గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్
మనసి లసతు మమ నిత్యమ్ ॥
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
1. జలజనయన విధినముచిహరణముఖ-
విబుధవినుత-పదపద్మ -2
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
2. భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ -2
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
3. శఙ్ఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ -2
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
4. అగణిత-గుణగణ అశరణశరణద-
విదలిత-సురరిపుజాల -2
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్-2
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥
-------------------------
ఈ పాటలో ముఖ్యంగా ఉన్నది - రెండు విషయాలు- మొదటి పంక్లిలో భగవంతుని గుణవిశేషణాలతో సంబోధన.
రెండవ అంశం- అటువంటి గుణవిశేషాలు కలిగిన తండ్రికి ప్రార్థన.. ఇది పునరావృతమవుతుంటుంది.
--------------
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి లసతు మమ నిత్యమ్
॥
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి మమ నిత్యమ్
లసతు ॥
గరుడ-గమన, = ఓ గరుడుని వాహనంగా కలిగినవాడా, గరుడునిపై విహరించేవాడా
తవ చరణకమలమ్ = నీ పాదాలనే కమలాలు
ఇహ మమ మనసి = ఇక్కడ నా మనసులో
నిత్యం లసతు = ఎల్లప్పుడూ విలసిల్లుగాక
మమ తాపమ్ అపాకురు దేవ =నా పాపాన్ని హరించు.
మమ పాపమ్ అపాకురు దేవ = నా తాపాన్ని హరించు.
(ఇదే పంక్తి ప్రతి చరణంలో పునరావృతమవుతుంది.)
ఇక చరణాలు-
1. జలజ-నయన, విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ
జలజ-నయన = ఓ కమలముల వంటి కన్నులు కలిగినవాడా
విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ ==
విధి- = బ్రహ్మ
నముచి-హరణ- = ఇంద్ర (నముచి అనే రాక్షసుని సంహరించినవాడు)
ముఖ- = ముఖ్యంగా కలిగిన
విబుధ-వినుత- = విబుధజనులచేత స్తుతింపబడే
పద-పద్మ = పాదపద్మాలు కలిగినవాడా
అంటే ఎవరి చరణాలనే పద్మాలను బ్రహ్మాదులు స్మరిస్తారో, (స్తుతిస్తారో) అటువంటివాడు.
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
2. భుజగ-శయన, భవ-మదన-జనక, మమ జనన-మరణ-భయ-హారీ ॥
భుజగ-శయన = పాము శయ్యపై పడుకుని ఉండేవాడా
భవ-మదన-జనక = సంసారానికి, మన్మథుడికి తండ్రి అయినవాడా
మమ జనన-మరణ-భయ-హారీ = నా జన్మ, మరణం అనే భయాన్ని పోగొట్టేవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
3. శఙ్ఖ-చక్ర-ధర దుష్ట-దైత్య-హర సర్వ-లోక-శరణ
॥
శఙ్ఖ-చక్ర-ధర = శంఖాన్ని చక్రాన్ని ధరించినవాడా
దుష్ట-దైత్య-హర = దుష్టులైన రాక్షసులను సంహరించేవాడా
సర్వ-లోక-శరణ = అన్ని లోకాలకు శరణు అయినవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
4. అగణిత-గుణగణ అశరణ-శరణద విదలిత-సుర-రిపు-జాల
॥
అగణిత-గుణగణ = లెక్కపెట్టలేనన్ని గుణాల గణాలు (గుంపులు) కలిగినవాడా
అశరణ-శరణద = శరణులేనివారికి శరణు ఇచ్చేవాడా
విదలిత-సుర-రిపు-జాల ==
విదలిత- = చీల్చినవాడా
సుర- = సురులు అంటే దేవతల యొక్క
రిపు- = రిపులు అంటే రాక్షసులను
జాల = జాలాలను, (దళాలను)
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
5. భక్తవర్యమ్ ఇహ భూరి కరుణయా పాహి
భారతీ-తీర్థమ్ ॥
ఇహ భక్తవర్యమ్ భారతీ-తీర్థమ్ భూరి కరుణయా పాహి ॥
భక్తవర్యమ్ = భక్తులలో అగ్రగణ్యుడిని
భారతీ-తీర్థమ్ = భారతీ-తీర్థుని (రచయిత మహాస్వామి)
ఇహ = ఇక, ఇక్కడ
భూరి కరుణయా = చాలా కరుణతో
పాహి = రక్షించు
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
పెద్దలకు వందనాలు! పై కీర్తనలోని నా ఈ చిన్న సందేహాన్ని నివృత్తి చేయవలసిందిగా ప్రార్థన. ఆఖరి చరణంలో భక్తవర్యం(భక్తుల్లో అగ్రగణ్యుడు) అని గురువు గారు తనని తానే ప్రకటించు కోవడం ఆత్మ స్తుతి కాద?? ఇది ఎంతవరకు సమంజసం? శంకరాచార్యుల రచనలో ఎక్కడా ఇటువంటి శైలి ఉండదు కద!! ఎవరు ఆ స్తోత్రాన్ని చదువుతారో వాళ్లకు వర్తించేలా ఉంటే అది ఉన్నత మైన శైలి. గురువు గారు అలా ఎందుకు చెయ్య లేదు??
ReplyDeleteI thinks since he had composed it so he would like add his name. but when you chant this song instead of using his name - you can replace with your guru name or anyone whom you love. nice composition and easy to sing,. why will we care about last line - bottom line- giving inner peace and happiness or not.
ReplyDelete