॥ శివప్రార్థన ॥
అసితగిరిసమం స్యాత్ కజ్జలం
సింధుపాత్రే,
సురతరువరశాఖా
లేఖనీ పత్రముర్వీ ।
లిఖతి యది గృహీత్వా శారదా
సర్వకాలం,
తదపి తవ
గుణానామీశ పారం న యాతి ॥
సింధు-పాత్రే కజ్జలం
అసిత-గిరి-సమం స్యాత్; సుర-తరువర-శాఖా లేఖనీ (స్యాత్); ఉర్వీ పత్రం (స్యాత్); శారదా
గృహీత్వా సర్వ-కాలం యది లిఖతి, ఈశ, తద్ అపి తవ గుణానాం పారం న యాతి ॥
సింధు-పాత్రే = సముద్రం
(అంత) పాత్రలో
కజ్జలం = కాటుక (వ్రాసే
సిరా)
అసిత-గిరి-సమం
స్యాత్ = నల్లని కొండ అంత ఉంటే
సుర-తరువర-శాఖా = కల్పవృక్షం
(దేవతల శ్రేష్ఠవృక్షం) యొక్క కొమ్మ
లేఖనీ = లేఖని (వ్రాసే
పరికరం, కలం)
ఉర్వీ = భూమి
పత్రం = (వ్రాసేందుకు)
కాగితం
శారదా = సరస్వతీ
దేవి
గృహీత్వా = చేత పట్టి,
తీసుకుని
సర్వ-కాలం = అన్ని
వేళలా
యది లిఖతి = ఒకవేళ వ్రాస్తే
ఈశ = ఓ పరమేశా
తదపి = అయినప్పటికి
తవ గుణానామ్ = నీ
గుణాలయొక్క
పారం = ఆవలి ఒడ్డును
న యాతి = చేరజాలదు.
సముద్రమంత పాత్రలో నల్లని
కొండ అంత సిరా ఉంటే, కల్పవృక్షం కొమ్మ లేఖనిగా అయ్యి, భూమి (వ్రాసేందుకు) కాగితం
కాగా, సరస్వతీ దేవి (రచయిత్రి అయ్యి) అన్ని వేళలా (కదలకుండా కూర్చుని) ఒకవేళ వ్రాస్తే,
ఓ పరమేశా, అయినప్పటికీ నీ గుణాలయొక్క ఆవలి ఒడ్డును చేరజాలదు.
No comments:
Post a Comment