నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై
ప్రేషితం మనః ।
తత్తు తత్రైవ రమతే హతాః పాణినినా వయమ్ ॥
శ్లోకార్థం- “నపుంసకమని తెలిసి ప్రేయసికి
నా మనస్సును పంపాను. అది అక్కడే రమిస్తూ ఉండిపోయింది. (అయ్యో,) పాణిని చేత హతులై (మోస)పోయినామే.”
ఒకడు ఇలా తలచాడు- ‘మనస్సు (మనస్-శబ్దం) నపుంసకము. అది ప్రియురాలి దగ్గరకు పంపితే ఏ హానీ ఉండదు’ అని. అందువల్ల ఆమె దగ్గరకు పంపాడు. కానీ ఆ మనస్సు అక్కడే రమిస్తూ
ఉండిపోయింది. అందువల్ల అతడు విషాదంతో అంటున్నాడు- ‘మనస్శబ్దం నపుంసకలింగం చేసిన పాణిని వల్ల హతులై (మోస)పోయామే..’ అని.
‘మనస్-శబ్దం’ నపుంసకమైతే మనస్సు కూడా నపుంసకం కావాలని నియమం లేదు. ఇది తెలియక
కష్టం అనుభవించాడు. అందుకని మనకు బాధ కలుగుతోంది.
ఇట్లాంటి ఉదాహరణలతో, ఉదంతాలతో ఏదో విషయం కల్పించి, శాస్త్ర విషయాన్ని చక్కగ విశదీకరించటం,
చమత్కారంతో
ఆనందింప చేయటం మనవారికి వెన్నతో పెట్టిన విద్య. "వ్యాకరణంలో శబ్దానికే కానీ అర్థానికి
లింగం ఉండదు"- అనే శాస్త్రీయ విషయాన్ని ఎంత హృద్యంగా చెప్పారో చూడండి మన సృజనాత్మకతకు
ఈ పద్యం ఓ మచ్చుతునక.
[నపుంసకం అయితే ప్రభావం పడదు అనుకున్నాడు.. అయినా అది ప్రభావితమైంది అని బాధ. స్త్రీ
తో దానికి తేడా పడదు అనుకున్నాడు.. కానీ పడిందే అని బాధ.. అంటే ప్రేమ కలిగింది.. ఆమెతోనే
నిలిచిపోయి తాను వంచితుడైనాడు.. పుంలింగంఅయితే స్త్రీ వల్ల దెబ్బ తింటుంది అని భయమైనా
ఉండేది, జాగ్రత్త పడేవాడు.. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోయింది. పాణిని మాట నమ్మి మోసపోయామే..
అని బాధ.]
No comments:
Post a Comment