ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహం।
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం॥
ఆంజనేయం, అతి-పాటల-ఆననం, కాంచన-అద్రి-కమనీయ-విగ్రహం, పారిజాత-తరు-మూల-వాసినం, పవమాన-నందనం భావయామి॥
ఆంజనేయం = అంజనాతనయుని
అతి-పాటల-ఆననం = ఎంతో ఎర్రని ముఖం కలవాడిని
కాంచన-అద్రి-కమనీయ-విగ్రహం = బంగారుకొండ వంటి అందమైన రూపం కలవాడిని
పారిజాత-తరు-మూల-వాసినం = పారిజాతం చెట్టు కింద నివసించేవాడిని
పవమాన-నందనం = వాయువుపుత్రుడిని
భావయామి = భావిస్తున్నాను (మనస్సులో తలుస్తున్నాను)
అంజనాతనయుని, ఎంతో ఎర్రని ముఖం కలవాడిని, బంగారుకొండ వంటి అందమైన రూపం కలవాడిని, పారిజాతం చెట్టు కింద ఉన్నవాడిని, వాయువుపుత్రుడిని భావిస్తున్నాను (తలుస్తున్నాను).
No comments:
Post a Comment