Monday, 18 July 2016

ప్రార్థన - గురుర్బ్రహ్మా

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥

గురుః బ్రహ్మా గురుః విష్ణుః గురుః దేవః మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥

గురుః = గురువు (ఆచార్యుడు)
బ్రహ్మా = (సృష్టికర్త) బ్రహ్మ
విష్ణుః = విష్ణువు
దేవః మహేశ్వరః = దేవుడైన శివుడు
సాక్షాత్ పరబ్రహ్మ = సాక్షాత్తు పరబ్రహ్మ
తస్మై శ్రీగురవే = అటువంటి గురువుకై
నమః = నమస్కారం

గురువే (సృష్టికర్త) బ్రహ్మ, గురువే విష్ణువు, ఆయనే శివుడు. ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ (మూలతత్త్వం). అటువంటి గురువుకు నమస్కారం.
{‘నమఃశబ్దంతో సంస్కృతంలో చతుర్థీవిభక్తి కై’; తెలుగులో మాత్రం షష్ఠీవిభక్తి కి’}

No comments:

Post a Comment