Thursday, 21 July 2016

ప్రార్థన - మనోజవం



మనోజవం మారుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ।
వాతాత్మజం వానరయూథముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి ॥
[పాఠాంతరం- శరణం ప్రపద్యే.]

మనో-జవం, మారుత-తుల్య-వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్ఠం, వాత-ఆత్మజం, వానర-యూథ-ముఖ్యం, శ్రీరామ-దూతం శిరసా నమామి ॥

మనో-జవం= మనస్సు అంతటి జవం(వేగం) కలవాడిని,
మారుత-తుల్య-వేగం= గాలితో సమానమైన వేగం కలవాడిని
జితేంద్రియం = ఇంద్రియాలను జయించినవాడిని
బుద్ధిమతాం వరిష్ఠం= బుద్ధిమంతులలో శ్రేష్ఠుడిని
వాత-ఆత్మజం= వాయుపుత్రుడిని
వానర-యూథ-ముఖ్యం = వానరుల సమూహంలో ముఖ్యుడిని
శ్రీరామ-దూతం = శ్రీరాముని దూత (అయిన హనుమంతుని)
శిరసా = శిరస్సు చేత, (తలను వంచి)
నమామి [పాఠాంతరం – ‘శరణం ప్రపద్యే’] = నమస్కరిస్తున్నాను, [శరణు పొందుతున్నాను]

మనస్సు అంతటి జవం(వేగం) కలవాడు, గాలితో సమానమైన వేగం కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానరుల సమూహంలో ముఖ్యుడు, శ్రీరాముని దూత (అయిన హనుమంతునికి) శిరస్సుతో నమస్కరిస్తున్నాను. [పాఠాంతరం- శరణు పొందుతున్నాను.]

No comments:

Post a Comment