ధ్యేయః సదా
సవితృమండలమధ్యవర్తీ, నారాయణః
సరసిజాసనసన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్
కిరీటీ, హారీ
హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ॥
సవితృ-మండల-మధ్యవర్తీ, నారాయణః సరసిజ-ఆసన-సన్నివిష్టః,
కేయూరవాన్, మకర-కుండలవాన్, కిరీటీ, హారీ, హిరణ్మయ-వపుః,
ధృత-శంఖ-చక్రః సదా ధ్యేయః ॥
సవితృ-మండల-మధ్యవర్తీ = సూర్యమండలమధ్యంలో ఉన్న
నారాయణః =
నారాయణుడు
సరసిజ-ఆసన-సన్నివిష్టః = కమలాసనంలో కూర్చున్నవాడు
కేయూరవాన్ = కేయూరములు (భుజకీర్తులు)
ధరించినవాడు
మకర-కుండలవాన్ = మొసలిఆకారం కల చెవుల దిద్దులు ధరించినవాడు
కిరీటీ = కిరీటం ధరించినవాడు
హారీ = అందమైనవాడు
హిరణ్మయ-వపుః = బంగారుమయమైన శరీరం కలవాడు
ధృత-శంఖ-చక్రః = శంఖచక్రాలు ధరించినవాడు
సదా ధ్యేయః =
నిత్యం (మన చేత) ధ్యానించబడవలసినవాడు
సూర్యమండలమధ్యంలో ఉన్న, నారాయణుడు, కమలాసనంలో
కూర్చున్నవాడు, కేయూరములు (భుజకీర్తులు) ధరించినవాడు,
మొసలి ఆకారం కల చెవుల దిద్దులు ధరించినవాడు, కిరీటం
ధరించినవాడు, అందమైనవాడు, బంగారుమయమైన
శరీరం కలవాడు, శంఖచక్రాలు ధరించినవాడు (అయిన సూర్యుడు మనచేత)
నిత్యం ధ్యానించబడవలసినవాడు.
No comments:
Post a Comment