సంస్కృతం నేర్చుకోవాలని అందరూ కోరుకుంటారు. బాగా సంస్కృతభాష పరిజ్ఞానాన్ని
ఎట్లా పొందగలం?
దాని కోసం మొదలు ప్రాథమిక స్థాయి జ్ఞానం కావాలి.
విభక్తులు, క్రియారూపాలు, కృదంతాలు, విశేషణ-విశేష్యభావాలు, కర్మణి-కర్తరి-ప్రయోగాలు, సంధులు, సమాసాలు బాగా తెలియాలి. తరువాతే
సంస్కృతభాషణానికి ప్రయత్నించాలి.
1. భాషణం కోసం శ్రవణం చాలా
ఆవశ్యకం. ఎంత వింటామో అంత మాట్లాడే సమర్థత కలుగుతుంది. అందువల్ల సంస్కృతంలో
ఉపన్యాసాలను వినాలి.
2. ప్రతిదినం గద్యం
(వాక్యరూపంలో ఉన్న పాఠం) కొద్దిగైనా తీసుకుని అర్థం మననం చేస్తూ- తక్కువ వేగంతో, పైకి చదవాలి.
3. ప్రతిదినం గద్యం
(వాక్యరూపంలో ఉన్న పాఠం) కొద్దిగా తీసుకుని చదువుతూ వ్రాయాలి.
4. ప్రతిదినం ఐదు
వాక్యాలైనా తప్పకుండా స్వయంగా వ్రాయాలి. మాతృభాషలో భావించిన దాన్ని సంస్కృతంలో
మాట్లాడగలిగేంతవరకు ప్రయత్నించాలి.
5. మొదట్లోనే గీతానువాదాలు
చేయాలని ప్రయత్నించరాదు. ఏదైనా క్రమంగా అభ్యాసం చేయటం మంచిది. కఠిన స్థాయిలో
వస్తువును తీసుకోకూడదు.
6. అన్వయసహితంగా ఉన్న
శ్లోకాలను చదవుతూ వాక్యనిర్మాణనం గమనించాలి. అది చూస్తూ మళ్ళీ అర్థాన్ని
విచారిస్తూ సాగాలి. ఆ పదాలు తిరిగి శ్లోకంలో ఎక్కడ ఉన్నాయో చూడాలి. ఏ పదానికి ఏ
అర్థమో ఎట్లా ప్రయోగించాలో- చింతన చేస్తూ చూడాలి. గీతాప్రేస్-గోరఖపుర్ వారి
పుస్తకాలు (హిందీలో) బాగా మూలానికి అనుగుణంగా అనువదింపబడ్డాయి. ఈ విషయంలో అవి చాలా
ఉపయుక్తంగా ఉంటాయి.
7. సంస్కృతంలో
అనువదింపబడిన లేఖలను తీసుకుని తిరగలి చదవాలి- అంటే అనువాదం ముందు చదివి, అప్పుడు మూలం చదవాలి.
8. ఏదైనా నూతన పదం
కనిపిస్తే, అది ప్రయోగించి వాక్యం నిర్మాణం
చేసుకోవాలి- మనసులోనే. దాని లింగం కూడా మనసులో ఓసారి అనుకోవాలి.
9. మాతృభాషాలో లేదా
ఆంగ్లభాషలో కానీ నాలుగు లేదా ఐదవ తరగతి పాఠ్యపుస్తకాలను తీసుకుని కథలను, లేఖలను సంస్కృతంలోనికి అనువాదనం చేయాలి. ఆ పదాలను
అన్వేషించటానికి ప్రయత్నిస్తూంటే, ఏదైనా చదివినప్పుడు ఆ
భావం దొర్లితే ఆ భావంపై, పదం పై దృష్టి
పడుతుంది.
10. సంస్కృతంలో
లింగం-వచనం-విభక్తి దోషాలు బాగా అధికంగా అవుతుంటాయి. సర్వనామప్రయోగాలలో, విశేషణ విశేష్యభావాలలో, కర్మణి-కర్తరి-ప్రయోగాలలో, ప్రత్యయప్రయోగాలలో
దోషాలు అధికంగా అవుతాయి. ఆ ప్రయోగాలను భాషలో చూసి దృష్టిపూర్వకంగా తొలగించాలి.
11. సంస్కృతభాషణం వింటూ
వ్రాసేందుకు ప్రయత్నించాలి (శృంగేరీశంకరాచార్యుల భాషణలు యూట్యూబులో ఉన్నవి)
https://www.youtube.com/watch?v=KbDmqTFsUcY&t=547s
https://www.youtube.com/watch?v=pbpNTarXg_4&t=433s
https://www.youtube.com/watch?v=3jGdMnhyuJk&t=285s
https://www.youtube.com/watch?v=JltBTuHURLQ&t=116s
https://www.youtube.com/watch?v=QnHP9yO2Dpk
https://www.youtube.com/watch?v=qD15ZJ3r3hk
12. సంస్కృతంలో భగవంతుని
స్తోత్రాలు ఎంతో ఉపయుక్తమైనవి. అవి అధ్యయనంగా పఠించాలి.
No comments:
Post a Comment