ఒక మంచి మాట-
ఈ భాగవతపద్యం చూడండి-
ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ
ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః ॥10.46.8॥
అనువాదం- ఉద్ధవుడు సూర్యుడు అస్తమించుచుండగా వ్రజాన్ని చేరాడు. గోగణాల యొక్క డెక్కల వల్ల రేగిన ధూళితో కప్పబడిన రథముగలవాడై, వ్రజగోవుల పాదరేణువులవల్ల కలిగిన పుణ్యమే సంపదగా కలవాడై నందవ్రజాన్ని ప్రవేశించాడు.
కృష్ణుని సందేశం తీసుకొని, ఉద్ధవుడు మధుర నుండి వ్రజానికి వచ్చినప్పుడు ఆయన రథానికి, ఒంటికి అంతా దుమ్ము అయింది. అయితే అది పవిత్రమైన గోవులుతిరగాడే భూమి. కనుక ఆ ధూళి గోధూళి. అది ఒంటిమీద పడినందుకు ఉద్ధవుడు బాధపడలేదు. పైగా సంతోషపడ్డాడు. గర్వించాడు. తనను తాను ధన్యుడుగా భావించాడు. అంటే వాటి డెక్కల ధూళి కూడా అంత పుణ్యాన్ని, మానసికానందాన్ని కలిగించే శక్తి కలది అని తెలుస్తుంది. అటువంటి భావనను మనలో నింపే గోవులు అంతటా తిరగాడిన భూమి భారతభూమి. కానీ ఈనాడు పూజించుకొందామన్నా ఒక్క దేశీగోవు దొరకటం కష్టమైపోతోంది. కనీసం ముందుగా మన హైందవ పారంపరిక సంపదలలో ఒక్క గోమాతను కాపాడుకోగలిగినా చాలు.. హైందవులు తిరిగి శక్తిని పుంజుకోగలరు. వందే గోమాతరం.

No comments:
Post a Comment