ఏహి సూర్య సహస్రాంశో
తేజోరాశే జగత్పతే ।
అనుకంపయ మాం భక్త్యా
గృహాణార్ఘ్యం దివాకర ॥
సూర్య, సహస్రాంశో, తేజోరాశే,
జగత్పతే, ఏహి. మాం అనుకంపయ. దివాకర, భక్త్యా అర్ఘ్యం గృహాణ ॥
సూర్య = ఓ సూర్యుడా
సహస్రాంశో = అనంతమైన కిరణాలుకలవాడా
తేజోరాశే = తేజస్సు యొక్క రాశి
జగత్పతే = ప్రపంచానికి అధిపతీ
ఏహి = రావయ్యా
మాం = నన్ను
అనుకంపయ = దయతో చూడు
దివాకర = ఓ సూర్యభగవాన్
భక్త్యా = భక్తి చేత
అర్ఘ్యం = అర్ఘ్యాన్ని
గృహాణ = తీసుకో
ఓ సూర్యుడా, అనంతమైన కిరణాలుకలవాడా, వెలుగుల రాశీ, ప్రపంచానికి అధిపతీ, రావయ్యా. నన్ను కరుణించు. ఓ దివాకరా, భక్తిచేత (నేను
ఇచ్చే ఈ) అర్ఘ్యం తీసుకో.
No comments:
Post a Comment