మన దేశంలో ఋషులు, మునులచేత వ్రాయబడిన ధర్మశాస్త్రం మనకు
నిత్యం కర్తవ్య బోధ చేస్తుంది. జీవనప్రవాహంలో పడి మనం ఏదైనా నిర్లక్ష్యం చేస్తే శాస్త్రం
సున్నితంగానో, గట్టిగానో మనకు మరచిన విషయాన్ని గుర్తు చేస్తుంది.
అది ఆచరించకపోతే ఎదుర్కోవలసిన పరిణామాలు వైపు మన దష్టిని మరలుస్తుంది. భూమిపై మనం జీవించే
ఈ లోకానికి అవతల ఏదీ లేదనే నాస్తికుల సంగతి చెప్పలేం. కానీ లోకంలో జరిగే ప్రతి క్రియకు
ప్రతిక్రియ ఉంటుంది అనే సత్యాన్ని అంగీకరించేవారు మాత్రం సదా గుర్తుంచుకోవలసింది ఏంటంటే-
ఒక ధర్మమైన పని చేస్తే పుణ్యం వస్తుంది. ధర్మం తప్పితే పాపం తగులుతుంది. పాపాన్నైనా
పుణ్యాన్నైనా మనం అనుభవించి తీరాలి. వాటికోసం నిర్దేశించబడిన స్థానాలే స్వర్గ నరకాలు.
స్థితి కలిగీ తల్లిదండ్రులను ఆదరించని పుత్రులకు కలగబోయే పరిణామం ఈ శ్లోకంలో చెప్పబడింది.
ఇధి ఆయా పనులను చేస్తున్న పుత్రులలో అపరాధభావాన్ని కలిగించటానికి ఉపదేశించబడినవి కావు.
ఎంత వీలైతే అంత త్వరగా ఆ అధర్మం నుండి బయటపడి ఆ దుష్పరిణామాన్ని తప్పించుకోండి- అనే
హెచ్చరిక మాత్రమే.
యస్తయోరాత్మజః కల్ప
ఆత్మనా చ ధనేన చ
వృత్తిం న దద్యాత్ తం
ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి ॥.10.45.6॥
ఏ పుత్రుడు శరీరంతో
(బలము/పరాక్రమంతో) సంపదతోనూ సమర్థుడైనా తమ తల్లిదండ్రులకు పోషణభారాన్ని స్వీకరించడో
ఆతనిచే యమదూతలు నరకంలో తన మాంసాన్నే తినిపిస్తారు. (శ్లోకానువాదం- శ్రీ కెవిఆర్.కే ఆచార్యులు)
No comments:
Post a Comment