Sunday, 7 November 2021

రోదన పై శోధన (హాస్య సంభాషణ)

పాత్రలు-2

రో.శో. = రోదన శోధకుడు

క.సా = కవి సహాయకుడు

-----------------------------

రో.శో.— అయ్యా, వందనం, అభివాదనం, నమస్కారం, ప్రణతులు

క.సా.— ఏదో ఒకటి చాల్లేవయ్యా- రా రా.. ఇంతకీ నువ్వేనా పరిశోధనలో సహాయం కావాలి అని ఫోన్ చేసింది?

రో.శో.— అవునండి.. వర్ణవర్ణాలా నేనే.

క.సా.— వర్ణవర్ణాల ఏమిటయ్యా?

రో.శో. — అదేనండి.. అక్షరాలా.. అక్కడ అక్షరాలు అని అనీ బోరేసింది.. అందుకు వర్ణాలు వాడాను.. అప్పుడు వర్ణాలనగానే అక్షరసంఖ్య తగ్గి బాలెంసు పోతుంది.. కనుక రెండుసార్లు చెప్పాను. కావ్యభావనలో పునరుక్తి దోషం కాదు కదండీ..

క.సా.— సరే, సరే. ఇంతకూ విషయం చెప్పావు కాదు.. మనకసలే సమయం తక్కువ..

రో.శో. — ప్రస్తుతం ఉన్న కవులు, పండితులు, పురాణాజ్ఞులలో మీరే అందరికంటే ఉన్నతులు అని సమాచారం తెలిసి మీకు ఫోన్ చేశాను..

క.సా.— అట్లాగే నయ్యా చాలా సంతోషము.. కానీ పురాణాజ్ఞుడు కాదయ్యా.. దీర్ఘం తీసేయి.. సరేలే.. విషయం చెప్పు.

రో.శో.— నేనో పరిశోశోధన చేస్తున్నాను. చాలా మటుకు పరిశోధన పూర్తయింది. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే ఇక వాటిని పెట్టి పరిశోధన వ్యాసం సమర్పణ చేయడమే మిగిలింది..

క.సా.— అవునా! అయితే ఇంకా ఆనందకర విషయం! అన్నట్టు- విషయాంశము ఏమిటన్నావోయ్..

రో.శో.— రోదన.. ఏడుపు

క.సా.— ఏ దన? ఏ డుపు?!!!

రో.శో.— ఏడుపేనండి..

క.సా.— అయ్యో దేవుడా! అదేం విషయమయ్యా.. శుభమా అని పరిశోధన చేస్తూ..

రో.శో.— అంటే కొత్త విషయాలు దొరకడం కష్టమైపోయింది. వెరైటీ ఉండాలి. ముందు వేరే ఎవరూ చేసి ఉండకూడదు.‌ ఇన్ని ఉరితాళ్ళబంధాల మధ్య ఇంకేం విషయం దొరుకుతుందండి. అందుకే ఇట్లా ఎంచుకున్నానండి..

క.సా.— ఎంత కొత్త అయితే మాత్రం మరీ ఏడుపు ఏమిటయ్యా!

రో.శో.— ఏం చేయాలండి? మా అన్నయ్య కొడుకు పుట్టి వాడి మొదటి ఏడుపు వినగానే నాలో కూడా ఈ విషయంపై పరిశోధనలు చేయాలి కొత్త కొత్త ఉత్సాహం తలెత్తింది.. నా ఒరిజినాలిటీకి దిమ్మదిరి దెబ్బకు విశ్వవిద్యాలయం వారు వినంగానే ఏ పక్కకూ చూడకుండా ఠపీమని ఆమోదం కూడా చేసేసారు.. దానితో రోదన శోధకుడినైనాను.. అది కథ.

క.సా.— చేయక ఉరి పోసుకుని చావలేరు కదా..

రో.శో.— నా పూర్వ ప్రతిపాదన- అదే హైపోతీసిస్సు- విని దాదాపు అంత పనీ చేసేవారే.. కానీ కొత్తవారికి అవకాశం ఇవ్వాలి కనుక, ఎవరో కొత్త ప్రొఫెసరు తన కింద ఒకరు అన్నా ఉన్నారు అని చూపించుకోవాలి అనే ఆశతో నాకు పుటుక్కున చోటు ఇచ్చేసారు..

క.సా.— సరే.. అతని సంచిత కర్మ, నీ ప్రారబ్ధకర్మ!  ఏం చేద్దాము..! ఇంతకీ నీ హైపోథిసిస్ ఏమిటి..?

రో.శో.— ఎంతవాడైనా ఏడుస్తూనే పుడతాడు- అనేది ముఖ్య ప్రతిపాదన.‌ ఆనుషంగికంగా ఇహి మిగితావి మామూలేగా.. ఓ ఐదధ్యాయాలు ప్లాన్ చేసాను.. విషయం ఇట్లా నింపాను- ఏడుపు నిర్వచనము- సంస్కృతంలో తెలుగులో సైంసులో సైకాలజీలో; ఇహ వివిధ శాస్త్రాల పరంగా కారణాలూ, వైయక్తిక-సామాజికాది సందర్భాలూ, రోదనలో రకాలు, విభాగాలు, సమస్యలు-సమాధానాలు.. ఇక పరిశోధనకై పనికొస్తాయీ అనుకునే అన్ని అంశాలూ జోడించానండి..

క.సా.— ఏడ్చినట్టు ఉంది!

రో.శో.— అబ్బ! అయితే అఛ్చంగా బాగుందనే కదండీ! విషయానికి తగినట్టు ఉందనే కదా! హమ్మయ్య- ఓ తీట తీరింది.

క.సా.— (దిక్కులు చూస్తూ) ఆ సంగతి వింటే కానీ తెలియదు. సరే, మొట్టమొదలు అసలు ఏడుపు నిర్వచనం ఏం వ్రాసావో మచ్చుకు చెప్పు..

రో.శో.— అబ్బ! అది అసలు విజ్ఞుల లక్షణం! అబ్బ.. వినండి.. “ఏ లేదా యా అనే అనునాసిక రహిత శబ్దాలతో వాఁ లేదా య్యాఁ అనే దిత్వాక్షరపు అనునాసిక యుక్త శబ్దాలతో ఎక్కువ ప్లుత ఉచ్చారణతో వ్యక్తమయ్యే బాధ సంతోషాది శబ్ద యుక్త లేదా శబ్ద రహిత శబ్ద విషయమే ఏడుపు. ప్రశాంతంగా లేదా శబ్ద యుక్తమై ఉండవచ్చు. ఆ సౌండ్ కు కన్నులనుండి ఉప్పునీరు ఫ్రీ..

క.సా.— (పైకప్పు వంక చూస్తూ) అదిరింది!! ఆహా!! వర్ణవర్ణాలా సరిపోయింది.. మరి దానికి కారణాలు?

రో.శో.— అనేకమండి! సృష్టి ఎంత విపులమైనదో ఏడుపు కూడా అంత విపులమైనది అని తెలుసుకున్నాను.. అన్ని వయసులవారు, అనేక సందర్భాలలో, అనేక కారణాలుగా, చిన్నగా పెద్దగా, లేదా మధ్యమ రీతిగా, సమయ సందర్భాలను బట్టి, తమకున్న శక్తిసామర్థ్యాలను బట్టి, సమయావధిని బట్టి ఏడుస్తూనే ఉంటారు.. అసలు ఏడుపులో ఉన్న అన్ని వెరైటీలు నవ్వులో కూడా లేవు అంటే అతిశయోక్తి కాదు..

క.సా.— (తల పట్టుకుంటూ) ఆహా! సరే! ఇంతకు నీకు నాతో తేలవలసిన ప్రశ్నలు చెప్పు..

రో.శో.— అట్లాగేనండి తప్పకుండా.. ఇప్పుడు... పిల్లలు, పెద్దలు ఏడిస్తే సౌండ్ లో తేడా ఎందుకు ఉంటుంది? దానికి కారణం ఏమిటి?

క.సా.— ఏముంటుందయ్యా? పెద్దవాళ్ళయ్యాక నానారకాల పనుల వల్ల అంత స్వతంత్రంగా ఏడిచేందుకు టైం లేక కావచ్చు..

రో.శో.— అబ్బా! అదిరిందండి చక్కగా చెప్పారు.. ఆగండి వ్రాసుకుంటాను.. (అని వ్రాసుకున్నాక) తర్వాతి ప్రశ్న- జంతువులు కూడా ఏడుస్తాయా? పక్షుల ఏడుపు శబ్దం ఎట్లా ఉంటుంది? కూత లాగే ఉంటుందా వేరుగా ఉంటుందా? పురుగులు చీమలు కూడా ఏడుస్తాయా? అప్పుడు వాటికి కన్నీరు వస్తుందా? అది ఉప్పగా ఉంటుందా? వీటిని మన జంతుపక్షిశాస్త్రాలలో ఎక్కడైనా చెప్పారా?

క.సా.— ఓహో ఏమి దృష్టికోణం..! తెలియదయ్యా.. చూడాలి..

రో.శో.— ధన్యవాదాలండీ. మా సైన్స్ విద్యార్థులకు పెద్దగా శాస్త్రాలు కావ్యాలపై అవగాహన ఉండదు కదా.. అందుకనే మీ సహాయాన్ని అర్థిస్తున్నాను..

క.సా.— సరే.. అట్లాగే నీ ప్రశ్నలన్నీ అడుగు.. ఇంకా ఏమేమి ఉన్నాయో.. విని అన్నింటికీ కలిపి ఆలోచించి వరుసగా సమాధానం చెప్తానేమో..

రో.శో.— అట్లాగేనండి.. ఇంకోటి- ఏడుస్తున్నప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది? అది తుడుచుకుంటూ చేతితో ఏడవటం గురించి కావ్యాలలో ఏమైనా వర్ణనలు ఉన్నాయా?

క.సా.— అసలు ఏమి ప్రశ్న అయ్యా బాబూ!! ఇది.. అసలు.. మాటలు రావట్లే.. అబ్బా జోహార్లు!

రో.శో.— ఇంకా ఇటువంటివి, ఇంతకు మించినవీ చాలా ఉన్నాయి అండి..‌ అసలు ఎన్ని ప్రశ్నలు అనుకున్నారు నాకు.. వ్రాసుకుని తెచ్చా..!

క.సా.— అయితే నేను చచ్ఛా!!

రో.శో.— ఏమిటండి అంటున్నారు?

క.సా.— అ.. అది.. ఏదో స్వాగతం లేవయ్యా! నువ్వు చెప్పు ఇంక మిగతావి కూడా..

రో.శో.— ఇంకా ఏమన్నా అంటే... (ఆలోచించి గుర్తుకు వచ్చి) ఆఁ, అది! ఏడుస్తున్నప్పుడు  ఎక్కిళ్ళు వస్తే ముందు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా లేక ఎక్కిళ్ళకు పరిష్కారం చూపినవి ఉన్నాయా..?

క.సా.— వెతకాలయ్యా.. చూద్దాము.. తర్వాత ప్రశ్న చెప్పు.. అన్ని కలిపి వెతికి పారేద్దాము

రో.శో.— మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు.. ధన్యవాదాలు. దీపావళి టపాకాయల లాగా నా మనసులో అట్లా సందేహాలు పేలుతూనే ఉంటాయండి.. అదేంటో..

క.సా.— మా తల నరాలు తెంపడానికి..

రో.శో.— ఏంటండి అంటున్నారు? తలంబ్రాలా? ఆఁ!! మంచి సన్నివేశం. అమ్మాయి తలంబ్రాలు పోసేదాకా నవ్వుతూనే ఉండి సడన్గా వీడ్కోలు దగ్గర ఏడుస్తుంది. తలంబ్రాలు పసుపు మొదలైనవన్నీ కళ్ళల్లో పడి ఏడుస్తుంది అని నా అంచనా..! ప్రమాణంగా చెప్పటానికి కావ్యంలో ఒక పద్యం ఏదైనా ప్రమాణంగా చూపగలరా..?

క.సా.— ఆహా అసలెంత బాగుంది ప్రశ్న!!

రో.శో.— కదండీ..? ధన్యవాదాలు..! అట్లాగే- సన్నివేశం ఏదైనా సరే- ఒకరు ఏడుస్తుంటే మరొకరికి ఆ ఏడుపు అనటం ఒక అంటు వ్యాధి వంటిది అని ప్రమాణం కూడా కావాలి అండి..

క.సా.— వ్వహ్వా!! ఇంక నాకు పిచ్చి పట్టటానికి ఎంతో దూరం లేదు..

రో.శో.— పిచ్చి!! ఆ నిజమే..! పిచ్చివాళ్ళు.. మరిచేపోయా.. వారిని కూడా జోడించాలి..! వారు అకారణంగా ఏడుస్తారు కదా.. దానిగురించి ఏదైనా నా నాటకంలో ప్రస్తావన ఉందా..? అంటే తిక్కనగారో పెద్దనగారో ఏమైనా నాటకాలలో వ్రాశారా?

క.సా.— నాయనా, వారు నాటకాలు వ్రాయలేదు.. దేవుడి దయ జగమెల్లా చల్లగా ఉండి అప్పట్లో పిచ్చివారెవరు పెద్దగా వుండేవారు కాదుట..

రో.శో.— ఎందుకంటే నాలాంటి పిచ్చెక్కించే వారు అందరికీ దొరకదు కదండీ..

క.సా.— బాగా చెప్పావు నాయనా.. వర్ణవర్ణాలా..

రో.శో.— ఇంకొకటండి.. అశలు భలే మండుతుంది ఈ వివక్షభావానికి.. ఏడవటంలో ఆడవారే ముందు అనేది ఒక అపప్రథ కావచ్చు కదండి.. మగవాళ్ళు ఏడ్చిన సన్నివేశాలు అన్నీ కూడా నాకు ఒక లిస్ట్ కావాలి అండి..

క.సా.— ఇది చాలా పెద్ద ప్రశ్నే..

రో.శో.— ఆఁ!! ‘పెద్ద’ అంటే తట్టిందండి. పిల్లలు పెద్దగా ఏడుస్తారు.. పెద్దవారు చిన్నగా ఎక్కిళ్ళు పెట్టి ఎవరికీ వ్యక్తం కాకుండా ఏడుస్తారు. మనిషి పెరిగిన కొద్దీ అన్ని పెరుగుతున్నప్పుడు, మరి ఈ అంసం పెరగకుండా తరుగుతున్నది ఎందుకు..? ఈ విరుద్ధ అంశం సృష్టిలో ఎందుకు ఉన్నది- అని ఎవరైనా ఇదివరకు పరిశోధన చేసిన దాఖలాలు ఉన్నాయా? పూర్వపరిశోధనల విభాగంలో వ్రాయాలండి..

క.సా.— (నుదురు రుద్దుకుంటూ) ఇది డాక్టరును లేదా సైకియాట్రిస్టు అడుగుతే సరిపోతుంది అన్ని సాహిత్యంలోనే ఉండవు కదా..

రో.శో.— అదీ నిజమేనండి.. ఇతర క్షేత్రాలను కూడా నేను చూడాలి.. ఎవరైనా సైకియాట్రిస్టులు కలుస్తాను.. వారి దగ్గర కొన్ని సమాధానాలు దొరకచ్చు..

క.సా.— నిజమేనయ్యా.. ఆ పని చెయ్యి. దేవుడి దయ నీమీద చల్లగా ఉండాలి..

రో.శో.— అన్నట్టు.. నిజమే! దేవుడంటే గుర్తుకొచ్చింది.. భక్తులు కూడా ఒకటే ఏడుస్తూ ఉంటారు.. దాని వెనక కారణం ఏమై యుంటుంది?

క.సా.— వారి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.. ఒక్క చూపు చూశారూ అంటే నిలువునా భస్మం అయిపోతావు.. భద్రం..

రో.శో.— అవునవున్లేండి.. అదీ నిజమే. కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉండిపోతాయి.. ప్చ్.. అయితే తరువాత ప్రశ్న- “అల్లసాని పెద్దన అల్లిబిల్లిగా ఏడ్చాడు, ముక్కు తిమ్మన్న ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు..” అని తెనాలి రామలింగడి ఏడుపు విమర్శలవంటివి నానుడులు సంస్కృత వాఙ్మయంలో ఉన్నాయా..? అట్లాగే నాయికలను ఏడిపించిన కవులు నాయకులను కూడా ఏడిపించారా‌‌..?

క.సా.— (కాళ్ళు చేతులు విదిలించి ఊపుతూ) అయ్యో.. అన్నీ వాళ్లే చెప్పరయ్యా.. కొన్ని నీలాంటి మేధావుల కోసం వదిలి పెడుతూ ఉంటారు.. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?

రో.శో.— ఉన్నాయి.. కానీ అవి సైన్సుకు సంబంధించినవండి..

క.సా.— అట్లాగా.. నేను కూడా ఒకప్పుడు సైన్స్ స్టూడెంట్ నే.. ఏది మచ్చుకు చూద్దాము.. అడుగు..

రో.శో.— ఉదాహరణకు.. (ఆలోచించి) ఆఁ.. ఈ ప్రశ్న చెప్తాను.‌ ఒక పిల్లవాడు ఏడిస్తే సగటున ఎంత నీరు రాలుతుంది..? వాడి సౌండ్ ఎన్ని డెసిబుల్స్ ఉంటుంది..? ఒక పెద్దవాడు ఏడిస్తే అతగాడికి ఎన్నిసార్లు ఎక్కిళ్లు వస్తాయి..? ఒక వ్వాఁ కి ఇంకో వ్వాఁ కి మధ్యలో ఎన్ని సెకెండ్లు ఆగగలతాడు? అది స్త్రీలలో పురుషులలో భిన్నం గా ఉంటుందా? కన్నీటిలో ఉండే ఉప్పును మనము హార్నెస్ చేసుకోవచ్చా?

క.సా.— (జుట్టు పీక్కుంటూ) అబ్బో అబ్బో! ఆహాహా! ఎంత సమాజోపయోగకరమైన టాపిక్..!!

రో.శో.— అంతే కాదండీ.. మన కన్నీరు ఉప్పగా ఉంటుంది..‌ అట్లాగే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. అంటే సముద్రాల కూడా ఏడుపుతో ఏమైనా సంబంధం ఉంది- అని మనం నిష్కర్ష తీయవచ్చా..? అంటే ఎవరో ఏడిస్తే సముద్రాలన్నీ బయటికి వచ్చాయి అని చెప్పవచ్చా..??

క.సా.— వాటిని సృష్టించిన భగవంతుడు ఒప్పుకుంటాడో లేదో తెలియదయ్యా.. ఈసారి కనిపిస్తే ఆయనను ఒక మాట అడుగు..

రో.శో.— సరేనండి.. తర్వాతి ప్రశ్న.. యావరేజ్గా ఒక చంటి పిల్లవాడు సంవత్సరంలోపు రోజుకు సుమారుగా ఎన్నిసార్లు ఏడుస్తాడు నేను లెక్కపెట్టాను.. కానీ నీ ఆడపిల్లలు కూడా అట్లాగే ఏడుస్తారా..? ఈ డేటా మాత్రం నా దగ్గర లేదండి..

క.సా.— లెక్క పెట్టాను అంటే ఏం చేసావ్ ఏమిటి?

రో.శో.— మా అన్నయ్య కొడుకు పుట్టినరోజు నుంచి వాడికి సంవత్సరం పుట్టిన రోజు వరకు ప్రతిరోజు వాడు ఎన్నిసార్లు ఏడ్చాడు ఒక పుస్తకంలో వ్రాసుకుంటూ దానితోపాటు ఎక్సెల్ షీట్ ని  చేశాను అండి.. వాడి ఏడుపు పాటర్న్స్ కి గ్రాఫ్ కూడా చేశానంఅండి..

క.సా.— అబ్బ.. ఏమి సింసియారిటీ..ఏమి నిబద్ధత! ఇంక.. అసలు వినే శక్తి లేదయ్యా!!

రో.శో.— అయ్యో ఇంకా ఇంతలోనే ఏమైందండీ..? ఇంకా ఉన్నాయి- ఉదాహరణకు- ఏడ్చి మొహం కడుక్కున్నట్టు అనే సామెత చేసినవాడు అద్దంలో తన మొహం తాను చూసుకుని చెప్పి ఉంటాడా?

క.సా.— నిజమేనయ్య మంచి సందేహం..

రో.శో.— అట్లాగే ఈ లోకంలో మొట్టమొదటి సారి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏడ్చి ఉంటారు? బాధొస్తే ఏడవాలి- ఇట్లా ఏడవాలి- అనే ఈ విషయం మొదటిసారి ఎక్కడ ఏ భాషలో గ్రంథాల్లో చెప్పబడింది? ఏదైనా జరిగితే ఈ ఈ రీతిలో ఈ శబ్దాలు వాడి ఏడవాలి ఇట్లా వ్యక్తపరచాలి అనే విషయం కనిపెట్టింది ఎవరై ఉంటారు? స్త్రీలా, పురుషులా? మనిషి కూడా ఒక జంతువులాగా’ అని చెప్పినప్పుడు కన్నీటిలో జంతువులు ఏడిచి ఉంటే చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడా?

క.సా.— భగవంతుడా దేవుడా పరమాత్మ ఆపద్బాంధవ..

రో.శో.— అసలు పుట్టుకతోనే ఏడుస్తూ జన్మ ప్రారంభమైనప్పుడు, జన్మకు ఆది గుర్తు ఏడుపు అయినప్పుడు, మరి నవ్వుతూ బ్రతకమని మనిషి ఎందుకు శాసించారు? ఏడుస్తూ బతకమని ఎందుకు చెప్పలేదు? నవ్వు నాలుగు విధాల చేటు అని తెలిసినా ఏడుపు చేటు అని ఎవరో చెప్పకపోయినా, ఎందుకో మన సమాజంలో తగిన స్థానం దొరకలేదు.‌ అని అనిపిస్తుంది. ఉదాహరణకు స్టేజీలు ఎక్కి నవ్వించే వారు ఉన్నారు అది ఒక ప్రొఫెషనల్ కానీ ఏడుపుకు ఒక సంప్రదాయం తప్ప వేరే ఏ కులాలు మతాలు జాతులవారు పాటు పడలేదు..

క.సా.— దేవుడా ఏమిటి విషమ పరీక్ష!!

రో.శో.— ఆఁ!! దేవుడు అంటే గుర్తుకు వచ్చాడు- బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి పుట్టగానే కేరుమని ఏడ్చినట్లు ఏదైనా పురాణాలలో ఉంటే నా తీసిస్ కి చాలా అందం వస్తుంది.. అట్లాగే వినాయకుడు కుమారస్వామి కూడా జన్మించగానే రోధించి ఉంటారా? అప్పుడు మానవాళి కాదు దేవతలు కూడా ఏడ్చి మొత్తుకుంటూనే జన్మించారని సిద్ధాంతీకరించవచ్చు.

క.సా.— అబ్బా!!! ఇంకా చాలయ్యా.. ఇదంతా వింటుంటే ఇన్ని విషయాలు మనకు తెలియవే అని నాకు ఇక్కడ ఇప్పుడే ఏడుపొస్తోంది..

రో.శో.— అయితే ఏడ్చి పెట్టండి.. నాకు మరో శాంపుల్ దొరుకుతుంది. నా పరిశోధన కోసం ఎందరినో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎందరిని ఏడిపించాలిసి వచ్చిందో మీరూహించలేరు. మీరు తొలిసారి- నా వైపునుండి ఎట్టి ప్రయత్నం లేకుండా ఏడుస్తాను- అంటున్నారు.. ప్రశ్నలతో కూడా ఏడిపించవచ్చు అనే కొత్త సిద్ధాంతాన్ని కారణాలలో వేసుకుంటాను..

క.సా.— ఏంటి??? నా ఏడుపు మీద పరిశోధన చేస్తావా..? ఆగరా ఆగు. చీపిరి ఏదీ కర్ర ఏది

రో.శో.— అమ్మో అయితే ఇంక నేను ఏడవాల్సి వచ్చేట్టుంది.. నామీద నేనే పరిషోధనాంశం వ్రాయాలి.. కుదరదు.. ఉంటానండి.. ధన్యవాదాలు.. దేవుడా.. ఇక పరుగో పరుగు..

(నీతి- ఇట్లాగే నవ్వుతూ ఉండండి)

రచన-

సంకా ఉషారాణి

Sunday, 19 September 2021

పంచవటి నుండి రహీమాబాద్‌


 ఒక గ్రామంలో, రాజ్‌పుత్, బ్రాహ్మణులు, సెట్టివారు, ఇతర కులాలు, హరిజనులు మొదలైన ప్రజలు నివసించేవారు, అందరూ కలిసి ప్రశాంతంగా జీవించేవారు.

ఒక రోజు ఒక ముస్లిం తన భార్య, ఎనిమిది మంది పిల్లలతో గ్రామ పెద్ద వద్దకు వచ్చి గ్రామంలో ఉండనివ్వమని వేడుకోవడం ప్రారంభించాడు.

గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకునే ఒక వాచ్‌మన్ నిరసన తెలిపాడు కానీ ఎవరూ అతని మాట వినలేదు. ముస్లిం కుటుంబాన్ని గ్రామంలో ఉండటానికి అనుమతించారు.

రోజులు గడిచాయి. ముస్లింల ఎనిమిది మంది పిల్లలు పెళ్ళి చేసుకునే సమయం వచ్చినప్పుడు, ముస్లిం సర్పంచ్ వద్దకు వెళ్లి, హుజూర్ పిల్లలు పెళ్లి చేసుకోబోతున్నారని, నాకు ఒక్క ఇల్లు మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు గ్రామస్తులు అతనికి బంజరు భూమిని ఇచ్చి మీరు దానిపై ఒక ఇంటిని నిర్మించుకోమని చెప్పారు.

దీని తరువాత ముస్లిం సెట్టి వద్దకు వెళ్లి అతని నుండి డబ్బు అప్పుగా తీసుకున్నాడు.

కొంతకాలం తర్వాత, ఆ ఎనిమిది మంది పిల్లలకు 74 మంది పిల్లలు జన్మించారు. సుమారు 30 సంవత్సరాలలో, ఆ గ్రామంలో ముస్లింల జనాభా 40%గా మారింది.

ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు వారి అలవాటు ప్రకారం హిందువులతో గొడవపడటం ప్రారంభించారు. వారి ఇళ్ళ మహిళలు, సోదరి, కుమార్తెలను వేధించడం ప్రారంభించారు.

క్రమంగా, ప్రతి హిందువు తన కుటుంబంతో కలిసి స్వచ్ఛందంగా గ్రామాన్ని విడిచిపెట్టడం ప్రారంభించాడు.

ఒక రోజు గ్రామంలోని ప్రధాన దేవాలయాన్ని ముస్లింలు కూల్చివేశారు. వారు దానిపై మసీదును నిర్మించడం ప్రారంభించారు. తర్వాత మిగిలిన హిందువులు వారిని ఆపడం ప్రారంభించారు, అప్పుడు అల్లాహ్ పనిని ఎవరు అడ్డుకున్నా వానిని చంపేయండి అని ముస్లిం చెప్పాడు.

ముఖాముఖిగా పరిగణించకుండా, మిగిలిన హిందువులు ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. మార్గంలో వాచ్‌మ్యాన్‌తో-మేము మీ మాట వినలేదని మరియు ముల్లాను విశ్వసించామని  చెప్పారు. ఈ కారణంగా వారు ఈ రోజు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.

ఆ గ్రామం పేరు ఇప్పుడు పంచవటి నుండి రహీమాబాద్‌గా మార్చబడింది. ఈ గ్రామం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉంది.
[ఓ వాట్సాప్ హిందీ లేఖకు తెలుగు అనువాదం]

(హిందీ లేఖ ఇక్కడ)

एक गांव में राजपूत, ब्राह्मण, बनिये, तेली, हरिजन आदि जाति के लोग रहते थे, सभी मिलजुल कर शान्ति से रहते थे।🙏🙏

एक दिन गांव के मुखिया के पास एक मुस्लिम अपनी पत्नी और आठ बच्चों के साथ आया और गांव मे रहने की भीख मांगने लगा।

रातों को जागकर गाँव की देखभाल करने वाले एक चौकीदार ने इसका विरोध किया लेकिन किसीने उसकी बात को नहीं माना और मुस्लिम परिवार को गांव में रहने की अनुमति दे दी।

दिन गुजरते गये और मुस्लिम के आठों बच्चे बड़े हो गए जब उनकी शादी की बारी आई तो मुस्लिम सरपंच के पास गया और बोला कि हुजूर बच्चों की शादी होनेवाली है और मेरे पास एक ही घर हैं तो गावँवालों ने उसको एक बंजर जमीन दे दी और कहा कि तुम उस पर घर बना कर रहो ।


इसके बाद मुस्लिम बनिये के पास गया और उससे पैसे उधार लिए ।

कुछ समय बाद उन आठों बच्चों के 74 बच्चे हुए और देखते ही देखते लगभग 30 सालों मे उस गांव में मुस्लिमों की जनसंख्या 40% हो गई।

अब मुस्लिम लड़के अपनी आदत अनुसार हिन्दुओं से झगड़ा करने लगे और उनकी औरतों और बहन बेटियों को छेड़ने लगे ।

धीरे धीरे एक एक हिंदु अपने परिवार को लेकर गांव को स्वेच्छा से छोड़ने लगा।


एक दिन गांव के मुख्य मंदिर को मुस्लिमों ने तोड़ दिया और उस पर मस्जिद बनाने लगे तब वहां के बचे कुचे हिंदूं उनको रोकने लगे तो मुस्लिम बोला कि जो अल्लाह के काम में रुकावट डाले उसे काट डालो ।

सामना करना ठीक न समझते हुए बचे कुचे हिंदुओने वह गांव छोड़ दिया और जाते जाते चौकीदार से बोले कि हमने तुम्हारी बात न मानकर उस मुल्ले पर भरोसा किया जिसकी वज़ह से आज हमें गांव छोड़कर जाना पड़ रहा है।

उस गांव का नाम पंचवटी से बदलकर अब रहीमाबाद हो चुका है । यह गांव महाराष्ट्र के अमरावती जिले में स्थित है।


Saturday, 10 July 2021

తెంస్కృతం నేర్పబడును- (సంభాషణ-మూలక నాటకం)

తెంస్కృతం నేర్పబడును

(సంభాషణ-మూలక నాటకం) -సంకా ఉషారాణి
 

పాత్రద్వయం-
అవధీః-- తాను చెప్పేవాడినని, మిగితావారంతా వినేవారని సింసియర్ గా అనుకనే ఓ పండితంమన్యుడు
స్వధీః-- ఎవరు భా.. వ్యా..  అనగానే వారిని భాషా పండితులు, వ్యాకరణవేత్తలని భ్రమపడే ఓ సగటు సంస్కృతార్థి
------------------------
స్వధీః-- (ప్రవేశించి, వినయంగా) నమస్కారమయ్యా.
అవధీః-- పనిలో వ్యస్తంగా ఉన్నాను.
స్వధీః-- (తనలో తాను) నిజమే.. చేతిలో ఉన్న తాటాకుపత్రాలు తిరగేసి పట్టుకుని కూడా ఏదో పరిశోధన చేస్తున్నట్టున్నాడు.. ఆహా, నా భాగ్యం కొద్దీ దొరికి ఉంటాడీయన.)
అవధీః-- ఏమీ పలకవు? త్వమేవ వా, తెలుగు శిక్షకోసం వచ్చింది?
స్వధీః-- (సభక్తి చెంపలేసుకుని) శిక్ష కాదయ్యా.. సంస్కృతంద్వారా తెలుగు నేర్చుకోవటానికి..
అవధీః-- అదే నేర్వటం సంస్కృతంలో శిక్షధాతువు లేవోయ్.. సరే, దగ్గరగా ప్రవేశించు.
స్వధీః-- అర్థం కాలేదండి..
అవధీః-- ఉప అంటే ఏంటి?
స్వధీః-- దగ్గరగా!
అవధీః-- విశ అంటే?
స్వధీః-- ప్రవేశించు-
అవధీః-- కలిపి?
స్వధీః-- అబ్బో.. అదరగొట్టేసారయ్యా.. (కూర్చుంటూ) ఒకటండి.. నాకసలు వీర విచిత్ర విప్రకృష్ట విధ్వంసంగా సందేహాలెక్కువ..!
అవదీః-- ఎవరో నాబోటి మహాత్ముడే అన్నట్టు- కాయం ఉన్నంతవరకూ సంకాయం తప్పదోయ్..
స్వధీః-- (క్షణం ఆలోచించి) దేహం ఉన్నంతవరకు సందేహం తప్పదోయ్.. అంటున్నారు కామోసు.. సరే అయ్యా.. మీరు నా ప్రతీ అడ్డదిడ్డమైన సందేహం తీరుస్తానంటేనే నేను మీ వద్ద కూర్చుని చదువుకుంటాను.. తమరు అందుకు సమర్థులు కనుకనే మీవద్దకేతెంచాను..
అవధీః-- (సంతోషిస్తూ) సరే- అట్లాగే.. అందరూ అంతేనయ్యా- నా వద్దకే తెస్తుంటారు ఏ సందేహమైనా..
స్వధీః-- కానీ- నేనన్నది ఏతెంచటమండి.. ఏతెంచు ధాతువు.. మీ వద్దకు ఏతెంచాను అని..
అవధీః-- అదేలేవో- నేనూ అదే అంటున్నాను. అంతా నా దగ్గర‘కే’ తెస్తారని.. నీవు తెస్తే, నేను తెంచేస్తాను..
స్వధీః-- (తల విదిలిస్తూ) సరే- సంతోషమయ్యా.. మనకు ఓ సందేహమయ్యా.. అడగవచ్చా? తెంచెదరా?
అవధీః-- అబ్బో, ఆదిలోనే హంసాలవాలమా?
స్వధీః-- (ఆలోచిస్తూ ఏదో తట్టి) హంసాలవాలమా? హంసపాదు మాటకా?కానీ హంసపాదు అంటే “వ్రాతయందు తప్పు గల చోట నుంచెడు హంసపాదాకారమైన గుర్తు.” అని శ్రీహరి నిఘంటువు. అది పాదమే కానీ, ఆలవాలార్థకమని..
అవధీః-- (భృకుటి ముడిచి) ఏకార్ధకాలైతే ప్రయోగాలలో ఏ చారూ ఉండదు.. అందుకే ఇట్లా..
స్వధీః-- (సాలోచనగా పైకి చూస్తూ) చారా? అంటే?
అవధీః-- అదేనయ్యా- రసం..
స్వధీః-- (అత్యాదరంగా చూస్తూ) అబ్బో.. అబ్బో.. ఏమి పాండిత్యం!
అవధీః-- (గర్వంగా నవ్వి) అందుకేగా నా వద్దకు గచ్ఛావు.
స్వధీః-- (ఉలికి పడి సర్దుకుంటూ) ఔనండి.. కానీ రావటం అంటే ఆగమనం కదా..(తనను తానే సరిచేసుకుంటూ) ఆఁ.. ఆగచ్ఛితిని అందుకే ఆవ్రజితిని..
అవధీః-- (ఆ మాత్రం పాండిత్యప్రదర్శను తిరస్కారంగా తల ఊపుతూ) అదంతా సరే సరే- నీవు ఏ సందేహం ఆపతినా పృచ్ఛవచ్చు..
స్వధీః-- (పక్కకు చూస్తూ) ఆపతినా?! అంటే భర్త ఉన్నంత వరకు -అతని చేత..?
అవధీః-- అబ్బే.. అంత దూరం పోకు.. ఆ ఉపసర్గ వేసావు గా.. దానితో ‘పత్’ ధాతువు -
స్వధీః-- (వెడల్పాటి కళ్లతో) ఓహోహో.. పత్ ధాతువా.. అబ్బబ్బ- అంటే- వచ్చిపడినా..! అబ్బా.. ధన్యుడనండి..
అవధీః-- (ఒక గొప్పతనసూచక హాసం (గొ.సూ.హా) చేస్తూ) అగ్గది! అట్లా ఉండాలి నేర్చుకునేవాడు.. నా వద్ద ‘సందేహవందమై’నా వృచ్ఛవచ్చు.
స్వధీః-- సందేహవందమా? అంటే?
అవధీః-- అంటే సందేహశతమన్నమాట! (తన గొప్ప ప్రయోగానికి తానే నవ్వుతూ) చూసావా.. నీకు తెలుగువ్యాకరణపూర్వకభాషతో పాటు సంస్కృతమూ నేర్పేస్తాను.. అహహహ
స్వధీః-- (నవ్వుతూ నమస్కరించి వినయంగా) అహహ.. అందుకే కదా మీ వద్దకు ఆగచ్ఛాను.
అవధీః-- సరే- నీ సందేహప్రథమంబు అధః..
స్వధీః-- అధః ఏమిటండి?
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) అడుగు కదా.. అంటే కింద కదా.. అంటే సంస్కృతంలో అధః..
స్వధీః-- అబ్బబ్బా! ఏమి పాండిత్యమండి.. అడుగడుగునా అడుగే లేనంత పాండిత్యం..
అవధీః-- (కాస్త చిరాకుగా చూసి, తలూపి) అడుగులేని చోట అడుగులేస్తే పడిపోగలము. కవిత్వాల ప్రదర్శనలు మనముందు వలదు. సరే- నీ సమ్యక్ దేహమ్ వెంటనే అధః అధః
స్వధీః-- సమ్యక్ దేహమేమిటండి?
అవధీః-- అబ్బా- పృచ్ఛ పృచ్ఛలోనూ సందేహమేనా? అంటే అడుగడుగునా సందేహమేనా?
స్వధీః-- ఏం చేసేదండి.. అందుకే ఏ గురువులూ నాకు బోధించటం లేదు..
అవధీః-- సరే- మా బాధ, మా బాధ..
స్వధీః-- మీ బాధేమిటండి?
అవధీః-- నా బాధా నీ బాధా కాదయ్యా.. బాధపెట్టకు అంటున్నా- మా నిషేధార్థకావ్యయం. లోట్ మధ్యమం.
స్వధీః-- (తుళ్లిపడుతూ) అబ్బో.. గొప్పగా మాట్లాడేస్తున్నారండి.. కానీ ‘మా’ సరే- మరి ‘బాధ’ ధాతువు ఆత్మనేపదం కదయ్యా.. నాకు తెలిసీ క్రియాఫలం కర్త అభిప్రాయమైతే ఆత్మనే- కాకపోతే పరస్మై కదండి..
అవధీః-- కానీ ఇక్కడ నువ్వు నన్ను బాధపెడుతున్నావు కదోయ్.. పరస్మైయే కదా..
స్వధీః-- (భయం నటించి) అయ్య దేవుడోయ్.. క్షమించేయండయ్యా..
అవధీః-- సరే సరే- మొత్తం శరీరం- అదే నీ- సమగ్రం దేహం చెప్పు..
స్వధీః-- (చేతులు జోడించి) నేను వచ్చీరాగానే ప్రారంభంలో ‘త్వమేవ వా’ అని మీరు నుడివి ఉన్నారు.. వా అనేది ‘ఇదా అదా’ అనే సందేహం లో కదా నిశ్చయార్థంకోసం అడిగేది?
అవధీః- నువ్వు మాకు శిక్షిస్తున్నావా, నేను నీకు శిక్షిస్తున్నానా?
స్వధీః-- అయ్యో. ఎంత మాట! మీరే నన్ను శిక్షిస్తున్నారు!
అవధీః-- ‘నన్ను’ ఏమిటి? నన్ను అంటే దండనార్థకమవుతుంది.. ‘నాకు’ అనాలి..
స్వధీః-- కానీ సంస్కృతంలో ‘శిక్ష్’ ధాతువుతో కర్మకదా- అంటే ‘కర్మణి ద్వితీయా’ కదా.. అంటే మాం శిక్షయ.. నన్ను శిక్షించు- అచ్చుతప్పేం లేదండి..
అవధీః-- అచ్చు ఒక్కటే తప్పు కాదయ్యా- అది హల్లుబహుళ తప్పు.. అంటే- నన్ను లో కనీసం.......
స్వధీః-- (మధ్యలోనే తుంచుతూ) సరే- వదిలేయండయ్యా..
అవధీః-- వదిలేయండయ్యా అంటే? అంటే ఏంటి నీ ఉద్దేశ్యం?
స్వధీః-- అంటే.. అది.. చెప్పకపోయినా ఫరవాలేదని అయ్యా..
అవధీః-- ఫరవాలేదంటే? నీవడిగింది చెప్పటానికి మాకేం హస్తే కాదు- అనా?
స్వధీః-- (తల గోక్కుంటూ..) హస్తే? అదేంటండి..?
అవధీః-- అదే- చేత చేత! చేత వెన్నముద్ద- ఎట్లా అనువదిస్తావోయ్..?
స్వధీః-- అబ్బా- నిజమేనయ్యా- హస్తే అనే!
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) ఇంతకాలం నీవు చేత అంటే సప్తమీ ఉందని గమనించలేదు కదా! అందుకే నాబోటి వారి వద్దకు వచ్చి ఏం చేతకానివారని మాట్లాడకూడదు..
స్వధీః-- మీకేం చేత కాకపోతే నేనిక్కడేం చేస్తుండానయ్యా? చంపేసారయ్యా..
అవధీః-- (గొప్పగా) అదే కదా నా పేరు అర్ధం..!
స్వధీః-- అంటే మీరందరినీ చంపేస్తుంటారా అయ్యా? మీకు అది మరో వ్యాపారమా?
అవధీః- జనాలను చంపితే ఏమొస్తుందోయ్, బూడిద! నేను జనులలోని అజ్ఞానాన్ని చంపేస్తుంటాను.. చాలామందిలోని అజ్ఞానాలను చంపేసాను కూడా.. అందుకే నా పేరు అవధీః..
స్వధీః-- అబ్బా.. ఆహా.. నిజమేనయ్యా.. కానీ వ్యాకరణపరంగా ఎట్టాగో తెలియటం లేదండయ్యా..
అవధీః-- అదేనోయ్- ఆదికావ్యంలో చూడలేదా? క్రౌంచమిధునాదేకమ్ అవధీః అని..
స్వధీః-- (ఆరాధనగా) ఓహ్! అటునుంచి వచ్చారా! ఆహాహా, అబ్బబ్బా! అసలు.......
అవధీః-- అక్కడే ఆగిపో.. క్రౌంచమ్-ఇధున-అదేకాన్ని వ్యాధుడు చంపినట్టు నేనూ....
స్వధీః-- క్రౌంచమ్ ఇధునమేంటయ్యా? కుదర్లేదు.. క్రౌంచమిథునం కదండయ్యా?
అవధీః-- వట్టి అమాయక చక్రవర్తిలా ఉన్నావు.. అందరూ విభజించినట్టు మనమూ విభజిస్తే మన గొప్పేం ఉంది? పార్వతీప-రమేశ్వరౌ అని ఇదివరలో వారు చేసేసారే- అది కుదిరిందా?
స్వధీః-- అదీ నిజమేనయ్యా.. కానీ ఒకటండయ్యా.. ఏకమ్ మాత్రమే ఆ వ్యాధుడు చంపాడయ్యా.. మీరు అనేకమవధీః ఉండాలి..
అవధీః-- ఎందుకులేవో?! ఏకకాన్ని చంపినా శతకాన్ని చంపినా చంపటం సమానం కనుక ఏకశేషం చేసేసుకుందాంలే..
స్వధీః-- ఏకకమేంటయ్యా?
అవధీః-- శతకం పక్కన క ఉంది కదా. అందుకే ఏకను కూడా ఓ కేకేసా.. అంతే! నా పేరు సంగతి ఒంటబట్టిందా? అది చెప్పు.. అందులో స్పష్టత చాలా అవసరం.!
స్వధీః-- ఇదీ బాగానే ఉందయ్యా.. అదే నేననుకున్నాను- అసలు మీపేరు చూసి, ‘అవ’ధీః ఏంటి? ‘కింద’బుద్ధి అని..? మీ పేరు అధిధీః ఉండాలీ అని.. దాని వెనక రహస్యం ఇప్పుడు అర్థమయిందయ్యా..
అవధీః-- రామాయణంలో ఉన్న పేరే కావాలని మా నాన్నగారి పట్టు.. అయితే ఇదివరకెవరకీ ఎక్కడా ఈ భూనభోంతరాళలో భూర్భువాది ఊర్ధ్వలోకాలలో అతలవితలసుతలాది అధోలోకాలలో ఆ పేరు ఉండకూడదని మా అమ్మగారి పట్టు.. దాంతో అంతా వెతికి ఈ పదంతో అయితే ఎవ్వరికీ ఎక్కడా ఇంతవరకు పేరు లేదని అట్లా పెట్టేసారన్నమాట..
స్వధీః-- క్రియాపదాలతో పేర్లు పెట్టేసుకోవటం కూడా మంచి పద్దతే.. కనీసం అర్థం పర్థం లేని పేర్లకంటే నయం కదయ్యా. మీ పెద్దోళ్ళు చేసింది సత్యంగా బాగుందయ్యా.. ఎంతైనా గొప్ప పండితుల కుటుంబం!.
అవధీః-- (తబ్బిబ్బౌతూ) అసలు.. అసలు.. నా నోటితో నేను చెప్పుకోకూడదు కానీ.. ఇంత పాండిత్యం అసలు నేనెట్లా భరిస్తానని ఆ భగవంతుడు నాకు ఇది ప్రసాదించాడో కానీ..
స్వధీః-- నిజమేనండయ్యా.. దేవుడు భలేగా అన్యాయాలు చేసేస్తుంటాడండయ్యా..
అవధీః-- అన్యాయం కాదు కానీ బాధ్యత! అజ్ఞాననాశనభారభాద్యత..
స్వధీః-- బాధ్యత అనుకుంటానండయ్యా..
అవధీః-- అంటే- బ అని అల్పప్రాణం పెడితే భలో ఉన్న భారం తొంగిచూడదని...
స్వధీః-- అభ్భభ్భభ్భ!
అవధీః-- ఆ ధాయిత్వంతో శిరస్సు సూక్ష్మాలవుతోందీ అంటే నమ్ము..
స్వధీః-- (తల ఊపుతూ) సూక్ష్మాలేమిటయ్యా?
అవధీః-- (తనలో తాను) హమ్మయ్య- ధాయిత్వం గురించి అడిగాడు కాదు.. (బయటకు) అదే అదే, బద్దలవుతోంది అని.. ‘బద్ద’కు ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) అనే ఉపకోశంలో సూక్ష్మః అని ఉండటం నీవు చూడలేదా? ఇప్పుడు మనం వేసిన ‘బద్దలు’ అంటే ‘బద్ద’కు బహువచనం కదా.
స్వధీః-- అసలు- ఏం తర్కమండి! ఆహా.. నిజమేలే అయ్యా.. అక్షరాలా..!
అవధీః-- మాకు పొగడ్తలస్సలు పడవు. ‘పొగడ్తలు అనే ఆగడ్తలలో పడరాద’ని మా జనకమాత చెప్పేవారు..
స్వధీః-- భలే చెప్పారండి.. జనకమాత ఎవరండి? సీతమ్మవారి నాన్నమ్మగారా? శ్రీమద్రామాయణంలో ఎన్నో శ్లోకమండి?
అవధీః-- రామాయణం కాదు నాయనా! మా జనకమాత చెప్పారు.... మా నాన్నమ్మ..
స్వధీః-- అబ్బా.. ఆహా.. తండ్రి తల్లి పితామహీ అనుకున్నానయ్యా ఇంతకాలం..
అవధీః-- ఇప్పుడూ అనుకో.. సరే- మొదలు సందేహం అడుగు.. మావి విశిష్టప్రయోగలు.. మా మాటలు టమాటాలకన్నా పుల్లనివి! ఎర్రనివి! చారు ఆస్వాదనం చేయాలి.. ప్రతీ పదానికీ ఆపతిస్తూంటే ఇంక అంతే..
స్వధీ-- సరేనండి.. మధ్యాపతించను.. అంటే- మధ్యలో పడను.. నా సందేహమేమిటంటే- మీరు ‘త్వమేవ వా’ అన్నారు.. కానీ ‘వా’ అవ్యయం “వా+కా । ౧ వికల్పే ౨ సాదృశ్యే ౩ అవధారణే ౪ సముచ్చయే అమరః”। అని వాచస్పత్యంలో ఉన్నది. అందులో ప్రశ్నార్థకం లేదు కదా..
అవధీః-- ఆమాత్రం తెలియకనే ప్రయోగించామనా?
స్వధీః-- (కంగారుగా) అయ్యో- అట్లా కాదండయ్యా.. సందేహం వస్తే చెప్పమన్నారు మరి..
అవధీః-- (ముఖమంతా చిట్లించి సూటిగా చూస్తూ) తల్లి గర్భంనుండే సంస్కృతంతో పుట్టినవారం.. మాకే చెబుతున్నావా భాష గురించి?
స్వధీః-- (ముక్కుమీద వేలేసుకుని) లేదయ్యా.. కానీ నాకేమో శిక్షించుకోవాలనే తాపత్రయంలో వెయ్యి సందేహాలండయ్యా..
అవధీః-- అయితే నీకు సమ్యక్-దేహ-దేహి అన్నమాట..
స్వధీః-- (మూతి కిందకు విచరిచి) అసలు బొత్తిగా ఏమీ ఎక్కలేదయ్యా..
అవధీః-- సందేహమన్నచో సమ్యక్ దేహం- అంటే మంచి శరీరమన్నమాట.. నీకు సమ్యక్ దేహంబులు వెయ్యి కదా..! వెయ్యి అంటే సంస్కృతంలో ఏమిటి? ‘దేహి’ అనే కదా..
స్వధీః-- అదెట్లా?
అవధీః-- ఇప్పుడూ, అన్నం తినే వేళ కూర వెయ్యి, పచ్చడి వెయ్యి అంటానికి ఏమంటావు?.....
స్వధీః-- (వెలిగే కళ్ళతో) ఆహా.. ఆహా.. ‘దేహి’ అనే కదా! అబ్బ.. అర్థమైందయ్యా..
అవధీః-- దేహి అనకుండా గేహికి గడవదయ్యా..
స్వధీః-- అబ్బో! అసలిదైతే- ఏం చెప్పాలి! ఏం మాట! గొప్ప సూక్తండయ్యా.. ఆగండి.. వ్రాసేసుకుంటాను..
అవధీః-- (గొప్పగా కనుబొమ్మలు తిప్పి) అది! చాలు. విరమిద్దామిక..
స్వధీః-- అంటే విశేషంగా రమిద్దామనా అయ్యా?
అవధీః-- అదీ సరైనదేననుకో! జ్ఞానంలో రమించటమే మాబోటి పండితుల పంచమం-నిషాదం...
స్వధీః-- పంచమం-నిషాదం ఏమిటయ్యా?
అవధీః-- సంగీతశాస్త్రం తియ్యవోయ్..  
స్వధీః-- అబ్బో.. పంచమమంటే -ప; నిషాదం అంటే ని- కిందపడి దొర్లి దొర్లి పొర్లాలనే కోరికను నియంత్రించుకుంటూన్నానయ్యా.. అహో..అయ్య అమ్మోయ్..
అవధీః-- (మరింత వికృతంగా కనుబొమ్మలు తిప్పి) అయితే నీకు తెలుగు శిక్షించాలా?
స్వధీః-- అయ్యో.. తెలుగు శిక్షించవద్దయ్యా.. నేర్పాలి..
అవధీః-- అదేలోవో.. మా దగ్గర ఏం నేర్చినా శిక్ష జరిగిపోతుందంతే..
స్వధీః-- ఆయ్.. అది ఇక్కడ పాదం మోపగానే తెలిసిపోయిందయ్యా.
అవధీః-- అస్తు, అధునా వయం తెలుగు శిక్షామః.. అంటే ఇప్పుడు మనం తెలుగు నేరుద్దాం..
స్వధీః-- (ప్రశ్నార్థకంగా చూసి) అయ్యా,, శిక్షధాతువు ఆత్మనేపదం కదా..
అవధీః-- అంటే? నాకు ఆమాత్రం తెలియదనా?
స్వధీః-- (కంగారుగా) అయ్యో.. అట్లా కాదు..
అవధీః-- (వివరిస్తూ) నా ప్రతీ ప్రయోగంలో వెనక ఏదో అంతరా‘ర్ధం’ ఉంటుంది.. ఒప్పుకుంటావా?
స్వధీః-- అది తెలుసుకోవాలనే తాపత్రయం అయ్యా.. కానీ వచ్చిందగ్గరి నుంచీ చూస్తున్నాను. థ రావాల్సిన చోటల్లా మీరు ధ అంటున్నారు.. ఇప్పుడు అది అంతరా‘ర్థం’ అనుకుంటా.. అర్థంలో థకారం కదా..
అవధీః-- అదే అదే- అధికప్రసంగమంటే..
స్వధీః-- (తగ్గుతూ) మూసుకుంటానండి..
అవధీః-- (వినయానికి సంతోషిస్తూ) ఇప్పుడు నీకు నేర్పుతూ నేనూ నేరుస్తున్నాను కదా.. అంటే పరస్మైపదమే కదా..
స్వధీః-- (చేతులు జోడించి) అబ్బా.. పడేసారయ్యా.. అంతే.. కాళ్ళమీద పడిపోతున్నానంతే..
అవధీః-- (చేతులతో ఆపి) అదే అతివినయం- నాకు పతదు..
స్వధీః-- (ఆలోచిస్తూ) ఓహ్.. పడదా..! అర్థమైంది. ఇప్పుడు మీరింత గొప్ప ప్రయోగాలు మీపాటికి మీరు చేసుకుంటూ పోయి, నాకు అర్థమే కాలేదనుకోండయ్యా.. అప్పుడు మీరవి ఎంత గొప్పగా చేసీ ప్రయోజనమేముందయ్యా?
అవధీః-- (సంతోషంగా) సరైన తర్కం పట్టావోయ్.. అదీ నిజమేలే.. చెప్పేవాడికి ఓపికుండాలి..
స్వధీః-- ఇంకోటేంటంటే.. మీ విశిష్టప్రయోగాలు మీరే తప్ప మరొకరు విప్పే సాహసం చేయగలరా?
అవధీః-- (ఇంకా ఉబ్బిపోతూ) నిజమే నిజమే.. లెస్స పలికితివి.. సరే- ఇహ పఠ మొదలెడదామా?
స్వధీః-- పఠ ఏమిటయ్యా?
అవధీః-- తెలుగులోకి అనువదించవోయ్.. పఠ అంటే?
స్వధీః-- చదువు..!
అవధీః-- అదే కదా నేనన్నది..! సరిపోయిందా లేదా?
స్వధీః-- (ఆశ్చర్యంగా) అబ్బబ్బబ్బా.. ఇదైతే.. అసలు- అసలు కింద పడి కొట్టుకోవాలనిపిస్తోందండి..
అవధీః-- సరే- పఠ అయినాక ఆపణంకో..
స్వధీః-- ఆపణంకో?
అవధీః-- ఆపణాన్ని తెలుగులో ఏమంటారు?
స్వధీః-- (ఆలోచిస్తూ) దుకాణం.. కాదు.. కొట్టు..
అవధీః-- ఆఁ!! అదే.. కొట్టుకో అన్నాను..
స్వధీః-- అసలు, అసలు మీరూ.. అబ్బాబ్బా.. అబ్బా..
అవధీః-- పితః పితః అని తరువాత కొట్టుకుందూ..
స్వధీః-- పితః ఏమిటయ్యా..?
అవధీః-- అబ్బ అబ్బ అంటున్నావు కదా.. అమ్మా అబ్బా అంటే తల్లిదండ్రులే కదా..
స్వధీః-- అమ్మమ్మమ్మా...
అవధీః-- జననీమాతామాతా! అమ్మమ్మ వాళ్ళ అమ్మా?
స్వధీః-- ఇంకా నయం! ఇంకో నాలుగు తరాలు దింపారు కాదు... ఆహాహాహాహాహ.. అసలు.....
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) సరే సరే- ఆగిపో.. అక్కడే!
స్వధీః-- సరేనయ్యా.. ‘వా’ గురించి నా సందేహానికి ఇంకా మీరు చెప్పలేదయ్యా..
అవధీః-- వా లో అసలు సందేహం ఏముంది? ఏమీలేదు. అది తెలుగు ‘వా’యే..! వికల్పార్థం. తెలుగులో- వస్తావా, రావా, పోతావా, ఉంటావా, లేస్తావా..- అదే కన్నడంలో- అల్వా, ఇల్వా- సంస్కృతంలోనూ అంతే- !
స్వధీః-- అబ్బో- నిజమేనయ్యా.. కానీ వాడు వస్తాడా, ఆమె వస్తుందా, వాళ్ళు వస్తారా, మీరు వస్తారా అన్నింటికీ వాడుతున్నారుగా..
అవధీః-- ఆప్టే తెరవవోయ్.. (d) possibility; అని ఉంటుంది చూడు..
స్వధీః-- మరి తెలుగన్నారు కదయ్యా- ఆప్టే తెలుగు కాదు కదా..
అవదీః-- (తల గోక్కుని) చెడ్డ చిక్కు తెస్తావోయ్.. సరే- ఆప్టేకోశం సంస్కృతమే.. వా కూడా
స్వధీః-- అది నిజమే కానీండయ్యా, మరి ప్రయోగాలు కదా మనకు శరణ్యం.. కోశంలో అర్థం ఉంటే ఉంది- అది మన ఇతిహాసపురాణాలలో అంత చేటు - అదే ఈనాడు మన వాడుతున్నంతగా ప్రయోగంలో ఎక్కడైనా ఉన్నదా?
అవధీః-- ఇప్పుడు ఉంటే ఎంతయ్యా? ఉండకపోతే ఎంత? మనకు కావాల్సింది కోశంలో ఉంది కదా.. అంతే.
స్వధీః-- సరేనండయ్యా- ఇహ తాము పాఠం చెప్పండి.
అవధీః-- అంటే ఇప్పటిదాకా నృత్యం చేసానా?
స్వధీః-- అట్లాగ కాదండయ్యా..
అవధీః-- ఇదీ పాఠమే. ఇంత సంశరీరనిఏనుగులో ఎన్ని పాఠాలు చెప్పేసానో-
స్వధీః-- సంశరీరనిఏనుగులోనా? సంశరీరమంటే సందేహమే.. కానీ ఏనుగేమిటయ్యా?
అవధీః-- ఏనుగు ముందు మరో అక్షరం వేసాను.. చూడు- ని-అని! అంటే ఏంటి? సంస్కృతంలో ఆలోచించేయటమే..
స్వధీః-- ఏనుగుపేర్లా? సంస్కృతంలోనా? (తనలో తనుగా) దన్తీ దన్తావలో హస్తీ ద్విరదోఽనేకపో ద్విపః,
మతఙ్గజో గజో నాగః కుఞ్జరో వారణః కరీ, ఇభః స్తమ్బేరభః పద్మీ యూథనాథస్తు యూథపః (ఆలోచిస్తూ) అమరకోశమంతా ఇవే పదాలే.. వీటిలో ఏదై ఉంటుందబ్బా.. నిఏనుగు.. అంటే.. నికరీ, నిహస్తీ.. ఉఁహుఁ.. నివారణ.. ఆ!! నివారణ.. అంటే- సందేహనివారణ అన్మాట..! అబ్బో.. అదిరిందండి.. ఆహా, ఓహో, ఏమి మేధావులండి మీరు..
అవధీః-- (కాస్త కుదుటపడి) సరే సరే- ఊరికే పనిలేనివాడిలా నీతో పొగిడించుకోవటానికి రప్పించుకోలేదు. కాస్త నువ్వూ సొంతంగా ఏదైనా ఆలోచిస్తూండు. ఎప్పుడైనా ఏదైనా ఆలోచనలొస్తే నాతో చెప్పు.. నేనో పరిశోధనపత్రం వ్రాసుకుంటాను.. సరేనా? వచ్చాక కలువు..
స్వధీః-- అట్లాగేనండయ్యా.. మీ మాటలే కాదు, మీ సలహా కూడా కంపేనయ్యా ..
అవధీః-- (ఉలికిపడి) కంపేమిటోయ్?
స్వధీః-- అదేనయ్యా- కంప్ ధాతువు- అదిరింది అని..
అవధీః-- (గొప్పగా) అయితే సరే- ప్రస్తుతానికి ఇదే నీ గురుదక్షిణగా భావిస్తాను.. శుభమస్తు..
స్వధీః-- నమస్కారమయ్యా..
అవధీః-- శుభం భూయాత్..
స్వధీః-- (నమస్కారాలు చెప్తూ ఆనందంగా వెళిపోయాడు)