నారాయణం నమస్కృత్య నరం
చైవ నరోత్తమం ।
దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్ ॥
నారాయణం, చ ఏవ, నర-ఉత్తమం, నరం, దేవీం సరస్వతీం, వ్యాసం, నమస్కృత్య, తతః జయం ఉదీరయేత్ ॥
నారాయణం = (భగవంతుడైన)
నారాయణుని
చ ఏవ, నర-ఉత్తమం = నరోత్తముని
నరం = నరుని
దేవీం సరస్వతీం =
సరస్వతీదేవిని
వ్యాసం = వ్యాసమహర్షిని
నమస్కృత్య = నమస్కరించి
తతః = ఇక, అటు తరువాత, పిమ్మట
జయం = జయమును
ఉదీరయేత్ = చెప్పవలెను
నారాయణునికి, నరునికి, నరులలో ఉత్తమునికి, సరస్వతిదేవికి, వ్యాసుడికి నమస్కరించి
జయమును (పురాణకథనమును) చెప్పాలి. (ప్రతి పురాణం ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పటం
పరంపర.) 🌺
No comments:
Post a Comment