॥ సంక్షిప్తరామాయణం ॥
ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా
మృగం కాంచనం,
వైదేహీహరణం జటాయుమరణం
సుగ్రీవసంభాషణం ।
వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం,
పశ్చాద్రావణకుంభకర్ణహననం
ఏతద్ధి రామాయాణం ॥
ఆదౌ రామతపోవనాదిగమనం మృగం
కాంచనం హత్వా, వైదేహీ-హరణం
జటాయు-మరణం సుగ్రీవ-సంభాషణం వాలీ-నిగ్రహణం సముద్ర-తరణం లంకా-పురీ-దాహనం, పశ్చాద్-రావణ-కుంభకర్ణ-హననం ఏతద్ హి రామాయాణం ॥
ఆదౌ = ముందు
రామ-తపోవనాది-గమనం =
రాముడు తపోవనాలకు పోవటం
మృగం కాంచనం హత్వా =
బంగారు లేడిని చంపి
వైదేహీ-హరణం = సీత అపహరించబడటం
జటాయు-మరణం = జటాయువు
చనిపోవటం
సుగ్రీవ-సంభాషణం = సుగ్రీవునితో
సంభాషించటం
వాలీ-నిగ్రహణం = వాలిని
వధించటం
సముద్ర-తరణం = సముద్రాన్ని
దాటటం
లంకా-పురీ-దాహనం = లంకను
దహించటం
పశ్చాద్-రావణ-కుంభకర్ణ-హననం
= తరువాత రావణకుంభకర్ణులను వధించటం
ఏతద్ హి = ఇది
రామాయాణం = శ్రీమద్రామాయణం
(కథ)
ముందు రాముడు తపోవనాలకు పోవటం, బంగారు లేడిని చంపటం, సీత
(రావణుడి చేత) అపహరించ బడటం, జటాయువు చనిపోవటం, సుగ్రీవునితో (శ్రీరాముడు)
సంభాషించటం, వాలిని వధించటం, (హనుమంతుడు) సముద్రాన్ని దాటటం, లంకను దహించటం, తరువాత
(శ్రీరాముడు) రావణకుంభకర్ణులను వధించటం- ఇది శ్రీమద్రామాయణం.
No comments:
Post a Comment