ప్రార్థన
కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం ।
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావలిం
గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః ॥
గోపాల-చూడామణిః - లలాట-ఫలకే కస్తూరీ-తిలకం, వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవ-మౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనం చ,
కంఠే చ ముక్తావలిం, కలయన్, గోపస్త్రీ-పరివేష్టితః విజయతే
॥
గోపాల-చూడామణిః = గోపాలులలో ప్రధాన అలంకారం అయిన శ్రీకృష్ణుడు
లలాట-ఫలకే = నుదుట
కస్తూరీ-తిలకం = కస్తూరి తిలకాన్ని
వక్షఃస్థలే కౌస్తుభం = ఛాతి వద్ద కౌస్తుభమణిని
నాసాగ్రే = ముక్కుకొసలో
నవ-మౌక్తికం = కొత్తముత్యాన్ని
కరతలే = అరచేతిలో
వేణుం = వేణువును
కరే = ముంజేతికి
కంకణం = కంకణాన్ని
సర్వాంగే = అవయవాలంతటా
హరిచందనం చ = ఎర్ర చందనమును
కంఠే చ = మెడలో
ముక్తావలిం = ముత్యాలహారమును
కలయన్ = వేసుకొని
గోపస్త్రీ-పరివేష్టితః = చుట్టూ గోపికలు నిలబడి ఉన్నవాడైన
విజయతే = విజయం చేయుగాక
గోపాలులకు చూడామణి వంటివాడు (అయిన శ్రీకృష్ణృడు) నుదుట కస్తూరి తిలకాన్ని, ఛాతి వద్ద కౌస్తుభమణిని, ముక్కుకొసలో కొత్తముత్యాన్ని, అరచేతిలో వేణువును, ముంజేతికి కంకణాన్ని ధరించి, అవయవాలంతటా హరిచందనం పూసుకొని, మెడలో ముత్యాలహారాన్ని వేసుకొని, చుట్టూ గోపికలు నిలబడి ఉన్నవాడైన శ్రీకృష్ణృడు విజయం చేయుగాక.
No comments:
Post a Comment