్యూనాధిక భావంతో అతిశయమైనదని (??? కాస్తో కూస్తో
అతిశయమని?) చెప్పటం న్యాయసిద్ధమేను. కానీ కర్మలో ఏకాంతతః ((పూర్తిగ)) అవిశుద్ధి
చెప్పటం న్యాయవిరుద్ధం, పైగా ఉపజీవ్యమైన దానికి (సాంఖ్యదర్శనం) బహిర్భూతము.
((బాహ్యమైనది)) ఎందుకంటే ఏ సాంఖ్యసూత్రం వల్ల కూడా ఈ చెప్పబడిన కర్మ అవిశుద్ధం అని
నిరూపింపబడలేదు. పైగా "అశుద్ధమితి చేన్న, శబ్దాత్" అనే బ్రహ్మసూత్రానికి
విరోధం అవుతుంది. ఈ సూత్రం శారీరక భాష్యంలో ఆచార్య 6 శంకరస్వామి "న హింస్యాత్
సర్వాభూతాని" ఈ శాస్త్రం ఉత్సర్గమని, "అగ్నీషోమీయం పశుమాలభేత" ఈ
శాస్త్రాన్ని అపవాదంగ వ్యవస్థ చేశారు. "అగ్నిహోత్రాది తు తత్కార్యాయైవ
తద్దర్శనాత్" (4.1.13) ఈ బ్రహ్మసూత్రంలో ఆనుశ్రవిక కర్మ విశేషం జ్ఞానంలో
ఉపయోగకరమైందని చెప్పారు. ఈ స్థితిలో "అవిశుద్ధిః = సోమాది యాగస్య పశుబీజాదివదసాధనతా"
అనే మాట కారికాపక్షాన్ని రక్షించటానికే ఉంది. ఈ విషయం గురించి సాంఖ్యతత్త్వకౌముదీ
విద్వత్తోషిణీ టీకలో శ్రీబలరామ ఉదాసీన సాధువు (టి. ఈయన స్వపరిష్క్తమైన పాతంజల
యోగభాష్యం ప్రారంభంలో యోగతత్త్వసమీక్ష అనే
ఒక భూమిక వ్రాశాడు. ఇందులో వేదాంత సిద్ధాంతాలను ఏకిపారేశాడు. ((ఆడే హాథోం సే
సంభాలా..?)) దాని సమాధానం వేదాంత పరిభాషలో సమణిప్రభా శిఖామణి టీక భూమికలో
శ్రీగోవిందసింహ నిర్మల సాధువు చెప్పాడు.) కర్మకాండోన్మూలనం పరిణామంగ చెప్పే
విశాలమైన కథనాన్ని చేశాడు. దాని ప్రాతిస్విక (??) విచారానికిది తగిన చోటు కాదు.
సంజ్ఞపనాన్ని యుగాంతరీయ ధర్మమని కూడ
స్తాపించలేము. ఎందుకంటే "చత్వార్యబ్దసహస్రాణి." అనే వ్యాసవాక్యంతో
త్రేతాగ్నిసాధ్య కర్మలఅనుష్ఠానం కలియుగంలో కూడా ప్రాప్తిస్తుంది. దేశ-కాల-పాత్రల
సంకోచం తో కొన్ని రోజుల కోసం చెప్పారు - అది వేరే మాట. "గోసంజ్ఞప్తిశ్చ
గోసవే" మొదలైన విశేష సంజ్ఞపనం శ్రుతి స్మృతుల ద్వారా పూర్తిగ నిషిధ్ధమైనది.
కానీ అగ్నిహోత్రం, చాతుర్మాస్యం, సోమాది కొన్ని యజ్ఞాలు నిషిద్ధాలు కావు. అందువల్ల
వాటికి ప్రాతిస్విక నిషేధ వాక్యాలు కూడ లభించవు. కొందరు దాక్షిణాత్య శిష్టులలో అవి
ఇప్పటికీ ఏదోవిధంగ ఆచరణలో కనిపిస్తున్నవి. ఇక మిగిలింది కలివర్జ్య ప్రకరణ లేఖనం.
అది "శ్వానం, యువానం, మఘవానమాహ" లాగ అయింది. అయితే స్మృతి వల్ల శ్రుతికి
బాధనం కలగదు, దేశ-కా-పాత్రల సంకోచం వల్ల అనేక కర్మల అనుష్ఠానం వల్ల సుకృతం బదులు
దుష్కృతాలు వచ్చి పడే పూర్తి ఆశంక ఉన్నప్పుడు మహానుభావులు "కలివర్జ్య"
వ్యవస్థ చేశారనేది చాలా ఆలోచించవలసిన విషయం. ఇందులో శ్రుతివిహిత, స్మృతివిహిత,
సామర్థ్యవిహిత, ఆచారావిహితమైన ఎన్నో కర్మలను నిషేధించారు. నిషిద్ధ విధానాన్ని కూడా
చెప్పారు. వైదిక సంజ్ఞపనం పిష్టపశు ((పిండితో చేసిన పశువు బొమ్మ))సాధ్యమైనదని కూడా
చెప్పటానికి లేదు. ఎందుకంటే "న వా ఉ ఏతన్మ్రియసే.." అనే ఉక్తితో
శ్రుతికి విరోధం వస్తుంది. ఠఅగ్నిషోమాభ్యాం ఛాగస్య వపాయై భేదసోనుబ్రూహి" మొదలైన
శ్రుతులు వల్ల పైష్టిక పశువు అనే మాట బాధింపబడింది. పైగా పిష్టపశువును చేయటానికి
విధివాక్యం కూడ లేదు. "శ్రూయతే హి పురా కల్పే నౄణాం వ్రీహిమయః పశుః" మొదలైన
వాక్యాలతో కల్పింపబడుతున్న విధి "పురాకల్పే తు నారీణాం మౌంజీబంధనమిష్యతే"
లాగే ఉపేక్షణీయమైంది ((పట్టించుకోకుండ వదిలివేయతగినది)). ఏ లక్ష్యంతో పిష్టపశువు
విధిత్వం ఒప్పుకుంటున్నారో దాన్ని వదిలించుకోవడం కూడా అసంభవం. ఎందుకంటే
"వ్యుత్థానావస్థాయాం రాగాదీనాం వశప్రవృత్తాయాం| మ్రియతాం జీవో మా వా ధావతయే
ధ్రువం హింసా||" అయితే అసాస్త్రీయ క్ర్మలలో అహంభావంలో పడి ఫలితం ఏం ఉంది? ధనం
కాదు నిధనం- లాంటివి. ((??))
అగ్నిపురాణం శిక్షలో ఇట్ల చెప్పారు-
అగ్నిష్టోమాదికర్మాణి
సాపాయాని కలౌ యుగే |
గంగాస్నానం హరేర్నామ
నిరపాయమిదం ద్వయమ్ ||
సంస్కారవ్యయం-
జాతీయ సంస్కారాలు (ద్విజత్వ ఘటక
సంస్కారాలు) అల్పవ్యయకరమైనవి. ((తక్కువ ఖర్చుతో కూడినవి.)) ఒకవేళ అట్ల లేకపోయి
ఉంటే ధనికులు మాత్రమే జాతిమంతులు కాగలిగేవారు. ఇది గృహ్యస్మృతులను చూస్తే స్పష్టంగ
తెలుస్తుంది. పారస్కర గృహ్యస్మృతిల ప్రధాన వ్యాఖ్యాత కర్కాచార్యుడు ఆవసథ్యాధానం
లోని "తతో బ్రాహ్మణభోజనం" అనే అంతిమ సూత్రానికి వ్యాఖ్య చేస్తూ "ఒక
బ్రాహ్మణునికి భోజనం" అని చెప్తాడు. ఆశయమేంటంటే ప్రకృతానికి సమాన సంఖ్య
జ్ఞానం లేనప్పుడు ((???)) ఒక బ్రాహ్మణుడని తీసుకోవాలి. "బ్రాహ్మణాన్
భోజయిత్వా" అని చెప్పిన చోట ముగ్గురిని తీసుకోవాలి. మనుమహర్షి కూడా ఇట్ల
చెప్పాడు-
ద్వౌ దైవే
పితృకార్యే త్రీనేకైకముభయత్ర వా |
భోజయేత్ సుసమృద్ధోపి
న ప్రసజ్జేత విస్తరే ||
ఇది శ్రాద్ధానికి చెప్పిన విషయమే అయినా
ఆతిదేశిక విధి ప్రకారం కర్మాంతరంలో ((ఇతర కర్మలలో)), ప్రామమికమైన ఏ విధి వాక్యమూ
లేని పక్షంలో దీనిని అనురోధం ((చేయమనటం)) అనుచితం కాదేమో. ఒకవేళ గృహ్యస్మృతి
ప్రకారం బ్రాహ్మణసంఖ్య తక్గకువగ ఉంటే ఈ యజ్ఞపార్శ్వ వాక్యాన్ని ఆలంబనం చేయచ్చు-
గర్భాధానాది
సంస్కారే బ్రాహ్మణాన్ భోజయేద్ దశ
శతం వివాహ సంస్కారే
పంచాశత్ మేఖలావిధౌ
ఆవసథ్యే
త్రయస్త్రింశత్ శ్రౌతాధ్యానే శతాత్ పరం
అష్టకం భోజయేద్
భక్త్యా తత్తత్ సంస్కారసిద్ధయే
సహస్రం భోజయేత్ సోమే
బ్రాహ్మణానాం శతం పశౌ
చాతుర్మాస్యే తు
చత్వారి శతాని పంచ సురాగ్రహే
అయుతం వాజపేయే చ
హ్యశ్వమేధే చతుర్గుణం
ఆగ్రయమే
ప్రాయశ్చిత్తే బ్రాహ్మణాన్ దశ పంచ చ ||
2.
ఉపాసనా కాండ-
సర్వోపాస్య పరమేశ్వరుడు నిర్విశేష, సవిశేష
అంటే నిర్గుణ (అవాఙ్మానసగోచర)- సగుణ (వాఙ్మానసగోచర) శ్రుతి స్మృతి ఇతిహాసాదులలో
అనేకవిధాల వర్ణింపబడ్డాడు.
నిర్విశేష పరమేశ్వరుడు (బ్రహ్మ)
అశబ్దమస్పర్శమరూపమవ్యయం,
తథారసం నిత్యమగంధవచ్చ యత్ |
అనాద్యనంతం మహతః పరం
ధ్రువం, నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే || (కఠోపనిషత్)
ఇది యజుర్వేదీయ కఠశాఖీయ శ్రుతి వల్ల
తెలుస్తుంది. సవిశేషపరమేశ్వరుడు (బ్రహ్మ)-
అథ చ
ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే, హిరణ్యస్మశ్రుర్హిరణ్యకేశ అప్రముఖాత్ సర్వ
ఏవ సువర్ణః
తస్య
యథా కప్పాసపుండరీకమేవమక్షిణీ స ఏష సర్వేభ్యః ఉదితః, ఉదేతి హ వై సర్వేభ్యః
పాప్మేభ్యో య ఏవం వేద ఇత్యధిదైవతం ||"
ఇది సామవేదీయ ఛాందోగ్య శ్రుతి వల్ల
తెలుస్తుంది.
విశ్వరూపధారి శ్రీనారాయణుడు నారద మునితో
అన్నాడు-
మాయా హ్యేషా మయా
సృష్టా యన్మాం పశ్యసి నారద |
సర్వభూతగుణైర్యుక్తం
నైవం మాం జ్ఞాతుమర్హసి || (శారీరక భాష్యం)
అంటే- ఓ నారద, నేను ఈ మాయను రచించాను.
దీని వల్ల నువ్వు నా సవిశేషరూపాన్ని చూస్తున్నావు. లేదంటే నువ్వు నన్ను అట్ల
తెలుసుకోలేవు.
అభిప్రాయంతోనే "అంతస్తద్ధమాపదేశాత్
1.1.20" అహే బ్రహ్మసూత్రంలో కల్పతరువులో ఈ వచనం వ్రాశారు-
నిర్విశేషం పరం
బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః |
యే మందాస్తేనుకంపంతే
సవిశేషనిరూపణైః ||
వశీకృతే మనస్యేషాం
సగుణబ్రహ్మశీలనాత్ |
తదేవావిర్భవేత్
సాక్షాతపేతోపాధికల్పనం ||
అంటే నిర్గుణోపాసన చేయటం రానివారు
సగుణోపాసన చేయాలి. చిత్తం నిర్మలమైనప్పుడే అదే నిర్గుణంగ (నిరుపాధి బ్రహ్మ) ప్రకటమవుతుంది.
ఉపాస్యోపబృంహణం-
పూర్వకాండం (శ్రౌత-స్మార్త కర్మ)లో
ప్రధానంగ అగ్ని, ఇంద్రాది దేవతలు వారి భక్తి- అంటే సోకం, సవనం, ఋతు, ఛందం, స్తోమం,
సామం, దేవగణం, కర్మ; భక్తివిశేషాలు- (అవాంతరభేదాలు = ప్రధానభేదాలలో ఉపభేదాలు) వాటి
సంస్తావక దేవతలు 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 1 ఇంద్రుడు, 1 ప్రజాపతి ని
యజనం చేయమని వ్యష్టిగ చెప్పారు. అట్లగే ఈ ఉపాసనకాండలో కూడ ప్రధానంగ విష్ణు, శివ,
శక్తి, గణేశ, సూర్య- ఈ ఐదుగురు దేవతల యజనం చెప్పబడింది. వీరి అవాంతర భేదాలు
అపరిచ్ఛిన్నాలు. ఉదా- చతుర్దశవిద్యాస్థానాలు, లేదా అష్టాదశ విద్యాప్రస్థానాల
సంక్షేపం (బీజం) ప్రణవం (ఓమ్) అయి ఉంది. అంటే వాఙ్మయమంతటికీ బీజం ప్రణవం (అక్షరం).
అట్లగే అందరు దేవతల మూలం ఈశ్వరుడు (అక్షరుడు). అంటే దేవతామాత్రులు ఈశ్వరునికన్నా
అభిన్నులు. (టి. క్లేశకర్మవిపాకాశయైరపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః 1.14 - అవిద్యాది
క్లేశాలు, శుభాశుభకర్మఫలాలు, వాసనల వల్ల నిర్లిప్తుడైనవాడు = అంటబడనివాడు
పురుషవిశేషుడు = పురుషోత్తముడు ఈశ్వరుడు. తస్య వాచకః ప్రణవః 1.27 ఆ ఈశ్వరుని వాచకం
(బోధకం) ప్రణవం. అంటే ఈశ్వరుడు వాచ్యుడు, ప్రణవం వాచకం. ఈ ఉపాసనావిషయాలన్నీ
యోగదర్శనంలో స్పష్టంగ చెప్పబడినవి. ప్రణవం మహిమను మాండూక్యం చెబుతుంది. ప్రణవం
శబ్దపరంగ కూడ ఈశ్వరునికన్నా భిన్నం కాని "అక్షరం". వ్యాససూత్రంలో
"అక్షరమంబరాంతధృతేః" 1.3.10 అని చెప్పారు. దీనివల్ల అర్థావగతి ((అర్థం
కావడం, తెలియటం)) లేకపోయినా మంత్రజపాదుల వల్ల ఈస్వరుడు ప్రసన్నం కావడమనేది
నిర్వివాదాంశం అని తేలుతుంది.. ఉపాస్యుడు ఈశ్వరుడు, ఉపాసకుడు (యోగి) కన్నా
పరమార్థంలో ((నిజానికి)) వేరు కాడు. అందుకే ఉపనిషత్తులో "తత్ త్వమ్ అసి"
అన్నారు.) దేవతల విభూతి విషయంలో ఈ శ్రుతి చెప్పబడింది-
త్రీణి శతా త్రీణి
సహస్రాణ్యగ్నిం, త్రింశచ్చదేవా నవం చాసపర్యన్ || (యజుర్వేదం- 33.7)
త్రయశ్చ త్రీ చ శతా
త్రయశ్చ త్రీ చ సహస్రేతి | వృ.
మళ్ళీ బృహదారణ్యకంలో "మహిమాన
ఏవైషాం.." అనే కథనంతో ఒకే దేవతకు అనేక రూపాలు చెప్పబడినవి. ఈ వైదికదర్శనం
చూసే వ్యాసభగవానుడు "విరోధః కర్మణీతి చేన్నానేకప్రతిపత్తేర్దర్శనాత్
1.3.27" ఈ విగ్రహసూచకమైన సూత్రం చెప్పాడు. పురాణ ఇతిహాసాల్లో విష్ణు, శివ,
శక్తి, మొదలైన భిన్న భిన్న విగ్రహాలు, ఒక్కడే విష్ణువుకు అనేక విగ్రహాలు చెప్పారు.
మహాభారత ప్రారంభంలో పురాణ ఇతిహాసాల ద్వారా వైదికజ్ఞానం పెంచుకోవాలని చెప్పారు.
(టి. మంత్రలింగాల వల్ల తెలిసిన దేవవిగ్రహాదుల సంగ్రాహక శ్లోకం-
విగ్రహో బహిషాం భోగ
ఐశ్వర్య చ ప్రసన్నతా
ఫలగ్రదానమిత్తత్
పంచకం విగ్రహాదికం || శారీరక వ్యాఖ్య)
ఇతిహాసపురాణాభ్యం
వేదం సముపబృంహయేత్
విభేత్యల్పశ్రుతాద్
వేదో మామయం ప్రహరేదితి ||
ఆజ్ఞానసిద్ధులైన దేవతల మహిమను గూర్చి
ఇంక వేరే ఏం చెప్పాలి? మళ్ళీ కర్మసిద్ధులైన యోగుల మహిమ కూడా శ్రుతి స్మృతులలో
విలక్షణంగ చెప్పబడింది-
పృథ్వ్యప్ తేజో
నిలఖే సముత్థే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే
న తస్య రోగో న జరా న
మృత్యుః ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరమ్ || శ్వేతా. 2.12
ఆత్మనో వై శరీరాణి
బహూని భరతర్షభ |
యోగీ కుర్యాద్ బలం
ప్రాప్య తైశ్చ సర్వైర్మహీం చరేత్ ||
ప్రాప్నుయాద్
విషయాన్ కైశ్చిత్ కైశ్చిదుగ్రం తపశ్చరేత్ |
సంక్షిపేచ్చ
పునస్తాని సూర్యో రశ్మిగణానివ || శారీరక భాష్యం.
సమానతంత్ర సాంఖ్యదర్శనంలో కూడా ఇట్ల
వ్రాశారు-
యోగసిద్ధయోప్యౌషధాదిసిద్ధివన్నాపలపనీయః
|| 5.128
ఔషధ మంత్రసిద్ధితో సమానంగ యోగసిద్ధి కూడ
నిరాకరించదగినది కాదు. ఇదే దృష్టాంతం న్యాయదర్శనంలో వేదప్రామాణ్యం (టి.
మంత్రాయుర్వేద-ప్రామాణ్యవచ్చ తత్ ప్రామాణ్యమాప్తప్రామాణ్యాత్ || 2.1.67)
సిద్ధిపచేయటానికి ఇవ్వబడింది. యోగసిద్ధి గురించి పాతంజలయోగదర్శనంలో విభూతిపాదంలో
వ్రాయబడింది. ఇవి తెలుసుకోకపోవటం వల్ల
భారతదేశంలోని క్షుద్రహృదయులు (నిర్భాగ్యులు) పౌరాణిక ఐతిహాసిక విషయాలను
గాలిమాటలని తీసిపారేస్తుంటారు.
దైవకభాషణం-
ప్రణవాది ఇష్టమంత్రాలను యథావిధిగ జపం చేయటం
వల్ల ఇష్టదేవతతో సంభాషణాది వ్యవహారాలు సిద్ధిస్తాయి. ఈ మాట పాతంజలయోగ దర్శనంలో
చెప్పారు-
స్వాధ్యాయాదిష్టదేవతాసంయోగః
|| 2.44
అంతేకాక- భావం తు బాదరాయణోస్త హి ||
1.3.33 అనే బ్రహ్మసూత్రానికి భాష్యంలో భగవత్పాదులు కూడ ఇట్ల అన్నారు-
తథా చ వ్యవసాదయో దేవాదిభిః ప్రత్యక్షం
వ్యవహరంతీతి స్మర్యతే || వస్తు బ్రూయాత్ ఇదానీంతనానామివ పూర్వేషామపి నాస్తి
దేవాదిభిర్వ్యవహర్తుం సామర్థ్యమితి స జగద్వైచిత్ర్యం ప్రతిషేధయేత్. ఇదానీమివ చ
నాన్యదపి సార్వభౌమః క్షత్రియోస్తీతి బ్రూయాత్, తతశ్చ రాజసూయాదిచోదనా ఉపరున్ధ్యాత్
ఇదానీమివ చ కాలాన్తరే ప్యవ్యవస్థితప్రాయాన్ వర్ణాశ్రమధర్మాన్ ప్రతిజానీత, తతశ్చ రాజసూయాదిచోదనా
ఉపరున్ధ్యాత్. ఇదానీమివ చ కాలాంతరేప్యవస్తిప్రాయాన్ వర్ణాశ్రమధర్మాన్ ప్రతిజానీత,
తతశ్చ వ్యవస్థావిధాయి శాస్త్రమనర్థకం స్యాత్. తస్మాద్ ధర్మోత్కర్షవశాత్ చిరంతనా దేవాదిభిః
ప్రత్యక్షం వ్యవజహ్నురితి శ్లిష్యతే. ఇతి.
అవతారం-
చెప్పబడిన ఈ
శ్రుతి-స్మృతి-పురాణ-ఇతిహాసాల వల్ల ఈ దేవతలు జడరూపమైన భౌతికమాత్రులు కారని; యోగుల
వలె ఐశ్వర్యవంతమైన చైతన్యాలని; ఏకకాలంలో నానావిధరూపాలను ధరించే సమర్థులు అని;
జగత్తులోని ఉత్పత్తి-స్థితి-సంహారాలనే కర్మల ప్రకారం బ్రహ్మ-విష్ణు-రుద్రులని;
వాక్-పాణి-పాద-పాయు-ఉపస్థలనే పేర్లతో విభక్తములైన కర్మేంద్రియాలకు
అగ్ని-ఇంద్ర-ఉపేంద్ర-మృత్యు-ప్రజాపతి పేర్లతో విఖ్యాతులైన అధిష్ఠాతలని;
శ్రోత్ర-త్వక్-చక్షు-రసన-ఘ్రాణాలనే పేర్లతో విభక్తులైన ((విభజించుకున్న))
జ్ఞానేంద్రియాలకు దిక్-వాత-అర్క-వరుణ-అశ్వీ అనే పేర్లతో ప్రసిద్ధులైన అధిష్ఠాతలని;
మనస్సు-బుద్ధి-చిత్త-అహంకారాలనే పేర్లతో విభక్తమైన అంతఃకరణానికి
చంద్ర-చతుర్ముఖ-శంకర-అచ్యుత పేర్లతో ప్రసిద్ధ ప్రభువులని; అంతేకాక వారు పిండాండంలో
బ్రహ్మాండం దైవత భావనానుసారంగ నానా నామధారులని; ఈ జగత్తు యొక్క వ్యవస్థి అంతా
(ప్రాకృతిక నియమాలు) ఏకస్వామికంగ ఉన్నట్టే వ్యవస్థితంగ కనబడుతుందని; "ముండే
ముండే మతిర్భిన్నా, తుండే తుండే సరస్వతీ" అనే న్యాయంతో అనేక అధికారులతో
ఏకాధికారం అవ్యవస్థితమవుతుందని కాదు, అట్ల జగత్తులో ఏ వ్యవస్థా అవ్యవస్థితంగ
కనిపించదు; అటువంటప్పుడు అగత్యా ((గతిలేక)) గుణకర్మానుసారియైన నానావిధ నామరూపాలను
ఉపసంహరించి జగత్తుకు ఏకస్వామి "పరమేశ్వరుడు" అని అంగీకరించాలి. ఇటువంటి
దశలో జగత్తు కల్యాణార్థం ణకర్మానుసారి నామరూపధారి అవతారాలను అంగీకరించటంలో బాధ
((నష్టం)) ఏంటి? ఏమీ లేదు. ఒకవేళ వ్యాపకతకు పొసగదు అంటే అది భ్రమమాత్రమే. చూడు- అగ్ని
విద్యుద్దీపంతో ప్రకటితమైతే దాని వ్యాపకతకు వచ్చిన బాధ ఏంటి? ఏమీ లేదు. జగత్తులోని
చాలా కార్యాలు సామాన్యంగ (టి. సామాన్యశబ్దానికి ఇక్కడ "కార్యానుసారంగ
వ్యవస్థితమైన" అనే అర్థం తీసుకోబడింది) చూస్తే సిద్ధించకుండ విశేషంగ చూస్తే
సిద్ధిస్తాయి. ఉదా- సామాన్య అగ్నితో పాకం ((వంట)) చేయటం కుదరదు. సామాన్యమైన వాయువు
అగ్నిని వెలిగించలేదు. సామాన్యమైన జలం పిపాసను శాంతిపచేయలేదు.. మొదలైనవి.
ఎన్నో చోట్ల అవతారాల గురించి వేదంలో
కూడా ప్రస్తావన కనిపిస్తుంది. శతపథబ్రాహ్మణంలో హవిర్యజ్ఞమనే ప్రథమకాండలో
అగ్నిహోత్ర వేదీ ఇతిహాసం ప్రసంగంలో "వామనో హ విష్ణురాస" లాంటి విష్ణువు
వామనుడుగా అయిన (టి. విస్తారభయం వల్ల శ్రుతులు వదిలిపెట్టబడినవి. ఈ వంకతోనే
జిజ్ఞాసువులు వీటిని పరిశీలించగలరు) సంగతి, సంహితలో సౌమిక వేదీ ప్రతిపాదకమైన
పంచమాధ్యాయం లోని పదిహేనవ మంత్రం వల్ల విష్ణువు యొక్క త్రివిక్రమత్వం ఉల్లేఖించబడింది.
శతపథంలో ప్రథమకాండలోనే "మనవే హవై ప్రాతః..." మొదలైన శ్రుతుల వల్ల
మత్స్యావతార కథ కూడా అటువంటివే. అట్లగే త్రిపురాద ఇతిహాసాలు కూడా. బలరామకృష్ణుల
అవతారాలు నిమ్నలిఖిత శ్రుతులవల్ల స్పష్టమవుతుంది.
జజ్ఞాన ఏవ వ్యబాధత
స్పృధః ప్రాపశ్యద్ వీరో అభిపౌంస్యం రణమ్
అవృశ్చిదద్రిమవ
సస్యదః సృజదస్తభ్నాన్నాకం (?) స్వపస్యయా పృథమ్ ||
అతడు (జజ్ఞాన ఏవ) ప్రకటమవుతూనే (స్పృధః)
స్పర్ధ చేస్తున్నట్టివారైన పూతనాది శత్రువులను (వ్యబాధత) బాధించాడు, (అద్రిం) గోవర్ధన
పర్వతాన్ని (అవృశ్చిద్) ధారమం చేశాడు, (సస్యదః) ధాన్యం ఇచ్చే వర్షించే మేఘాలను (అవసృజత్)
విసర్జితం చేశాడు, (స్వపస్యయా) తన మాయతో (పృథమ్) మహాన్ (నాకం) ఇంద్రుని
(అస్తభ్నాన్) స్తంభితం చేశాడు, (వీరః) మహావీరుడై కూడా (అభిపౌంస్యం) పౌరుషసాధ్యమైన
(రణం) భారతయుద్ధాన్ని నిరస్త్రంగ అయేవిధంగ (ప్రాపశ్యద్) చూశాడు.
ద్వే విరూపే చరతః
స్వర్థే, అన్యాన్యా వత్సముపధాపయేతే |
హరిరన్యస్యాం భవతి
స్వధావాఞ్ఛుక్ర అన్యస్యాం దదృశే సువర్చాః ||
(అన్యాన్యా) వేరువేరు (స్వర్థే)
కార్యాలలో తత్పరుడైన (విరూపే) విచిత్రమైన శోభ కలిగిన (ద్వే) ఆ ఇద్దరు బాలకులు
(చరతః) తిరగాడుతున్నారు. (వత్సం) దూడలకు (ఉపధాపయేతే) దగ్గర ఉండి పాలు
తాగిస్తున్నారు. వారిలో (అన్యస్యాం) ఒకరు (స్వధావాన్) అఖండైశ్వర్యవంతుడు (హరిః)
శ్యామవర్ణుడు (భవతి) అయి ఉన్నాడు. (అన్యస్యాం) ఇంకొకరు (సువర్చాః) తేజస్వి
(శుక్రః) గౌరవర్ణుడుగా (దదృశే) కనిపిస్తున్నాడు.
పూర్వాపరం చరతో
మాయయైతౌ, శిశూ క్రీడంతౌ పరియాతో అధ్వరమ్ |
విశ్వాన్యన్యో
భువనాని చష్ట, ఋతూన్యన్యో విదధజ్జాయతే పునః || తైత్తిరీయశ్రుతి.
(ఏతౌ)
ఈ ఇరువురు, రామకృష్ణులు (పూర్వాపరం) ముందూ వెనకా (చరతః) తిరుగుతూ (మాయయా) మాయతో
(శిశూ) బాలరూపంలో (క్రీడంతౌ) ఆటలాడుతూ (అధ్వరమ్) కంసుని ధనుర్యజ్ఞానికి (పరియాతః)
చేరారు. (అన్యః) వీరిలో ఒకరు (విశ్వాని-భువనాని) మొత్తం బ్రహ్మాండాన్ని (విచష్టే)
ఎరిగి ఉన్నవాడు. (అన్యః పునః) ఇంకొకరు రాముడు (ఋతూన్ దధత్) సమయానుసారం (జాయతే)
అవతీర్ణుడైనాడు. అంటే బలరాముడు కృష్ణునితో సమానంగ 'తమద్భుతం బాలకమంబుజేక్షణం-' మొదలైన
అద్భుతరూపంతో అవతారాన్ని గ్రహించలేదు. (?)
నామరూపలింగాలు-
పరమేశ్వరుని
నామలింగరూపాలు ఇక్కడ దిగ్మాత్రంగ చూపబడుతున్నవి. దీనిని తెలుసోకవటం వల్ల
సాకారోపాసన, నిరాకారోపాసన దృఢపడతాయి. ముందే అవతారాలు సిద్ధింపచేయబడినవి. అవి
భాగవతం ప్రకారం ఇవి-
మొదటి అవతారం హిరణ్యగర్భాది (టి.
"హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్| స దాధార పృథివీం
ద్యాముతేమామ్||" అని ఋక్ శ్రుతి. "స వై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే.
ఆదికర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత ||" అని స్మృతి. "జగృహే పౌరుషం
రూపం.." మొదలైన భాగవతం.) పదవాచ్యుడు ((పదం చేత తెలియబడేవాడు)), రెండు
వరాహమూర్తి (రసాతలంలోకి పడిపోయిన భూమిని ఉద్ధరించినవాడు.) మూడు నారదుడు (దేవర్షి
భావాన్ని పొంది సాత్వతతంత్రం అంటే పంచరాత్రం అనే వైష్ణవగ్రంథాన్ని రచించినవాడు.)
నాలుగు నరనారాయణులు (ధర్మపత్ని నుండి ఉత్పన్నుడై దుశ్చరమైన ((కష్టసాధ్యమైన))
తపస్సు చేసినవాడు.) ఐదు కపిలుడు (కాలవశాన లుప్తమైపోయిన సాంఖ్యాన్ని ఆసురి అనే
బ్రాహ్మణునికి ఉపదేశించినవాడు.) ఆరు దత్తాత్రేయుడు (అత్రి వల్ల అనసూయ యందు
జన్మించి ప్రహ్లాదాదులకు) అధ్యాత్మవిద్యను బోధించినవాడు.) ఏడు యజ్ఞుడు (రుచి వల్ల
ఆకూతి యందు జన్మించి తన యామాదులైన పుత్రులతో స్వాయంభుమన్వంతరం పాలించినవాడు.)
ఎనిమిది ఋషభుడు (నాభి వల్ల మేరుదేవియందు జన్మించిన అత్యాశ్రమి (?)) తొమ్మిది పృథు
(పృథివిని దోహనం చేసినవాడు((పాలు పితికినవాడు))) పది మత్స్య (మనువు రక్షకుడు.)
పదకొండు కూర్మ (సముద్రమథనం సమయంలో మందరాద్రిని తన వీపు మీద ధరించినవాడు.) పన్నెండు
ధన్వంతరి (ఆయుర్వేద ప్రకాశకుడు.) పదమూడు మోహిని (స్త్రీరూపంలో అసురులను మోహింపచేసి
సురులకు అమృతం తాగించినది.) పదునాలుగు నృసింహుడు (హిరణ్యకశిపుని సంహరించినవాడు.)
పదిహేను వామనుడు (బలిని నిగ్రహించినవాడు) పదహారు పరశురాముడు (ఇరవై ఒక్కసార్లు
క్షత్రియులను సంహరించినవాడు.) పదిహేడు వ్యాసుడు (పరాశరుని వల్ల సత్యవతి యందు
జన్మించి వేదాలను విభజించినవాడు.) పదునెనిమిది రాముడు (దశరథుని పుత్రుడై జన్మించి
రావణసంహారం చేసినవాడు.) పందొమ్మిది రామ-కృష్ణులు (యదుకులంలో పుట్టి భూభారాన్ని
హరించినవాడు.) ఇరవై బుద్ధుడు (అజన పుత్రుడు, దేవద్వేషుల మోహకుడు) (టి. ఒకచోట
రామ-కృష్ణులను విడివిడి అవతారాలుగా ఇచ్చారు. నరనారాయణులది ఒకే సంఖ్య ఇచ్చారు.
బుద్ధుని తండ్రిపేరు 'జిన' అనే పాఠాంతరం శ్రీధరీయ టీకలో కనిపిస్తుంది.) ఇరవై ఒకటి
కల్కి (విష్ణుయశుని కుమారుడు చౌరప్రాయులైన రాజుల వినాశనం చేసేవాడు.).
దశావతారాల సంగ్రహం ఈ శ్లోకంలో
కనిపిస్తుంది-
మత్స్యకూర్మోథ
వారాహో నరసింహోథ వామనః |
రామో రామశ్చ రామశ్చ
బుద్ధః కల్కీ చ తే దశ ||
ఈ అవతారాలవల్ల ఔపాసనిక నామ-రూప-లింగాలు
స్పష్టంగ బోధపడుతున్నవి. కానీ వైదిక నిఘంటువులో చతుర్భుజాది ఆకారాల పరిచయం
కలిగించగలిగే ఇటువంటి పేర్లు కనిపించవు. విష్ణువు మొదలైన పేర్లు కనిపించినా అది-
పూర్వకాండలో అగ్ని మొదలైన దేవతల వలెనే హవిస్సు భాగం గ్రహించేవాడు మాత్రమే; ఉత్తరకాండలో
నిరాకారుడు; 'అంతస్తద్ధర్మోపదేశాత్' మొదలైన స్థలాలలో ఉపాసనార్థం సాకారమై కూడా ఏ
నియతమైన ((ప్రత్యేకమైన)) ఆకారాన్ని బోధించదు. విష్ణువు మొదలైన పేర్లు ఇతర పేర్లతో
కలిపి చెప్పబడినచోట్ల - ఉదా- "అగ్నావైష్ణవం.." మొదలైనవి కూడా
అర్థాంతరాన్ని ((వేరే అర్థాన్ని)) బోధిస్తాయి. "యథాభిమతధ్యానాద్వా" మొదలైన
దార్శనిక లింగం కూడా నియత ఆకారం వ్యవస్థాపన చేసేది కాదు. ఇటువంటి పరిస్థితిలో
విష్ణువు ఆది పదార్థాల ఉపబృంహకాలైన ((అర్థం తేటపరిచేవి)) ఇతిహాస-పురాణాలే శరణ్యం.
వాటిలో ఏ ఆకారానికి ఏ ఉపబృంహక ప్రకరణం ఉందో దానిని అనుసరించి ఆకార-ప్రతిపాదకమైన
పేరు, సహపఠితమైన ((దానితో కలిపి చెప్పబడిన)) నిరాకార-ప్రతిపాదకమైన పేరు,
వ్యావహారికమైన, పారమార్థికమైన దశల సిద్ధికి పర్యాయరూపాలుగా తెలుసుకోవాలి. అందుకని
అగ్నిపురాణాదుల ఆధారంగ రచింపబడిన నామ-లింగానుశాసనాల (కోశాలు)లో బ్రహ్మాది
దేవతలపేర్లు ఏకత్రీకరించారు. వీనిలో వైదికసిద్ధాతసిద్ధమైన భేదక-అభేదకమైనవి రెండు
పేర్లూ ఉన్నవి. (?) ఈ విషయం మున్ముందు స్పష్టం చేయబడుతుంది.
నామ-రూప-లింగాల ఉపబృంహకాలైన శ్రుతులు-
"అథ యో హ ఖలు వా వాస్య రాజసోంశోసౌ
స యోయం బ్రహ్మా; అథ యో హ ఖలు వా వాస్య తామసోంశోసౌ స యోయం రుద్రః; అథ యో హ ఖలు వా వాస్య సాత్వికోంశోసౌ స
యోయం విష్ణుః" మైత్రేయోపనిషత్.
ఉమాసహాయం పరమేశ్వరం
ప్రభుం, త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం |
ధ్యాత్వా
మునిర్గచ్ఛతి భూతయోనిం, సమస్తసాక్షిం తమసః పరస్తాత్ || కైవల్యోపనిషత్.
(టి.
"త్ర్యంబకం యజామహే.." (య.3.61) మొదలైనవి; "నీలగ్రీవః.."
(య.16.7) మొదలైనవి; యా తే రుద్ర శివా తనూః శివా విశ్వహా భేషజీ | శివా రుద్రస్య
భేషజీ తథా నో మృదు జీవసే || (య. 16.49))
స తస్మిన్నేవాకాశే స్త్రయమాజగామ
బహుశోభమానాముమాం హైమవతీం తాం హోవాచ కిమేతత్ యక్షమితి || సామవేదీయ తవలకారోపనిషత్.
తామగ్నివర్ణాం తపసా
జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం |
దుర్గాం దేవీం
శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః || నారాయణోపనిషత్.
(టి.
అన్యదేవతల ఆకారాల విషయంలో ఈవిధమైన మంత్రలింగాలు ((సంకేతాలు)) నాలుగు వేదాల
మంత్రసంహితలలో, తైత్తిరీయ కనిపించవు. ఒక్కసారి చూడవలసింది.)
మొదలైనవి.
పదార్థం యొక్క ఉత్పత్తి-స్థితి-సంహారమనే
అవస్థా భేదాల ప్రకారం పరమేశ్వరుని బ్రహ్మ-విష్ణురుద్రులనే అవస్థా భేదాలు వేద దృష్టితో
ఉత్పన్నమైనవి. జడచేతనాలుగా విభక్తాలై స్థావర జంగమాత్మక పదార్థాలలోపల వేడి, బయట వెలుగు
ఆవశ్యకం కావడం చేత అగ్నీషోమాత్మక సూర్యుడు ఉత్పన్నుడైనాడు. పదార్థం దాని అవస్థ
సిద్ధి కోసం గణేశుడు ఉత్పన్నమైనాడు. పదార్థాలను యథాయోగ్యం అవస్థానం చేయటానికి
శక్తి ఉత్పన్నమైంది. ఈ బ్రహ్మకార్య ఉత్పత్తిని శక్తిలో అంతర్భూతంగ ఒప్పుకుని
పరమేశ్వరుని విష్ణువు మొదలైన పంచదేవాత్మక ఉపాసన ప్రవృత్తమైంది. దీని విస్తారం
విష్ణుపురాణం, శివపురాణం, మార్కండేయపురాణం, సూర్యపురాణం, గణేశపురాణాలలో వివరంగ
చెప్పబడింది. అంతెందుకు? అన్ని పురాణాలు, ఉపపురాణాలు ఇతిహాసాల ఉపసంహారం (?) ఈ
విష్ణు-శివ-శక్తి-గణేశ-సూర్యుల విభూతులలోనే అయింది. పదార్థ ఉత్పత్తి మొదలైన మూడు
భావవికారాల వల్ల (టి. పదార్థ యొక్క అవస్థ) బ్రహ్మాది ముగ్గురు దేవతలను చెప్పారో,
అట్లగే పదార్థం యొక్క వేడి-వెలుగల కారణంగ అన్య (టి. జాయతేస్తి, విపరిణమతే,
వర్ధతేపక్షీయతే వినశ్యతి- వార్ష్యాయణి) భావవికారాల వల్ల సూర్యుడు, నియమిత
భావవికారాల లాభం కోసం (టి. "వినాయకః కర్మ విఘ్న.." యాజ్ఞ్యవల్క్యుడు) వినాయకుడు
చెప్పబడినాడు. భావవికారం చేతేవేదాంత దర్శనంలో ("జన్మాద్యస్య యతః"
వేదవ్యాసుడు) పరమేశ్వరుని తటస్థ లక్షణం చెప్పారు. శబ్దార్థ రూపమైన జగత్తులో (టి.
నిత్యానందవపుర్నిరంతరగలత్ పఞ్చాశదర్ణైః క్రమాద్, వ్యాసం యేన చరాచరాత్మకమిదం
శబ్దార్థరూపం జగత్ | శబ్దబ్రహ్మ యదూచిరే సుకృతివశ్చైతన్యమంతర్గతం, తద్వోవ్యాదనిశం
శశాంకసదనం వాచామధీరాం మహః || శారదాతిలకకారుడు) ఇది అర్థసృష్టికి వ్యవస్థ. అట్లగే
శబ్దసృష్టికి వ్యవస్థ అని కూడా తెలుసుకోవాలి.
పరమేశ్వరైక్యం-
చిత్తం అత్యంత చంచలమైనది (టి.
"చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం" గీతా- 6.34) కావడం వల్ల
పరమేశ్వరుని నిరాకారోపాసన పూర్వకాలంలో కూడా దుర్ఘటమైనది. వర్తమానకాలంలో అయితే
అత్యంత దుర్ఘటమే కాక అసంభవం కూడా. శివమహిమ లో ఇట్ల చెప్పారు-
అతీతః పంథానం తవ చ
మహిమా వాఙ్మనసయో-
రతద్వ్యావృత్త్యా యం
చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః
కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే
పతతి న మనః కస్య న వచః ||
అందువల్లే మధ్యమాధికారి, మందాధికారుల
(టి. వర్తమానకాలిక ఉపాసకులు ఈ పేర్లతో చాలా విరుచుకుపడతారు. ఎందుకంటే వారికోసం
నిరాకారోపాసన చాలా సులభమైనది. (? మౌసీ కా ఘర్ హై)) చిత్తవిశ్రాంతికోసం
పంచదేవాత్మకమైన సాకారోపాసన వేదదృష్టితో చెప్పబడింది. పైగా ఆ పంచదేవతలకూ
శ్రుతి-స్మృతి-ఇతిహాస-పురాణాల ప్రకారం భేదం లేదు. అభేదమే ఉంది. ఈ విషయమై ముందు
కొన్ని శ్రుతులు ఇవ్వబడినవి.
ఇంద్రం మిత్రం
వరుణమగ్నిమిత్యాహుః, రథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్ |
ఏకం సద్ విప్రా
బహుధా వదంతి, అగ్నిం యమం మాతరిశ్వానమాహుః || (ఋ.సం. 2.3.22)
తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు
చంద్రమాః |
తదేవ శుక్రం తద్
బ్రహ్మ తా ఆపః స ప్రజాపతిః || (య.సం. 32.1)
స బ్రహ్మా స శివః
సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ |
స ఏవ విష్ణుః స
ప్రాణః స కాలోగ్నిః స చంద్రమాః || (కై.ఉ. 1.8 ప్రథమ ఖండం 8 మంత్రం)
(టి.
ఈ మంత్రంకన్నా మేదు "ఉమాసహాయం.." మంత్రం ఉంటుంది.)
అంతేకాక గాయత్రీ మంత్రం ప్రతిపాదించిన
ఒకే బ్రహ్మ సంధ్యా ప్రకరణమలో కాల-స్థాన భేదాలతో బ్రహ్మా-విష్ణు-శివరూపాలతో
ధ్యేయుడు ((ధ్యానించదగినవాడు)).
పూర్వా సంధ్యా తు
గాయత్రీ సావిత్రీ మధ్యమా స్మృతా
యా భవేత్ పశ్చిమా
సంధ్యా సా దేవీ తు సరస్వతీ ||
రక్తా భవతి గాయత్రీ
సావిత్రీ శుక్లవర్ణికా
కృష్ణా సరస్వతీ
జ్ఞేయా సంధ్యా త్రయముదాహృతమ్ ||
నీలోత్పలదలశ్యామం
నాభిదేశే ప్రతిష్ఠితం
చతుర్భుజం మహాత్మానం
పూరకేణైవ చింతయేత్ ||
కుంభకేన హృదిస్థానే
ధ్యాయేచ్చ కమలాసనమ్
బ్రహ్మాణం
రక్తగౌరాంగం చతుర్వక్త్రం పితామహమ్ ||
రేచకేనేశ్వరం
ధ్యాయేల్లలాటస్థం మహేశ్వరమ్
శుద్ధస్ఫటికసంకాశం
నిర్మలం పాపనాశనమ్ || ఆచారాదర్శం
పంచాయతనం-
తరువాత "పంచాయతనం" పూజలో విష్ణు, శివ, శక్తి, గణేశ, సూర్యులు- ఈ ఐదుగురు
బ్రహ్మధారలో ఒక్కొక్కరిని ప్రధానంగ చెప్పి ఇతరిని నలుగురిని గౌణం అని చెప్పారు. ఈ
విధంగ ప్రతీ దేవతా ప్రధానం, గౌణం అని ఉంటారని సిద్ధిస్తుంది. ఈ మాట
పరమార్థదృష్టితో అభేదం అని ఒప్పుకుంటేనే సంగతమవుతుంది. ((పొసగుతుంది)). లేదంటే
మత్తప్రలాపంగ కనిపిస్తుంది. ఈ ఉద్దేశంతోనే వేదవ్యాసుడు విష్ణుపురాణాదులలో (టి. ఆది
శబ్దంతో పురాణాలు, లేక పురాణాలలోని ప్రకరణాలు అని తీసుకోవాలి.) విష్ణువును,
శివపురాణాదులలో శివుని, దేవీభాగవతాదులలో శక్తిని, గణేశపురాణాదులలో గణేశుని,
సూర్యపురాణాదులలో సూర్యుని కారణబ్రహ్మలుగా ఒప్పుకుని వారి ఉత్కర్షను ((గొప్పతనం)),
అన్యులను కార్యబ్రహ్మగా అనుకుని వారి అపకర్షను ((తక్కువదనం)) వర్ణించాడు. లేదంటే
అనేక బ్రహ్మవాదాలు లోకవేదవిరుద్ధంగ అయిపోతాయి. ఈ మాట విద్వద్వరుడు ((విద్వాంసులలో
శ్రేష్ఠుడు)) నీలకంఠుడు మహాభారతం టీకలో ముఖబంధంలో చెప్పాడు. పంచాయతన పూజాక్రమమిది-
శంభౌ మధ్యగతే
హరీనహరభూదవ్యో, హరౌ శంకరే
భాస్యేనాగసుతా, రవౌ
హరగణేశజాంబికాః స్థాపితాః |
దేవ్యాం
విష్ణుహరేభవక్ర(?) రవయో, లంబోదరేజేశ్వరేనాంబాః
శంకరభాగతోతి సుఖదా వ్యస్తాస్తు
హానిప్రదాః || (నిర్ణయ సింధు)
వేద, పురాణ, ఇతిహాస, తంత్రాలలో
పరమేశ్వరుని పంచదేవ సంబంధమై కనిపిస్తున్న పేర్లలో నుంచి నిరాకారుని స్పష్ట లింగక
పేరు (అభేదక) తీసుకోవటం వల్ల అభేద, సాకారుల పేర్లు (భేదక) తీసుకోవటం వల్ల భేదం
సిద్ధిస్తుంది. పేరు రెండు రకాలు- ఒకటి ఓం మొదలైనవి, రెండు విష్ణు ఆదులు. వీనిలో
మొదటిదాన్ని మంత్రం అంటారు. రెండవది నామ-మంత్రమంటారు. మంత్రం - కేవల వైదికం, కేవల
తాత్రికం, వైదిక-తాంత్రికమని మూడు విధాలు. నామమంత్రాలు కూడా మూడు విధాలు. కానీ
వాటి పూర్వోక్త భేదాలలోనే ఉపసంహారం (?) ఉంది. కేవలం వైదిక మంత్రాలు
"సహస్రశీర్షా.." ఆదులు కేవలం తాంత్రికమంత్రాలు శ్రీకృష్ణః శరణం మమ"
మొదలైనవి. ఉభయాత్మకాలు "ఓం నమో నారాయణాయ" మొదలైనవి. ఇప్పుడు ముందు
తాంత్రిక మంత్రాల గురించి కొంత విచారించి తర్వాత పేరు ద్వారా పంచదేవతల అభేదం
చూపబడుతుంది.
తంత్రం-
తాంత్రిక మంత్రాల అనగానే "తంత్రం" అంటే ఏంటి అదేం పదార్థం అని
తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. తంత్రశబ్దానికి అర్థం దర్శనం అని ఉన్నా ఇక్కడ
తంత్రం వల్ల విష్ణు-శివ ప్రోక్తమైన గ్రంథాలు వివక్షితమవుతున్నవి. యథా- కర్మకు
ఉపబృంహకాలు కల్పసూత్రలు, మన్వాది స్మృతులు; ఉపాసనకు ఉపబృంహకాలు శాండిల్యవిద్య,
పారమహంస సంహిత; జ్ఞానానికి ఉపబృంహకాలు ఉపనిషత్తు, యగవాసిష్ఠాలు;
కర్మ-ఉపాసన-జ్ఞానానికి పబృంహకాలు పురాణ-ఉపపురాణ-ఇతిహాసాలు; అట్లగే ప్రధానంగ ఉపాసన,
జ్ఞానానికి ఉపబృంహకాలు తంత్రాలు. పై గ్రంథాలలో నిరాకారమైన, లేదా సాకారమైన
బ్రహ్మాభావానుసారం జ్ఞాననిష్ఠ, కర్మనిష్ఠ ప్రయత్నపూర్వకంగ నిరూపింపబడినవో అట్లగే ఈ
తంత్రాలలో జ్ఞాన-కర్మనిష్ఠల ఆధిక్యం ఉంటుంది. పై గ్రంథాలలో ఉత్తమ, మధ్యమ, మంద
అధికారుల ప్రకారం జ్ఞానం, కర్మ, వాటి అవాంతరభేదాల వినియోగం చెప్పారో అట్లగే
తంత్రాలలో కూడ. వైదిక సంపత్తి శాఖాభేదాదులతో అపరిచ్ఛిన్నమో అట్లగే తాంత్రిక
సంపత్తి కూడా.
అందువల్లే ఈ మాట చెప్పబడింది-
సాంఖ్యం యోగం
పంచరాత్రం వేదాః పాశుపతం తథా |
అతి
ప్రమాణాన్యేతాని హేతుభిర్న విరోధయేత్ || యాజ్ఞ్యవల్క్య మహర్షి.
(టి.
శ్రీరామానుజాచార్యకృత శ్రీభాష్యంలో ఉత్తరార్ధం ఈ విధంగ ఉంది- ఆత్మప్రమాణాన్యేతాని
న హంతవ్యాని హేతుభిః ||)
సాంఖ్యం యోగం
పంచరాత్రం వేదాః పాశుపతం తథా |
కృతాంత (సిద్ధాంత)
పంచకం విద్ధి బ్రహ్మణః పరిమార్గణే || (విష్ణుధర్మోత్తరం)
సాంఖ్యస్య వక్తా
కపిలః పరమర్షిః స ఉచ్యతే
హిరణ్యగర్భో యోగస్య
వక్తా నాన్యః పురాతనః ||
అపాంతరతమాశ్చైవ
వేదాచార్యః స ఉచ్యతే
ప్రాచీనగర్భం తమృషిం
ప్రవదంతీహ కేచన ||
ఉమాపతిర్భూతపతిః
శ్రీకంఠో బ్రహ్మణః సుతః
ఉక్తవానిదమవ్యగ్రో
జ్ఞానం పాశుపతం శివః ||
పంచరాత్రస్య
కృత్స్నస్య వక్తా తు భగవాన్ స్వయమ్ || (మహాభారతం)
పంచరాత్రాది
తంత్రాల గణనం- పంచరాత్రం (నారద పంచరాత్రం)
పాశుపతజ్ఞానం అంటే శివసూత్రం, పరశురామసూత్రం, చతుఃషష్టితంత్రం, దక్షిణామూర్తి
సంహిత, సనత్కుమార సంహిత, పరమానంద కులార్ణవం మొదలైనవి. చతుఃషష్టి తంత్రాల ప్రకారం
విభాగం ఇది-
1. మహామాయ, 2. శంబర,
...................(పే.74)
ఏవమేతాని శాస్త్రాణి
తథాన్యాన్యపి కోటిశః
భవతోక్తాని మే దేవ
సర్వజ్ఞానమయాని చ ||
ఇవి ఉపసంహార వాక్యాలు-
తంత్రాలలో శివ-శక్తి సంవాదాలలో వ్రాయబడిందాని
అభిప్రాయం ఏంటంటే పరమశివుడు ప్రకాశం, విమర్శ అనే రెండు రూపాలను ధరించి
విమర్శాంశంతో స్వాత్మను అడిగాడు, ప్రకాశాంశంతో స్వాత్మకు జవాబు చెప్పాడు. ఈ మాట ఈ
ప్రమాణాలవల్ల తెలుస్తుంది-
గురుశిష్యపదే
స్థిత్వా స్వయమేవ సదాశివః
ప్రశ్నోత్తరపరైర్వాక్యైస్తంత్రం
సమవతారయత్ || (స్వచ్ఛందతంత్రం)
స జయతి మహాప్రకాశో
యస్మిన్ దృష్టే న దృశ్యతే కిమపి
కథమివ తస్మిన్
దృష్టే సర్వం విజ్ఞాతముచ్యతే వేదే ||
నైసర్గికీ స్ఫురత్తా
విమర్శరూపాస్య వర్తతే శక్తిః
తద్యోగాదేవ శివో
జగదుత్పాదయతి సంహరతి || (వరివస్యా రహస్యం)
మొదలైన
ప్రమాణాల వల్ల తంత్రశాస్త్రం ప్రమాణభూతమైనదని స్పష్టమవుతుంది. అట్ల కాక
అపరార్కాదులైన కొందరు ధర్మశాస్త్రులు తంత్రం ప్రామాణ్యాన్ని శంకిస్తారో వారు
"అతిప్రమాణాన్యేతాని.." మొదలైన పూర్వోక్తవాక్యాలతో సమాధేయులు
((సమాధానపడదగినవారు)).
తంత్రాలలోని కొన్ని అంశాలలో ఉన్న
భావజన్యదోషాలు సమస్తరూపంలో కానీ వ్యస్తరూపంలో కానీ వేదంలో కూడా ఉపలబ్ధమవుతాయి.
అందువల్ల రెండింటిది ఒకే గతి. మహాభారతం అనుక్రమణికాధ్యాయంలో ఇట్ల వ్రాసి ఉంది-
తపో న కల్కోధ్యయనం న
కల్కః, స్వాభావికో వేదవిధిర్న కల్కః |
ప్రసహ్య చిత్తాహరణం
న కల్కస్తాన్యేవ భావోపహతాని కల్కః ||
(టి.
"తతస్తు సప్తనే.." మను. 11.15)
తంత్రాలలో ప్రత్యక్షంగ శ్రుతవిరుద్ధమైన
అంశాలు విరోధాధికరణ న్యాయంతో మూలశ్రుతి లభించనంతవరకు ఆచరణయోగ్యాలు కావు. మరి
కొన్ని-
వామం పాశుపతం సోమం
లాంగలం చైవ భైరవం
న సేవ్యమేతత్కథితం
వేదబాహ్యం తథేతరత్ ||
కాపాలం పాంచరాత్రం చ
యామలం వామమార్హతం
ఏవం విధాని చాన్యాని
మోహనార్థాని తాని తు ||
మొదలైన పాశుపత విశేషం, పాంచరాత్ర విశేషం
(టి. పాశుపత పాంచరాత్రాలకు ద్వైవిధ్యం వల్ల 'విశేషం' పదం చేర్టబడింది.) ఇంకా
మిగిలిన ఇతరేతరాలు పూర్తిగ వేదవిరుద్ధమైనవి మహాపాతక-దూషిత-వేదభ్రష్టాలని
అన్యాన్యజాతులకోసమని చెప్పబడినవనే మాట ఈ వాక్యాల వల్ల స్పష్టమవుతుంది (టి. వీటిలో
కొన్ని వాక్యాలు విద్వద్వరులు శ్రీకనక ఛేదరామ్ వ్రాసిన సనాతనధర్మోత్తరం నుండి
తీసుకొనబడినవి.)-
పాంచరాత్రం భాగవతం
తథా వైఖానసాభిధం
వేదభ్రష్టాన్
సముద్ధిశ్య కమలాపతిరుక్తవాన్
శ్రుతిభ్రష్టః
శ్రుతిప్రోక్తప్రాయశ్చిత్తే భయం గతః
క్రమేణ
శ్రుతిసిద్ధ్యర్థం మనుష్యస్తంత్రమాశ్రయేత్ || సాంబపురాణం
అథాంశుః సాత్వతో నామ
విష్ణుభక్తః ప్రతాపవాన్
మహాత్మా దాననిరతో
ధనుర్వేదవిదాం వరః
స నారదస్య వచనాద్ వాసుదేవార్చనే
రతః
శాస్త్రం
ప్రవర్తయామాస కుండగోళాదిభిః శ్రితం
తస్య నామ్నా తు
విఖ్యాతం సాత్వతం నామ శోభనం
ప్రవర్తతే
మహాశాస్త్రం కుండాదీనాం హితావహం || కూర్మపురాణం
(టి. అమృతే జారజః కుండకో మృతే భర్తరి
గోలకః)
తేనోక్తం సాత్వతం
తంత్రం యజ్జ్ఞాత్వా ముక్తిభాగ్ భవేత్
యత్ర స్త్రీశూద్రదాసానాం
సంస్కారో వైష్ణవః స్మృతః || శ్రీమద్భాగవతం
మొదలైన దుర్వ్యవస్థల వల్లే వేదాంతదర్శనం
లోని సూత్రభాష్యంలో (టి. పత్యురసామంజస్యాత్ | ఉత్పత్త్యసంభవాత్ మొదలైన సూత్రాల
శారీరకభాష్యంలో) పాంచరాత్రిక భాగవతప్రక్రియ, పాశుపత ప్రక్రియలు ఖండించబడినవి.
పారమార్థికమైన వైష్ణవ, శైవ ప్రక్రియలను కాదు. (టి. పారమార్థిక వైష్ణవ ప్రక్రియ
నృసింహతాపిని, గోపాలతాపిని, రామతాపిని (ఉపనిషత్) మొదలైన గ్రంథాలలో స్పష్టంగ ఉంది.)
ప్రస్తుతానికి వస్తే పేరు ద్వారా
పంచదేవతల అభేదం ఈ విధంగ ఉంది-
విష్ణువుకు- కృష్ణుడు-
(శ్యామ-నల్లనివాడు) కేశవ (చక్కని రింగుల జుట్టువాడు) పీతాంబర (మెరిసే వస్త్రాలు
ధరించేవాడు) మొదలైనవి; శివుడికి- చంద్రశేఖర, త్ర్యంబక, భూతేశ మదలైనవి; శక్తికి
సరస్వతి, లక్ష్మి, గౌరి మొదలైనవి; గణేశునికి హేరంబుడు, లంబోదరుడు మొదలైనవి;
సూర్యునికి వికర్తన, విరోచనాది నామాలు; ఆకారోపాధికులైనందువల్ల (ఆకారం = రూపం
ఉపాధిగా కలవారు) కృష్ణుడు మొదలైన ఐదు ఆకారాలను (విశేష్యాలను) బోధిస్తాయి. ఒకవేళ
విష్ణువు (వేవేష్టి), శివుడు (శివయతి), శక్తి (శక్నోతి), గణేశ (గణానామీశః),
సూర్యుడు (సువతి)- వీరిని ఏకత్వ వివక్షలో ((ఒక్కరేనని చెప్పదలచటం)) తీసుకుంటే ఆకారోపాధిక
(నియతరూపాన్ని తెలిపేవారు) కానందువల్ల పరస్ప-విశేషణ-విశేష్య-భావాన్ని పొంది ఒకే
వ్యక్తిని (పరమేశ్వరుడు) తెలుపుతారు. ఇదే రహస్య పంచాయతన ముఖ్య గుణ-భావ-కల్పనలో
కూడా ఉంది. అంతెందుకు, పౌరాణిక తాంత్రిక సహస్రనామ స్తోత్రాలు ఈ రెండురకాల పేర్లు
(భేదక-అభేదక) ఉన్నవి. ఈ విష్ణువు మొదలైన పేర్లతోనే వైష్ణవులు మొదలైన ఉపాసకులకు ఆ
పేరు వచ్చింది. ఇంక ఏదైతే-
ఛందాంసి యజ్ఞాః
క్రతవో వ్రతాని, భూతం భవ్యం యచ్చ వేదాః భవంతి |
అస్మాన్ మాయీ సృజతే
విశ్వమేతత్ తస్మింశ్చాన్యో మాయయా సంనిరుద్ధః ||
మాయాం తు ప్రకృతిం
విద్యాన్ మాయినం తు మహేశ్వరం
తస్యావయవభూతైస్తు
వ్యాప్తం సర్వమిదం జగత్ || (శ్వే.ఉ. 4-5, 10)
మొదలైన
ఉపనిషత్తువాక్యాల ప్రకారం మాయా (శక్తి), మాయావాన్ (శక్తిమాన్ పరమేశ్వరుడు) వీరు
ధర్మ-ధర్మి భేదాలతో రెండు పదార్థాలు కల్పింపబడినారు. వీరిని లక్ష్మీ-విష్ణు
శబ్దాలతో అయినా శివ-శక్తి శబ్దాలతో పిలవవచ్చు. కానీ అర్థప్రకారం ఇరువురూ ఒఖటేననే
అభిప్రాయం లో ఇట్ల చెప్పారు-
నిత్యం నిర్దోషగంధం
నిరతిశయసుఖం బ్రహ్మ చైతన్యమేకం
ధర్మో ధర్మీతి
భేదద్వయమితి పృథగ్భూయ మాయావశేన
ధర్మస్తత్రానుభూతిః
సకలవిషయిణీ సర్వకార్యానుకూలా
శక్తిశ్చేచ్ఛాదిరూపా
భవతి గుణగణశ్చాశ్రయస్త్వేక ఏవ
కర్తృత్వం తత్ర
ధర్మీ కలయతి జగతాం పంచసృష్ట్యాది కృత్యే
ధర్మః పుంరూపమద్ధా
సకలజగదుపాదానభావం విభర్తి
స్త్రీరూపం ప్రాప్య
దివ్యా భవతి చ మహిషీ స్వాశ్రయస్యాదికర్తుః
ప్రోక్తౌ
ధర్మమభేదాదితినిగమవిదాం ధర్మివద్ బ్రహ్మకోటీ || అప్పయ్యదీక్షితుడు
అంటే ఒక్క సచ్చిదానంద రూప నిర్వికార
బ్రహ్మ ఉంది. అది మాయ వల్ల ధర్మ-ధర్మి భావాన్ని పొందుతుంది. తన ఇచ్ఛ, జ్ఞాన,
క్రియా శక్తులే ధర్మాలు. ఈ గుణాలన్నింటి ఆధారం ఆ ఒక్క ధర్మియే. ధర్మి జగత్తు లోని
స్థూల సూక్ష్మ కార్యాలనే చేస్తుంది. ధర్మం దానికి ఉపాదాన కారణం అవుతుంది. ధర్మమే
స్త్రీరూపం పొంది తన ఆశ్రయమైన ఆదికర్త పురుషుని పొందుతుంది. ఈ విధంగ ఉంటుంది
వైదికదృష్టితో దివ్య దంపతుల స్థితి. అది కాక-
ద్విధా కృత్వాత్మనో
దేహమర్ధేన పురుషోభవత్ |
అర్ధేన నారీ తస్యాం
స విరాజమృజత్ ప్రభుః || (మనుస్మృతి)
పీఠాయతనం-
ఉపాస్యుని ((ఉపాసింపబడేవారి)) పూజనం కోసం నానావిధ పీఠాయతనాలు చెప్పబడినవి. యథా-
జలం, అగ్ని, హృదయం, సూర్యుడు, స్థండిల (వేదీ) ప్రతిమ (మృత్తిక, ((మట్టి)) కాష్ఠం,
((కర్ర)) పాషాణాది ((రాయి)) ధాతువులతో నిర్మితమైనది, లేదా స్వయంభువు), యంత్రాలు
మొదలైనవి.
అప్స్వగ్నౌ హృదయే
సూర్యే స్థండిలే ప్రతిమాసు చ |
షట్స్వేతేషు హరేః సమ్యగర్ఛనం
మునిభిః స్మృతమ్ || (అగ్ని పురాణం)
(టి.
శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ | మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా
|| భాగవతం)
"స హోవాచ ప్రజాపతిః, షడరం వా ఏతత్ సుదర్శనం
మహాచక్రం.." మొదలైనవి. -నృసింహతాపినీ
"తే హోచురుపాసనమేతస్య పరమాత్మనో గోవిందస్యాఖిలాధారిణో
బ్రూహీతి. తానువాచ యత్తస్య పీఠం హైరణ్యాష్టపలాశమంబుజం, తదంతరాలేనలాస్త్రయుగం,
తదంతరాద్యార్ణాఖిలబీజం కృష్ణాయ నమ.." మొదలైనవి. -గోపాలతాపినీ.
"ఏవం త్రికోణరూపం స్యాత్.." మొదలైనవి. -రామతాపినీ.
ఇక్కడ జలం అంటే సామాన్య జలాలు, గంగా,
యమునా మొదలైన విశేషజలాలు; అగ్ని అంటే గృహాగ్ని, శ్రౌతాగ్ని, తాంత్రికాగ్ని; హృదయం
అంటే శ్రుతిప్రసిద్ధమైన హృదయం, తంత్రప్రసిద్ధ అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారాలు;
సూర్యుడు అంటే భౌతిక సూర్యమండలం, చంద్రమండలం; స్థండిల అంటే అనేకవిధాలైన మనహరమైన
పవిత్రమైన పీటలు; ప్రతిమ అంటే పరమేశ్వరుని పరిచాయకాలైన నానావిధ చల, స్థిర, ఆర్ష
ఆకారవిశేషాలు ((విగ్రహాలు)); యంత్రం అంటే విహితమైన ద్రవ్యంతో విహితమైన ఆధారం మీద
లిఖితమైన ఆర్ష బిందు-త్రికోణాది సంనివేశ విశేషాలు గ్రహింపబడతాయి.
పీఠాయతనం విషయంలో కొన్ని శ్రుతులు ఇట్ల
ఉన్నవి-
సితాసితే సరితే యత్ర
సంగతే, తత్రాప్లుతాసో దివముత్పతంతి |
యే వై తన్వం
విసృజంతి ధీరాస్తే జనాసో అమృతత్వం భజంతే ||
దీనివల్ల గంగాయమునా వాని సంగమం,
సంగమస్థానాల ఫలం స్పష్టంగ తెలుస్తుంది. ఇఅందువల్ల 'తీర్యతే అనేనేతి తీర్థం =
సంసారసాగరం ఆవలకు దాటే ఉపాయం' అని తీర్థశబ్దానికి అర్థం. దీనివల్ల లక్ష్యానుసారం
తీర్థరాజం ప్రయాగ అని సిద్ధిస్తుంది.
"తదేవాగ్నిస్తదాదిత్యః.."
ఈ ముందుచెప్పిన శ్రుతి వల్ల అగ్ని ఆది ప్రసిద్ధములు.
"అంగుష్ఠమాత్రః
పురుషోంతరాత్మా, సదా జనానాం హృదయే సంనివిష్టః ||"
"శతం చైకా
హృదయస్య నాడ్యస్తాసాం మూర్ధానమభినిఃసృతైకా |
తయోర్ధ్వమాపన్నమృతత్వమేతి
విశ్వగే (?)తా ఉత్క్రమణే భవంతి ||
దీనివల్ల హృదయాది స్థానాలు బోధపడతాయి.
అయినప్పటికీ కొందరు సాహసికులు వేదంలో మూర్తిపూజనం లేదంటారు. అందువల్లే -
"న తస్య
ప్రతిమా అస్తి, యస్య నామ మహద్యశః"
అనే శ్రుతిలో ప్రతిమ నిషేధింపబడింది.
వారు తెలుసుకోవలసింది ఏంటంటే ఇక్కడ ప్రతిమ శబ్దానికి మూర్తి అని కాదు, ఉపమానం అని
అర్థమని.
ఉక్తమంత్రానికి ఇది అర్థం- ఎవరి పేరు,
కీర్తి అంతటా వ్యాపించి ఉందో వారికి ఉపమానం ఏం లేదు. అంటే పరమేశ్వరుడు నిరుపముడు (టి.
"న తన్ముఖస్య ప్రతిమా చరాచరే"- శ్రీహర్షుడు) అని అర్థం. పరమేశ్వరుని
రూపాలకు ఈ శ్రుతి కూడా ప్రమాణం-
"ద్వే వా
బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ."
మూర్తిశబ్దం అర్థం స్త్రీ పుంసాకారాలే
కాదు. ఏదో ఒక ఆకారం ((రూపం)) అని అర్థం. ఈ ఉద్దేశంతోనే రుద్రాధ్యాయం మొదలైనవాటి
ద్వారా పరమేశ్వరుని పురుషాకారం సిద్ధించినప్పటికీ ఆయన 'అష్టమూర్తి' (టి. "యా
సృష్టిః స్రష్టురాద్యా.." కాళిదాసు; "సాష్టమూర్తేశ్చ మూర్తిః.."
భాస్కరాచార్యుడు.) మొదలైన పేర్లు ప్రసిద్ధమైనవి. విశేషంగ స్త్రీపుంసాకారం కథనం
ఆశయం ఏంటంటే శాస్త్రం ప్రవృత్తి మనుషులకోసం చెప్పబడింది. అందువల్లే
"హృద్యపేక్షయా తు మనుష్యాధికారత్వాత్.." వే. 1.3.25 మొదలైన మహర్షుల
వచనాలు ప్రవృత్తమైనవి. పరమేశ్వరుడు నిరాకారుడు, సాకారుడు రెండగా ఉన్నాడు. కేవలం
సాకారుడనే అభిప్రాయంతోనే కాదు, మూర్తిపూజనం నిరాకారుని అభిప్రాయంతో కూడా
ప్రవృత్తమైనది. అందువల్ల
"రూపోపన్యాసాచ్చ.." వే. 1.2.23. మొదలైన కల్పన చేయబడింది. ఒకవేళ
సాకారానికి ప్రతిబింబం అయినందువల్ల ఒకవేళ మూర్తిపూజను ఒప్పుకున్నా నిరాకారునికి
ప్రతిబింబం లేనందువల్ల మూర్తిపూజ ఎట్ల సంగతమవుతుంది? ఇదంతా కుతర్కం మాత్రమే. ఆకాశం
నిరాకారమైనదే అయినా ప్రతిబింబాకాశం వ్యవహారంలో ఉంది. అట్లగే శబ్దానికి ప్రతిబింబం
ప్రతిశబ్దమనబడుతుంది. అందువల్ల ఈ ఆకారాన్ని ఒప్పుకోవటానికి ఏ ఆపత్తి లేదు.
యథాసంభవం పూర్వోక్త ఆయతనం పీఠం మీద షోడశోపచారాలు,
(టి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఉపనీతం, చందనం,
పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నమస్కారం, ప్రదక్షిణ, విసర్జనం. ఈ ఉపచారాలు
పురుషసూక్తం లేదా అన్యమంత్రాలతో చేస్తారు.) లేదా పంచోపచారాలు, లేదా మానసోపచారాలతో
పూర్వాహ్ణంలో (టి. పూర్వాహ్ణే ఏవ కుర్వాత దేవతానాం చ పూజనం- మను.) పంచాయతనం పూజ
లేదా ఇష్టదేవత పూజ చేయబడుతుంది. ఈ పూజను ఆహితాగ్నులైనవారు సంధ్యోపాసనం, నిత్య హవనం
తర్వాత, అనాహితాగ్నులైనవారు సంధ్యోపాసనం తర్వాత, ద్విజభిన్నులైన పవిత్రజాతులవారు
స్నానం తర్వాత చేయాలి. స్థాపిత ప్రతిమ, శాలగ్రామం, బాణలింగంలోకి ఆవాహనం, విసర్జనం
((దేవుణ్ణి ఆహ్వానించి, పూజించి తిరిగి పంపేయటం)) చేయకూడదు. శాలిగ్రామం, బాణలింగం
పూజలో ద్విజభిన్నులకు అధికారం లేదు. విష్ణుపూజకు ఊర్ధ్వపుండ్రం, శివాదుల పూజకు
త్రిపుండ్రం చేయాలని చెప్పబడింది. ఊర్ధ్వపుండ్రం, త్రిపుండ్రం పూజాకాలంలో జలం,
భస్మం లేదా గాంగ ఆది పవిత్ర మృత్తిక ((మట్టి)) తోనే చేయాలి. పూజ తర్వాత దేవశేష
చందనంతో వాటి అలంకరణ ఉంటుంది. పంచదేవులలో సూర్యుడికి బిల్వపత్రం, గణేశునికి తులసీపత్రం
వేయటం నిషిద్ధం' కానీ శివునికి బిల్వం, విష్ణువుకు తులసి అతిప్రియాలు.
రుద్రాక్షమాలతో అందరు దేవతల మంత్రాలను జపించవచ్చు. కానీ విష్ణువుకు తులసిమాల,
శివునికి రుద్రాక్షమాల అతిప్రియాలు. శాలిగ్రామం, బాణలింగం మొదలైన కొన్ని మూర్తులు
కాక మిగితావాటి నైవేద్యం గ్రహించటం నిషిద్ధం.
దేవతల విశేష తీర్థాలు ఇవి- అయోధ్య, మథు(ధు)రా,
ద్వారకా, కాంచిలో సగభాగం, - ఈ మూడున్నర నగరాలు విష్ణువుకు చెందినవి. కాశీ,
ఉజ్జయినీ, మాయా, కాంచిలో సగభాగం - ఈ మూడున్నర నగరాలు శివునకు చెందినవి. ఈ విధంగ
విష్ణువు, శివుల ప్రధాన ఏడు నగరాలు శాస్త్రలోకంలో ప్రసిద్ధాలు. తర్వాత విష్ణువు
విశాలనగరం, శివుని సేతుబంధం. కామాక్షా, ఉడ్యాణ (జగన్నాథ పురీ పేరుతో ప్రఖ్యాతం),
జలంధర పుణ్యగిరి ఈ నాలుగు స్థానాలు శక్తిపీఠాలు అనబడతాయి.
భక్తి-
భక్తి, జ్ఞానం యొక్క అవస్థా విశేషం. (టి. పరమేశ్వరుని విషయంలో ఉన్న ఇష్టసాధనతా
జ్ఞానమే భక్తిని ఉత్పన్నం చేస్తుంది. జ్ఞానంలో అంతఃకరణం, భక్తిలో వాఙ్యకరణం
ప్రధానాలు.) నిరాకారోపాసనలో జ్ఞానం ప్రధానం, ఈవిధంగ సాకారోపాసనలో భక్తి ప్రధానం.
దీని ఆరు ప్రకారాలు- మానసీ, వాచికీ, లౌకికీ, వైదికీ, ఆధ్యాత్మికీ. వీటి లక్షణాలు
పద్మపురాణీయ అంబరీష నారద సంవాదంలో ఈ విధంగ చెప్పబడినవి-
అథ భక్తిం
ప్రవక్ష్యామి వివిధాం పాపనాశినీం
వివిధా
భక్తిరుద్దిష్టా మనోవాక్కాయసంభవా
లౌకికీ వైదికీ వాపి
భవేదాధ్యాత్మికీ తథా
ధ్యానధారణయా
బుద్ధ్యా దేవానాం స్మరణం చ యత్
విష్ణుప్రీతికరీ
చైషా మానసీ భక్తిరుచ్యతే
మంత్రవేదనమస్కారైరధిసంఘ్యం
విచింతనైః
జాప్యైశ్చారణ్యకైశ్చైవ
వాచికీ భక్తిరుచ్యతే
వ్రతోపవాసినియమైస్తథేంద్రియనిరోధనైః
కాయికీ సా తు
నిర్దిష్టా భక్తిః సర్వార్థసాధికా
భూషణైర్హేమరత్నాంకైశ్చిత్రాభిర్వాగ్మిరేవ
వా
వాసః ప్రభృతిభిః
సూత్రైః పవనైర్వ్యజనోత్థితైః
నృత్యవాదిత్రగీతైశ్చ
సర్వవల్గ్యుపహారకైః
(టి.
నృత్యం చోదరార్థం నివిద్ధం- ఇతి శ్రీధరస్వామి)
భక్ష్యభోజ్యాన్నపానైశ్చ
యా పూజా క్రియతే నరైః
నారాయణం సముద్దిశ్య
భక్తిః సా లౌకికీ గతా
ఋగ్యజుఃసామజాప్యాని
సంహితాధ్యయనాని చ
క్రియంతే
విష్ణుముద్దిశ్య సా భక్తిర్వైదికీ మతా
దృష్టిర్వృత్తిః
సోమపానం యాజ్ఞికం కర్మ సర్వశః
అగ్నిభూమ్యనిలాకాశజలశంకరభాస్కరం
యముద్దిశ్య కృతం
కర్మ తత్సర్వం విష్ణుదైవతం
ఆధ్యాత్మికీయం
వివిధా బ్రహ్మభక్తిః స్థితా నృప ||
భక్తిలో మానసికాది మొదటి మూడింటిలో
తర్వాతి మూడు అంతర్భతమైనవి. ఎందుకంటే మానసిక, వాచిక, కాయిక వ్యాపారాలకు
((వ్యవహారాలకు)) వేరుగా ఇంకొక వ్యాపారం లేనేలేదు. అందువల్లే ఈ వ్యాపారాలు
దుష్టమైనప్పుడు- "శరీరజైః కర్మదోషైర్యాతి స్థావరతాం నరః | వాచికైః
పక్షిమృగతాం మానసైరంత్యజాతితాం ||" అని మనుమహర్షి ఈ మూడు దుర్విపాకాలను
చెప్పాడు. మానసీ మొదలైన మూడు భక్తిలలో కర్మ, ఉపాసనను ప్రతిపాదించే అన్ని
శాస్త్రాలు పూర్తైనవి. ఈ మాటే ఈ భక్తి లక్షణంతో తెలుస్తుంది. లౌకికీ భక్తిలక్షణంలో
వచ్చిన నృత్య, గీత, వాదిత్ర (?) ప్రసంగాల ఆశయం ఏంటంటే సత్త్వగుణోద్రేకంలో భక్తుడు (టి.
భక్తుడు నాలుగు రకాలు- ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని) తానే నృత్యాదులను
చేసి తన ఉపాస్యుని ప్రసన్నతను పొందాలి. ఈ విషయం ఉపబృంహణమే ((వివరణం))
యాజ్ఞ్యవల్క్యుడు ఈవిధంగ చెప్పాడు-
యథా విధానేన పఠన్
సామగాయమవిచ్యుతం
సావధానస్తదభ్యాసాత్
పరం బ్రహ్మాధిగచ్ఛతి
అపరాంతకముల్లోప్యం
మద్రకం మకరీం తథా
ఔవేణకం
సరోబిందుముత్తరం గీతకాని చ
ఋగ్గాథా పాణికా
దక్షవిహితా బ్రహ్మగీతికా
గేయమేతత్తభ్యాసకరణాన్మోక్షసంజ్ఞితం
వీణావాదనతత్త్వజ్ఞః
శ్రుతిజాతివిశారదః
తాలజ్ఞాశ్చాప్రయాసేన
మోక్షమార్గం నియచ్ఛతి || ప్రాయశ్చిత్తాధ్యాయం (12.114)
ఈ వచనాల వల్ల స్పష్టంగ తెలిసేదేంటంటే విషయవాసన
ఎక్కువకావడం వల్ల ఈ కాలంలో దేవాలయాలలో (టి. శ్రావణమాసంలో అయోధ్యాది
పుణ్యక్షేత్రాలలో జరిగే డోలోత్సవం (ఊయల) వేడుకలు చూడండి. అందుకే ఇట్ల చెప్పవలసి
వస్తోంది- పే.86 (శ్లోకాలు)) జరిగే నృత్యగానాలు, ఆర్భాటాల రాసలీలాదులు పరమార్థంలో
భక్తికి సాధనాలు కాక విక్షేపాలు, వ్యభిచారాలకు సాధనాలు అవుతున్నాయి. ఈ
అభిప్రాయంతోనే ఇట్ల చెప్పారు-
ఉపాసనా ధ్యానధృతీ
సమాధిః స్వర్గాపవర్గౌ చరితాని దూరే
ఇతోధునా సాధువిధాం
ధునానాం శృంగారిణాం వల్గతి రాసలీలా ||
భక్తి, భక్తుల ప్రసంగాలలో
.............((వర్తమాన పరిస్థితి- పే. 87))
శైవులు విష్ణువు శివుడికి భేదం
ఒప్పుకోరు. అట్ల చెప్పేవాడు శైవుడే కాదు. అట్లగే వైష్ణవుడు కూడా. ఇక్కడ తులసీదాసు
వచనాలు చూడండి-
శివద్రోహీ మమ దాస
కహావై, సో నర సపనేఉ మోహి న పావై ||
ఈ అభిప్రాయాన్నే చెప్పే సుభాషితం
ప్రసిద్దమైనది-
ఉభయోరేకా ప్రకృతిః
ప్రత్యయభేదాచ్చ భిన్నవద్భాని
కశ్చిన్మూఢః కలయతి హరిహరభేదం
వినా శాస్త్రం || ఇత్యాదులు.
((శైవ-వైష్ణవ ద్వేషాల గురించి- పే.98
వరకు ఉంది. వదిలేస్తున్నాను. పే.98 లో శివ-విష్ణువుల ఘనిష్టసంబంధం గురించి ఉంది.
తర్వాత 102 వరకు వదిలేశాను.))
3.
జ్ఞానకాండ-
ఉపాసనాకాండలో
సవిశేషబ్రహ్మ (సాకార) విస్తారంగ నిరూపించడమైనది. ఇక నిర్విశేష బ్రహ్మ
(నిరాకార) నిరూపింపబడుతోంది.
వర్తమానకాలంలో జ్ఞానమార్గం అధికారులు ఎక్కువగా కనిపించకపోతునప్పటికీ,
కనిపించినవారు కూడా కర్మభీరువులైనందువల్లో, లేక కర్మకు అనధికారులైనందువల్లో
జ్ఞానాన్ని శరణు వేడుతున్నవారైనప్పటికీ, "కాలోహ్యయం నిరవధిర్విపులా చ
పృథ్వీ" అనే న్యాయంతో ఎవరైనా జ్ఞానమార్గం అధికారులు ఉండేఉంటారనే దృష్టితో
మంతవ్యమైన (చర్చించవలసిన) విషయంలో కొంత సిద్ధాంతం చెప్పుకుందాము. పరమేశవరుని నిర్విశేషం
గురించిన నిరూపణం "అశబ్దమస్పర్శమరూపమవ్యయం.." అనే శ్రుతితో చేయబడింది.
ఇదే అభిప్రాయంలో చెప్పబడిన శ్రుతులివి-
"అదృష్టమవ్యవహార్యంగ్రాహ్యమలక్షణమచింత్యమపదేశ్యమైకాత్మ్యమత్యయసారప్రపంచోపశమం
శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః." మాండూక్య
"యత్తదదృశ్యమగ్రాహ్యమగోత్రమర్ణ్యమచక్షుఃశ్రోత్రం
తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం తద్భూతయోనిం పరిపశ్యంతి
ధీరాః." ముండక
"యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం
పశ్యతి.." బృహదారణ్యక. మొదలైనవి.
ఈసిద్ధాంతాలు శ్రుతల వల్ల నిర్విశేష
బ్రహ్మ (నిరాకారం) అంటే నామరూపాది సమస్త ఉపాధులకు రహితమైన కేవల సచ్చిదానందం అని
తెలుస్తుంది. ఈ కారణంగనే ఈ శ్రుతిస్మృతిరూపమైన నేత్రాలతో ఏదో విధంగ చూడగలిగినది,
ఇతర నేత్రాల వల్ల చూడలేనిది. ఇదే మాట ఈ శ్రుతి స్మృతులలో స్పష్టంగ చెప్పబడింది.
పరాంచిఖాని వ్యతృణత్
స్వయంభుః తస్మాత్ పరాఙ్ నాంతరాత్మం
కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమైచ్ఛదావృత్తే
చక్షురమృతత్వమిచ్ఛన్ || కఠ.
భావార్థం- పరమేశ్వరుడు ఇంద్రియాలను
ఆత్మను గ్రహించగలిగే సామర్థ్యం కలిగినవిగా చేయలేదు. అందువల్ల అవి స్థూల పదార్థాలనే
గ్రహించగలవు. ఆ ఆత్మను ప్రత్యక్షం ((కళ్ళకు సాక్షాత్కరించటం)) చేసుకోవటంలో
అసమర్థాలు. ఎవరో జితేంద్రియుడైన మహాపురుషుడు మోక్షం వాసనతో ((ఆసక్తితో)) శాస్త్రం
ద్వారా ఆత్మను ప్రత్యక్షం చేసుకుంటాడు.
చక్షుషా గృహ్యతే
నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా
జ్ఞానప్రసాదేన
విశుద్ధసత్త్వస్తతస్తుతం పశ్యతే నిష్ఫలం ధ్యాయమానః || ముండక.
యం వినిద్రా
జితశ్వాసాః సంతుష్టాః సంయతేంద్రియాః
జ్యోతిః పశ్యంతి
యుంజానాస్తస్మ యోగాత్మనే నమః || స్మృతి.
ఇదే ఆశయం "అపి సంరాధనే
ప్రత్యక్షమనుమానాభ్యాం" (వే.ద. 3.2.24) ఈ సూత్రం లోనిది. కల్పతరువులో శ్లోకం
ఇట్ల ఉంది-
అపి సంరాధనే
సూత్రాచ్ఛాస్త్రార్థధ్యానజాప్రమా
శాస్త్రదృష్టిర్మతా
తాం తు వేత్తి వాచస్పతిః పరః ||
మొదలైన
ప్రమాణాల వల్ల స్పష్టమయ్యేదేంటంటే ఆ నిర్విసే, (నిరాకార) పరాత్మ చాక్షుష
ప్రత్యక్షం ((కళ్ళ ముందు కనిపించటం)) కాడు. అతడు కేవలం జ్ఞానగమ్యుడే. ఎక్కడైనా ఈయన
ప్రత్యక్షం కావడం గురించి వ్రాసి ఉన్నట్లైతే అది అంతా మాయాసృష్టి. అందువల్ల
"మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద" అని చెప్పాడు. ఇదే
అభిప్రాయం భగవద్గీతలో అర్జునుడు చూసిన విశ్వరూపానిది కూడా. కృష్ణుని సాధారణ
అవతారరూపం అందరికీ కనిపించింది. ఇదే మాట రామావతారం లో కూడా తెలుసుకోవాలి. సవిశేష,
నిర్విశేష ఈ రెండు విశేషణాలతో బ్రహ్మ రెండురకాలుగా తెలియబడతాడు. అందులో సవిశేషం
అంటే నామ-రూపాల విచిత్రత వల్ల అనేక రసాలు బ్రహ్మ (సాకారం) కు ఉన్నాయి. పరమార్థంలో
ఇదంతా నిర్విశేషమే (నిర్వికారం). ఇదే సిద్ధాంతాన్ని వేదవ్యాస మహర్షి తృతీయాధ్యాయం
రెండవపాదంలో చక్కగ చెప్పాడు. దీనికి సంగ్రహంగ చెప్పిన పూర్వపక్షసిద్ధాంతరూపమైన
శ్రీభారతీతీర్థ శ్లోకాలు ఈవిధంగ ఉన్నాయి-
'బ్రహ్మ కిం? రూపి,
వారూపం, భవేన్నీరూపమేవ వా
ద్వివిధశ్రుతిసద్భావాత్
బ్రహ్మ స్యాదుభయాత్మకం |
నీరూపమేవ వేదాంతైః
ప్రతిపాద్యమపూర్వతః
రూపం త్వనూద్యతే
భ్రాంతం, ఉభయత్వం విరుధ్యతే ||'
ఈ బ్రహ్మను పొందటానికి జ్ఞానం ఒక్కటే
సాధనం. జ్ఞానం లేక బ్రహ్మను గుర్తించటం కష్టం. బ్రహ్మలాభం, బ్రహ్మ దర్శనం,
బ్రహ్మసాక్షాత్కారం జ్ఞానంతోనే అవుతుంది. ఇదే శ్రుతి-స్మృతి-ఇతిహాస-పురాణాల
ఆదశం-ఉపదేశం-సుభాషితం-సారాంశం అన్నీ. వివేకం, వైరాగ్యం, శమం, దమం, శ్రద్ధా,
సమాధానం, ఉపమామం, తితిక్షాష్టకం, ముముక్షుత్వం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం,
తత్త్వపదార్థశోధనం- ఈ ఎనిమిది జ్ఞానానికి అంతరంగ సాధనాలు. కర్మ బహిరంగ సాధనం.
అందువల్ల బ్రహ్మ (ఆత్మ)సాక్షాత్కారంలో జ్ఞానం, కర్మలు పరమార్థదృష్టితో సముచ్చయం,
లేదా వికల్పం లేదా అంగాంగిభావం ఏ విధంగాను లేదు. ఈ విషయంలో కొన్ని ప్రమాణవాక్యాలు-
"న కర్మణా న
ప్రజయా ధనేన.."
"నాన్యర్దేవైస్తపసా
కర్మణా వా.."
"తద్విజ్ఞానేన
పరిపశ్యంతి ధీరాః.." ఇత్యాది శ్రుతులు.
"జ్ఞానం
నిఃశ్రేయసం ప్రాహుర్వృద్ధా నిశ్చయదర్శినః
తస్మాజ్జ్ఞానేన
శుద్ధేన ముచ్యతే సర్వపాతకైః ||"
"వ్రతాని
దానాని తపాంసి యజ్ఞాః, సత్యం చ తీర్థాశ్రమకర్మయోగాః
స్వర్గార్థమేవాశుభమధ్రువం
చ, జ్ఞానం ధ్రువం శాంతికరం మహార్థం ||"
"మూలం నికృతిః
క్షమా చ, కామస్య రూపం వపుర్వయశ్చ
ధర్మస్య యాగాది దయా
దమశ్చ, మక్షస్య సర్వోపరమః క్రియాభ్యః ||" ఇత్యాది స్మృతి.
అంతెందుకు-
ప్రతితంత్రం సాంఖ్యదర్శనంలో కూడ చెప్పబడింది-
"జ్ఞానాన్ముక్తిః | బంధో
విపర్యయాత్ | నియతకరణత్వాన్న సముచ్చయవికల్పౌ | స్వప్నజాగరాభ్యామివ మాయికా
మాయికాభ్యాం నోభయోర్ముక్తిః పురుషస్య" (3 అధ్యాయం, 23-26 సూత్రాలు)
భగవద్గీతాభాష్యంలో భగవత్పాదులు కేవలం
జ్ఞానంతోనే మోక్షప్రాప్తిని చెప్పారు. అంతంలో తాత్పర్య నిర్ణాయక భాష్యంలో
గీతాశాస్త్ర రహస్యాన్ని దర్శింపచేశారు. ప్రమాణవాక్యాలు-
తస్మాద్ గీతాసు
కేవలాదేవ తత్త్వజ్ఞానాన్మోక్షప్రాప్తిః, న కర్మసముచ్చితాదితి నిశ్చితోర్థః||"
ఇటువంటి దశలోజ్ఞానకర్మకు సహానుభూతికి
శ్రీభాష్యంలో అలౌకిక కల్పన చేశారు. జైమిని ద్వాదశాధ్యాయిని (పూర్వమీమాంస) పరిశిష్ట
చతురధ్యాయి (సంకర్షణకాండ) తో కలిపితే షోడశాధ్యాయి అవుతుంది. ఈ షోడశాధ్యాయి, వేదాంత
చతురధ్యాయి (బ్రహ్మసూత్రం) కలిపి ఏకవింశత్యధ్యాయి అవుతుంది.(12 అద్యాయలు
పూర్వమీమాంస + 4 అద్యాయలు సంకర్షణ కాండం + 4 అధ్యాయాలు ఉత్తరమీమాంస = 20
అధ్యాయాలు) దీనిని ఒక శాస్త్రంగ తీసుకోవాలిట. చూడండి, ప్రవృత్తి నివృత్తిరూపమైన
ధర్మాల భేదం ఉండడం వల్ల జిజ్ఞాసా భేదం ఉన్నప్పుడు కూడా వాటి భిన్నప్రతిపాదకాలైన
శాస్త్రాలను ఒక తాటికి కట్టటం ఎంతటి ఉద్దండతో..!
కొందరు వాదనపరులు సవిశేష బ్రహ్మ
(సాకారం) మాత్రమే ఉపాస్యం అని, నిర్విశేష బ్రహ్మ (నిరాకారం) ఉపాస్యం కాదని అంటారు.
కానీ ఇది అవిచారిత రమణీయం ((విచారించకపోతేనే అందంగ ఉండేది. విచారించి లాభం లేనిది.
విచారించటానికి అర్థం పర్థం లేనిది)). శ్రుతి, స్మృతులలో రెండింటి ఉపాస్యత
చెప్పబడినప్పుడు ఒక్కదాని ఉపాస్యతే ఎందుకు ఒప్పుకోవాలి? సవిశేష బ్రహ్మకు నానాత్వం
ఉండటం వల్ల వారి ఉపాసనకు కూడా నానాత్వం ఉంది. అంటే ధ్యేయాకార భేదం వల్ల ధ్యాత
యొక్క ధారణం, ధ్యానం, సమాధి (సంయమనం), ఉపచారం అన్ని భిన్నాలే. ఇక్కడ చివరలో విశేషక
గుణాల ఉపసంహారాన్ని ఒప్పుకుని నిర్విశేషం దగ్గరే విశ్రాంతి దొరుకుతుంది. అవి
ఏకవిషయక-విశేషం (ఆకారం) అయినప్పటికీ శ్రుతనిసిద్ధమైన అవ్యాకృతావస్థ అయితే నెత్తిన
ఉంది కదా...; ఇందువల్లే నిర్విసేష బ్రహ్మ ప్రధానమే. దాని ఏకత్వం వల్ల
ఉపాసన-ధారణ-ధ్యాన-సమాధులు ఏకశ్రితాలు. బ్రహ్మ నిర్విశేషత్వం నిరూపించి దాని
సాక్షాత్కారమనే మోక్షరూప ఫలం ఈ సిద్ధాంత శ్రుతిలో ప్రసిద్ధంగ చెప్పబడింది.
అశబ్దమస్పర్శరూపమవ్యయం,
తథారసం నిత్యమగంధవచ్చ యత్ |
అనాద్యనంతం మహతః పరం
ధ్రువం నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే || కఠోపనిషత్.
అటువంటప్పుడు సవిశేషపక్షం తీసుకుని
విష్ణువు, శివుల ఐచ్ఛికమైన ఒకే ఆకారం, లేదా ఐచ్ఛిక ఆకారాల ఉపసంహారం మీద ఆధారపడి
బ్రహ్మసూత్రాల యోజనం చేయటం ఐచ్ఛిక వ్యాఖ్య (బ్రహ్మసూత్ర భాష్యం) కాకపోతే ఇంక ఏంటి?
దాన్ని ఏమనాలి? ఏదైనా సంహిత, బ్రాహ్మణభాగం లేదా తదాశ్రితమైన బ్రహ్మసూత్రంలో
విష్ణువు లేదా శివుల సవిశేష పక్షం (ఆకారఘటకమైన లింగం) ప్రాప్తించినప్పుడు
పురాణాలలాగ సవిశేషమైన (విష్ణు, శివాదులు) ఉద్దేశ్యంతో బ్రహ్మసూత్రవ్యాఖ్యను చేయటంలో
తప్పేంటి? ఏం లేదు. కానీ అట్ల లేనందువల్లే వేదవ్యాసుడు నిర్విశేష లక్ష్యంతో
తదనుకూలుడైన బ్రహ్మశబ్దాన్ని "అథాతో బ్రహ్మజిజ్ఞాసా" అనే
శాస్త్రారంభసూత్రంలో ప్రయోగించాడు. ఇటువంటి దశలో సవిశేషపక్షాన్నిఅవలంబించి
"బ్రహ్మ" శబ్దాన్ని కేవలం విష్ణువు లేదా కేవలం శివలకు చెందిన అర్థం
చెప్పటం ఏకదేశీయ మతం ((సర్వసమ్మతం కాదు)). అందువల్లే ఆ వ్యాఖ్యానాలు ఏకదేశీయాలు-
"బ్రహ్మశబ్దేన చ స్వభావతో
నిరస్త-నిఖిల-దోషోనవధికాతిశయాసంఖ్యేయ-కల్యాణగుణగణః పురుషోత్తమోభిధీయతే"
శ్రీభాష్యం.
"అనంతాచింత్య-స్వాభావిక-స్వరూప-గుణశక్త్యాదిభిర్బృహత్తమో
యో రమాకాంతః పురుషోత్తమో, బ్రహ్మశబ్దాభిధేయః.." వేదాంత పారిజాత సౌరభం.
"బ్రహ్మశబ్దశ్చ
విష్ణురేవ" పూర్ణప్రజ్ఞదర్శనం
తాత్పర్యమేటంటే "సవిశేష
బ్రహ్మవాదంలో కూడా బ్రహ్మశబ్దం కేవల విష్ణువాచకం కాదు. బ్రహ్మశబ్దానికి విష్ణువులో
శక్తిగ్రహం ((అర్థం)) లేదు. అందువల్ల శ్రుతి, స్మృతులలో బ్రహ్మ, విష్ణు, శివ
మొదలైన శబ్దాలు పర్యాయాలు (ప్రయోగప్రవాహం వల్ల ఏకార్థకాలు) గా తీసుకోబడలేదు. ఒకవేళ
వేదాంత ప్రక్రియతో బ్రహ్మశబ్దానికి విష్ణువు అర్థం చెప్పాలనుకున్నా దానికి శివాది
అర్థాలు కూడా ఏదో విధంగ ఖండితం కావు. అప్పుడు బ్రహ్మ శబ్దం పంచదేవాత్మకం అవుతుంది.
విజ్ఞానభిక్షువు కూడ ఈ విధంగ చెప్పాడు-
"యత్త్వాధునికా కేచన పరస్య
సాక్షాదపి లీలావిగ్రహం కల్పయంతి, తదప్రామాణికం. విష్ణ్వాదీనామేవ
లీలావిగ్రహావతార-శ్రవణాత్. విష్ణ్వాదీనాం చ పరమాత్మన్యేవాహం భావాత్తేషామవతారా ఏవ
పరమేశ్వరావతారతయా శ్రుతిస్మృతిషూచ్యంతే. తే న తు తే భ్రాంతాః "న తస్య కార్యం
కరణం తు విద్యతే.." ఇత్యాది శ్రుతిభ్యః పరమేశ్వరస్య
కార్యకారణాఖ్య-శరీర-ద్వయ-ప్రతిషేధాత్. "అనాదిమత్ పరం బ్రహ్మ
సర్వదేహవివర్జితం" ఇత్యాది స్మతిభ్యశ్చేతి దిక్." తథా-
బ్రహ్మావిష్ణుశివాదీనాం యః పరః స మహేశ్వరః" ఇతి. యోగవార్తికం.
ఆవిధంగ బ్రహ్మశబ్దం కేవలం
పంచదేవతామాత్రులకు వాచకం కాదు.. రామకృష్ణాది ఇతిహాస-పురాణ-తంత్ర ప్రసిద్ధమైన
అనేకానేక లీలావిగ్రహాలకు వాచకం కూడ. ఇదే తాత్పర్యం రామతాపినీ, గోపాలతాపినీ మొదలైన
గ్రంథాల వల్ల స్పష్టంగ తెలుస్తుంది.
రామ- రమంతే యోగినోనంతే
నిత్యానందే చిదాత్మని
ఇతి రామపదేనాసౌ పరం
బ్రహ్మాభిధీయతే
చిన్మయస్యాద్వితీయస్య
నిష్కలస్యాశరీరిణః
ఉపాసనానాం
కార్యార్థే బ్రహ్మణే రూపకల్పనా
రూపస్థానాం దేవతానాం
పుంస్త్ర్యంగాస్త్రాదికల్పనా
ద్విచత్వారిషడష్టాసాం
దశ ద్వాదశ షోడశ
అష్టాదశాపి కథితా
హస్తాః శంఖాదిభిర్యుతాః
సహస్రాంతాస్తథా
తాసాం వర్ణవాహనకల్పనా
శక్తిసేనాకల్పనా చ
బ్రహ్మణ్యేవం హి పంచధా
కల్పితస్య శరీరస్య
తస్య సేనాది కల్పనా || రామతాపినీ.
కృష్ణ- కృషిర్భూవాచకః శబ్దో
నశ్చ నిర్వృతివాచకః
తయోరైక్యం పరంబ్రహ్మ
కృష్ణ ఇత్యభిధీయతే || గోపాలతాపినీ.
కృష్యతే విలిఖ్యతే ఇతి కట్,
భూమిః సర్వాధారః, నిర్వృతిః ఆనందః, సుఖం; తయోరైక్యం సామానాధికరణ్యం. తచ్చ యదా
కర్మధారయేణ భవతి తదా పరంబ్రహ్మ కృష్ణే ఇతి శబ్దేనాభిధీయతే. అథవా భూగ్రహణం
దృశ్యోపలక్షణం. నిర్వృతిః సుఖస్వరూపం బ్రహ్మ, తయోరైక్యం అధ్యాసనివృత్త్యా
శుద్ధాత్మతాపాదనం. ఇతి నారాయణః.
శాస్త్రంలో అథ నుంచి ఇతి
వరకు యథాస్థానంగ ((తగినంతగా?)) నిర్విశేషబ్రహ్మ ప్రతిపాదనం కనిపిస్తూన్నది; దాని
ప్రాధాన్యమే ఒప్పుకున్నారు; కేవలం ఉపాసనం కోసం మాత్రమే సవిశేష బ్రహ్మను
నిరూపించారు; నిర్విశేషబ్రహ్మ సిద్ధికోసమే అద్వైతవాదం, దానికి ఉపయోగపడే అధ్యాసవాదం,
వివర్తవాదం మొదలైన శ్రుతి, యుక్తుల చేత సిద్ధించే పదార్థాలను కల్పించారు; ఈ
అద్వైతవాదం ఆత్మసాక్షాత్కారం తరువాత అనుభవం లోకి వస్తుంది. ఈమాట-
దేహాత్మప్రత్యయో యద్వత్
ప్రమాణత్వేన కల్పితః |
లౌకికం తద్వదేవేదం
ప్రమాణం త్వాత్మనిశ్చయాత్ ||
మొదలైన శ్రుతి-స్మృతి-యుక్తి సిద్ధమైన
ప్రమాణాలవల్ల స్పష్టంగ ఉంది; వ్యవహారదశలో ద్వైతవాదమే ఒప్పుకోబడింది; అయినప్పటికీ ((పట్టుదల
వల్ల?)) హఠాత్ సంప్రదాయికులు నిర్విశేషవాదాన్ని ఖండించి సవిశేషవాదం
సిద్ధింపచేయటానికి దుర్వ్యఖ్యానాలు చేసి వేదవ్యాసభగవానుని బ్రహ్మసూత్రాలను ఆకులితం
చేశారు. మాయావాదానికి విరోధులై ఉడి కూడా శ్రుతి స్మృతులను సాధారణజనాలకు అర్థంకాని
మాయావాదంలో పారేశారు. కుకర్మల వల్ల జరిగే ప్రత్యవాయం ధర్మశాస్త్రం నుంచి దాగలేదు.
ఇక సాధారణజనులకు కూడా అర్థం అయ్యేవిధంగ ఉన్నవి, బ్రహ్మను ప్రతిపాదించేవి కొన్ని
శ్రుతులు చూపిస్తాను. వీటిలో దృఢత్వం కోసం మాటిమాటికీ ఒకే మాట చర్చింపబడింది.
"యద్వాచానభ్యుదితం
యేన వాగభ్యుద్యతే
తదేవ బ్రహ్మ త్వం
విద్ధి నేదం యదిదముపాసతే
యన్మనసా న మనుతే
యేనాహుర్మనో మతం
తదేవ బ్రహ్మ త్వం
విద్ధి నేదం యదిదముపాసతే
యచ్చక్షుషా న పశ్యతి
యేన చక్షూంషి పశ్యతి
తదేవ బ్రహ్మ త్వం
విద్ధి నేదం యదిదముపాసతే
యచ్ఛ్రోత్రేణ న
శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం
తదేవ బ్రహ్మ త్వం
విద్ధి నేదం యదిదముపాసతే
యత్ప్రమాణేన న
ప్రాణితి యేన ప్రాణః ప్రణీయతే
తదేవ బ్రహ్మ త్వం
విద్ధి నేదం యదిదముపాసతే
(నిచాయ్యతన్మృత్యుముఖాత్
ప్రముచ్యతే) - కేనోపనిషత్
చాలా కారణాల వల్ల బ్రహ్మసూత్రాల
(వేదాంతదర్శనానికి) అర్థం భగవత్పాదులు శారీరక భాష్యంలో చెప్పిందే
(శ్రవణం-మననం-నిధిధ్యాసనానికి యోగ్యమైందిగా) తీసుకోవాలి.
ఈశ-కేన-కఠ-ప్రశ్న-ముండ-మాండూక్య-తైత్తిరీయ-ఛాందోగ్య-బృహదారణ్యకమ-ఐతరేయ ఉపనిషత్తుల
భాష్యాలలో, గీతాభాష్యంలో చెప్పిందే తీసుకోవాలి.
కారణం-
శ్రౌత-స్మార్త-ప్రతిష్ఠార్థం భక్తానాం హితకామ్యయా
ఉపదేక్ష్యంతి
తజ్జ్ఞానం శిష్యాణాం బ్రహ్మసమ్మితం
యుగే యుగే మమాంశశ్చ
హరాంశశ్చైవ శంకరః
ఉద్ధరిష్యంతి మే
మూర్తీస్తావకీనహదాచ్ఛుభాత్ ||
ఈ ధర్మ సంహిత పుస్తకం పబ్లిషర్స్ ఎవరో కొద్దిగా చెప్పగలరు నేను సేకరిద్దాం అనుకుంటున్నాను
ReplyDelete