Saturday, 23 July 2016

ప్రార్థన - కర్కోటకస్య నాగస్య




కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ॥ (కలిబాధానివారణం)

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ రాజర్షేః ఋతుపర్ణస్య కీర్తనం కలినాశనం (కరోతి)॥

కర్కోటకస్య = కర్కోటకము యొక్క
నాగస్య = పాము యొక్క
దమయంత్యాః = దమయంతి యొక్క
నలస్య = నలుడి యొక్క
చ = కూడా
రాజర్షేః = రాజర్షి యొక్క
ఋతుపర్ణస్య = ఋతుపర్ణుడి యొక్క
కీర్తనం = నామం పలకటం
కలినాశనం = కలిబాధ నివారణ చేసేది

కర్కోటకమనే పాము, దమయంతీ-నలులు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు- వీరి (కథ)ను కీర్తిస్తే కలిబాధ నివారణ జరుగుతుంది. 

(కలిబాధ అంటే- ఇతరుల దుష్టత్వం వలన మనసులో ఉదయించే చెడుభావాలు, చుట్టూ ఉండే చిరాకులు, రకరకాల వైచారిక ఇబ్బందులు అని భావం. ఉదయాన్నే ఈ శ్లోకాన్ని ఒకసారి చదవటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.)

No comments:

Post a Comment