Monday, 8 August 2016

ప్రార్థన- ఆదిత్యస్య నమస్కారం



ఆదిత్యస్య నమస్కారం యే కుర్వంతి దినే దినే ।
జన్మాంతరసహస్రేషు దారిద్ర్యం నోపజాయతే॥

యే ఆదిత్యస్య నమస్కారం దినే దినే కుర్వంతి, (తేషాం) జన్మాంతర-సహస్రేషు దారిద్ర్యం న ఉపజాయతే॥

యే = ఎవరైతే
ఆదిత్యస్య = సూర్యునికి
నమస్కారం = నమస్కారమును
దినే దినే = ప్రతిరోజు
కుర్వంతి = చేస్తారో
జన్మాంతర-సహస్రేషు = తరువాత రాబోయే వేల జన్మలలో
దారిద్ర్యం = దరిద్రం, లేమి
న ఉపజాయతే = కలుగదు

ఎవరైతే ప్రతిరోజు సూర్యునికి నమస్కరిస్తారో, (వారికి) వేయిజన్మలవరకు దారిద్ర్యం (పేదరికం, అన్నిరకాల లోటు, లేమి) కలుగదు.

No comments:

Post a Comment