శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే ॥
సర్వ-విఘ్న-ఉపశాంతయే
శుక్ల-అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న-వదనం ధ్యాయేత్ ॥
సర్వవిఘ్న-ఉపశాంతయే
= అన్ని విఘ్నాలు శాంతించుటకు
శుక్ల-అంబర-ధరం =
తెల్లని వస్త్రాలు ధరించిన
విష్ణుం = వ్యాపక
స్వరూపుడిని (అంతటా వ్యాపించే వాడిని)
శశివర్ణం = తెల్లని
శరీర కలవాడిని
చతుర్భుజం = నాలుగు
భుజాలు ఉన్నవాడిని
ప్రసన్న-వదనం =
ఏనుగు ముఖం వాడిని
ధ్యాయేత్
[పాఠాంతరం- ధ్యాయే] = ధ్యానించవలెను, (పా. ధ్యానిస్తున్నాను)
అన్ని రకాల విఘ్నాలు
తొలగటం కోసం – తెల్లని
బట్టలు వేసుకొన్న, వ్యాపించే తత్త్వం కల, తెల్లని కుందేలు రంగు కలిగిన, నాలుగు భుజాలు ఉన్న,
ఏనుగుముఖంవాడిని ధ్యానించాలి. [పాఠాంతరం- ధ్యానిస్తున్నాను.]
శ్రీ శ్యామలా షొడసనామ స్తోత్రం అర్థం వివరించగలరు (టీకా తాత్పర్య సహితం) https://stotranidhi.com/sri-shyamala-shodashanama-stotram-in-telugu/
ReplyDelete