Saturday, 23 July 2016

ప్రార్థన - శరజ్జ్యోత్స్నాశుద్ధాం



శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరాం।
సకృన్నత్వాం నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణతయః ॥

శరత్-జ్యోత్స్నా-శుద్ధాం, శశియుత-జటాజూట-మకుటాం, వర-త్రాసత్రాణ-స్ఫటిక-ఘటికా-పుస్తక-కరాం, త్వాం, సకృత్, నత్వా, సతాం, కథం, ఇవ, మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణతయః, న సన్నిదధతే

శరత్-జ్యోత్స్నా-శుద్ధాం = శరదృతువులోని వెన్నెలతో సమానమైన తెల్లదనాన్ని కలిగినదానను
శశియుత-జటాజూట-మకుటాం = జటాజూటంలో చంద్రుని కిరీటంగా కలిగినదానను
వరత్రాస-త్రాణ-స్ఫటిక-ఘటికా-పుస్తక-కరాం = (నాలుగు చేతులు-) వరదహస్తం-(భయంకలిగినవారికి) అభయహస్తం-స్ఫటికమాల (ధరించినది)-పుస్తకము చేతిలో ధరించినదానను
త్వాం = నిన్ను
సకృత్ = ఒక్కసారి
నత్వా = నమస్కరించి
సతాం = మంచివారికి
కథం ఇవ = ఎట్లా, ఏ విధంగా
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః = తేనె-పాలు-ద్రాక్ష వంటి మధురమైన
ఫణతయః = పలుకులు
న సన్నిదధతే = రాకుండా ఉంటాయి

శరదృతువులోని వెన్నెలతో సమానమైన తెల్లదనాన్ని కలిగిన, జటాజూటంలో చంద్రుని కిరీటంగా కలిగిన, (నాలుగు చేతులు-) వరదహస్తం-భయంకలిగినవారికి అభయహస్తం-స్ఫటికమాల (ధరించినది)-పుస్తకము చేతిలో ధరించిన - దానివి అయిన నీకు, సజ్జనులు ఒక్కసారి నమస్కరిస్తే చాలు, తేనె-పాలు-ద్రాక్ష వంటి మధురమైన పలుకులు వారికి రాకుండా ఎట్లా ఉంటాయి? (అంటే తప్పక వస్తాయి అని భావము.)

No comments:

Post a Comment